Daily Postings

Q అన్నదానం ఎక్కడ చెయ్యాలి???

ఇదేమి ప్రశ్న ??? అని అనుకోకండి ఈ మధ్యలో చాలా చోట్ల విన్నాను శిరిడీలో ద్వారాకామాయి దగ్గర అన్నదానం చేస్తే అపూర్వమైన ఫలితాలు వస్తాయి అని.ఇదేమిటి ఇలా అన్నదానం శిరిడి కె పరిమితం చేస్తే ఎలా ????
నిజానికి మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి తెలియకుండానే సమయాను కూలంగా ఆకలి వెయ్యడం భోజనం కోసం తపించడం సర్వ సాధారణం కదా. సమయానికి భోజనం దొరికినప్పుడే ప్రాణ శక్తి పొందుదాం,అప్పుడే దైవ శక్తి వైపు మనస్సును మరల్చగలం.అందుకే బాబా ఉపవాసాన్ని ప్రోత్సహించరు.   ఐతే ఈ భూమి మీద తినడానికి లేక ఆకలితో అలమటించే వారు చెప్పలేనంత మంది ఉన్నారు.
ముందుగా మనం ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి మనం చేసే పని నుండి దేనిని ఆశించ కూడదు అని.ఇక ఆకలితో ఉన్న ఎవరి ఆకలి తీర్చినా చివరికి కుక్క ఆకలి తీర్చినా నా ఆకలి తీర్చినట్లే అని బాబానే స్వయంగా చెప్పారు. మరి ఇక్కడ పెట్టాలా మరి ఇంక వేరే ఎక్కడ పెట్టాలి అని అనుమానం ఎందుకు.మనం మనస్ఫూర్తిగా ఒక్కరి  ఆకలి తీర్చినా కచ్చితంగా ఫలితం వస్తుంది.
బాబా ఎంతో ఇష్టపడే సేవ అన్నదానం ,ఎంతో ఇష్టంగా చేసిన నిత్యకృత్యాలలో మొట్టమొదటిది అన్నదానం.బాబా స్వయంగా ఆచరించి చూపించిన తత్వం ఇతరులకు అన్నం పెట్టడం.
మనలో ఎవ్వరైనా స్వయంగా మన ఇళ్లలో ఓ 100 మందికి అన్నం వండి పెట్టగలమా ??? దానికంటే ముందు సామూహికమగా చేసే సత్కార్యాలకు భగవంతుడు చాలా ప్రీతి చెందుతాడు అని మనకు తెలుసు.
అదే సాయి నిలయంలో జరుగుతుంది అది కూడా స్వచ్ఛంగా , రుచిగా , ప్రేమగా , నిస్వార్థంగా, మనం ఇంట్లో ఏవిధముగా తింటామో అదే విధమైన బోజనాన్ని ఏమాత్రం కామ్ప్రమైజ్ అవ్వకుండా బాబా ఆజ్ఞ మేరకు,బాబా సూచనల మేరకు చేయ బడుతుంది.
మనచేత చేయించి,మన చేత్తోనే 100 మందికి అన్నం పెట్టె అవకాశం అద్భుతమైన్ విషయం.ఎన్నో కర్మలను తొలగించేది అన్నదానం.
ఉదాహరణకు:-
మా మావయ్య గారి పేరుమీద రొండు,మూడు ,సార్లు అన్నదానం ఈ మధ్యలో చేయించారు బాబా అమ్మ ద్వారా చెప్పించి.ఆయనకి రొండు సంవత్సరాలు నుండి ఆరోగ్యం బాలేదు .ఐనా ఏ రోజు అనారోగ్యం ఉన్న మనిషిలా ఆయన జీవించలేదు ఈ రొండు సంవత్సరాలలో.అసలు అది ఎలా సాధ్యం దానికి రొండు కారణాలు ఉన్నాయి.
ఒకటి మా మావయ్యగారు ప్రతి క్షణం ” “సాయి సాయి ” అనే బాబా నామాన్ని తుది శ్వాస వరకు విడవలేదు .బాబా తను ఇచ్చిన మాట నిల బెట్టు కున్నారు.”సాయి సాయి అనే నామాన్ని మరువకుండా ఎవరైతే  సర్వకాలసర్వావస్థలయందు నన్ను తలుస్తారో వారి రక్షణయే నా వ్యసనం అవుతుంది అని చెప్పారు”.
ఇక రొండవది అన్నదానం ద్వారా తీవ్రమైన కర్మలను సహితం గురువు మాత్రమే తీసివేయ్యగలరు అనేదానికి మా మావయ్య గారి మరణమే ఉదాహరణ. ప్రస్తుతకాలంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద రోగాల బారిన పడటం సంవత్సరాలు ,సంవత్సరాలు మంచంపై పడి ప్రత్యక్ష నరకం భూమి పైనే చూడటం మనం ఎన్నో చూసాం. కానీ మా మావయ్యగారి పెరు మీద చేసిన అన్నదాన ఫలితమే ఆయనకు బాబా ఇచ్చిన ఆసన్న మరణం అనే వరం.
ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన నా కుటుంభం ఆయన లేని లోటును ఊపిరి ఉన్నత వరకు మర్చి పోలేక పోయిన ఆయన బాబా ని చేరుకుని బాబా పాదాల దగ్గర ఉన్నారు అని తెలిసిన తరువాత బాబాకి కృతజ్ఞతలు చెప్పడం తప్ప ఏమీ చెయ్యలేని నిస్సహాయత నాది.

POSTED BY SWAPNA

Q. బాబా కి దక్షిణ ఎంత ఇవ్వాలి , ఎలా ఇవ్వాలి , ఎందుకు ఇవ్వాలి ????
దక్షణ ఎంత ఇచ్చాము అనేది ఇచ్చిన మనమే చూస్తాం , ఇచ్చిన దానికి గర్విస్తాం, భగవంతుడు ఇవేమీ చూడడు, మనకు భగవంతుడు ఇచ్చిన దానిలోనుంచి  తృప్తిగా ,గర్వం లేకుండా ఇవ్వాలి . నేను ఇచ్చాను అనే భావన లేకుండా ఇవ్వాలి.నమ్మకంతో ఇవ్వాలి.దక్షణ ద్వారా మన పాపాలను భగవంతుడు స్వీకరిస్తారు.కర్మలను తొలగిస్తాడు కనుక దక్షిణ ఇవ్వాలి.మానవుల యొక్క కర్తవ్యం దక్షణ ఇవ్వడం.మనం ఒక్కసారి దక్షిణ ఇచ్చిన  ఆ క్షణమే ఆ దక్షిణ కోసం మర్చిపోవాలి ,అలా కాకుండా ఇచ్చిన దానికోసం పరిపరి  విధాలుగా చాలా మంది చింతించడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం చేస్తారు అలా చెయ్యడం వల్ల ఫలితం సూన్యం,వ్యర్థం .
త్యాగ గుణం నేర్పించడానికే బాబా దక్షిణ అడిగి తీసుకునే వారు.ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది దక్షిణ,అరిషడ్వర్గాలను నియంత్రించుకునే శక్తిని బాబా దక్షిణ స్వీకరించడం ద్వారా మనకు ఇస్తారు. తద్వారా       మనలను మనమే అర్పించు కోగలుగుతాం, అంటే ఆత్మ నివేదన చేసుకో గలుగుతాము.ఆ దిశగా సాధనలో మొట్టమొదటి మెట్టు దక్షిణ.
jj నార్కే అను భక్తుడను బాబా15/- దక్షిణ అడుగగా నార్కే ఎంతో బాధ తో బాబా నాదగ్గర 15 /- లేవు అని చెప్పగా బాబా దానికి ఇలా అన్నారు నాకు తెలుసు నీ వద్ద 15 /- లేవు అని నీవు సత్ గ్రంథ పారాయణలు చేస్తున్నావు గా దానినుండి ఇవ్వు అని అన్నారు బాబా.ఇక్కడ బాబా అడిగిన 15 /- కు అర్ధం 1+5= 6 అంటే అరిషడ్వర్గాలను నాకు దక్షిణగా ఇవ్వు అని అడిగారు.ఆ గ్రంథం చదవటం ద్వారా కామ ,క్రోధ, లోభ, మోహ,మద,  మత్సర్యాలు కోసం క్షుణ్ణం గా నేర్చుకున్నావు కదా వాటిని నాకివ్వు అని బాబా నార్కే ని అడిగారు.
తర్కడ్ భార్య ను,శ్యామను కూడా బాబా దక్షిణ అడిగారు వారు మనఃపూర్వకమైన నమస్కారాలు సమర్పించారు. దీనిని బట్టి క్షుణ్ణంగా అర్ధం అవుతున్నది ఏమిటంటే  దక్షిణ అంటే అది రూపాయలలో కాదు అని,బాబా రూపాన్ని మన మనస్సులలో సాక్షాత్కరించుకో గలిగి నప్పుడు దక్షిణ ఎందుకు,ఎంత,ఎలా ఇవ్వాలి అనేది  పూర్తిగా అర్ధం అవుతుంది.
ఇక బాబా ఎప్పుడూ అనేవారు నాకివ్వగలిగిన వాడే నావద్ద నుంచి పుచ్చుకోగలడు అని అనేవారు. అంటే బ్రహ్మం కోసం శిరిడి  వచ్చిన పెద్ద మనిషి కథ గుర్తుకొస్తుంది.బాబా నుంచి బ్రహ్మం కావాలి అని ఓ పెద్ద మనిషి వస్తాడు బాబా 5 /- కోసం ప్రయత్నిస్తూ అతనికి బ్రహ్మాన్ని చూపిస్తున్నారు ఐనా దానిని అర్ధం చేసుకోకుండా అతని  దగ్గర ఉన్నా ఇవ్వలేదు సరి కదా బాబానే తొందర పెట్టాడు. వెలకట్టలేని బ్రహ్మం కోసం 5 /- ఉన్నది కూడా ఇవ్వలేని వాడికి బ్రహ్మం తో ఏమి పని , ప్రయోజనమేమిటి బ్రహ్మమాన్ని పొందడంవలన .దక్షిణ పదులు నమస్కారాలు సమర్పించచ్చు అంటే ఉంచుకొని కూడా నమస్కారాలు పెట్టమని కాదు అర్ధం . 
ఇంకా చెప్పాలి ఆంటే చాలా తేలికగా  ఆడిగేస్తాం బాబా నీ పాదాల చెంత చోటివ్వు బాబా అని.నమ్మలేని జీర్ణించుకోలేని ఒక నిజం ఏమిటంటే ఐశ్వర్యం,వ్యాపారం,విద్య,లోటుపాట్లు లేని సంతోష కరమైన జీవితం ఇవి అడగచ్చు పర్వాలేదు.కానీ బాబా పాదాల  చెంత చోటు పొందాలి అంటే అంత సులువా, సరే పొందాం బాబా ఇచ్చారు మనం అచంచలమైన భక్తి ,విశ్వాసాలతో నిశ్చలంగా వేరే ఏ ఆలోచనలు ,ఏ కోరికలు లేకుండా ఉండగలమా??? ప్రశ్నించుకివాలి మనల్ని మనం ఒక్కసారైనా .బాబా సేవే గా ఆడిగాము ,మంచి విషయమే గా అనుకుంటాం  అర్హత కావాలి,అదృష్టం ఉండాలి,మనలో మార్పు రావాలి ఇదేమైనా  చిన్న కోరికా??? లౌకికమైన కోరికలకు కోటి రేట్లు పెద్దదైన కోరిక అది బాబానే ఇవ్వాలి,బాబాకి ఇవ్వాలి అని అనిపించాలి, బాబాకి మనపై ఆ నమ్మకం రావాలి.
బాబా పాదాల చెంత చోటు ఆయన ఆశీస్సులతో మాత్రమే పొందగలం

By Swapna

Q. బాబా బడి లో ప్రవేశం ఎలా లభిస్తుంది???
సత్చరిత్రలో బాబా తనకు లభించిన గురువు,బడి కోసం ఎంతో చక్కగా వివరించారు.అలా లభించిన బడిని బాబా ఎలా సార్ధకం చేసుకున్నారు???
బాబా కి తన గురువు తారస పడడానికి ముందు ఒక బంజారా బాబా కి గురువుని వెతుకున్న సమయంలో కనబడతాడు.అప్పుడు ఆ బంజారా ఉత్త కడుపుతో ఏమి చేసినా ప్రయోజనం ఉండదు కనుక ఈ భోజనం తినమంటాడు.బాబా అతను ఎవరు? ఏమిటి ? అనే సందేహాలు పక్కన పెట్టి భోజనాన్ని తిరస్కరించడం పాపంగా భావించి ఆ భోజనాన్ని స్వీకరించారు.అంతే మరుక్షణం బాబాకి తన గురువు లభిస్తారు.అంటే ఇక్కడ భంజారానే బాబా గురువు అదే బాబాకి మొట్టమొదటి పరీక్ష .ఆ పరీక్షలు బాబా విజయం సాధించారు.
వెనువెంటనే బాబా గురువుగారు నాతో వాస్తవా అని అడిగారు బాబా ఏమి ఆలోచించలేదు వెంటనే వస్తాను అని సమాధానం చెప్పారు.ఇక్కడ రొండో పరీక్ష లో కూడా విజయం సాధించారు.ఒకసారి గురువుగా భావన పొందాకా ఆ గురువు చెప్పింది ఏదైనా చేసే స్థాయికి మనం మనల్ని సిద్ధంగా ఉంచుకోవాలి అని ఈ కథ నిరూపోయిస్తుంది.
అక్కడ నుంచి బాబాను తన గురువు ఒక బడి దగ్గరకు తీసుకు వెళ్లడం ఆ బడి బాబాని అమితంగా ఆకర్షించడం జరిగాక.గురువు గారు మొట్ట మొదట బాబాకి తల గొరిగిస్తారు ఎందుకు ???ప్రతి మనిషికి తన శరీరాకృతిలో ఆకర్షించ బడేది కేశాలు కనుక జీవితంలో దేనినైన సాధించాలి అంటే  వ్యామోహం ఉండరాదు కనుక తలను గోరిగించారు.
తరువాత 2 రూపాయల దక్షిణ ఎందుకు అంటే ధనమందు వ్యామోహంకూడా మనిషిని పతనం చేస్తుంది ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఆటంకం అవుతుంది .తీసుకున్న 2 రూపాయలు కూడా ఒకటి శ్రద్దకు మరొకటి ఓర్పు కు ప్రతీకలుగా తీసుకున్నవే. గురువు శిష్యుల నుండి ఊరికే ఏది తీసుకోరు అలా అడిగి తీసుకున్న పక్షంలో ఒక రూపాయి తీసుకుంటే 10 రూపాయలు నేను ఇవ్వవలసి ఉంటుంది అని బాబా మనకు ఎన్నో సార్లు ఆచరణాత్మకంగా కూడా నిరూపించారు.
ఇక భోజనం పెట్టిన వెంటనే తల క్రిందులుగా నూతిలో వ్రేలాడదీసి 4 గంటలు తరవాత బయటకు తీసి ఎలా అనిపించింది అని గురువు అడిగితే బాబా చెప్పిన సంధానం అద్భుతం .చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.వేరే ఎవరైనా ఐతే భుక్తాయాసంగా ఉంది ప్రాణం పోయినంత పని అయ్యింది అని చెప్పేవారు.యద్భావం తద్భవతి మనం చూసే దాన్ని బట్టే ఏదైనా. 
బాబా ఎప్పుడూ చెప్పేది ఒక్కటే భగవంతుని దర్భారులో స్థానం కోసం ప్రయత్నించు,ప్రపంచంలోపేరు, ప్రఖ్యాతలు  కోసం కాదు అని భోదించేవారు.
అంటే బాబా తన బడిలోకి మనకు ఆహ్వానం పలుకుతున్నారు.దానిని మనం గ్రహించాలి చాలా మంది బాబా పిలుపును వినగలుగుతున్నారు.బాబా సేవవరకు వేళ్ళ గలుగుతున్నారు.కానీ  ఆపై మార్పులు త్వరిత గతిలో పొందలేక పోతున్నారు.
1- దృఢమైన నమ్మకం ఉండాలి2- ఓర్పు తో ఉండాలి3- శ్రద్ద తో ఉండాలి4 – కోరికలు నశించిపోవాలి 5- పరనింద అపరాధం చెయ్యకూడదు 6- బాబా తన గురువును తదేక దృష్టితో చూసినట్లు మనం బాబాని, బాబా రూపాన్ని, బాబా నామాన్ని జ్ఞప్తి యందు ఉంచుకుమదాం.7 – పారాయణ చెయ్యడం కథలను స్మరించడం,సాధన ప్రారంభిస్తే సాయిబాబా గుడే మనకు బడి అమ్మ వడి కూడా అవుతుంది.8 – పారాయణ చెయ్యడం వల్ల జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది.9- ఆధ్యాత్మికతకు మార్గం చూపిస్తుంది,లక్ష్యం వైపు అడుగులు వెయిస్తుంది,లక్ష్యాన్ని సాధించగలిగే శక్తిని బాబా ప్రసాధిస్తారు,సాయి బడిలో ప్రవేశం కావాలి అంటే బాబా కథలు శ్రద్ధగా చదివితే ప్రేరణను ,చైతన్యాన్ని బాబానే ప్రేరేపిస్తారు.ఇది ఒక్కరోజులో వచ్చేది కాదు మనతో ఉన్నది బాబా ,మనతో చేయించేది బాబా,మనల్ని నడిపించేది బాబా అని భావిస్తే నేను, నాది,అనే  భావనకు దూరంగా ఉన్ననాడు ఇది సాధ్యం.ఎటువంటి చిన్న చిన్న విషయాలను కూడా పాటించలేక పోతున్నాము.
మన కోరికలు తీరకపోతే బాబానే ప్రశ్నించే సాహసం చేస్తున్నారు.గురువు సమక్షంలో మాట్లాడడానికే భయ పడాలి అటువంటిది ప్రశ్నించే స్థాయికి ఎదిగి పోతున్నాము .నువ్వు అసలు ఉన్నావా అని అనేస్తారు.
బాబా ఉన్నారు కనుకనే మనకు హాని అని తలిచేది ఏది మనకు దగ్గరవ్వనివ్వరు బాబా అని నమ్మాలి.మనకు శ్రేయస్సు దేని వలన కలుగుతుందో,మనకు ఏది ఇవ్వాలో,ఏది మంచి అని బాబా కి తెలుసు అని మనకి కూడా తెలుసు కానీ మాయలో చిక్కుకుని గ్రహించలేకపోతున్నాం.
అప్పుడు బాబా కి ఒక బడి  దొరికింది 
ఇప్పుడు మనకు సాయి నిలయం ( బడి ) దొరికింది .

Q. నా రాముడు దగ్గరకి తప్ప నేను ఎక్కడికి  రాను .ఎవరీ మాటలు అన్నది???
ఒకానొక రోజు శ్రీ కృష్ణుడు ద్వారాకలో ఓ భవనంలో  రుక్మిణీ సమేతుడుగా ఉన్నాడు.శ్రీ కృష్ణుడు నారధమహమునిని పిలిచి నాకో కార్యం చేసి పెట్టు అని అడుగగా నారధుడు సెలవియ్యండి స్వామి అని అడిగెను.దానికి శ్రీ కృష్ణుడు నారధా హనుమను నేను రమ్మన్నానని నావద్దకు తీసుకురా అని ఆజ్ఞాపిస్తాడు.నారధుడు హనుమ వద్దకు చేరుకుని విషయం వివరిస్తాడు.
హనుమా శ్రీ కృష్ణుడు ద్వారాకలో రుక్మిణీ సమేతుడై ఉన్నారు, వారు ఆదేశం మేరకు నేను నీవద్దకు వచ్చాను అనగా.హనుమ  అవునా ఇంతకు విషయం ఏమిటి అని అడుగగా నారధుడు శ్రీ కృష్ణుడు నిన్ను ఒక్కసారి కలవాలి అని అనుకుంటున్నారు కాన ఆ వార్తతో నేను నీవద్దకు వచ్చితిని అని సెలవిచ్చేను.
దానికి హనుమ నేను ఏ కృష్ణుడు వద్దకు రాను మీరు ఇక బయలుదేవచ్చు అని చెప్పగా నారధుడు అదే సంగతిని శ్రీ కృష్ణుడుకి వివరించగా దానికి శ్రీ కృష్ణుడు చిన్నగా నవ్వి  సరే నారధా  ఇప్పుడు వెళ్లి ద్వారాకలో ఉన్నది రాముడని ఆయనే నిన్ను చూడగొరుతున్నారు అని చెప్పు వెంటనే వస్తాడు అని  చెప్పగా, నారధుడు ఆ సంగతి హనుమకు చెప్పగా  హనుమ వాయు వేగంతో ద్వారక చేరుకొనెను.నారధుడుని ప్రశ్నించెను ఎక్కడ నా రాముడు ఎక్కడ నా రాముడు అని ప్రశ్నించెను.
నారధుడు ఓ భవనం వైపు చూపించి అదిగో అక్కడే ఉన్నారు వేళ్ళు అని చెప్పెను.హనుమ సంతోషంతో ఆతృతగా లోనికి వెళ్లగా అక్కడ శ్రీ కృష్ణుడు రుక్మిణీ దేవితో ఆశీనులై ఉండటం చూసి కొంత నిరాశతో నారదునిపై కొంత ఆగ్రహంగా ఉన్నారు హనుమ. నిరాశగా వెనకడుగు వెయ్యగా ఓ కంఠం వినిపించింది హనుమా అని ,ఆశ్చర్యంతో ఆ కంఠం నా రాముడు కంఠం లా ఉంది అని వెనుకకు తిరిగి చూడగా రాముడు సీతా సమేతంగా దర్శన మిచ్చెను.హనుమ రామని పాదాలపై పడి నమస్కరించి లేచి చూడగా శ్రీ కృష్ణ దర్శనమే అయ్యింది.
అప్పుడు గ్రహించాడు హనుమ ఆ నాటి నా రాముడే ఈ నాటి శ్రీ కృష్ణుడు అని.ఇది ఇలా ఉండగా శ్రీ కృష్ణుడు హనుమను ఓ ప్రశ్న అడుగుతాడు.హనుమా నారద ,తుంబరులలో ఎవరు గొప్ప సంకీర్తనా కారులు అని అడుగుతూ అడుగులు ముందుకు వేసెను.హనుమ ముందు వెళ్తుండగా శ్రీ కృష్ణుడు వెనుక వెళ్తున్నాడు.హనుమ జై జై రామ్ జానకి రామ్ అని స్తుతిస్తున్నాడు.
దీనికి అర్ధం ఏమిటి ????
రాముడే కృష్ణునిగా వచ్చినా హనుమ తన స్మరణను ఏమాత్రం మార్చుకోలేదు. జై జై కృష్ణ జై జై కృష్ణా అని భజన చేయచ్చుగా లేదు అలా హనుమ చెయ్యలేదు ఎందుకు అంటే దానినే “ఏక దైవ నిశ్చయం అని అంటారు “.
ఒకసారి మన హృదయంలో ఒక దైవాన్ని నిశ్చయించుకొంటే ఎన్ని జన్మలు ఎత్తినా మరువ కూడదు మనస్సు మారకూడు అని హనుమ భక్తి ద్వారా మనకు అర్ధం అవుతుంది.
బాబా కూడా మనకు ఎప్పుడూ భోధించేది ఒక్కటే గురువును ఎప్పటికి ఎట్టి పరిస్థితుల్లోనూ మరువకూడదు అని. ఎంత మంది గురువులు తారస పడినా వారిలో మనకు మన గురుదర్శనమే అవ్వాలి అని బోధించారు సాయి.   అలాగే బాబా ప్రతి జీవి యందు ప్రతి వస్తువులోనూ నన్ను దర్శించండి అని పలికారు అది ఎలా ????

ఆనాడు బాబా పలికిన పల్కులు ఈ రోజు అక్షర సత్యాలు అయ్యాయి.ఈ సృష్టి అంతా నేనే వ్యాప్తి చెంది యున్నాను.అన్నిటా,అంతటా నేనే ఉన్నాను అని.ప్రతి వస్తువులోనూ,ప్రతి జీవిలోనూ నన్నే చూడండి అని పలికారు సాయి. ఈ రోజు ఎటు చూసినా అంటే ఓ భవనం చూస్తే బాబా పటం,బాబా పేరు.మరో పక్క చూస్తే ఓ చిన్న పిల్లవాడిని ఓ తల్లి సాయి  సాయి అని పిలుస్తూ కనబడుతుంది.ఇంకా ఓ వ్యాపార సంస్థ పెరు సాయి ,ఆటో లో చూస్తే సాయి ఫోటో,సాయి పేరు. మనం రోడ్డు మీద నడుస్తుంటే కుక్కలు కనబడితే వెంటనే బాబా జ్ఞాపకం.ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే బాబా మాటలు జ్ఞాపకాలు.వీధి వీధికి బాబా ఆలయాలు.బాబా తత్త్వం, బాబా కథలు, బాబా భక్తులు,బాబా కీర్తి.
అసలు ఈ జన్మ సరిపోదు బాబాని బాబా ఖ్యాతిని వివరించడానికి.మనం చనిపోయే లోపల బాబా చెప్పిన  బోధనలలో ఒక్కటైనా చెయ్యగలమా??? చెయ్యగలం కచ్చితంగా బాబా ఆశీర్వాదాలు, అమ్మ uncle లాంటి వారితో సాంగత్యం ఉంటే కచ్చితంగా బాబా శిష్యులు అని అనిపించుకునే అర్హత సాధించ గలం.

Q. నేవాస్కర్ ఇంటికి బాబా పాము రూపంలో  వచ్చారా ???
నేవాస్కర్ అనే బాబా భక్తుని కోసం మనం సత్చరిత్రలో చదువుకున్నాం.అతనిని బాబా ఎంతగానో ప్రేమించేవారు.ఒకరోజు నేవాస్కర్ ఇంటికి ఒక పెద్ద సర్పం వచ్చింది.గోసాలలో ప్రవేశించడం శిరిడి ప్రజలు గమనించి నెవాస్కర్ ను హెచ్చరించెను.కానీ నేవాస్కర్ ఏమాత్రం బయపడలేదు.ఆ సర్పం ఉన్న చోటుకి వెళ్లి దగ్గరగా కూర్చుని బాబా ఎందుకు ఈ రూపంలో వచ్చావు.చూడు నిన్ను ఈ రూపంలో చూసి నీ బిడ్దలు భయపడుతున్నారు.ఇవిగో ఈ పాలు తాగి వేళ్ళు సాయి అని వెడుకొనగా ఆ సర్పం పాలు తాగి అక్కడనుంచి వెళ్లిపోయెను.దానితో అందరూ శాంతించెను.
ఐతే బాబా పాము రూపంలో నేవాస్కర్ ఇంటికి వచ్చారా ????
ఇక్కడ మనం గమనించాల్సిన  అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే బాబా పాము రూపంలో వచ్చారు అని అనే దానికన్నా ఆ సర్పం వద్దకు నేవాస్కర్ వెల్తూనే “సాయి సాయి “అని పిలవనారంభించాడు.ఆ నామం విన్న ఆ సర్పం బాబా నామాన్ని వినడంతో ఆ సర్పంలోని సహజ గుణాన్ని కోల్పోయి సాత్వికమైన గుణం ప్రేరేపించబడి పాలు తాగి వెళ్లిపోవడం జరిగింది అనే సత్యాన్ని గ్రహించాలి.బాబా తత్వాన్ని బట్టి బాబా అలా ఓ సర్పం రూపంలో వచ్చి తన బిడ్డలను బయపెట్టరు  కదా.బాబా నామం వినడం వల్ల  భయంకరమైన విషజంతువు కూడా తన చెడు గుణం కొల్పియింది.
మనం కూడా బాబా ని త్రికరణ శుద్దితో కొలిచినా,పూజించినా,సేవించినా,చివరికి పిలిచినా తన భక్తుల రక్షణమే తన తక్షణ కర్తవ్యంగా వ్యవహరిస్తారు బాబా.అలా బాబాని ప్రేమతో భక్తితో స్నేహాభావంతో పిలిస్తే మనలో ఉన్న హరిషడ్వర్గాలను హరింప చేస్తారు బాబా

*ఋణానుబంధం*
ఒక యోగి  ఒక్కనాడు   ఒకరి చెప్పులు వేసుకున్న కారణానికి, మోక్షానికి వెళ్లవలసిన వాడు ఈ ఋణం ఉండిపోవటంతోఅతని ఇంట పుత్రుడై, జన్మిస్తాడు.
రుణానుబంధం తీర్చుకోవటానికి ఆ యోగి మళ్ళీ పుడతాడు.
జాతకం చూసిన వాడు తలిదండ్రులకు ఒక హెచ్చరిక చేస్తాడు. 
ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉన్నాడు.
వాడి చేతి నుంచి పైసా కూడా తీసుకోకండి.
వాడికి అన్నీ ఇస్తూండండి. అని చెప్తాడు.
నాటినుంచీ తల్లిదండ్రులు వానినుంచి ఏమీ ఆశించకుండా పెంచుతారు.
 పూర్వజన్మ గుర్తున్నందున అతడు వారి రుణంతీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.
పెద్దయ్యాక తండ్రి ఇతడిని రాజుగారి కొలువుకి తీసుకుపోయి ఉద్యోగం ఇమ్మంటాడు.
రాజు రాత్రి గస్తీ ఉద్యోగం ఇస్తాడు.
అపుడు ప్రతి జాముకీ ఒకసారి ఆ యువకుడు ఇలాటి ఉపదేశాన్ని నిద్రలో ఉన్న వారికి జాగ్తేరహో….. 
అనే అర్ధంలో ఇస్తాడు.దొంగలంటే ధనం ఎత్తుకుపోయేవారేకాదు.
ఇవన్నీ కూడా దుఃఖభాజనాలే సుమా అని చెపుతుంటాడు.
ప్రతి జాముకీ ఇలాంటి హితవు ఒకటి చెబుతుండేవాడు.. 
రాజుగారికి రాచకార్యాలతో నిద్రపట్టక తిరుగుతూ ఇవన్నీ విని ఇతడు సామాన్యుడు కాడని గుర్తిస్తాడు.
మరునాడు స్వయంగా అతడి ఇంటికి వెళ్లి రాత్రి తాను అన్నీ విన్నాననీ, తన మనసు ప్రశాంతి పొందిందనీ అంటాడు.
 పళ్లెంలో వెంట తెప్పించిన ధనాన్ని అతడికి అందిస్తాడు.
అతడు వెంటనె ఆ ధన రాశిని తల్లికి ఇవ్వగా ఆమె పుత్రోత్సాహంలో నియమం మరచి ఆ పళ్లెం అందుకుంటుంది.
వెంటనే అతడు తనువును విడిచి ముక్తి పొందుతాడు.తలిదండ్రులు దుఃఖిస్తే రాజు ఆ యోగి కావలి సమయంలో చెప్పిన ఉపదేశాలు వినిపించి ఓదారుస్తాడు
తస్మాత్ జాగ్రత జాగ్రత !
1. శ్లో|| మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః|         అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత  జాగ్రత||
తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు అందుచే ఓ మానవుడా సావధానుడవై ఉండుము.
2. శ్లో|| జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|      సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత  జాగ్రత||
తా:- ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, ఈ సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.
3. శ్లో|| కామశ్చ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|      జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత  జాగ్రత||
తా :-  కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు  విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.
4. శ్లో|| ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|      ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత  జాగ్రత||
తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఎదియో చేయవలెనను ఆశతోనే జీవింతురు. కానీ తరిగిపోవుచున్న జీవిత కాలమును గుర్తింపరు.కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.
5. శ్లో|| సంపదః స్వప్రసంకాశాః యౌవనం కుసుమోపమ్|      విధుఛ్చచంచల ఆయుషం తస్మాత్ జాగ్రత  జాగ్రత||
తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, యౌవనము ఒక పూవు వలె మనజీవితములో స్వల్ప కాలము మాత్రమే ఉండునది. ఈ జీవితమూ మెరుపు వలె క్షణభంగురము. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.
6. శ్లో|| క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితమావయోః|      యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత  జాగ్రత||
తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.
7. శ్లో|| యావత్ కాలం భవేత్ కర్మ తావత్ తిష్ఠతి జంతవః|      తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్ర కా పరివేదన||
తా:- మనుషులకు వారి కర్మానుసారము జీవితకాలము ఉండును. అది తీరిన తరువాత వారును నశింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?
8. శ్లో|| ఋణానుబంధ రూపేణ పశుపత్నిసుతాలయః|      ఋణక్షయే క్షయం యాంతి తత్ర కా పరివేదన||
తా:- గత జన్మ ఋణానుబంధముచే పశు, పత్ని పుత్ర గృహ లాభము గల్గును. ఆ ఋణము తీరగనే వారును పోవుదురు. దానికై దుఃఖించుట ఎందులకు?
9. శ్లో|| పక్కాని తరుపర్ణాని పతంతి క్రమశో యథా|      తథైవ జంతవః కాలే తత్ర కా పరివేదన||
తా:- చెట్ల యొక్క పండిన ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?
10. శ్లో|| ఏక వృక్ష సమారూఢ నానాజాతి విహంగమాః|      ప్రభతే క్రమశో యాంతి తత్ర కా పరివేదన||
తా:- రాత్రి చెట్లపై వివిధ జాతుల పక్షులు చేరును. మరల సూర్యోదయము కాగానే ఒక్కటోక్కటిగా ఎగిరిపోవును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?
11. శ్లో|| ఇదం కాష్టం ఇదం కాష్టం నధ్యం వహతి సంగతః|      సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన||
తా – ప్రవహించుచున్ననది లో కళేబరములు తేలుచు, ఒకప్పుడు కలియుచు ఒకప్పుడు విడిపోవుచుండును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు? 

స్వస్తి …………………..

Q. ( ఎంతటి సిరిసంపదలైనా బాబా ఆశీస్సులతో సరి తూగవు)
              ఈ జన్మలోనో , పూర్వజన్మలోనో మనం చేసిన సత్కర్మల ఫలితంగా వచ్చిన పుణ్యంవల్ల భోగభాగ్యాలు కలిగాయి అని భ్రమపడుతూ ఉంటాం . మనకి భగవంతుడు ఇచ్చిన దానితో పోల్చి చూస్తే మనం చేసింది చాలా తక్కువ . ఒక గింజ నాటితే , అది మొక్కగా పెరిగి ఎన్నోరెట్లు పంటను ఇచ్చినట్లు , మనం చేసిన స్వల్పమైన దానమో , సేవో భగవంతుని అనుగ్రహంతో గొప్పగా ఫలిస్తుంది . ఇది మన ప్రతిభ అనుకోవటం పొరపాటు . అనుగ్రహించటమే తన లక్షణంగా అవతరించిన భగవంతుడే శ్రీసాయిబాబా . తాను స్వీకరించిన దానికెన్నో రెట్లు తిరిగి ఇవ్వవలసి ఉంటుందని దక్షిణ స్వీకరించటంలోని అంతరార్ధం గురించి వివరిస్తూ చెప్పారు . నశించిపోయే శరీరాన్ని , దాని ద్వారా చేసే సేవలను బాబాకు అంకితం చేస్తే , శాశ్వతమైన తన సన్నిధానం అనుగ్రహించటం బాబా దయకు చిహ్నం మాత్రమే కాని , అది మన శ్రమ ఫలితం కాదు . ఆ అర్హతను మనకు ప్రసాదించేది కూడా ఆయన అనుగ్రహం అన్నది వాస్తవం .           ఎంతటి భౌతిక సంపదలైనా బాబా ఆశీస్సులతో తులతూగవు . వాటికి అవే సాటి . చాలామంది భక్తులు ధనం కావాలని , ఆరోగ్యం కావాలని , ఉద్యోగం కావాలని బాబాను ఆరాధిస్తారు . మానవజన్మ ఎత్తినందుకు మనం వేడుకోవలసింది మరోజన్మ ఎత్తే అవసరంలేని ముక్తినే . నిజానికి అదికూడా మనం అడిగే అవసరం లేదు . పవిత్ర హృదయంతో బాబా దారిలో నడవటమే మనం చేయవలసినది . బాబా ఆశీస్సులు మనకు ఎల్లప్పుడూ లభిస్తాయి.

Q. నిరాశ ఉన్నచోట సంపూర్ణమైన భక్తి ఎలా వృద్ధిచెందుతుంది????
కాకాసాహెబ్ దీక్షిత్ ఒకనాడు పారాయణ చేస్తుండగా నవనాధులు భక్తి కోసం తెలుసుకుని నిరాశ చెందుతూ ఉండగా అది చూసి శ్యామా కాకా మీరు ఎందుకు ఇంత నిరాశగా వున్నారు??? అని అడుగగా కాకా ఈ రోజు పారాయణలో  నవనాధులు యొక్క విశేషమైన భక్తికోసం తెలుకుని ,మనలో అంత శక్తి లేదే అని  చింతిస్తున్నాను,అసలు ఈ జన్మకు కాకపోయినా మరు జన్మలో నైనా  అర్ధం చేసుకోగలమో లేదో   అని నిరుత్సాహంగా ఉంది అని  చెప్పగా దానికి శ్యామా ఇలా అన్నారు.
సాయి వంటి ఆభరణం పొంది ఉన్న మనవంటి భక్తులు  నిరుత్సాహ పడటం విచారించవలసిన విషయం. విశేషమైన,అచంచలనీయమైన భక్తి ఉన్నవారు ఇలా విచారించనేలా ????నవనాధులు భక్తి గొప్పది కావచ్చు .ఎంతటి గొప్పవారైనా ,మనకు మించిన వారైన వారిని చూసి మనం చింతించవలసిన అవసరం లేదు.ఎదుటి వారితో పోల్చుకోనుటకొంత వరకు మనకు హాని కలుగ చేస్తుంది అని మరువకూడదు. ఎందుకనగా మనం  సాయి అనే ఆభరణం పొందివున్నాం.
 బాబా సర్వసమర్థులు. బాబా తలచుకుంటే తన ప్రేమను మనపై కురుపించగలరు. అందుకే బాబాని మనం” అఖిలాండ కోటి బ్రహ్మాణ్డనాయక రాజాది రాజా యోగిరాజా సమర్ధ సద్గురు సాయి నాధ మహరాజ్ కి జై ” అని కీర్తిస్తున్నాము.సమర్ధ సద్గురువు అంటే      ఏ భక్తులలో స్థిరమైన,దృఢమైన విశ్వాసం ఉంటుందో,ఎవరైతే హృదయంలో  సత్సంకల్పాలతో జీవిస్తారు వారికి సాయి వంటి గురువు యొక్క రక్ష కచ్చితంగా లభిస్తుంది.అటువంటి సమర్థులు సాయి అని శ్యామా చెప్తారు.
ఐనా కాకా సంతృప్తి చెందలేదు. మాయ అనే పొర అతని నమ్మకాన్ని క్షీణింప చేస్తుండగా బాబా ఆనందరావు పాకడే స్వప్నం ద్వారా బోధించారు .
ఎవరైతే గురువు యొక్క పాదాలను ఎల్ల వేళలా విశ్వాసంతో గట్టిగా పట్టుకుని ఉంటారో వారికి సాయి రక్ష తక్షణమే లభిస్తుంది అని స్వప్నం ద్వారా నేర్పించారు.

Q. మనస్సును కదిలించే ఆదిశంకరుల మాతృ పంచకం(తాత్పర్యాలతో)
కాలడిలో అది శంకరుల తల్లి ఆర్యాంబ మరణశయ్యపై ఉంది. తనను తలచుకొన్న వెంటనే ఆమె దగ్గరకు శంకరులు వచ్చి ఉత్తరక్రియలు చేసారు.
ఆ సందర్భంలో శంకరులు చెప్పిన ఐదు శ్లోకాలు “మాతృపంచకం” గా ప్రసిద్ధమైనవి. వాటిని స్మరించుకొందాం.
मुक्तामणिस्तवं नयनं ममेतिराजेति जीवेति चिर सुत त्वम् ।इत्युक्तवत्यास्तव वाचि मातःददाम्यहं तण्डुलमेव शुष्कम् ॥ १॥
ముక్తామణిస్త్వం నయనం మమేతిరాజేతి జీవేతి చిరం సుత త్వంఇత్యుక్తవత్యాస్తవవాచి మాతఃదదామ్యహం తండులమేవ శుష్కమ్.
తాత్పర్యము:
అమ్మా! “నువ్వు నా ముత్యానివిరా! , నా రత్నానివిరా!, నా కంటి వెలుగువు నాన్నా! నువ్వు చిరంజీవి గా ఉండాలి” అని ప్రేమగా నన్ను పిలిచిన నీనోటిలో – ఈనాడు కేవలం ఇన్ని శుష్కమైన బియ్యపు గింజలను వేస్తున్నాను. నన్ను క్షమించు.
अम्बेति तातेति शिवेति तस्मिन्प्रसूतिकाले यदवोच उच्चैः ।कृष्णेति गोविन्द हरे मुकुन्दइति जनन्यै अहो रचितोऽयमञ्जलिः ॥ २॥
అంబేతి తాతేతి శివేతి తస్మిన్ప్రసూతికాలే యదవోచ ఉచ్చైఃకృష్ణేతి గోవింద హరే ముకుందేత్యహో జనన్యై రచితోయమంజలిః.
తాత్పర్యము:
పంటిబిగువున నా ప్రసవ కాలములో వచ్చే ఆపుకోలేని బాధను “అమ్మా! అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!” అనుకొంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను.
आस्तां तावदियं प्रसूतिसमये दुर्वारशूलव्यथानैरुच्यं तनुशोषणं मलमयी शय्या च संवत्सरी ।एकस्यापि न गर्भभारभरणक्लेशस्य यस्याक्षमःदातुं निष्कृतिमुन्नतोऽपि तनयस्तस्यै जनन्यै नमः ॥ ३॥
ఆస్తాం తావదియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యథానైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యా చ సంవత్సరీఏకస్యాపి న గర్భభార భరణ క్లేశస్య యస్యాక్షమఃదాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః.
తాత్పర్యము:
అమ్మా! నన్ను కన్న సమయంలో నువ్వు ఎంతటి శూలవ్యథను (కడుపునొప్పి) అనుభవించావో కదా! కళను కోల్పోయి, శరీరం శుష్కించి ఉంటుంది. మలముతో శయ్య మలినమైనా – ఒక సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావోకదా! ఎవరూ అలాంటి బాధను సహించ లేరు. ఎంత గొప్పవాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా? నీకు నమస్కారం చేస్తున్నాను.
गुरुकुलमुपसृत्य स्वप्नकाले तु दृष्ट्वायतिसमुचितवेषं प्रारुदो त्वमुच्चैः ।गुरुकुलमथ सर्वं प्रारुदत्ते समक्षंसपदि चरणयोस्ते मातरस्तु प्रणामः ॥ ४॥
గురుకులముప సృత్య స్వప్న కాలే తు దృష్ట్వాయతి సముచితవేషం ప్రారుదో త్వముచ్చైఃగురుకులమథ సర్వం ప్రారుదత్తే సమక్షంసపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః.
తాత్పర్యము:
కలలో నేను సన్యాసివేషంలో కనబడేసరికి బాధ పడి ,మా గురుకులానికి వచ్చి పెద్దగా ఏడ్చావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడివారందరికీ బాధ కలిగించింది. అంత గొప్పదానివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నాను
न दत्तं मातस्ते मरणसमये तोयमपिवास्वधा वा नो दत्ता मरणदिवसे श्राद्धविधिना ।न जप्त्वा मातस्ते मरणसमये तारकमनु-रकाले सम्प्राप्ते मयि कुरु दयां मातुरतुलाम् ॥ ५॥
న దత్తం మాతస్తే మరణ సమయే తోయమపివాస్వ ధా వా నో దత్తా మరణదివసే శ్రాద్ధవిధినాన జప్త్వా మాతస్తే మరణసమయే తారక మను-రకాలే సంప్రాప్తే మయి కురు దయాం మాతురతులామ్.
తాత్పర్యము:
అమ్మా! సమయం మించిపోయాక వచ్చాను. నీ మరణసమయంలో కొంచెం నీళ్ళు కూడా నేను నీగొంతులో పోయలేదు. శ్రాద్ధవిధిని అనుసరించి “స్వధా”ను ఇవ్వలేదు. ప్రాణము పోయే సమయంలో సమయంలో నీ చెవిలో తారకమంత్రాన్ని చదవలేదు. నన్ను క్షమించి, నాయందు దేనితో సమానము కాని దయ చూపించు తల్లీ!

Q. బాబా హనుమంతునితో ఎందుకు మాట్లాడే వారు ???

మసీదుకు చావడికి మధ్యలో హనుమంతుని ఆలయం ఉండేది బాబా రోజు హనుమంతునితో మాట్లాడేవారు ఏవో సౌమ్యలు చేసేవారు అది ఎవ్వరికి అర్థం అయ్యేది కాదు  హనుమంతుడు అక్కడ సూక్ష్మ రూపంలో నివసించేవారు .బాబా మసీదు వద్ద నిలబడి తంబిరేకు డబ్బాతో నీళ్లు హనుమంతుడు విగ్రహంపై పడేలా విసిరేవారు అది సరిగ్గా అభిషేకం చేసినట్లు విగ్రహం పై పడేవి ఆ నీళ్లు . బాబా నే దైవం కదా బాబా ఎందుకు హనుమంతుడికి అభిషేకం చేసేవారు   అని అనుమానం రావచ్చు మనకి దానికి సమాధానం విష్ణువు రామావతారం (మానవ రూపంలో )ఎత్తి రామేశ్వరంలో సైకత లింగము స్వయంగా తయారు చేసి శివుడిని అర్చించనట్లే బాబా కూడా రామావతారమే బాబా కూడా మానవ అవతారంలో ఉన్నారు కనుక బాబా హనుమతో మాట్లాడడమే కాక అలా అభిషేకం చెయ్యడం జరిగేది.దానికి కారణం భగవంతుడిని సేవించడం ప్రజలకు నేర్పించే ప్రయత్నం మాత్రమే . అంతే కాని రామ కళ్యాణం చేయించి నందుకు రామ భక్తుడు అని , హనుమకి అభిషేకం చేశారు అని హనుమ భక్తుడు అని కాదు 

సాయి అష్టోత్తరంలో మనం 

రామ శివ మారుత్యాధి రూపాయ నమః అని ఓ నామం కూడా చదువుకున్నాము అంటే బాబా వీరందరి ప్రతిరూపమే అని కదా.

హనుమ ఎంతో శక్తి వంతుడు మనం జీవితంలో ఎన్నో సందర్భాలలో భయంతో శక్తిని,ధైర్యాన్ని , కోల్పోతాం అటువంటి సమయంలో హనుమను సేవించి పూజించి మనలో ధైర్యాన్ని నింపుకుంటాం బాబా అందుకే సాయి నిలయంలో  హనుమను మండలం రోజులు పూజించమని చెప్పి ఎన్నో మహిమలు చూపించారు ఒక్కోవిషయం కోసం తెలుసుకుంటున్నప్పుడు షిరిడీలో జరిగిన ప్రతి ఒక్క బృహత్కార్యాన్ని బాబా మన కోసం సాయి నిలయంలో కూడా జరిపించారు అని తెలుస్తుంది .

రామావతారంలోనే కాదు హనుమ బాబా నే స్వయంగా రాముడు కనుక ఆయనను ఈ కలియుగంలో కూడా  ఆయనతో ఉండే భాగ్యాన్ని వదులుకోలేదు హనుమ

   

Q. ఉల్లిని ఎవరు తినవచ్చు ??

సహజంగా మనిషి కి మూడు గుణాలు ఉంటాయి అవి 

1- రజో గుణం

2- సత్వ గుణం 

3 – తమో గుణం

ఇవి ఒక్కో సందర్భంలో ఒక్కోలా మనిషిపై ప్రభావం చూపిస్తాయి

దానికి కారణం మన జీవిత విధానం,మన చుట్టూ ఉండే మనుష్యులు, మనం భుజించే ఆహారం కారణాలు అవుతాయి.అందులో భాగమే ఈ ఉల్లి.కనుకనే  కొన్ని పర్వధినాలలో నిషిద్ధ ఆహారంగా భావిస్తారు. పర్వదినాలలో మన మనస్సు, ఆలోచనలు దైవం పైనే ఉండాలి అని లౌకిక మైన విషయాలు మనస్సు లోకి రాకూడదు అని మన పెద్దలు చెప్తారు. ఉల్లికి మనిషిలోని గుణాలను మార్చెయ్యగలిగే శక్తి ఉంది ఆ కారణంగానే ఉల్లిని కొన్ని సందర్భాలలో వినియోగించారు.

ఐతే బాబా వద్దకు ఒక యోగి వచ్చినప్పుడు బాబా ఉల్లిని తినడం చూసి ఆ యోగి  మనస్సులో వ్యతిరేకంగా అనుకుంటూనే నమస్కరిస్తాడు.అప్పుడు బాబా అతని మనస్సు ఎరిగి ఇలా అంటారు( “ఉల్లిని ఎవరు ఐతే జీర్ణించుకో గలరో వాళ్లే  దానిని తినాలి అని అంటారు” ) దానికి అర్ధం ఉల్లి తిన్న తర్వాత కూడా మనిషి మనస్సు, మాట,నడక,దృష్టి ఇలా అన్ని స్వభావాలు ఉల్లి తినక ముందు ఎలా ఉన్నాదో అదే విధంగా నిశ్చలంగా,నిర్మలంగా తమ ఆధీనంలో ఉంచుకోగలిగి నప్పుడు వాళ్ళు ఉల్లి ని తినడంలో తప్పు ఏమివుంది అని బాబా ఉదేశ్యం 

Q బాబా కి తాబేలుకి ఉన్న బంధం ఏమిటి?
బాబా ఎదురుగా తాబేలుని ఎందుకు ఉంచుతారు?

మనం సాయి నిలయంలో పారాయణ చేస్తూ ఎన్నో విషయాలు నేర్చుకున్నాము .

మరికొన్ని నేర్చుకుందాం.

1౼ తాబేలు ౼ తాబేలుకి 4 కాళ్ళు ,తల కలిగి ఉంటుంది .

తనని తాను రక్షించుకునేందుకు కాళ్ళు ,తలను లోపలకు పెట్టుకోవడం ద్వారా రక్షించుకోవడం మనం చూస్తాం .అలా ఉన్నపుడు ఎవరు తనను ఏమి చెయ్యలేరు .

బాబా ౼  తాబేలులాగే బాబా కూడా పంచభూతాలు తన ఆధీనంలోనే ఉంచుకున్నారు ఇంకా కామ,క్రోధ  లోభ,మోహ,మధ,మాత్సర్యా లను కూడా బాబా అదుపులో ఉంచుకోగలరు.అలా ఉంచుకోగలగటం వలన బాబా ఎప్పుడు నిశ్చింతగా ఉండటం మనం చూసాం. దానికి ప్రతీకగా తాబేలు బాబా ముందర ప్రత్యేకంగా ఉంచుతారు .

2౼ ఇంకా కృష్ణార్జునుల మధ్య  ఓసారి సాదారణంగా సంభాషణ జరుగుతుండగా కృష్ణుడు రాయుడు కట్టిన రామసేతు వంతెన గొప్పతనం వర్ణిస్తుంటే అర్జునుడు ఇలా అన్నాడు  కావచ్చు కానీ బావా చూడు నేను కూడా నా బాణాలతో వంతెన నిర్మిస్తాను అది ఎంతో దృడంగా నిర్మిస్తాను అలా  కట్టలేని పక్షంలో నేను నా జీవితంలో బాణాన్ని తాకనే తాకను అని ప్రతిజ్ఞ చేస్తాడు వంతెన కడతాడు  కట్టిన వంతెన చూడటానికి బావుంది కానీ ఎంత దృడంగా ఉందో పరీక్షించాలి కృష్ణుడు ఇలా అంటాడు . నేను నీకు బావను కనుక బావుంది అని చెప్పవచ్చు, కనుక వంతెనను పరీక్షించడానికి  హనుమంతుడిని పిలుద్దాం అని కృష్ణుడు అంటాడు హనుమంతుడిని పిలుస్తారు హనుమంతుడు  వంతెనను పరిక్షిస్తూ  తన శరీరాన్ని(బరువు) పెంచుతూ  వంతెనను పరిక్షిస్తుండగా  వంతెన వంగిపోవడం ప్రారంభం అయ్యింది అప్పుడు శ్రీ కృష్ణుడు ఈ వంతెన కూలిపోతే అర్జునుడు యుద్ధం ఎలా చేస్తాడు  అని కృష్ణుడు వంతెన కింద కూర్మవతారదారిఅయ్యి ఆ వంతెనను కాపాడ సాగేడు అర్జునా ఇప్పటికైనా తెలుసుకో అన్నాడు కృష్ణుడు . అప్పుడు అర్జునుడుకి గర్వభంగం కలిగి  కళ్ళుతెరచుకొన్నాడు.

2౼ ఐతే ఆ కథకి  బాబాకి గల సంభందం కూడా ఇదే బాబా ఎప్పుడూ అంటూ ఉంటారు మీ భారాలు నాపై పడవేయుడు నేను వాటిని మోస్తాను అని అంటారు . సాక్షాత్తు శ్రీ కృష్ణుడే బాబా గా అవతరించారు అని.దానికి ప్రతీకనే ఈ తాబేలును బాబా ముందర ఉంచడానికి గల మరికొన్ని కారణాలు అని తెలుస్తుంది

Q. బాబా చేసే చిత్రవిచిత్రాలు  అంతరార్థాలు

   యోగుల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో తీరు (విధానం). భక్తులైనవారికి ఆ *తాదాత్మ్యబుద్ధి(ఎలాగైనా ఆ దర్శించుకుంటున్న యోగియందే బుద్ధి కలిగి ఆయన దృష్టిలోనే ఆలోచించగలిగిన తనం) గాని ఉన్న పక్షంలో తప్పక కొంత కాలానికి అర్థమౌతారు ఆ మహనీయులు.* నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే భక్తులకి సహనం తక్కువ. *‘ఫలానావారి దగ్గరికి వెళ్లాను. దర్శించాను. వారం తిరక్కుండా ఈ మంచి జరిగింది…’ అనే ఈ తీరు లాభదృష్టి వారిది తప్ప, మహనీయుల ద్వారా తెలుసుకోదగ్గ గొప్పదనాలేమిటనే తీరు ఆలోచన నూటికి తొంభైమందికి ఉండదనేది నూటికి నూరు పాళ్లు నిజం.* అందుకే తమదైన దృష్టితో ఆలోచిస్తూ భక్తులు ‘ఫలానా స్వాములవారు ఇలా.. ఫలానా వారు అలా..’ అంటూ లో–దృష్టి లేకుండా నోరు పడేసుకుంటూ ఉంటారు. అలాంటి నిందలకి సాయి కూడా దూరంగా లేడు. ఆయన్ని ‘కోపిష్ఠి అనీ, ఎప్పుడేం చేస్తాడో అర్థం కానీయనివాడనీ, ఒకసారి గొప్పగా చూస్తూ మరోసారి తొక్కి వేస్తాడనీ..’ ఇలా మాట్లాడుతూ ఉండేవారు ఆయన ఉన్నతత్వం గురించి తెలుసుకుందామని కనీసం ప్రయత్నించనివారూ, కొంతకాలం ప్రయత్నించి అర్థం చేసుకోలేనివారున్నూ.

Q. షిరిడీలో చావడి ఉత్సవంలో బాబా పటానికి వస్త్రం ఎందుకు కడతారు???

బాబా షిరిడీలో శశీరులుగా ఉన్నపుడు పల్లికి ఉత్సవం చేసేవారు కదా అప్పుడు గుఱ్ఱము పల్లికి ఇంకా ఎన్నో సౌకర్యాలు ఉన్నా బాబా మాత్రం ఎన్నడూ పల్లకి ఎక్కలేదు,గుఱ్ఱం పై ఎక్కలేదు కాలి నడకనే ఊరేగింపుగా వెళ్లే వారు బాబా అంత నిరాడంబర జీవనాన్ని గడిపారు మహాసమాధి చెందే వరకు కూడా.

ఐతే ఆ పల్లకి ఉత్సవంలో బాబా కు ఓ కోటు ధరించమని భక్తులు కోరుకోగా వారి కోరిక మేరకు ఆ కోటు వేసుకునే వారు ఆ కోటు ఇప్పటికి మనం మ్యూజియంలో చూడవచ్చు . ఐతే బాబా మహా సమాధి తర్వాత కూడా ఆయన జీవించి ఉన్నట్లు గానే భావించి బాబా పటానికి వస్త్రం కట్టి ఆయనకే తొడిగినట్లు గా భావిస్తున్నారు భక్తులు .

అందుకే భగవంతుని విషయములో భావన ముఖ్యం అని .భావన లేకుండా అన్ని ఉపచారాలు అన్ని రకాల పూజా సామాగ్రీలు సమకూర్చుకుని చేసిన అది నిష్ప్రయోజనమే అని అంటారు.

బాబా లాంటి గురువులు, దైవం ,ఇంకా స్నేహితుడు ,ఎప్పటికి జీవించే ఉంటారు .

Q. – సర్వస్యశారగతి అంటే ???

సర్వస్యశరణాగతి అంటే మనం సాయి నిలయంలో తెలుసుకున్నాము అప్పుడు కొంతమంది వినని వాళ్ళ కోసం చిన్నగా నాకు తెలిసినంత వరకు చెప్తాను .మనం రోజూ కొన్ని పదాలు వింటాము ,వినియగిస్తాము కానీ వాటిగురించి క్లుప్తంగా తెలియని వాళ్ళము ఉంటాము అలా తెలియని వాళ్ళ కోసం తెలియచేసే ప్రయత్నమే  బాబా ఆశీస్సులతో నేను చేస్తున్నా దానికి ప్రసన్నమ్మ అనుమతి కూడా లభించింది దానికి గాను బాబా కు ,అమ్మకు కృతజ్ఞతలు

Q సర్వస్యశరణాగతి -: అంటే

1 – తన్ 

2 – ధన్ 

3 – మన్ 

1- తన్ అంటే మన దేహం దానిని ఎంత వరకు అవసరమో అంత వరకే ప్రేమించాలి, పోషించాలి అంతే కాదు ఈ శరీరం భగవంతుడుది ఈ శరీరం ఇచ్చినది భగవంతుడే కనుక దీనిని ఆయన సేవ కోసమే వినియగిద్దాం అని భావించాలి . అలా చేస్తేనే మన దేహం శుద్దిగా ఉంటుంది.

2 – ధన్  అంటే మన  సంపద మన సంపాదించాం అనుకుంటే అది అహంకారం భగవంతుడే ఇచ్చాడు ఈ ఐశ్వర్యం అనుకుంటే అది అనుకువ .భగవంతుడు  భావనను చూస్తాడు ధనాన్ని కాదు. కనుక భగవంతుడు ఇచ్చిన దాన్ని స్వలాభం కోసం మాత్రమే కాకుండా కొంత దానం కూడా చెయ్యాలి సత్కార్యాలకు మన ధనాన్ని వెచ్చిస్తే తనువు తో పాటు సంపద కూడా శుద్ధిగా ఉంటుంది.

3 – మన్ అంటే మనస్సు ఇది మన శరీరంతో పాటు భూమిమీదకు స్వచ్ఛంగా వస్తుంది ఎందుకు అంటే భగవంతుని ప్రసాదం ఎప్పుడు స్వచ్ఛంగానే ఉంటుంది కనుక.  కానీ మనం ఒక్కోసారి తెలిసో తెలియకో దానికి మురికిని అంటిస్తాం అటువంటి ప్రమాదం మనకు మన మనస్సుకు కలగ కుండా ఉండాలి అంటే మనస్సులో నిరంతరం దైవ నామం చేస్తూ ఉంటే కచ్చితంగా అది స్వచ్ఛంగా ఉంటుంది బద్రంగాను ఉంటుంది .

దేహము , సంపద , మనస్సు వీటిని భగవంతునికి స్వచ్ఛంగా సమర్పించడమే సర్వస్యశరణాగతి  

Q షిరిడీ లో ద్వారకా మయి లో ఉన్న కొన్ని ముఖ్యమైన బాబా వినియోగించిన వస్తువులు కోసం తెలుసుకున్నాము కదా మరో మూడు అద్భుతమైన  ఐన వస్తువులు ఇప్పటికి ద్వారకా మయి లో ఉన్నాయి అవి 1 – గంట , 2 – కొలంబ , 3 – కొక్కెములు రొండు  పైన వేలాడ దీసి ఇప్పటికి ఉన్నాయి .

1 – గంట :- బాబా చూడటానికి ముస్లీం లా ఉంటూ సాక్షాత్తు భగవత్ స్వరూపుడే అయిన భిక్షాటన చేస్తూ మసీదుకు ద్వారకా మాయి అని పేరు పెట్టి అక్కడే ఎంతో నిరాడంబరంగా జీవిస్తూ హిందువు లాగా నిరంతర    అగ్ని హోత్రం వెలిగిస్తూ తులసిని పూజిస్తూ గంటను కూడా  వినియోగిస్తూ అందరికి ఆదర్శంగా ఉండేవారు. భక్తులను సన్మార్గంలో నడిపించడమే బాబా కు వ్యసనంగా జీవించేవారు వ్యసనం అని ఎందుకు అన్నాను అంటే ఓ బృహత్కార్యాన్ని ఆరంభించి దానినే ఊపిరిగా అలసిపోకుండా  జీవించడం వలన బాబా కి తన భక్తుల శ్రేయస్సే వ్యసనం గా మారిపోయింది కనుక ఆ పదాన్ని వినియోగించాను .

షిరిడీలో ఇప్పటికి మసీదులో గంట అలాగే ఉంది .ఆ గంట ను బాబా మసీదులో నివసిస్తున్న  కాలంలో  వినియోగించేవారు  హారతులు ఇచ్చేవారు అలా హారతికి 5 నిమిషాలముందు ఆ గంటలు మ్రోగిచేవారు దానితో హారతి ప్రారంభం అయ్యింది అని భక్తులు పరుగు పరుగున రావడం జరిగేది .

2 – కొలంబా – : ద్వారకా మయి లో ధునికి ఎడమపక్క ఓ నల్లని కుండ ఇప్పటికి చూడచ్చు .దానిని అందరూ గమనించ లేక పోవచ్చు ఒక వేళ గమనించినా అది ఏమిటి ఎవరికి తెలియదు.

బాబా భిక్షాటన చేయగా వచ్చిన ఆహారాన్ని కుండలో ఉంచి వచ్చి పోయే జనాలకు ,ఆకలితో ఉన్న మూగ జీవులకు పెట్టడానికి వినియోగించేవారు,ఇంకా ఒక్కోసారి అందులోనే నీటిని నింపుకుని బాబా త్రాగడానికి ,అక్కడకి వచ్చిన వారు త్రాగటానికి కూడా వాడేవారు  అని విన్నాం కదా అదే ఆ కోలంబా ( కుండ) దానిని ఇప్పటికి చూడగలగటం మన అదృష్టం .

3 – కొక్కెములు :- కొక్కెములు కూడా ఇప్పడికి ద్వారకా మయి లో ఉన్నాయి అవి ఏమిటో తెలుసుకుందాం.

బాబా మసీదులో విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని వస్త్రాలు ఒకదానిమీద ఒకటి వేసుకుని విశ్రాంతి తీసుకునే వారు .అది చూసిన నానా సాహెబ్ డేంగలే అనే భక్తుడు బాబా నిరంతరం మన సుఖం కోరుకుంటారు ,ఇక్కడికి చాలా మంది వచ్చి వారి వారి కష్టాలు,కోరికలు చెప్పుకుని తీరిపోయాకా వెళ్ళిపోతారు గాని బాబా సుఖం ఎవ్వరికి పట్టదు అని అతను ఆలోచించి  ఓ మంచం తెచ్చి ఇచ్చాడు బాబా అప్పుడు ఇలా అన్నారు ఈ మంచం అవసరం నా కన్నా నీకే ఎక్కువ ఉంది ఒద్దులే నువ్వు తీసుకుని వెళ్లు అని సున్నితంగా తిరస్కరించారు. కానీ అతనికి బాబా పై గల భక్తి,ప్రేమలతో  ఓ కర్రబల్ల ను ఇవ్వడం దానిని బాబా స్వీకరించడం బాబా ఆ బల్లను ఓ ఉయ్యాలలా కట్టడం మనం చదువుకున్నాము ఆ కర్రను 4 వైపులా రంధ్రాలు చేసి 2 కొక్కాలను ద్వారకా మయి లో దూలాలకు కట్టి ఉయ్యాలను వ్రేలాడా తీశారు. అవి ఇప్పటికి అక్కడే ఉన్నాయి పైన ఉన్న గంట ను , 2 కొక్కాలను మనం ఈ సారి షిరిడి వెళ్ళినప్పుడు గమనించవచ్చు

Q బాబా వేపచెట్టు కింద ఎందుకు కూర్చునే వారు ?

1౼ బాబా వేపచెట్టు వద్ద తన గురుస్థానం ఉంది కనుక గురువు పాదాల వద్దే శిష్యులు సురక్షితంగా ఉంటారు అని గురువు ఆవశ్యకత ప్రతి మానవుడికి తప్పని సరి అని తాను మానవ రూపందాల్చి మనలో ఒకరిగా ఉంటూ గురువు యోక్క గొప్పతనాన్ని చాటుతూ వేపచెట్టు కింద కూర్చునేవారు బాబా .

2౼ చేదుగా ఉన్న వేప ఆకును తియ్యగా చేసిన సాయి మన జీవితాలలో ఉన్న చేదు క్షణాలను తలచుకుంటే తీపి జ్ఞాపకాలుగా మార్చగలను అని దానిని నిరూపిస్తూ వేపచెట్టు కింద కూర్చునేవారు.

3 ౼ వేపచెట్టు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రతిరూపం .బాబాని మనం ఎన్నోసార్లు అమ్మవారి ప్రతినిధిగా ఈ భూమి మీదకు వచ్చినట్లు చదువుకున్నాము.

” సాయి మహాలక్ష్మి నారాయణి ” అని ఓ కమ్మని పాట కూడా బాబా మీద పాడుకుంటాం .కలియుగంలో భక్తులను రక్షించడానికి అమ్మ బాబాని కలియుగ దైవంగా నియమించింది అని మన అందరికి తెలుసు .సాక్షాత్తు అమ్మవారే బాబా కనుక బాబా వేపచెట్టు కింద కూర్చునే వారు.అంతే కాదు ప్రతి గురువారం ,శుక్రవారం , షిరిడీ లో వేపచెట్టు వద్ద దీపం వెలిగించిన బాబా కు ఎంతో ప్రీతి అని కూడా విన్నాం. ఇంతకన్నా ఋజువు ఏమి కావాలి బాబా యే స్వయంగా అమ్మవారు అని నమ్మడానికి .లక్ష్మీ దేవికి దీపాలన్నా ఎంతో ఇష్టం బాబా కి కూడా అంతే ఇష్టం దీపాలు అంటే

పుట్టుక లేని పకీరు

ఎవరిదైనా ఓ జీవిత చరిత్రని రాయాలంటే స్పష్టమైన ఆధారాలు లభించినప్పుడు మాత్రమే దాన్ని లోకానికి ప్రచారం
చేయడం సరైన పని. అలా కాక ఆధారాల్లేకపోయినా ఏదో ఊహలతోనో, ఎవరెవరో చెప్పిన కట్టుకథలతోనో జీవిత
చరిత్రలని గనుక రాస్తే నిజమైనదేదో, నమ్మాల్సిందేదోనన్న విషయం ఓ జీవితకాలంలో తెలియదు ఎవరికీ కూడా.
రామకథకి వాల్మీకి రాసిన శ్రీమద్రామాయణమే ప్రమాణం అవుతుంటే, పూర్తిగా శ్రీమద్రామాయణాన్ని చదవని ఎందరో
కొంత శ్రీమద్రామాయణంలోనిదీ, కొంత మరో రామాయణంలోనిదీ, మరికొంత అక్కడక్కడ హరికథల్లో విన్నదీ కలిపి
చెప్పేస్తున్న కారణంగానే నేటికీ శ్రీమద్రామాయణం అసలు కథ ఏదో అది నూటికి తొంభైమందికి తెలియకుండా
పోయింది, కేవలం ఇలాంటివారి వల్ల. అలాగే, వ్యాసుడు రాసిన భారత భాగవత కథలు కూడా పూర్తిగా చదవనివారి
కారణంగానే కల్పిత కథలతో ప్రచారమవుతూ నిజమైన కథ ఏదో తెలియకుండా పోయింది. కేవలం ఇలాంటివారి వల్లే..
‘ధర్మసందేహాలు’ వస్తూనే ఉంటాయి ఓ జన్మకాలమంతా. దానిక్కారణం దేన్నీ సరిగా లోకానికి రానీయక
పోయినందువల్ల. ఇలా చెప్తున్నారేమిటి? అని ప్రశ్నించేవారూ, అలా చెప్పడం సరికాదని ఎదురు తిరిగే వారూ
లేకపోయినందువల్లనే.హేమాడ్‌ పంత్‌ ఒక బాధ్యతాయుతమైన మేజిస్ట్రేట్‌ పదవిని నిర్వహించినవాడైన కారణంగా తగిన
సాక్ష్యాధారాలు, వీటితో పాటు ఎవరినుండైనా విన్న కొన్ని సమాచారాలుంటే వాటిలో నిజానిజాలెంతో పరిశీలించగల శక్తి
ఉన్న తన బుద్ధితో విచారించి ఆ ప్రమాణబద్ధమైన అంశాలు కలిపి సాయి పుట్టింది ఎప్పుడు? ఎక్కడ? ఎలా? అనే
విశేషాలని తేల్చగలిగాడు.

సాయి మొదటి దశ
అది 1854వ సంవత్సరం. షిర్డీ గ్రామానికి వెలుపల, అంటే పొలిమేర అనుకోవచ్చు. అక్కడో పెద్ద వేపచెట్టుండేది. దాని
కిందే సాయి ఉండేవాడు. అప్పటికి ఆయన 16 సంవత్సరాల వయసువానిగా కన్పించాడు అందరికీ. అంటే ఆయన
పుట్టినది 1838వ సంవత్సరం అయ్యుండచ్చు.ఎప్పుడూ ఆ చెట్టు కిందే బస. ఓ రాత్రి లేదు, ఓ పగలు లేదు, ఓ ఎండ
అనీ లేదు, ఓ వాన అనీ లేదు, ఓ చలి అనీ లేదు. అక్కడే అక్కడే అక్కడే. షిర్డీ గ్రామానికి వస్తూండేవారూ
పోతుండేవారూ ఏవేవో వృత్తులు చేసుకుంటూండేవారూ గానీ, ఎందుకు ఈ బాలుడు ఇలా కూర్చున్నాడో ఎవరికీ కనీసం
తెలుసుకుందామని కూడా అనిపించలేదు. అడిగిన వారు కూడా లేరు.కొన్నాళ్లిలా గడిచాక, ముస్లిం పద్ధతిలో
కనిపిస్తున్న ఆ బాలుణ్ని గమనించాక, ఎప్పుడూ అల్లానామాన్నే జపిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమయ్యాక, ఎవరో
ఒకామె తన పుత్రికని తీసుకొచ్చి, తన పాప కండ్ల కలకతో బాధపడుతోందని నమస్కరించి చూపించింది. సాయి
టక్కున లేచి కొంతదూరంలో ఉన్న చెట్టువద్దకెళ్లి పసరు తీసి ఆమె కళ్లలో వేసాడు. మరురోజుకి తగ్గింది.అంతే! ఆమరునాడు మరో ఇద్దరొచ్చారు. ఈ వ్యాధీ ఆ వ్యాధీ అంటూ ఎవ్వరొచ్చినా మాట్లాడే ధోరణే లేదు. వినడం, ఏ చెట్టు ఏ తీగ
అనే దాన్ని చూసుకోవడం, టక్కున లేచి కొంత దూరం వెళ్లి తేవడం, ఆ పసరుని నోటిలోనో, గాయంపైనో వేసి ఆ వ్యాధి
తగ్గేట్టుగా వైద్యం చేయడం, పంపించివేయడం ఇలా జరిగేది. దీంతో ఐదుగురు పది మందిగా, పదిమంది వందగా
అయిపోయారు. ఇలా జనం పెరుగుతున్నా ఆయనకి విసుగు, విరామం లేకుండా వైద్యం చేస్తూనే ఉండేవారు.
అప్పుడైనా ఏ ఒక్కరికీ ఇంతటి వైద్యం చేసిన ఆయన్ని ఏ ఇంటిలోకో, వసారాలోకో ఉండవలసిందిగా పిలుద్దామని,
నిత్యం భోజనాన్ని సమకూరుద్దామని వాళ్లకీ అనిపించలేదు. ఈయనకు కూడా అడుగుదామనే ఆలోచన ఏమాత్రమూ
లేదు. ఆయన వివరాలని ఎవరూ అడిగిందీ లేదు. ఈయన చెప్పిందీ లేదు.

ఈయనది ఏ మతం?

జనసంఖ్య పెరగడంతో మెల్లగా ఈయన గురించిన వివరాల్లోకి ఆలోచనలు సాగాయి.ఫకీరు రూపంలో ఉన్నాడు
కాబట్టి, మసీదు గోడకి ఆనుకుని కూర్చున్నాడు కాబట్టి, మధ్యమధ్యలో పైకి ‘అల్లాహ్‌మాలిక్‌’ (అల్లాయే నా జీవిత
యజమానీ దైవం కూడా) అంటూ ఉన్నాడు కాబట్టి… ఈయన ముస్లిం మాత్రమే అని కొందరు ఓ నిర్ణయానికొచ్చేశారు.
పైగా మహమ్మదీయులకి ఇలాంటి పసరు వైద్యాలు, తాయెత్తులు, దిష్టి తొలగించే వైద్యాలు వంశ పరంపరగా వస్తూంటాయి కాబట్టి కూడా ఈయన ముస్లిమే అనే నిశ్చయం చేసుకున్నారు.అయితే మరికొందరు మాత్రం సాయి చెవులు రెంటికీ ఉన్న చిల్లుల్ని చూసి ఇవి హిందూధర్మం ప్రకారం ఉపనయనం (ఒడుగు) కార్యక్రమంలో చేయబడే సంస్కారాలు చెవులు కుట్టడం (కర్ణవేధ) అలాగే పుట్టువెండ్రుకల్ని తీసివేయడం (చౌలం) అనేవి స్పష్టంగా కనిపిస్తున్న
కారణంగా హిందువేననే నిర్ణయానికొచ్చేశారు.కొద్దిగా పరిచయమయ్యాక మాటలు దొర్లుతాయిగా! బాబూ! నీ బస ఎక్కడ? ఇక్కడే కనిపిస్తూ ఉంటావని అడిగితే ఆ మసీదు చూపిస్తూ ‘అదుగో! ద్వారక నా నివాసమన్నట్లు చూపించాడు. చనువుతో మసీదులోపల తిరిగి చూస్తే మహమ్మదీయ విధానానికి విరుద్ధంగానూ, హైందవ ధర్మానికి అనుగుణంగానూ ‘తులసిమొక్క’ కనిపిస్తోంది. అదేదో తనంత తాను పెరిగింది కాదు. పెంచబడుతూన్న ధోరణి కనిపిస్తోంది. మరి కొద్దికాలమయ్యాక ‘నువ్వెవరివి?’ అని అడిగితే కొందరితో రాముడిననీ, మరికొందరితో కబీరుననీ,
ఝాన్సీ లక్ష్మీబాయ్‌ కొలువులో సిపాయిననీ, బట్టలని నేస్తూ ఉండేవాడిననీ… ఇంకా విచిత్రంగా మహాలక్ష్మిననీ… ఇలా చెప్తుంటే ఆశ్చర్యపడేవారు అందరూ. అయినా మన రోగాలన్నీ నయమవుతూంటేనూ, ఈ కుర్రవాడు ఏ సొమ్మునీ తీసుకోకుండా చిటికెలో వైద్యం చేస్తుంటేనూ, వయసులో స్త్రీలందరినీ ఎంతో గౌరవ మర్యాదలతో సభ్యదృష్టితోనే చూస్తున్న కారణంగానూ మనకి ఇతర వివరాలెందుకనుకుంటూ వాళ్లంతా ఏనాడూ ఈయన గురించిన లో వివరాలకి
పోలేదు. ఒకవేళ వివరాలని ఆయన చెప్పినా అవి అర్థమయ్యేవి కాదు. ఇలా అన్నింటినీ జోడించుకు చూసుకుంటే
లౌకికంగా ఆయన ఓ పిచ్చివానిలా అనిపించేవాడు కూడా. అలా ఆయన్ని పిచ్చివాడుగా అనుకోవడానికి ఇష్టముండేది కాదు. మనసు అంగీకరించేది కాదు. ఇతరులకి ఈయన గురించి చెప్పాలంటే ఏం చెప్పాలో తెలిసేదీ
కాదు.ఇదిలా ఉండగా ఓసారి సాయిని ధులియా అనే ఊళ్లో మేజిస్ట్రేటు కోర్టులో ఎవరి వ్యాజ్యంలోనో సాక్షిగా విచారించవలసి వచ్చింది. అప్పుడు సాయిని గురించి ప్రశ్నా సమాధానాలు ఇలా ఉన్నాయి. ‘‘నీపేరు?’’‘‘బాబా.’’‘‘నీ తండ్రి పేరు?’’‘‘బాబా.’’తండ్రీకొడుకుల పేర్లు ఒకలానే ఎందుకుంటాయి? అని ఒక్కక్షణం
మేజిస్ట్రేటు ఆశ్చర్యపడినా తన బాధ్యత చెప్పింది రాసుకోవడం మాత్రమే కాబట్టి, ఇంకా ఏదైనా అడిగితే అది న్యాయస్థాన నియమాలకి వ్యతిరేకం కాబట్టి అలాగే నమోదు చేశాడు.‘‘సరే! నీ మతం ఏమిటి?’’‘‘కబీరు మతం.’’‘‘ఏ కులం
నీది?’’‘‘దేవుడి కులం’’‘‘ఇంకా ఏమైనా నీ వివరాలని చెప్తావా?’’‘‘నేను అనసూయాదేవిని, మహాలక్ష్మిని.’’మేజిస్ట్రేటు మారు మాట్లాడక ‘వెళ్లవచ్చు’నన్నట్టు చూశాడు. చిత్రమేమంటే మేజిస్ట్రేటు ఎక్కడా కూడా ‘నీ ఊరేది?’ అని
అడగలేదు. సాయి చెప్పలేదు కూడా.షిర్డీకి వంద మైళ్ల దూరంలో పత్రి అనే గ్రామం ఉంది. ఆ ఊళ్లోనే సాయి పుట్టాడనే ఓ వదంతి ఉంది. ఆ దిశగా పరిశీలించారు కొందరు మేధావులు. జన్మస్థలం ‘పత్రి’కాదుసహజంగా ఎవరైనా ఎక్కడైనా
పుడితే ఆ విషయం తెలియకుండా ఉండదు. పుట్టాడు అనగానే తల్లి, తండ్రి, మేనత్త, మేనమామ, ఇతర బంధువులు,ఆప్తులూ తిరిగిన ప్రదేశం చదువుకున్న బడీ, లేదా పనిచేసిన పొలం… ఇలా ఏవో కొన్ని వివరాలు తప్పక ఉంటాయి.
ఒకరికి కాకపోతే మరొకరికైనా తెలిసి తీరుతాయి కదా! నిజంగా సాయే గనుక పత్రి గ్రామంలోనే పుట్టి ఉండి ఉంటే, గ్రామం షిర్డీకి కేవలం వంద మైళ్ల దూరంలోనే ఉంది కాబట్టి, ఆ ఊరి ప్రజలు ఇక్కడికీ, ఇక్కడివారు అక్కడికీ ఏవో వృత్తి వ్యాపారాల మీద తిరుగుతూనే ఉంటారు కాబట్టి ఈ నిజం తప్పక బయటపడి ఉండేదే తగిన సాక్ష్యాధారాలతో. ఒక వ్యక్తి జన్మించాడంటే పైన అనుకున్న తీరుగా ఏ కొందరో బంధువులు తప్పనిసరి కాబట్టి, నేరుగా షిర్డీలో మసీదు గోడనానుకుని కూర్చుని ఉన్న సాయి దగ్గరకే వచ్చి, ఈ పత్రి గ్రామం, జన్మస్థలం… వ్యవహారాన్ని చెప్పి
ఉండకపోవచ్చును గానీ, ఏ ఒక్కరో అయినా ఆ నోట ఈ నోట ఫలానివారికి కలిగిన కుర్రవాడు, వాని లక్షణాలు ఇవీ, వృత్తి ఇదీ, ఇల్లు ఇదీ.. అంటూ చెప్పకుండా ఉండగలరా?

పోనీ! ఎవరికైనా జన్మస్థలం జన్మనిచ్చిన తల్లి అతిముఖ్యులు కాబట్టి, తన తల్లిపేరునీ ఊరిపేరునీ సాయి ఎక్కడైనా చెప్పాడా? చెప్పుకున్నాడా? పదిమందిలో చూచాయిగానైనా అన్నాడా?.. అని పరిశీలిస్తే ఎక్కడా కూడా ఆ ప్రస్తావనే
రాలేదు ఆయననుండి. పోనీ! ఏ ఊరు పేరూ గుర్తింపూలేని వ్యక్తుల విషయంలోనైతే సమాచారం తెలియకపోవచ్చుననుకోవచ్చు గానీ, ఇందరు రోగులకి రోగ బాధని నయం చేస్తూనూ, ఒంటరిగా ఉంటూ ఎవరి జోలికీ పోకుండా ఇంత చిన్నవయసులో ఇంత సభ్యతతో ఉంటూ కనిపిస్తూంటేనూ, ఏమీ ఆశించకుండానూ ఏం తింటున్నాడో
ఎలా జీవనాన్ని గడుపుతున్నాడో ఎవరికీ తెలియని రీతిలో ఉంటూంటేనూ ఆయన గురించి సమాచారం వంద మైళ్ల దూరంలో ఉన్న ‘పత్రి’ గ్రామవాసులకి తెలిసి ఉండదా?ఇదంతా ఒకెత్తూ… సాయికి బాగా దగ్గరగా ఉండే వారైన. నానాదీక్షిత్, అలాగే బూటీ… మరికొందరికీ సాయి చెప్పి ఉండడా? లేక వీరు అడిగి ఉండరా? తెలిసి ఉండదా?వాళ్లెవరూ సాయిది ‘పత్రి’ గ్రామమనకపోవడంతో పాటు అసలు ఆయన జన్మస్థలం గురించిన ప్రస్తావననే తేకపోవడం మరొకెత్తూను.సాయి ఇంకా ఈ లోకంలో ఉండగానే ‘ఖండోబా’ అనే గ్రామదేవత ఆలయంలో అర్చకునిగా ఉంటున్న
‘మహల్సాపతి’ అనే ఆయన సాయిమీది విశేష భక్తితో అనేక పర్యాయాలు సాయికీర్తనలని రాగయుక్తంగా పాడాడు కదా! ఆయన కూడా ఎక్కడా ఏనాడూ ఏ చోటా సాయి ఎక్కడ పుట్టాడనే విషయాన్ని గానీ, విశేషించి ‘పత్రి గ్రామం’
పేరుగాని ఎత్తనే లేదు.మరి ఈ జన్మస్థలం గురించిన ఈ చర్చ అపోహలకి కారణం ఒక్కటే. ‘ఖండోబా’ అనే గ్రామదేవత ఆలయంలో అర్చకునిగా పనిచేస్తూండే ‘మహల్సాపతి’ అనే ఆయన ఒక పెన్సిలుతో ఒక కాగితం మీద ‘సాయి షిర్డీ
సమీపంలోని పత్రి గ్రామంలో పుట్టాడు’ అని రాసి ఉండడమే. ఈ రాతకి ఏ మాత్రం ఆధారం లేనే లేదు. ఏతావతా తేలిందేమంటే మనం చెప్పుకోబోయిన కథ చెప్పుకున్న మన సాయి కథా ‘కంచికి వెళ్లకుండా మళ్లీ అనగనగా… అంటూ కథ ప్రారంభానికే వచ్చేసిం’దని. దీన్ని బట్టి సప్రమాణంగా తెలిసేదేమంటే… సాయి జన్మస్థలం, తల్లిదండ్రులు, సాయి పేరు, సాయి మతం, సాయి బాల్య విశేషాలు, సాయి చేసే వృత్తి.. ఇలా ఏమీ కూడా ఇప్పటివరకూ తెలియనే తెలియవనీ, తెలియడం కోసం ప్రయత్నించిన అందరికీ కూడా అంతుబట్టన లేదనీను. ఇదంతా ఇలా ఉంచి ఆయన్ని అడిగితే ఏం చెప్తాడోనని ఆలోచించి, చివరి ప్రయత్నంగా ఆయన్ని గురించిన వివరాలని ధైర్యం చేసి ఆ సాయినే అడిగితే ఆయన, చిరునవ్వుని మౌనంగా నవ్వి మరో పక్కకి తొలిగిపోయేవాడుకూడా.ఊరు, పేరూ వివరాలూ లేకుండా ఉండడం సాధ్యమా?పైన చదివిందాని ప్రకారం సాయి ఊరూ పేరూ వివరాలూ.. ఇలా ఏమీ తెలియవీల్లేదని అనుకున్నా, అలా ఉండడం సాధ్యమా? అనే సందేహం మనకి వస్తుంది. అలా రావడం తప్పుకాదు కూడా. ఇప్పుడు యథార్థాన్నితెలుసుకుందాం!సాయి మనలా ఒక కులానికీ, మతానికీ సంప్రదాయానికీ చెందిన వాడు కాదు. అందుకే కులాన్ని గురించి అడిగితే దేవుడికులమని, మతాన్ని అడిగితే కబీరు మతమనీ అన్నాడు. సంప్రదాయం గురించిఎవరూ అడగకున్నా.. వేషం ప్రకారం మహ్మదీయం,తులసి మొక్క నాటడం, నిత్యం అగ్నిహోత్రాన్ని చేసే సంప్రదాయం(ధుని) అలాగే మసీదుని ద్వారక అనడం ప్రకారం
హైందవమనీ తెలియజేసుకున్నాడాయన.తాను పుట్టిన 16 సంవత్సరాల వరకూ ఏ ఉనికీ లేకుండా అకస్మాత్తుగా వెలుగులోకి రావడం ప్రకారం ఆయన ఏదో ఓ ఘనకార్యాన్ని లోకానికి చేయదలిచి వచ్చినవారే అని అర్థమవుతుంది.

దీనికి బలమైన ఆధారం కూడా ఒకటుంది! లోకంలో అందరికీ ఈ అకస్మాత్తుగా ఊడిపడ్డ సాయిని గురించిన అనుమానం కలిగి షిర్డీగ్రామంలో ఉన్న గ్రామదేవతకి జరిగే ఉత్సవాల్లో ఓ రోజున ఈయనని గురించి తెలుసుకోవాలనుకున్నారు .ఆ రోజుల్లో యథార్థమైన ‘పూనకాలు’ ఉంటూండేవి. ‘పూనకం’ అంటే ఒక దైవశక్తి. నిత్యం .ఆ దేవిని ఉపాసిస్తూండే ఒక వ్యక్తిలోనికి ప్రవేశించడమని అర్థం. అలా దైవశక్తి ఈలోనికి ఆవహించిన వేళ, అలాఆవహింపబడిన వ్యక్తికి బాహ్యస్పృహా స్మృతీ ఉండవు. అంటే తానెవరో, ఎక్కడ నుంచి వచ్చాడో, తన వివరాలేమిటో తనకి తెలియవు. కేవలం ఆ దేవీ స్మృతీ స్పృహలోనే ఉంటారు.అలాంటి పూనకం వచ్చిన వ్యక్తిని అక్కడి ప్రజలంతా ఈ 16 సంవత్సరాల బాలుని గురించి చెప్పవలసిందిగా కోరారట. అంతే! ఒక గునపం తెమ్మని చెప్పి ఒక ప్రదేశాన్ని చూపించి తవ్వవలసిందన్నాడు ఆ పూనకం వచ్చిన వ్యక్తి. కొద్దిగా తవ్వగా ఒక బండరాయి కనిపించింది. ఆ రాతిని
తొలగించి చూస్తే నాలుగు దీపాల ప్రమిదలూ కన్పించాయి. అంతేకాదు, అప్పుడే పూజ చేసి ఎక్కడికో వెళ్లిన తీరులో పూజాద్రవ్యాలూ పూజ చేసిన విధానాలు కనిపించాయి అందరికీ. ‘‘ఈ బాలుడు 12 సంవత్సరాలు ఈ నేలమాళిగలో
తపస్సు చేశాడు. ప్రతి నిత్యం ఇలా చేస్తూ పైకి వస్తూంటే అక్కడి జనమంతా అనవసర ప్రశ్నలతో బాధిస్తుంటే, ఆప్రదేశాన్ని విడువబోతూ ఈ బండని కప్పి.. దయచేసి ఈ ప్రదేశాన్ని పాడుచేయకండి అని ప్రార్థించి వెళ్లిపోయాడు’’ అని
చెప్పాడు పూనకం వచ్చిన వ్యక్తి.అంటే దాదాపు 1838లో జన్మించిన సాయి 1842 లో (నాల్గవ సంవత్సరంలో) తపస్సు ప్రారంభించి 12 ఏళ్ల పాటు తపస్సు చేసి 1854లో షిర్డీ పొలిమేర జనులందరికీ కనిపించాడన్నమాట. అక్కడి నుంచిమరో నాలుగు సంవత్సరాల పాటు సాయి ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియదు. పోనీ! ఇంత గొప్పవాడు సాయి అనే అభిప్రాయంతో ఆ గ్రామదేవత అయిన ఖండోబా ఆలయంలో ఎక్కడో ఒక చిన్న గదినైనా సాయికి ఇయ్యగలిగారా ఎవరైనా? అంటే ఈయన హైందవధర్మానికి చెందినవాడు కాదు గదా! అని ఆ ఆలయ అర్చకుడు ‘మహల్సాపతి’తో
పాటు అందరూ నిరాకరించారు ఇవ్వడానికి, లేదా మౌనంగా ఉండిపోయారు. చిత్రమేమంటే ఆయన 1858లో తిరిగి షిర్డీకి రాగానే ఆయన ప్రతిభ ప్రారంభమయింది. ఆయనకి పేరు పెట్టడంతో సహా లీలలన్నీ జనులకి ఒకటొకటిగా
తెలియసాగాయి. తన పాదాలనుండి ‘దాసగణు’ అనేమహాభక్తునికి గంగా యమునా నదీ ధారలని చూపించాడు
సాయి. ఎలాగో చూద్దాం.

సాయి అనే మాటకి అర్థం..?

ఖండోబా గ్రామదేవత ఆలయ అర్చకుడు మహల్సాపతి పెట్టిన పేరే ‘సాయి’. ‘ఆవో సాయీ!’ (దయచేసి రండి సాయీ!) అని ఆయన ఆహ్వానిస్తే సాయి లోనికొచ్చాడు.ఇంతకీ సాయి అనే పేరుతోనైతే మహల్సాపతి పిలిచాడు గానీ ఈ పదానికున్న అర్థం ఏమిటనే సంశయం మనకొస్తుంది కదా! మరాఠీ భాషా నిఘంటువు ప్రకారం సాయి అనే మాటకి ‘ప్రభువు – దేవుడు – నాథుడు – ప్రియుడు – ఫకీరు’ అనే అర్థాలున్నాయి. ఇది ఇప్పుడే కొత్తగా వచ్చిన పదం కాదు. భక్తకబీరు ‘సాయి’ అనే పదాన్ని ‘అత్యంత సమర్థతతో లోకాలని నడిపించే భగవంతుడు’ అనే అర్థం వచ్చేలా తనగీతాల్లో వాడాడు.‘సాయి’ అని ఎందుకు మహల్సాపతి సంబోధించాడో క్రమంగా చూసుకుంటూ వెళదాం.

సాయి పదానికి మొదటర్థం ‘ప్రభువు’ అని. ‘భు’ అంటే ‘ఉన్నవాడు’ అని అర్థం. ‘స్వయం+భు+వు అనే పదానికి తనంతట తానుగా పుట్టి, ప్రస్తుతం ఉన్నవాడని అర్థం. అలాగే ‘ఆత్మభువు అనే మాటకి ఆత్మ నుండి పుట్టి ప్రస్తుతం ‘ఉన్నవాడు’ అని అర్థం. మనోభువు అనే మాటకి మనసు నుండి పుట్టి ప్రస్తుతం ‘ఉన్నవాడు’ అని అర్థం. ఈ తీరులో ‘ప్రభువు’ అనే అర్థమున్న సాయిపదానికి ‘ప్ర+భు+వు’అంటే మానవ అతీతమైన లక్షణాలు కలిగి ప్రస్తుతం ఉన్నవాడు అని అర్థమౌతుంది. ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోగల శక్తి సాయికి ఉండడమనేది ప్రభువనే అర్థానికి సరైన ఉదాహరణ.

ఇక సాయి అనే పదానికి ఉన్నరెండో అర్థం ‘దేవుడు’. దీవ్యతీత దేవః – ఎప్పుడూ మానసికానందంతో ఉండేవాడని దీనర్థం. ఎండకి మాడుతున్నా, వర్షం తనని తడుపుతున్నా, చలి తనని బాధిస్తున్నా, సమయానికి తిండి దొరక్కున్నా, ఎవరిమటుకు వారు తమతమ ఇళ్లలో తలుపులు వేసుకుని కూర్చున్నా – ఏవిధమైన దుఃఖమనేది లేకుండా అదే మసీదు దగ్గర ఉండటం. ఆ సమయంలో కూడా ఆనందంగానే ఉండటమనేది ‘దేవుడు’ అనే ఆ అర్థానికి సరైన ఉదాహరణ.

సాయి అనే పదానికున్న మూడో అర్థం ‘నాథుడు’. ‘నాథే’ తాను అండగా ఉండి రక్షించేవాడని ఈ మాటకి అర్థం. కలరావ్యాధితో బాధపడుతున్న షిర్డీవాసులకి తాను అండగా ఉండే కదా గ్రామప్రజలు కలరా రోగులు కాకుండా రక్షించాడు! కాబట్టి నాథుడనే అర్థానికి ఉదాహరణ ఇదన్నమాట!

సాయి అనే పదానికున్న నాలుగో అర్థం ‘ప్రియుడు’. ప్రియుడు అనగానే రోజులు మారాక ‘ప్రేమించిన వాడు’అనేది అర్థంగా అయిపోయింది. అయితే ప్రియుడనేమాటకి సరైన అర్థం అది కాదు. శరీరం నిండుగా ప్రేమతత్త్వం కలవాడని. ప్రియుడు అనగానే కేవలం మనుషుల విషయంలో.. అందునా యవ్వనవంతుల విషయంలో మాత్రమే ప్రేమ కలిగినవాడనేది దాని భావంగా కనిపిస్తుంది. ప్రేమభావమనేది పక్షుల విషయంలో, కుక్కల విషయంలో, చెట్ల విషయంలో ఇలా అన్ని చరాచర జాతులన్నింటిలోనూ ఉండాలి. సాయి ఎన్నో పక్షులకి తిండిగింజల్ని వేసేవాడు. కుక్కలకి ఆహారాన్ని పెట్టేవాడు. నిత్యం ‘లెండీ’ అనే పేరుగల తోటలో చెట్లకి నీటిని క్రమం తప్పకుండా పోస్తుండేవాడు. కాబట్టి ప్రియుడనే ఆ అర్థానికి ఇవన్నీ ఉదాహరణలన్నమాట!

సాయి అనే పదానికి ఉన్న చివరి అర్థం ‘ఫకీరు’. దేని మీదనూ ధ్యాసలేకుండా ఉండేవాడిని ఫకీరు అంటారు. ఒకే వస్త్రాన్ని కట్టుకోవడం, భిక్షాటన చేసి తెచ్చుకున్న ఆహార పదార్థాలని ఒక గిన్నెలో ఉంచి, కనీసం మూత కూడా

లేకుండా చేసి.. కుక్కలు, పక్షులు, చీమలు తింటున్నా పట్టించుకోకుండా.. అవి తినగా మిగిలిందాన్ని ఏ మాత్రపు అసహ్యం లేకుండా తినడం, ఒకవేళ భిక్షాటనలో ఆహారం లభించకపోతే తిండి లేకుండా ఉండటం ఇవన్నీ ఫకీరు లక్షణాలే కదా! కాబట్టి ఫకీరు అనే అర్థానికి ఇవి ఉదాహరణలన్నమాట!

ఇన్ని తీరుల లక్షణాలనీ గమనించాడు కాబట్టే ఖండోబా దేవాలయ అర్చకుడైన మహల్సాపతి ‘సాయి’ అనే పేరుతో ఆయన్ని సంబోధిస్తూ తన గౌరవాభిమాన భక్తులన్నిటినీ కలుపుతూ ‘యా సాయీ! (సాయీ! దయచేయండి)’ అన్నాడన్నమాట.సంస్కృత పండితులు కొందరు ‘సాయి’ అనే పదం సంస్కృత వ్యాకరణం ప్రకారం సరికాదు కాబట్టి ఆయన్ని ‘శాయి’ అని పిలవాలంటూ ‘శాయి బాబా’ అనడం మొదలెట్టారు ఒకప్పుడు. ‘శాయి’ అనే పదం సంస్కృత భాష ప్రకారం.. నిత్యం శయనించి (పరుండి) ఉండేవాడు (శేతే ఇతి శాయీ) అనే అర్థాన్నిస్తుంది. శేషుని మీద పరుండి ఉండేవాడు కాబట్టి ‘శేష శాయి’ అయ్యింది. ఆ పదాన్ని ఉచ్చరించేటప్పుడు ‘శేషసాయి’ అనకూడదు. ఇక్కడ ‘సాయి’అనేది సంస్కృత భాషాపదం కాదు. మరాఠీ పదం కాబట్టి ‘శాయి’ అనకూడదు. ‘సాయి’అనే అనాలి.అలాగే ‘బాబా’అనేది కూడా ‘‘తండ్రి వలే రక్షకుడు’ అనే అర్థాన్నిస్తుంది కాబట్టి సాయి లేదా సాయి బాబా అనే అనాలి తప్ప శాయి అని గాని శాయిబాబా అనిగాని అనకూడదు. శాయి అనేది సంస్కృత పదమే అయినా మళ్లీ ‘బాబా’ అనేది సంస్కృతం కాదు కాబట్టి ‘శాయి బాబా’ అనకూడదు.



దాసగణు కథ

ఒక ఇంటిని మనం కట్టుకున్నాక ఏయే వస్తువులు మనకి అవసరమవుతాయో గమనించుకుని ఎలా తెచ్చుకుని మనింట్లోనే ఉంచుకుంటామో, అలా సాయి కూడా తనతో పాటుగా ఏయే లక్షణాలున్నవారిని ఎవరెవరిని శాశ్వతంగా
ఉంచుకోవాలో బాగా ఆలోచించుకున్నాడు. ఆయన దృష్టి అనన్యసామాన్యం కదా! అలా ఆయన మనోభీష్టానికి అనుగుణంగా వచ్చి ఆయన దగ్గరే ఉండిపోయినవాళ్లే కాకా సాహెబ్, నానా సాహెబ్, సచ్చరిత్ర రాయాలనే దృక్పథానికి వచ్చిన అన్నాసాహెబ్‌ అనేవాళ్లు. ఈ ముగ్గురూ మంచి మిత్రులైపోయారు. వీరు కాక ఇంకా ఎందరో ఆయన దగ్గరికి రావడం భక్తులుగా మారిపోయి ఆయన సన్నిధిలోనే ఉండిపోవడం జరిగింది.అలాంటి ఉత్తమ
భక్తుల కోవలోకి మరొకర్ని రప్పించుకోవాలని మనసులో భావించాడు సాయి. ఆ అనుకున్నది ‘దాసగణు’
అనే ఒక పోలీసు ఉద్యోగాన్ని చేస్తున్నవానిని గూర్చి సాయి తనలో అనుకోవడం తడవు – దాసగణుకి షిర్డీ రావాలని అనిపించింది. సాయి అతణ్ణి చూస్తూ.. ‘గణూ! ఆ పోలీసు ఉద్యోగాన్ని మాని ఈ మానవసేవకి అంకితం
అయిపోకూడదూ? ప్రశాంతంగా జీవితాన్ని వెళ్లదీయచ్చుగా!’
అన్నాడు.దాసగణు ఆ మాటలకి కొద్దిగా అసంతృప్తి పడి – ‘స్వామీ! నేనిప్పుడు సాధారణ పోలీసుని. ఎందుకో పదవోన్నతిని పొంది సబ్‌ ఇన్‌స్పెక్టరుగా కొంతకాలంపాటు ఆహోదాలో ఉండి ఆ మీదట వద్దామనుకుంటున్నా’ అన్నాడు. సాయి చిరునవ్వుతో ‘అలాగా! అలాగే కానీ!’ అన్నాడు.చాలా తొందరకాలంలోనే దాసగణుకి పదవోన్నతి లభించింది. సబ్‌ ఇన్‌స్పెక్టరయ్యాక సాయి వద్దకొస్తానన్న ఆ మాట తనలో తిరుగాడుతూనే ఉంది. సాయి దర్శనానికొచ్చాడు. సాయి మాట్లాడుతూ.. ‘గణూ! ఇన్‌స్పెక్టరయ్యాక వచ్చేస్తానన్నావుగా!’ అన్నాడు. దాసగణు ఆ మాటకి సమాధానాన్నిచెప్పలేకపోయాడు. దానిక్కారణం ఆ ఉద్యోగంలో కొంతకాలం ఉండాలనే మోజు మాత్రమే. సాయి చిరునవ్వు నవ్వుకుంటూ తనలో అనుకున్నాడు. మంచి ఆధ్యాత్మిక భవిష్యత్తున్నవాడు కదా దాసగణు! ఈ లౌకిక ప్రవృత్తిలో ఎందుకిలా జీవితాన్నినష్టపరుచుకుంటున్నాడు? అని. ఇలా అనుకుని ‘సరే గణూ! ఎలా ఆ ఉద్యోగాన్ని నిర్వహిస్తావో చూద్దాం!’ అన్నాడు సాయి. ఆ మాటకర్థం అప్పుడు తెలియలేదు దాసగణుకి.కొన్నాళ్లయ్యాక పోలీసుస్టేషన్లో ఏదో చోరీసొత్తు దొంగలనుండి రాబట్టి తెచ్చినది కనిపించలేదు. దురుదృష్టవశాత్తూ ఆ సొమ్ముని దాసగణు తీసి ఉంటాడనే అభియోగం మోపబడింది.నిజానికి తాను నిర్దోషి. ఎన్ని విధాల తాను దోషిని కాదంటూ తగిన పత్రాలని సమర్పించినా దాసగణు మాత్రమే
నేరగాడుగా లెక్కించబడ్డాడు. దాంతో దాసగణు ఉద్యోగానికి రాజీనామా చేస్తూ సాయి పలికిన పలుకుల్ని గుర్తు చేసుకుని – షిర్డీకి తన మకాంను మార్చేసాడు. 70 సంవత్సరాల వయసున్నప్పటికీ దృఢంగా ఉన్న తాను సాయిసేవలో పూర్తిగా తన జీవితాన్ని వెళ్లదీయాలని నిశ్చయించుకుని సాయి అనుమతిని కోరాడు. సాయి
అనుగ్రహించాడు.దాసగణుది మంచి శ్రావ్యమైన కంఠం. రాగాలజ్ఞానం కూడా ఉంది. సొంతంగా కీర్తనలని రచించి స్వరపరిచి పాడగల నైపుణ్యం ఉంది. తనకి కల్గిన అనుభవంతో, సాయిది భవిష్యత్‌ జ్ఞాన శక్తి కల తపశ్శక్తి అని గ్రహించి సాయి మీదే
కీర్తనలని సొంతంగా రచించాడు. అంతతో ఊరుకోకుండా చుట్టుపక్కలనున్న గ్రామాల్లో హరికథల రూపంలో సాయి చరిత్రని శ్రావ్యంగా పాడుతూ అనేకుల్లో సాయి భక్తిని రగుల్కొల్పాడు. శ్రావ్యమైన కంఠం, కీర్తనల్లోని సాహిత్యం కారణంగా కేవలం మహారాష్ట్రలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా దాసగణు కీర్తనలని వినాలనే తపన ప్రారంభమయింది శ్రోతలైన భక్తులకి. దాంతో అనేక ప్రదేశాల్లో సాయి కీర్తనలని విరివిగా వినిపించాడు దాసగణు. ప్రతిఫలాపేక్ష ఏ మాత్రమూ లేకుండా ఇలా సాయి ప్రచారం విశేషంగా అయిన కారణంగా సాయి భక్తుల సంఖ్య మరింత అయిపోయింది.
నిజమైన ఆశ్చర్యకరమైన అంశమేమంటే దాసగణు నిజానికి సాయి భక్తుడు కాదు. తొట్టతొలుతదశలో అతను పండరిపురాధీశుడైన విఠ్ఠల భక్తుడు. ఆ సాహిత్యాన్ని బాగా చదివిన వాడూ అనేక అనుభవాలని పొందినవాడు కూడా. అయితే షిర్డీక్కూడ వస్తుండేవాడు కేవలం విఠ్ఠలునివద్దకే కాకుండా. అలాంటి దాసగణు సాయిని సమీపించి పాదాలని స్పృశించి నమస్కరించి ‘ప్రభూ! ఒక్కసారి పండరిపురానికి వెళ్లి విఠ్ఠలుని దర్శించి రావాలని అనిపిస్తోంది. నీ సన్నిధిని విడిచి వెళ్లడమా? అని మనసు వెనకడుగువేస్తోంది! కాదు పాండురంగణ్ణి. దర్శించాల్సిందేనని బుద్ధి వెంటపడుతోంది! నాకేమీ పాలుపోవడం లేదు’ అన్నాడు.

సాయి చిరునవ్వుతో దాసగణుని చూస్తూ ‘గణూ! పండరి వెళ్తేనే విఠ్ఠలుని దర్శనమవుతుందా? ఆయనఅక్కడ మాత్రమే ఉన్నాడా? ఉంటూ ఉంటాడా? సరే! నీ అభీష్టానికి అనుగుణంగా పండరినాథుని దర్శనం కలిగేలా చేస్తాను. మరి నామగుప్తాహాన్ని (పండరి విఠ్ఠలదేవుని నామాన్ని క్రమం తప్పకుండా ఏడు రోజుల పాటు చేయడం) చేస్తావా?’ అన్నాడు. గురుదేవుని ఆజ్ఞ ప్రకారం తప్పక చేస్తానన్నాడు దాసగణు.తాను చెప్పిన ప్రకారం దాసగణు ఏడురోజుల పాటూ నియమనిష్ఠలతో పండరినాథుని దర్శనమవుతుందనే గట్టి ఎదురుచూపుతో సప్తాహాన్ని ముగించి సాయికి పాదాభివందనాన్ని చేసాడు. తలనెత్తి చూసే సరికి సాయిలేడు. పండరిపురనాథుడైన విఠ్ఠలుడే రుక్మిణీ సమేతంగా దర్శనమిస్తుండే సరికి దాసగణుకి కలిగిన ఆనందానికి శరీరం పట్టలేదు. ఏమిటీ వింత? నా దగ్గరికొచ్చి విఠ్ఠలుడు దర్శనమీయడమా? భగవంతుణ్ణి మన చెంతకి నామపారాయణం వల్ల రప్పించుకోగలమా? దానికి గురు అనుగ్రహం ఇంతగా ఉంటుందా? అనుకుంటూ ఆ విఠ్ఠలుని పాదాలని తన చేతులతో స్పృశించాడు. విఠ్ఠల పాండురంగడు విగ్రహరూపంలో లేడు. జీవించివున్న దైవరూపంలో సచేతనంగా కనిపించాడు. కనులనిండా ఆనందబాష్పాలు అలా కారిపోతుంటే… ‘సాయీ! సాయీ!’ అంటూ సాయిని మనఃపూర్వకంగా స్మరించాడు ఇంతటి ఆనందాన్ని
కలిపించినందుకు.అంతే! ఎదురుగా అయిదడుగుల శరీరంతో తానెప్పుడూ ధరించే పెద్దలాల్చీతో సాయి కనిపించాడు. దాసగణుకి నోట మాట రాలేదు. సాయి నిత్యం తన చెంత ఉన్న కారణంగా ఆయన గొప్పదనాన్ని లెక్కించలేకపోయానని సిగ్గుపడ్డాడు.కొంతకాలమయ్యాక దాసగణుకి గంగాయమునల్లో స్నానం చేసి రావాలనే బుద్ధి పుట్టింది. ఆ అభిప్రాయాన్నే సాయికి వెల్లడించాడు. సాయి మళ్లీ పూర్వంలాగానే నవ్వి – దాసగణూ! గంగాయమునలు ఇక్కడలేవా? ఇది ప్రయాగ కాదనుకుంటున్నావా? తప్పక స్నానాన్ని చేయిస్తాను’ అనగానే దాసగణు
సాయిపాదాల చెంత తన శిరసునుంచి నమస్కరించాడు. అంతే ఒకపాదం నుండి గంగా మరోపాదం నుండి యమునా ధారలుగా రాసాగాయి.
దాసగణుతో పాటు అందరికీ ఆశ్చర్యం ఆనందం కలిగాయి. ఇది సాధ్యమా? ఎలా
వచ్చాయి ధారలుగా?

సాయి అతీంద్రియ శక్తి

సాయిలీలలు ఆశ్చర్యకరంగానూ నమ్మలేని విధంగానూ ఉంటాయి. దాసగణు అనే భక్తుడు సాయిని అనుమతి కోరాడు – గంగలో స్నానం చేసి రావాలని. అది కూడా ప్రయాగలోనే అని. ఎప్పటిలాగానే సాయి చిరునవ్వు నవ్వి ‘గణూ! గంగాస్నానానికి ప్రయాగ దాకా వెళ్లాలా? ఈ మన ద్వారకమయే ప్రయాగ, ఇదే ద్వారక, ఇదే
పండరిపురం కూడా’ అనడంతో దాసగణు సాయి పాదాల మీద ఆనందంగా శిరస్సు వాల్చి నమస్కరించాడో లేదో,సాయి పాదాల బొటన వేళ్లలో కుడి బొటన వేలు నుండి గంగా, ఎడమ బొటన వేలు నుండి యమునా ధారాపాతంగా ప్రవహించసాగాయి. అందరూ వింతగా చూస్తూ ఆ రెండు నదుల జలాన్నీ తీర్థంగా తీసుకున్నారు. ఇలా జరగడం సాధ్యమా? సాధ్యమే అయితే ఎలా? అనేది మన సందేహం.

ఇది ఎలా సాధ్యం?

సాధారణంగా మన లక్షణం ఎలా ఉంటుందంటే.. మనం చేయగలిగింది ఎంతో, ఏదో అలాగే అందరూ చేయగలుగుతారనీ, అలా కాకుండా గనుక ఎవరైనా చేస్తే.. అది ఎంత మాత్రం నిజం కాదనీ, అసలు నిజమయ్యే వీలే లేదనీ అనుకుంటుంటాం. ఇంకాస్త పైకి ఆలోచిస్తే.. ఇలాంటివి జరిగాయని చెప్పడం అభూతకల్పనలేనని వాదిస్తూ, అలాంటి వాటిని ప్రచారం కానీయకుండా చేస్తూ ఉంటాం. మంచిదే. అయితే

ఇదే యుగంలో మన కళ్ల ముందే జరిగిన కొన్ని వాస్తవాల్ని పత్రికలు, ప్రసార మాధ్యమాలూ చెప్పినవాటినీ చూపించినవాటినీ మనం ఈ సందర్భంలో గమనిద్దాం! భోపాల్‌లో అలాగే బీహార్‌లో కూడా పెద్ద భూకంపం వస్తే ఆ వచ్చిన కాలంలో పడిన భవంతుల మట్టి పెళ్లల కింద 72 గంటల పాటు ఒక వృద్ధుడు (68 ఏళ్లు) ఉండిపోయాడు. ఎవరికీ కనపడకుండా కావాలని దాక్కోవడం కాదు. తన మీద
మట్టిపెళ్లలు పడి ఆ సమయంలో అరిచినా వినిపించనంతగా అయిపోయింది పరిస్థితి. నీళ్లూ తిండీ గాలీ మరి ఎలా లభించాయో తెలియదు. తర్వాత తవ్వుతుంటే కొన ఊపిరితో ఉంటే ఆయనని పైకి తీస్తే బతికాడు. దీన్ని నమ్మడం
సగటు మనిషికి సాధ్యమా? మరి అతణ్ణి ఆ పెళ్లలని తీస్తూ, పైకి రప్పించడాన్ని ప్రసారమాధ్యమాలే చూపించాక కాదని అనలేముగా!
మరి ఇదేమిటి?ఏడు సంవత్సరాల బాలుడు. పుట్టిందగ్గర్నుండే కనిపించిన ప్రతి వస్తువు మీదా చేతితో లయకి సరిపడే తీరులో కొడుతూ ఉండడం చేస్తూ ఉండేవాడు. సరిగ్గా 7వ సంవత్సరం వచ్చిందో లేదో సొంతంగా 5 మద్దెలని
ఒకదాని పక్కన ఒకదానిని ఉంచి లయబద్ధంగా ఆ శాఖలో ప్రవీణులైన వారి ముందు వాయించి అందర్నీఆశ్చర్యపరిచాడు.దీన్ని కాదనగలమా?ఒక రైలు వేగంగా పరిగెడుతుంటే నిండు నెలలు నిండిన గర్భిణి శౌచాలయంలోనికి వెళ్లిందో
లేదో, ఆ శిశువు, వ్యక్తులంతా కాలకృత్యాలు తీర్చుకునే ఆ గదిలో ఉండే నేలబారుకన్నం నుండి కిందికి పడిపోయింది.వెంటనే బండిని ఆపితే అది ఆ వేగానికి దాదాపు 1 కి.మీ. దూరంలో ఆగింది. వ్యక్తులు వెనక్కి పరుగెత్తారు. నిమిషాల
క్రితం పుట్టిన శిశువు రైలు పట్టాల మధ్యనున్న నల్లకంకరరాళ్ల మీద ఎత్తు నుంచి పడడం, ఈ వ్యక్తులు ఆ శిశువుకోసం వెదకడం, కొంత సమయం గడిచిన తర్వాత కూడా ఆ శిశువు బతికే ఉండడం ఇది నమ్మగల నిజమేనా? మరి
చూపించారుగా మాధ్యమాల్లో..గుండె నుండి పలుగు (గునపం లేదా గడ్డపారు) హృదయం నుండి వీపుని చీల్చుకుని ఇవతలికి వస్తే బతికి
ఉండడం నిజం కాదా?కొన్ని కుక్కలు పిల్లి పిల్లలకి పాలు ఇవ్వడం, కొన్ని పదుల సంఖ్యలో పాముల్ని ఒక గదిలో పెట్టుకుని వాటి మధ్య పడుకుంటే అవి ఇటూ అటూ తిరుగుతూ అతణ్ని పట్టించుకోనట్లుగానూ, అతణ్ని ఓ రాయో,
రప్పో, కొయ్య కర్రో అన్నట్లుగా భావిస్తూ అతణ్ని ఏ మాత్రం కరవకపోవడాన్ని చూస్తున్నాం కదా! ఇది ఆశ్చర్యం కాదా?
ఏ మార్గం లేని కాలంలో, ఏ వంతెనా నిర్మించబడని కాలంలో ఏ ఊరికి ఏది తోవయో తెలుసుకునే వీలు ఏ మాత్రమూ ఉండని కాలంలో, చలీ వేడిమీ వర్షాలు ప్రకృతి ధర్మానికి అనుగుణంగా ఉండే కాలంలో, చేతిలో ఏ
ఆహారానికి సంబంధించిన ముందు ఏర్పాట్లు లేకుండా, ఎక్కడ ఉండాలో ఆ వివరాలు తెలియకుండాముందుగా అనుకోకుండా తానొక్కరే ఇటు రామేశ్వరం నుండి అటు హిమాలయ పర్వతం వరకూ (ఆ సేతుశీతాచలం) ఆదిశంకరులవారు తన 19వ ఏట, అది కూడా కాలినడకన వెళ్లొచ్చారంటే
అది కళ్లకి కనిపించిన సత్యం కదా!

అది అబ్బురపరిచే విషయం కాదూ?
కొండ చిలువలు, పాములు, పులులు, సింహాలు, తోడేళ్లు విచ్చలవిడిగా తిరిగే తిరుమల అడవుల్లో గోగర్భమనేపేరున్న గుహలో రాత్రీ పగలూ అనే భేదమే లేకుండా తపస్సు మాత్రమే చేస్తూ సిద్ధిని పొందిన స్వాములవారిని మనం దాదాపు 200 సంవత్సరాల క్రితమే చూసి ఉండటం విస్మయపరిచే విషయం కాదా?
ఈ తీరుగా ఎన్నెన్నో జరుగుతున్నా వాటిని ఆ సమయంలో చూసి ‘అబ్బో! ఆశ్చర్యం’ అనుకోవడం, మళ్లీకొంతకాలం కాగానే మర్చిపోవడం. మళ్లీ మనదైన ధోరణిలో ఇవన్నీ నిజం కాదంటూనో, నమ్మవద్దంటూనో
నోరేసుకుని పడటం సరైన పనేనా?
పైవన్నీ కూడా దైవం ఏర్పాటు చేసిన లీలలు.

అందరికీ అన్ని శక్తులూ ఉండవు, రావు కూడా. అలాగే అందరి మీదా దైవం తన శక్తిని ప్రసరింపజేయడు.అనుగ్రహాన్ని చూపించడు. ఇనుమనే లోహం అన్నింటి ఆకర్షణకీ లోను కాదు. కేవలం అయస్కాంతమనే దానికే లోబడుతుంది. శిశువు కూడా తనని కన్నతల్లి మాత్రమే – ఇతడు తండ్రి, ఇతడు అన్న.. అంటూ చెప్పినప్పుడు
మాత్రమే అంగీకరిస్తాడు తప్ప ఆ తల్లి తనకి అలా పరిచయం చేయనప్పుడు ఒప్పుకోలేడు. చుట్టాల్లో ఎవర్నో చూపించి ‘ఫలానా’ అని చెప్తే ‘ఔనా? నిజమేనని నమ్మమంటావా?’ అన్నట్లు తల్లివైపే చూస్తాడు. ఆమె అంగీకారానికి లోబడే
నమ్మడం, నమ్మకపోవడం చేస్తాడు.అంటే ఏమన్నమాట? సాధారణ జీవితాన్ని మాత్రమే గడిపే మనం మనదైన సగటు ఆలోచనల్లో ఉంటూ, అలా ఉన్నప్పుడూ అలాగే జరిగినప్పుడూ మాత్రమే ఆ సంఘటనలనీ లేదా ఆ సందర్భాలనీనమ్ముతున్నామన్నమాట. అది సరికానే కాదని నిరూపించే ఘట్టాలే పైవన్నీ.

సాయి కూడా అంతే!

ఒక మసీదు గోడకి ఆనుకుని కూచోవడం, చలి లేదు, వాన లేదు, ఎండ లేదు ఎప్పుడూ ఆ ప్రదేశంలోనే ఉంటూ ఉండటం, లేదా ఆ పాడుబడిన మసీదుల తలదాచుకోవడం… ఇక తిండి విషయానికొస్తే భిక్షాటన ద్వారా వచ్చే రొట్టెలని తెచ్చుకోవడం, వాటిని మూతలు లేని పాత్రలోనే ఉంచడం, అటు నుండి కుక్కలు ఇటు నుండి పిల్లులూ ఇతర ప్రాణులు వచ్చి సగం కొరికినా, ఎత్తుకుపోయినా ఆ ఉన్నవాటినో మిగిలినవాటినో తింటూ జీవించడం… తానెప్పుడూ వ్యాధిగ్రస్తుడైనట్టుగా ఎక్కడా కనిపించకపోవడం… ఇవన్నీ కళ్లముందు కనిపించిన నిజాలేగా! కాదనలేం కదా!ఇప్పుడుఇది ఎలా సాధ్యమయిందో చూద్దాం! శరీరంలో ఉండే కళ్లూ, చెవులూ, ముక్కూ, కాళ్లూ చేతులూ.. ఇలా అన్నిఅవయవాల్నీ చూడగలుగుతున్నాం. అయితే శరీరంలో దాగిన మనసూ బుద్ధీ అనే వాటిని మాత్రం మనంచూడలేం. మనసు అనేది ఓ కోతిలాగా చంచలంగా ఉంటూ చెడుపనిని సైతం చేయవలసిందిగా ప్రేరేపిస్తుంటుంది.ఉదాహరణకి.. ఎవరైనా కొంత సొమ్మును ఎక్కడైనా పడవేసుకుంటే.. దాన్ని చూసిన కన్ను మనసుకి ఆ సమాచారాన్ని చేరవేస్తే.. ‘అక్కడ ఎవరైనా ఉన్నారేమో చూడు జాగ్రత్తగా! లేని పక్షంలో జేబులో పెట్టెయ్‌! ఎవరడిగినాఅది నాదే అని చెప్పు!’ అని ప్రేరేపిస్తుంది మనసు. చేసేవరకూ ప్రోత్సహిస్తుంది కూడా. అయితే తల్లిదండ్రులసంస్కారం, మనల్ని పెంచిన, మనం పెరిగిన వాతావరణమనేదానికి అనుగుణంగా ‘బుద్ధి’ అనేది ఉంటుంది
కాబట్టి, ఆ బుద్ధి ఇలా అంటుంది… ‘అది తప్పు, మనమే అలా పోగొట్టుకున్న పక్షంలో దొరికితే బాగుండుననుకుంటాంకదా! అలా ఆ సొమ్ము దొరికిన వ్యక్తి మనకిస్తే, ఎంతో ఆనందపడి ఆ వ్యక్తికి కృతజ్ఞులమయ్యుంటాం కదా! అదే మరో తీరులో జరిగి ఆ సొమ్ము మన వద్ద పట్టుబడి మనం దొంగగా నిరూపింపబడితే పరువుపోతుంది. మన మీద దొంగ అనే ముద్రపడుతుంది కదా!?’ అని. ఇదుగో! ఈ మనసుని ఆ బుద్ధికి లోబడేలా చేసినట్లయితే వ్యక్తి సరైన తీరులో జీవితాన్ని సాగిస్తాడు. కీర్తి
ప్రతిష్టల్ని గడిస్తాడు.
ఆ మనసే బుద్ధి ద్వారా ఈ శరీరాన్ని బాగా వ్యాయామం చేయవలసిందని శాసిస్తే ఆ శరీరం బాగావ్యాయామాన్ని చేసి శరీరబలాన్ని సాధించి, వ్యక్తిని ఓ ‘పహిల్వాన్‌’ అని అందరూ అనేలా చేస్తుంది.అదే మరి మనసూ
బుద్ధీ కలిసి తపస్సుని ప్రారంభించి ఏకాగ్రతతో దైవధ్యానం మీదే దృష్టిని పెడితే.. శరీరవ్యాయామం ద్వారాఇంద్రియశక్తిని పొందగలిగితే.. (కన్నూ కాలూ చేయీ.. ఇలా అన్ని ఇంద్రియాలూ బలపడడం మంచి శక్తినికలిగి ఉండడం) ఈ మనసూ బుద్ధీ కలిసి వాటికి సంబంధించిన మరో వ్యాయామం ద్వారా ఇంద్రియాలని
అదుపు చేసి తమ అధీనంలో ఉంచుకోగల శక్తిని అంటే.. అతీంద్రియశక్తిని సాధింపజేస్తాయి వ్యక్తికి
. అంటేకొద్దిగా వివరించుకోవాలి. త్వక్‌ (శరీరం) అనేది మొదటి ఇంద్రియం. ఇది ఎన్నో అవయవాల సమూహం. చలికీ వేడికీ కొంతవరకూ తట్టుకోగల ధర్మం కలిగినది మాత్రమే. అతీంద్రియ శక్తి అంటే.. చలీ వేడీ అనే వాటి ప్రభావానికి అతీతంగా ఉండటమని అర్థం. కుంభమేళాలో నాగసాధువులు ఎక్కడి నుండి వస్తారో తెలియదు. గుంపులు గుంపులుగా వస్తూ ఎముకలు కొరికే చలిలో ఒంటిమీద నూలు పోగు కూడా లేకుండా ఉన్న శరీరంతో పరుగులు పెడుతూగడ్డకట్టించే నీటిలో చక్కగా స్నానాన్ని సంతోషంగా ముగించి వెళ్లిపోతారు. ఎక్కడుంటారో ఎప్పుడు తింటారో,తినేందుకు వాళ్లకి ఏం దొరుకుతుందో ఊహాతీతం.

అలాగే రెండవ ఇంద్రియమైన కన్ను, తాను చూడగలిగినంత దూరాన్ని మాత్రమే చూడగలుగుతూ ఉంటే,అతీంద్రియ శక్తిని సాధించిన వ్యక్తికుండే కన్ను గడిచిన సందర్భాన్నీ, వస్తువుని చూడడం కాకుండా, వ్యక్తుల్నిభౌతికంగా చూడడం కాకుండా, వాళ్లలో దాగిన విశేషాల్ని కనుక్కోగలుగుతుంది. ఇది నిజం కాబట్టి ఎందరో
వ్యక్తులుంటే సాయి కొందర్ని మాత్రమే తన సమక్షానికి రావలసిందిగా నిరంతరం సేవలో ఉండవలసిందిగాకోరాడు
ోరతాడు. అలాంటి వారిలో ఒకడే దాసగణు.మనకి జ్ఞానాన్ని బుద్ధికి చేరవేసే శక్తి ఉన్న శరీర భాగాలని (ఇంద్రియాలు) జ్ఞానేంద్రియాలు అంటాం.వాటిలో మొదటిది త్వక్‌ (శరీరం). అది అతీంద్రియ శక్తిమంతమైనప్పుడు పైన అనుకున్నట్టు ఏవాతావరణానికైనా దుఃఖించదు. అదే సాయి మసీదు గోడకానుకుని మనకి తెలియజేసిన సత్యం. రెండవ జ్ఞానేంద్రియం కన్ను. అది అతీంద్రియ శక్తిమంతమైనప్పుడు జరిగిన, జరుగుతున్న, జరగబోయే
విషయాలని చూడగలుగుతుంది.
ఇది నిజం కాబట్టే సాయి ఆ రోజున అన్నా సాహేబు బయలుదేరి వెళ్తుంటే..ఈ రైలు ఆ స్టేషనులో ఆగదంటూ సూచించి మరీ రాగలిగాడు.
మూడవది చెవి. అది అతీంద్రియ శక్తిమంతమైనప్పుడు ఎక్కడ ఎవరు మాట్లాడుకున్నా వాటిని వినగలుగుతుంది. ఇది నిజం కాబట్టే సాయి, ఆనాడు అన్నా సాహేబూ బాలాసాహేబూ ‘కర్మలూ వాటి ఫలితాలూ’అనేదాని గురించి వాదప్రతివాదాలని తనకి వినిపించనంత దూరంలో చేసుకున్నా ‘ఎవరు గెలిచారు వాదంలో?’అనగలిగాడు.

నాలుగవది జిహ్వ (నాలుక). ఇది అతీంద్రియ శక్తిమంతమైనప్పుడు ఆ నోటితో ఏం మాట్లాడితే అదిజరుగుతుంది. ఇది నిజం కాబట్టే దాసగణుతో మాట్లాడుతూ ‘నువ్వు రాదలుచుకోకపోయినా ఎందుకు రావో, ఇక్కడేసేవ చేస్తూ ఎలా ఉండవో చూస్తా’ అని అనగలిగాడు.

ఐదవ ఇంద్రియం ఘ్రాణం(ముక్కు). అది అతీంద్రియ శక్తిమంతమైనప్పుడు ఎవరికెంత పూర్వజన్మసంస్కారవాసన ఉందో ఈ విషయాన్ని గ్రహించగలగడం సాధ్యమౌతుంది. ఇది నిజం కాబట్టే సాయి
తన వద్ద ఎవరెవరు ఉండవలసినవాళ్లో ఉండగలిగేవాళ్లో తెలుసుకుని, పూర్వజన్మసంస్కారపరులైన అలాంటివారిని మాత్రమే తన స్థానానికి పిలుచుకున్నాడు. వచ్చేలా చేసుకోగలిగాడు.ఈ అతీంద్రియశక్తి జ్ఞానేంద్రియాల విషయంలో పైతీరుగా ఫలిస్తే, అదే అతీంద్రియశక్తి కర్మేంద్రియాలైన మాట, కాలు, చేయి మొదలైన వాటిలో కూడా ఫలించి మాట ద్వారా వశం చేసుకోగలగడం, కాలు ద్వారా గంగా యమునల్ని ప్రవహింపజేయగలగడం.. ఇలా బాబా చేసిన మరిన్నిలీలలని తెలుసుకుందాం! ఎందుకు తెలుసుకోవాలిట? మన జీవితంలో కూడా తీవ్రాతి తీవ్రమైన అసాధ్యమైనసమస్యలు కష్టాలు వచ్చినప్పుడు ఇలా తన లీల ద్వారా మనల్ని బయటపడేయగలడు కాబట్టి!

.                ఆ కనులు ఆకర్షణ గనులు

     ఎంతటివారైనా ఏదో కొంత సమయాన్ని తమతో తాము కాలక్షేపం చేసుకుంటూ గడిపినా, ఆ తర్వాత కొంత సమయాన్నైనా ఎవరితోనైనా గడపాలని అనుకుంటారు. అలా మరొకరితో సమయాన్ని గడపడం కోసం వాళ్లు మరో వ్యక్తి దగ్గరికి పోవడమో లేక ఆ పరిచితుడైన వ్యక్తికి కబురుచేసి రప్పించుకోవడమో చేస్తారు. ఇది లోక సహజమైన విషయం. అయితే సాయి మాత్రం ఎవరి సాంగత్యమూ తనకి అక్కర్లేదన్నట్లుగానే ఉండేవాడు. ఒంటరితనంలోనే – ఎందరితోనో తానున్నట్లుగా అనుకుంటూ ఉండేవాడేమో అనిపించేవాడు. సూర్యుడు అస్తమించాడనగానే మసీదులోకి వెళ్లేవాడు. పడుకోబోయేప్పుడు తన వస్తువులైన చిలుం – పొగాకు – రేకుడబ్బా – సటకాలని తృప్తిగా చూసుకుంటూండేవాడు. తన మోకాళ్ల వరకూ కప్పేస్తూ ఉండే పొడవైన చొక్కా(కఫనీ)ని ధరించి ఆ లోపల ఒక గోచీని ధరించేవాడు. తెల్లని శుభ్రమైన గుడ్డని తలచుట్టూ బిగించి గట్టిగా కట్టుకోవడమే కాక, ఆ మిగిలిన గుడ్డని బాగా మెలితిప్పి ఎడమచెవి వద్ద ముడివేసి ఉంచేవాడు. తన కఫనీకి అక్కడక్కడా చిరుగులున్నా ఎంతో సంతృప్తితో ఉండేవాడు. ఎవరైనా ఆయన్ని చూడ్డానికొచ్చినప్పుడు – తాను చిరిగిన దుస్తులతో ఉన్నాననే తక్కువదనం, బిడియం ఆయనలో ఏమాత్రమూ ఉండేది కాదు. వెనక్కి వేలాడుతూంటే ఆ ముడివేసిన వస్త్రం మిగిలిన భాగం ఓ జడలాగా అనిపిస్తూ ఉండేది, దూరంగా నిలబడి చూస్తుంటే. ఒక్కోసారి ఆ ఎడమచెవి వద్ద వస్త్రాన్ని ముడివేయగా మిగిలిన వస్త్రం అక్కడి నుండి ఎడమభుజం మీదుగా వక్షస్థలమ్మీదికి వేలాడుతూ కనిపిస్తూండేది. ఒక్కోసారి వారం, మళ్లీ మాట్లాడితే పదిరోజులైనా స్నానమే చేయకుండా ఉంటూండేవాడు. పాదాలకెప్పుడూ చెప్పులు ధరించేవాడు కాదు. ఇటు తోటకి వెళ్లినా అటు చావడి వైపుకి వెళ్లినా ఒట్టి పాదాలతో వెళ్లడమే ఆయనకు అలవాటు. తిరిగి తిరిగి వచ్చాక కూచోవాల్సి వస్తే పాతబడి చిరుగులతో కనిపించే ఆ గోనెపట్టాయే అతనికి గొప్ప ఆసనంగా ఉండేది. దాన్నేదో రాజులు వేసుకునే మెత్తని పట్టువస్త్రం తొడిగిన మెత్తని దిండుగా భావించేవాడు. రాత్రింబవళ్లూ ఆ గోనెసంచి అక్కడే ఉండేది. చలి నుండి తనని తప్పించుకోవడానికి అక్కడ ‘ధుని’ (నిరంతరం నిప్పుతో వెలుగుతూండే స్థలం) ఉండేది. మసీదులో దక్షిణానికి ముఖాన్ని పెట్టుకుని, తన ఎడమచేతిని ఆ చిన్న గోడలా ఉండే కట్టడం మీద పెట్టుకుని కూర్చుని కనిపిస్తూండేవాడు. వ్యక్తిలోని అహంకారం, అజ్ఞానం, అవమానభారం, తిరస్కారం, ప్రాపంచికమైన ప్రలోభాలూ… ఇలాంటి వాటన్నింటినీ అగ్నిలో ఆహుతి చేయాలనే దానికి సంకేతంగా ధుని వెలుగుతున్నట్లుగా భావిస్తూ నిరంతరం ఆ ధునినే శ్రద్ధతో, ఏకాగ్రతతో చూస్తూ కాలాన్ని గడుపుతూ, ఎప్పుడూ ‘అల్లా హో మాలిక్‌!’ అని పైకి అంటూండేవాడు. అహంకారం, అభిమానం అనే రెంటికీ సాక్ష్యంగా ప్రతీకగా రెండే రెండు కర్రలని ఎప్పటికప్పుడు ధునిలో వేస్తూ ఆ అగ్ని ఆరిపోకుండా ప్రజ్వరిల్లుతూ ఉండేలా చూసుకుంటూండేవాడు. ‘అల్లాహ్‌ హో మాలిక్‌!’ అంటూ జెండాని ఎగరేస్తూండేవాడు. ఆ మసీదు చాలా ఇరుకుగా ఉండేది. అయినా సరే అదే మసీదులో తిరుగుతూండేవాడు, నిద్రించేవాడు. తనని కలవడానికి వచ్చిన భక్తుల్ని కూడా అక్కడికే రమ్మనేవాడు. మరో విచిత్రమేమంటే బాబాని కలవాలంటే ఆ మసీదులోకి పోవాలి కదా! అది చదును చేయబడిన నేల కాదు. మోకాళ్ల లోతు గుంటలు. చిన్న చిన్న గోతులు. ఎత్తు పల్లాలతో నేల ఉండేది. తన మీద గనక నిజమైన భక్తి, శ్రద్ధ, ప్రేమ, విశ్వాసం ఉంటే ఈ అసౌకర్యాలని లెక్కించరుగదా! అనేది ఆయన దృఢ విశ్వాసం. శారీరక వ్యాధుల్ని నివారించుకోదల్చిన వారూ, మనో వ్యాధుల్ని పోగొట్టుకోదల్చినవారూ, ఆయనని గురించి అనేక విధాలుగా విని ప్రసిద్ధుడైన ఆయన ఎందుకంతటి ప్రసిద్ధిని సంపాదించగలిగారో చూసి పోదామని వచ్చిన వారూ, వారి వెంట వచ్చినవారూ… ఇలా అందరూ ఆ ఇరుకు మసీదులోనే ఆ గుంతలు గోతుల్లోనే వస్తూ అసౌకర్యమనే భావనకి ఏ కోశానా గురయ్యేవారు కాదు. ఆ కారణంగానే రోజురోజుకీ వచ్చేవారి సంఖ్య పెరిగిపోతూనే వచ్చింది గాని తరగనే తరగలేదు. అదే తీరుగా ఇందరు తండోపతండాలుగా తన దగ్గరికొస్తున్నారు గదా! అని ఏనాడూ సాయి తన ఆసనమైన పాతబడిన గోనె సంచినీ, ఇరుకు మసీదునీ, కుట్లూడిన చిరుగులతో కనిపిస్తున్న కఫనీని మార్చుకుందామనే ఆలోచనకీ రాలేదు. ఇదీ నిజమైన ఫకీరు లక్షణమంటే.

  (సాయి నిలయానికి) ఇందరు ఇన్నిమార్లు వస్తూ మరికొందరిని కూడా ఎందుకు తీసుకొస్తున్నారు? రావడంలో, వస్తూ ఉండటంలో రహస్యమేంటీ? కారణమేమిటీ? దయనిండినవీ, దర్శించేవారికి వాళ్ల తప్పుల్ని వారికి అర్థమయ్యేలా వివరించగలిగినవీ, ఓదార్పునిచ్చేవీ, బాధలు తీరిపోతాయనే తీరు ఉపదేశాన్ని మౌనంగా ఇవ్వగలిగినవీ ఆకర్షణకి గనులలాగా ఉన్నవీ అయిన ఆయన ఆ కళ్లే. (మనకి అమ్మ కళ్ళే) ఆ రోజున తన గుర్రమే ప్రాణంగా ఉన్న చాంద్‌పాటిల్‌కు  అంత ఎండలో అంతటి ఆందోళనలోనూ ఆకర్షించినవి సాయి కళ్లే. ఆయన్ని తన ఇంట్లో అలా ఉంచుకుని నిరంతరం సేవిస్తూ ఉండటానిక్కూడా కారణం ఆ కళ్లే. ప్రతిదానికీ తగిన కారణం కావాలంటూ ఆలోచించేవాడూ, దొరికిన కారణం నచ్చని పక్షంలో, ఏమాత్రమూ నమ్మనివాడూ అయిన అన్నాసాహెబు సాయిని దర్శించిన మరుక్షణంలో ఆయన జీవితాన్ని గ్రంథరూపంలో సాయిచరిత్రగా రాయాలనే ఆలోచనకి శ్రీకారాన్ని చుట్టించినవి కూడా ఆ కళ్లే. పరమ భయంకరుడూ, తన అరుపులతో షిరిడీ గ్రామ ప్రజలకి నిద్రాభంగాన్ని కలిగించేవాడూ, ఎందరు నచ్చజెప్ప ప్రయత్నించినా దగ్గరక్కూడా రానివ్వనివాడూ అయిన రోహిల్లా సాయిని దర్శించడానికి వచ్చి, దర్శించి అక్కడే ఉండిపోయేలా చేసినవి ఆ కళ్లే. ఖండోబా దేవాలయ అర్చకుడూ, సంప్రదాయపరుడూ, బ్రాహ్మణుడూ అయిన మహల్సాపతి ‘యా! సాయీ!’ అని సాదరంగా ఆహ్వానించడానికి కారణం ఆ కళ్లే. దాసగణుకి గంగాయమునలని సాయి చూపించగలడనీ ఆ తీరు దృఢ విశ్వాసాన్ని కలిగించినది ఆ కళ్లే. అందుకే సాయిని దర్శించదలిచి వెళ్లిన అందరూ కూడా దర్శించవలసింది ఆ సాయి నేత్రాలనే. బాధలతో ఉన్నవారికి బాధ నివారిణులూ – మనోవ్యాధితో ఉన్నవారికి ఉన్న మనోధైర్య కారిణులూ – కష్టాలలో మునిగి తేలుతున్న వారికి చేతి ఊతనిస్తాననే విశ్వాసదాయినులూ – సాయికి మరింత దగ్గర కాగలుగుతామన్న ఆనంద విధాయినులూ ఆ కళ్లు. ఆ కళ్లు. ఆ కళ్లే.చూసి తీరాలనే ఆర్తితో…లోకంలో కనిపించే ఎన్నో పక్షుల్ని, పశువుల్ని, మృగాల్ని, సర్పాలని, వాహనాలని, వ్యక్తుల్ని అలా చూసేస్తుంటాం. అన్నింటినీ మన మనసు ఇష్టంతో చూడదు. అలా చూడని పక్షంలో ఆ దృశ్యాన్ని బుద్ధికి పంపించదు. అలా బుద్ధికి చేరని దేన్నీ, ఆ బుద్ధి తనలో దాచదు. ఆ కారణంగా వేటిని మన మనసు గ్రహిస్తుందో, తాను ఆనందించి బుద్ధికి అందజేస్తుందో ఆ దృశ్యాలు మాత్రమే మనకి అనుక్షణం కళ్లముందు కనిపిస్తూ ఉంటాయి. అందుకే శాస్త్రం అంది – ఏదో యథాలాపంగా చూడటాన్ని కేవలం చూడటమనీ, అదే మరి రెండవతీరుగా బుద్ధిలో దాచేంత విధంగా చూడటాన్ని దర్శనమనీ. అందుకే దైవ దర్శనం అంటూంటాం.

ఈ నేపథ్యంతో పరిశీలిస్తే సాయిని చూసినవారు కొందరున్నారు. దర్శించినవారు ఎందరో ఉన్నారు. మనం ఎదుటివారిని ఎలా చూస్తామో ఆ చూపుకి ఉన్న లోతుతనాన్ని బట్టే కదా ఎదుటివారు కూడా మనని చూసేది! ఆ కారణంగా కేవలం చూడటమనే పనిని చేసిన ఎందర్నో సాయి ‘రమ్మనలేదు – ఇంకా రావేమిటి? అనలేదు – ఎందుకు రావో చూస్తాననలేదు. నేను రానే రానని చెప్పిన నానా వంటి వారికి మళ్లీ కబురు చేసి మరీ రప్పించుకోకుండానూ ఉండలేదు! ఈ దృష్టిభేదాన్ని మనం గమనించాలి. ‘గౌలిబువా’ అనే తొంభై ఐదు సంవత్సరాల భక్తుడొకాయన ఉండేవాడు. ఆయనకి సాయి మీద కాదు భక్తి. పండరీపురంలో ఉండే విఠ్ఠలపాండురంగని మీదే దృష్టంతా. సంవత్సరంలో ఉండే 12 నెలల కాలంలో 8 నెలలపాటు పాండురంగని (విఠ్ఠలుడు) మీదే బుద్ధిని నిలిపి ఆ పండరీపురంలోనే ధ్యానంలోనే కాలాన్ని గడిపి, ఆ మిగిలిన 4 నెలల కాలాన్నీ గోదావరీ నదీ తీరాన తపస్సు చేసుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తూండేవాడు. ఆ నెలల కాలమూ కూడా శ్రీహరి యోగనిద్రకి ఉపక్రమించే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ ఉండే కాలంలోనే. అంటే శయన ఏకాదశి (శ్రీహరి యోగనిద్రని ముగించి నిద్రనుండి లేచే రోజు) వరకు మాత్రమేనన్నమాట.  ఈ మధ్యలో ఒకసారి గోదావరి ఒడ్డునే ఉంటాడు కాబట్టి షిరిడీకొచ్చి సాయిని కలిసి వెళ్తూండేవాడు. ఇలా చాలాకాలం పాటు జరుగుతూ వచ్చింది. పైన అనుకున్నట్టుగా సాయిని ఆయన చూసి వెళ్తూండేవాడే తప్ప దర్శించి వెళ్లేవాడు కాదు. ఆ కారణంగా సాయి గొప్పదనం సర్వదేవతా సమూహం సాయి అనే భావం ఏనాడూ కలగలేదు ఆ వృద్ధ భక్తునికి. తన సామాను మోసేందుకోసం ఓ గాడిదని వెంటబెట్టుకుని దానికి తగిన ఆహారం మొదలైనవి సమకూర్చేందుకై ఓ వ్యక్తిని తోడు తీసుకుని ఈ 4 నెలలపాటూ గోదావరి ఒడ్డున ఉంటూండేవాడు. అలా ఒకసారి సాయివద్దకొచ్చి సాయిని అనుకోకుండా దర్శనదృష్టితో చూశాడు. అంతే! గౌలిబువా దృష్టి మొత్తం మారిపోయింది. దాంతో పైకి అననే అన్నాడు – సాయి నవరత్నాల్లో వజ్రంలాంటి వాడు. ఏ విధంగానూ ముక్కలు కానిదీ, నాశనం కానిదీ, కోయడానికి అవకాశమీయనిదీ అయిన వజ్రం ఎలా ఆకర్షణీయమైనదో, దృఢమైనదో అలా సాయి కూడా ఎవరికీ వశుడు కానివాడు – అహంకారం లేనివాడు – తన స్థాయిని గమనించి అందరినీ రానీయకుండా ఉంచాలనీ, కొందరినీ రప్పించుకోవాలనీ భావించేవాడు కాడు. ఇదంతా నా పూర్వ ఆలోచన. ఇప్పుడు మాత్రం సాయిని ఆర్తితో భక్తితో దర్శించాక నా ఆలోచనే మారిపోయింది. సాయి నన్ను చూసిన ఆ చూపులకున్న లోతుతనంతో నాకు అర్థమయింది – సాయి నాకిష్టమైన పండరీనాథుడు పాండురంగడే – అని అనేశాడు. మనం కూడా గమనించాలి. దైవాన్ని చూడరాదనీ, దర్శించాలనీ, అలా దర్శించగలిగినప్పుడూ, దర్శించినప్పుడూ మాత్రమే భగవదవతార తత్త్వం మనకి గోచరిస్తుందనీ – అలా కాక ఏదో దేవాలయానికి వెళ్లాల్సిన అవసరం అలవాటూ ఉన్నాయనే భావంతోగాని వెళ్తే దేవుణ్ని చూడటమే జరుగుతుందనీ – దర్శించడం వీలు కాదనీ, ఇలా చూసిరావడం వల్ల సమయనష్టం తప్ప ప్రయోజనం ఏ మాత్రమూ ఉండదనీను. అలాంటి ఆర్తితో చూసినప్పుడే అది దర్శనం అనిపించుకుంటుందన్నమాట. కాబట్టి సాయిని దర్శించాలని అర్థం చేసుకుందాం!

అహంకారులకి మార్గదర్శనం సాయికి ఇప్పుడు బాబాసాహెబ్‌ అనే అతనుండేవాడు. అతనింటికే వెళ్లి దాదాపు రోజురోజంతా అక్కడే గడిపేవాడు. అంతటి ఉత్తముడు బాబాసాహెబ్‌. అతనికో తమ్ముడున్నాడు. పేరు నానాసాహెబ్‌. అతనికి సంతానం ఎంతకాలానికీ కలగలేదు. ఎదురుచూసి ఎదురుచూసి తన భార్య అనుమతిస్తే రెండో పెళ్లిని కూడా చేసుకున్నాడు. అయినా అతనికి సంతానం కలగలేదు. నానా సాహెబ్‌ (నానా) తహశీల్దార్‌ ఉద్యోగాన్ని చేస్తుండేవాడు. ప్రభుత్వోద్యోగి అయిన కారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువమందితో పరిచయాలున్నాయి అతనికి. అలాంటి నానాకి సాయి ఓసారి ‘అప్పాకులకర్ణి’ అనే అతనితో కబురు చేశాడు – ఓసారి నానాని చూడాలనుంది. తనవద్దకి రావలసిందని. ఆ మాటల్ని లెక్కచేయకుండా నానా కాలాన్ని గడిపేస్తూ వచ్చాడు. మళ్లీ మళ్లీ కబురుపంపాడు సాయి. దాంతో తనకి కబురు తెచ్చిన కులకర్ణిని నిందిస్తూ – ‘నేనేమీ ఖాళీగా ఫకీరులా లేను. ప్రభుత్వోద్యోగిని. పని ఒత్తిడిలో ఉన్నా’ అంటూ నిష్టూరంగా దెప్పిపొడుపుగాను కూడా మాట్లాడాడు. కులకర్ణి వెళ్లిపోయాక తనలో తాను నవ్వుకుంటూ – ఈ ముస్లిం ఫకీరు దగ్గరికి నేను పోవడమా? మాయా శక్తులూ, మాటల గారడీలూ ఉన్న సాయి దగ్గరికి వెళ్తే ఏం ప్రయోజనం ఉంటుంది? పైగా రెవెన్యూ ఉద్యోగం చేస్తున్న నా స్థాయి ఎక్కడ? చెట్టు కింద చెప్పుల్లేకుండా కూచునే సాయి స్థాయి ఎక్కడ? చేతులు కట్టుకుని ఆ ఫకీరు ఎదురుగా నిలబడితే నన్ను గౌరవించే అందరూ నన్ను చూసి నవ్వరూ?’ అని ఆలోచించి రానేరానంటూ సాయికి వర్తమానాన్ని పంపించాడు నానా. అయితే ఆశ్చర్యకరమైన అంశమేమంటే ఎందుకో తెలియదుగానీ నానా సాయిని దర్శించాల్సిన పరిస్థితొచ్చింది. నానా సాయిని చూస్తూనే ‘సాయీ! నన్నెందుకు పిలిపించారు?’‡అని అడుగుతూ ఆయన కళ్లలో కళ్లు పెట్టి చూశాడు. అయస్కాంతం దగ్గరగా ఇనుపవస్తువుని పెడితే ఎలా ఆ వస్తువు కాస్తా ఆ అయస్కాంతపు ఆకర్షణకి గురై అయస్కాంతానికి హత్తుకుపోతుందో, బలవంతాన లాగితే తప్ప ఇవతలికి రాదో అలా నానా కళ్లు సాయి కనుల ఆర్ద్రతనుండి బయటికి రాలేకపోయాయి. అంతటితో ఆగక, ‘నానా! లోకంలో ఎందరు లేరు? అయినా నిన్నే ఎందుకు పిలిపించానంటావు? నువ్వు నీ నోటికొచ్చిన తీరులో మాట్లాడినా మళ్లీ ఎందుకని ఆహ్వానించానంటావు? బాగా ఆలోచించుకో! నీకూ నాకూ మూడు జన్మలనుండీ బంధం ఉందయ్యా! అది నీకు తెలియదు. నాకే తెలుసు. అందుకే ఓసారి చూద్దామని కబురంపాను. నాకో నమ్మకం ఉంది నీ మీద – నువ్వు ఇప్పుడు కాకపోతే మరెప్పుడైనా వస్తావని. వచ్చావుగా!’ అంటూ సాయి మాట్లాడుతూ ఉంటే ఆయన దయార్ద్రమయమైన కళ్లలో తన కళ్లని తిప్పలేక ఉంచిన నానా వెక్కి వెక్కి ఏడుస్తూ, ‘సాయీ! అపరాధం. మహాపరాధం. అపచారం. మహాపచారం అయిపోయింది’ అంటూ ఉండగానే సాయి తన ఎడమచేతిని నానా తలమీద పెట్టాడు. అంతే! సాయి కనిపించలేదు. ఒక క్షణం నానాకి సాయిలో ధర్మమయమైన వింటిని ధరించిన శ్రీరామచంద్రుడు కనిపించాడు. మళ్లీ అంతలోనే జటాజూటాన్ని ధరించి పరమానందంతో ఆశీర్వదిస్తున్న శివుడు దర్శనమిచ్చాడు. మళ్లీ క్షణంలోనే మహా బలిష్ఠుడూ, నవవ్యాకరణ పండితుడూ, అమోఘకంఠస్వరం కలవాడూ అయిన ఆంజనేయుడు కనిపించాడు. నానా తనని తాను నమ్మలేక కలా? నిజమా? అనుకుని నిజమే అని అనిపించాక ‘సాయిదేవా!’ అన్నాడు హృదయపూర్వకంగా. అక్కడి నుండి దైవంతో సమానంగా కొలుస్తూంటే సాయి దర్శనం కారణంగా నానాకి సంతానం కలిగింది. సాయిని చూస్తే సంతానం కలగడమా? అది సాధ్యమేనా? సాధ్యమే! ఎలాగో రేపు  చూద్దాం!

Q ద్వారాకమైలో గోధుమ బస్తా ఎందుకు ఉంది ?

ద్వారకమైలో ఇప్పటికి ఓ గొడుమబస్తా ఉంటుంది .చాలా మంది బాబా ఉన్నప్పటి బస్తా అది అని అనుకుంటారు కానీ అది కాదు దానికి ఓ కధ ఉంది .

బాలాజీ నేవాస్కర్ అనే భక్తుడు కోసం మనం సత్చరిత్రలో చదువుకున్నాము.బాబా శిరిడీలో ఉనప్పుడు బాబా కు బాలాజీ నేవాస్కర్ గొప్ప భక్తుడు అతనికి బాబా ఆశీస్సులు తో జీవితం ఎంతో సంతోషంగా గడుస్తుంది దానితో అతను బాబాకు కృతజ్ఞుడుగా ఉంటూ బాబాకి తన గోధుమ పంట చేతికి వచ్చిన వెంటనే పంటను ఎడ్ల బండి పై వేసుకొని ఆ పంట బాబాకు సమర్పించే వాడు అప్పుడు బాబా అతనిని ఆశీర్వదించి ఒక్క బస్తా మాత్రం బాబా ఉంచుకొని మిగిలినవి బాలాజీ నేవాస్కర్ కి తిరిగి ఇచ్చేసేవారు.

బాబా అతని భక్తికి అంతటి గొప్పస్తానం ఇచ్చారు కనుకనే ఇప్పటికి ద్వారకా మయి లో గొదుమ బస్తా ఉంటుంది . ఆ బస్తాను ప్రతి సంవత్సరం శ్రీ రామనవమి నాడు తీసి మరో బస్తాను ఉంచడం ఆనవాయితీ గా వస్తుంది . ఇక్కడ బాలాజీ నేవాస్కర్ భక్తి అనిర్వచనీయం ఎందుకు అంటే పంట అంతా తీసుకోమంటే బాబా మొత్తం తీసుకుంటే నాకు ఏమి మిగలదు అనే భయం అతనికి లేదు .  .

Q కంటిచూపుతో కన్నారు

  ఏదైనా ఓ వింతని, నమ్మలేని నిజాన్ని విజ్ఞానశాస్త్రజ్ఞులు చెప్తే చాలు.. కచ్చితంగా నమ్మడానికి సిద్ధంగా మనల్ని మనం తయారు చేసేసుకున్నాం. మళ్లీ అదే అంశం నిజం కాదని మరికొంత కాలమయ్యాక పరిశోధనలు చేశామని మళ్లీ వాళ్లే చెప్తే దాన్ని కూడా నిజమేనని అంగీకరిస్తాం తప్ప ఏ వాదాన్నీ చెయ్యం. ఫలానా ఔషధం ఎంతో గొప్పదని చెప్పిన అదే విజ్ఞానశాస్త్రం కొంతకాలమయ్యాక ఈ ఔషధం వల్ల అనేక దుష్ఫలితాలున్నాయని నిరూపించబడిందనగానే వెంటనే మానేస్తాం.ఈ విషయాన్నెందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఆ శాస్త్రం చెప్తే నమ్మే జనం, అనుమానాన్ని వ్యక్తీకరించని లోకం, సాయి కళ్లలోనికి చూస్తే సంతానం కలిగిందని చెప్పిన నిజాన్ని ఎందుకు నమ్మరు? ఎలా నమ్మాలో వివరించుకుందాం! ఏదో గాలి మాటలు కాకుండా సప్రమాణంగా ఆధారాలతో సహా చెప్పుకుందాం!

సంతానాన్ని కనే తీరులు

 మనం మానవజాతికి చెందినవాళ్లం కాబట్టి సంతానాన్ని కనడం అనగానే స్త్రీ పురుషసమాగమం మాత్రమే అనేసుకుంటాం. అది తప్ప మరో మార్గమే లేదని దృఢంగా వాదిస్తాం కూడా. సంతానాన్ని కనే విధానాలని వైశేషిక దర్శనమనే గ్రంథం చెప్పింది –‘స్వేదజ, అండజ, జరాయుజ, ఉద్భిజ్జ, సాంకల్పిక, సాంసిద్ధిక, భేదాత్‌’ అని.  స్వేదజ సంతానం మొదటిది. స్వేదమంటే శరీరం నుంచి బయటికి వచ్చే చెమట అని అర్థం. ఆ చెమట నుండి పుట్టే సంతానమన్నమాట. క్రిముల్లో కొన్ని విడిచిన స్వేదమూ లేదా మనుష్యులు మొదలైనవారి శరీరాల నుండి విడువబడిన స్వేదమూ నుండి పుట్టే సంతానం అని దీనర్థం. తలలో పట్టే చెమట కారణంగా ఈ పేలు మొదలైనవి పుడతాయి. వాటిలో మగపేను, ఆడపేను అనే జాతి భేదం, లింగ భేదం ఉండదు. అలాగే పశువులు విడిచిన స్వేదం నుండి సన్ననైన ఓ తీరు క్రిములు పుడతాయి. వాటిని గ్రామప్రాంతాల్లో నుసుములు అని పిలుస్తారు. అవి మనల్ని కుట్టవు గానీ ఊరికే వాలుతూ ఒక తీరు అసహ్యాన్ని, చిరాకునీ మనకి కలుగజేస్తుంటాయి. అపరిశుభ్రంగా ఉన్న, లేదా కుళ్లిన పదార్థాల మీద వాలుతూ కన్పిస్తాయి. వీటికి కూడా లింగభేదం ఉండదు. సంగమం కారణంగా పుట్టవు. ఇవన్నీ ఏకలింగజీవులు. మరి దీన్ని వింతగా అనుకోవద్దు. అలాగే కడుపులో నులిపురుగులెలా పుడుతున్నాయి? గమనించుకోవాలి.

 రెండవ సంతానం అండజాలు. అండమంటే గుడ్డు. గుడ్డు నుండి పుట్టేదని దీనర్థం. నిజానికి తల్లి తీసుకునే ఆహారసారం ఆమె గర్భంలో ఉన్న శిశువుకి జీవద్రవ్యంగా ఉపయోగపడుతూ క్రమంగా పెరుగుతూ ఆ మీదట బయటికి రావలసిన కాలానికి శిశువుగా ప్రాణం పోసుకుని జన్మించడం మనం చూస్తూండే అంశం. చిత్రమేమంటే గుడ్డు అనేది మొత్తం కప్పబడి ఉండి, తల్లి ద్వారా ఏ విధమైన ద్రవ్యం దానికి చెందే, చెందించే వీలే ఉండదు గుడ్డుకి. అయినా ఆ గుడ్డు కొంతకాలానికి సంతానంగా మారుతూ కన్పిస్తోంది, తల్లి ఏ మాత్రపు ఆహారాన్ని అందించకుండానే. దీన్ని కూడా చిత్రమని అనుకోవద్దూ?

  మూడవ సంతానం జరాయుజాలు. జరాయువనే మాటకి ‘మావి’ అని అర్థం. దీన్నే ‘మాయి’ అని పిలుస్తుంటారు వ్యవహారంలో. కొన్ని చోట్ల ‘మాయ’ అని అంటుంటారు. ఏది ఏమైనా మావి ద్వారా జన్మించేవి మనుష్య–పశుజాతులు. అందుకే జంతువులతో బాగా పరిచయం, అనుభవం ఉన్న వాళ్లు పశువులు తమ సంతానాన్ని ఈనుతున్న దృశ్యం కంటపడగానే ఆ తల్లి కాబోతున్న పశువుకి ధాన్యపు పొట్టుని ఆహారంగా పెడతారు. ఆ దాన్యపు పొట్టు (చిట్టు అంటారు కొన్ని ప్రాంతాల్లో) లోపల ఉన్న మావిని రంపంలా కోసేసి దూడని తొందరగా బయటికొచ్చేలా చేస్తుంది. పశుజాతి, కొన్ని మృగజాతులు, కొన్ని జంతుజాతులు కూడా ఇలా పుట్టేవే!

  నాల్గవ సంతానం ఉద్భిజ్జాలు. ‘ఉత్‌’ అంటే పైకి అని అర్థం. ‘భిత్‌’ అంటే చీల్చుకోవడం, చీల్చడమని అర్థం. ‘జ’ అంటే పుట్టడమని అర్థం. ఒక పదార్థాన్ని చీల్చుకుని పైకి రావడమని దీని భావం. దీనికి ఉదాహరణ మొక్క. విత్తనాన్ని భూమిలో పాతి మట్టిని కప్పి కొద్దిగా నీటిని పోస్తే చాలు.. ఆ విత్తనం ఉబ్బి మెల్లగా అంకురరూపాన్ని (మొలక)విత్తి మెల్లగా ఆ భూమిని చీల్చుకుని (ఉత్‌ + భిత్‌) పుడుతోంది. (జ) మొక్కగా అవుతోంది. ఆకుల్ని వేస్తోంది. సన్నకాండంతో మొదలై ఎదుగుదలలో చెట్టుగా మారుతోంది. మరి ఈ మొక్క స్త్రీ పురుష సంగమం వల్ల కలగలేదుగా!

  ఐదవ సంతానం సాంకల్పికం. చెప్పలేనంత తపశ్శక్తిని ఆర్జించి దేవతలైన వారికి కలిగే సంకల్పం కారణంగా కలిగే సంతానం. బ్రహ్మ తనంత తానుగా సంకల్పించాడు. చక్కని రూపసౌందర్యం కలవాళ్లూ, మహా వైరాగ్యం కలిగి ఈ ప్రపంచాన్నే ఓ కలగా భావించే వాళ్లూ, ఏ ప్రలోభానికీ లొంగనివాళ్లూ, నిత్యం శ్రీమన్నారాయణ దర్శనమే తమ అనుదిన జీవిత ధ్యేయంగా కలవాళ్లూ అయిన పుత్రులుంటే బాగుండునని. అంతే! ఆ లక్షణాలతో నలుగురు ఒకే రూపం, ఒకే లక్షణాలు, గుణాలతో జన్మించారు. వాళ్లే సనక – సనందన – సనత్సుజాత– సనత్కుమారులు అనే పేర్లు కలవాళ్లు. వీళ్లకే సనకచతుష్టయమని పేరు. ధృతరాష్ట్రుడు తనకి మనశ్శాంతి లేని వేళ ఈ సనత్సుజాతుణ్ణే ఆహ్వానించి ధర్మబోధ చేయవలసిందని ప్రార్థించాడు. ఆయన చేసిన బోధనని విన్నాడు. మరి ఈ సనకచతుష్టయానికీ తల్లీ తండ్రీ సంగమం.. మొదలైనవి లేవుగా! అందుకే వీళ్లని బ్రహ్మమాసన పుత్రులు (బ్రహ్మగారి మనసులోని ఆలోచనకి అనుగుణంగా కల్గినవారు).

 ఆరవ తీరు సంతానం సాంసిద్ధికం. సద్యోగర్భం ద్వారా పుట్టీ పుడుతూనే బాల్యం దాటి కౌమారదశకి వచ్చేయడం. పరాశరమహర్షి పడవలో గంగని దాటి అక్కడ ఉన్న ద్వీపాన్ని చీకటినిండేలా చేసి సత్యవతి ద్వారా వ్యాసుణ్ణి కన్నాడు. చిత్రమేమంటే ఈ వ్యాసుడు సద్యోగర్భం (అప్పటికప్పుడు వచ్చిన గర్భం) ద్వారా పుట్టడమే కాక, పుడుతూనే కౌమారదశలో కన్పిస్తూ దండకమండలాలతో తల్లికీ తండ్రికీ నమస్కరించాడు. ‘కృష్ణ ద్వైపాయనుడు’ అని ఆయన పేరు. కృష్ణ అంటే చీకటిగా చేయబడిన, ద్వైపాయన ద్వీపమే తనకి జన్మస్థలంగా కలవాడని అర్థం. స్త్రీ పురుష సంగమం లేదిక్కడ. పోనీ! చీకటిగా ద్వీపాన్ని చేసిన కారణంగా సంగమమే ఉందనుకుందాం కాసేపు. అదే నిజమైతే దాన్నే నమ్మేటట్లయితే.. ఆయన తన పుట్టుకతోనే 13 సంవత్సరాల వయసు కలవానిగానూ దండకమండలాలతోనూ జన్మించాడనే విషయాన్ని కూడా నమ్మితీరాలి కదా!

 కళ్ల ద్వారా సంతానం , పైన అనుకున్న ఇన్ని తీరులుగా సంతానాన్ని పొందడం, అందులో కొన్నింటిలో స్త్రీ పురుష సంగమం లేకుండా ఉండటాన్ని మనం గమనించాం. ఇంతవరకూ అయ్యాక ఇప్పుడిక కళ్ల ద్వారా సంతానాన్ని ఎలా కన్నారో, ఎవరు కన్నారో ఆ విషయాన్ని చూద్దాం!భారతకథని చూడాలి. కాశీరాజుకి ముగ్గురు పుత్రికలు. వాళ్లలో పెద్దామె అయిన అంబ ప్రేమ విఫలమైంది. ఇక మిగిలిన అంబిక, అంబాలిక అనే ఇద్దరినీ విచిత్రవీర్యునికిచ్చి భీష్ముడు వివాహం జరిపించాడు. సంతానం కలగలేదు. విచిత్రవీర్యుడు మరణించాడు. రాజవంశం సంతానం లేని కారణంగా ఆగిపోయే పరిస్థితికొచ్చింది. అప్పుడు వ్యాసుణ్ణి తల్లి అయిన సత్యవతి ప్రార్థించింది – ఈ అంబిక, అంబాలికల ద్వారా సంతానాన్ని కనవలసిందని. ఈ మాట వింటూంటేనే ఇదేమిటి? అనే ఆలోచన మనకొస్తుంది. దానిక్కారణం మనందరికీ సంతానమనే మాట వినగానే సంగమం ద్వారానే సాధ్యమవుతుందనే ఒక్క విషయం మాత్రమే మన బుద్ధికి తడుతూండటమే.తన తల్లి ప్రార్థించగానే వ్యాసుడు సరేనని అంబిక వద్దకొచ్చాడు. ఆయన గడ్డాలు, మీసాలు ఎరుపు తెలుపు కలిసిన జడల సమూహం మునిరూపం చూడగానే అంబికకి ఓ తీరు భయం వేసి ఒక్క క్షణం పాటు ఆయన్ని చూసి కళ్లు మూసుకుంది. వెంటనే గదిలో నుండి ఇవతలికి వచ్చిన వ్యాసుడు తన తల్లితో.. ఈమెకి అంధుడు పుడతాడని చెప్పాడు. అతనే ధృతరాష్ట్రుడు.మరి సంగమమే సంతానకారణమయ్యుంటే వ్యాసుని తల్లి గది వద్దే ఉండదు కదా! క్షణంలో గది నుండి బయటికి రావడం సాధ్యం కాదు గదా! పైగా వ్యాసుడు ఆ కలగబోయే సంతానం అంధుడవుతాడని ఎలా చెప్పగలుగుతాడు, సామాన్యుడే అయ్యుంటే?

  కళ్లలో ఏముంది శక్తి?  

 సర్వ సాధారణంగా పురుషుని శుక్లం అధోముఖంగా వెళ్లి స్త్రీకి సంతానం కలిగించేందుకు తోడ్పడుతుంది. అదే మరి యోగులు, సిద్ధులు అయినవారి విషయంలో ఆ శుక్లం క్రమంగా ఊర్థ్వముఖంగా ప్రయాణిస్తుంది.ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి.. అని మంత్రం వెళ్తుంది. ఆ శుక్లం అలా ప్రయాణించి ప్రయాణించి మెల్లగా కనురెప్పల వద్ద నిలవ ఉంటుంది. ఏ స్త్రీ సంతానాన్ని అర్థిస్తూ ఆ సిద్ధుణ్ణో స్వామినో యోగినో చూస్తుందో వెంటనే ఆ కళ్లలో ఉన్న సంతానోత్పాదక శక్తి స్త్రీ కళ్ల ద్వారా ప్రయాణించి అధోముఖంగా ఆమెకి గర్భం కలిగేలా చేస్తుంది. ఇదే జరిగింది వ్యాసుని విషయంలో.అంబిక అలా వ్యాసుణ్ణి చూసి వెంటనే కళ్లు మూసుకుంది. గర్భం కలిగింది కానీ అంధత్వం వచ్చింది. సంతానానికి ధృతరాష్టుడు పుట్టాడు.తరువాతిదైన అంబాలిక గదిలోనికి వెళ్లాడు వ్యాసుడు. ఆమె వ్యాసుణ్ణి అంబికలాగానే భయంతో చూసింది గానీ, నిన్నటి రోజున తన అక్కకి జరిగిన తీరు అంధసంతానం రారాదని భావించి కళ్లని తెరిచే ఉంచింది. అయితే ఆ వ్యాసుని రూపం, తపః ప్రకాశం ఆమెకి దుర్నిరీక్ష్యం (చూడ శక్యం కానిది) కావడంతో బలవంతాన కనులు మూసుకోవలసిరావడం అనే ఈ రెండాలోచనల మధ్య కళ్లని తెరవడం, మూయడం చేస్తుంటే ఆ ప్రవర్తన కారణంగా ‘పొండుర్‌గా’ కలిగిన పాండురాజు జన్మించాడు.ఇక ఈ ఇద్దరూ ఆలోచించుకున్న మీదట, సత్యవతి ఊహప్రకారమూ గదిలో దాసిని ఉంచితే, ఆమె వ్యాసుణ్ణి పరమసిద్ధునిగా గ్రహించి ఆ తీరు గౌరవంతో భయంతో భక్తితో శ్రద్ధతో కనుల్ని తెరుచుకునే ఉండి ఆయన కళ్లలోనికి చూసింది సంతాన ఆపేక్షతో. అంతే! విదురుడు ఆ దర్శనఫలంగా పుట్టాడు.

అంటే ఏమన్నమాట? యోగులు, సిద్ధులు, దివ్యపురుషులు అయిన వారి ముఖంలోనికి మనం ముఖాన్ని ఉంచి భయభక్తి శ్రద్ధలతోగానీ చూసినట్లయితే ఆ చూపు ప్రకారం దాని కనుగుణంగానూ సంతానం కలుగుతుందనేది యథార్థమని తెలిసిపోయింది కదా!శ్రీమద్రామాయణంలో తృణబిందుడనే రాజర్షి ఉన్నాడు. ఆయన ఆశ్రమంలోనికి స్త్రీలెవరూ ప్రవేశించరాదనే ఓ నియమాన్ని పెట్టాడు. లోకంలో ఏదైనా ఓ నియమమంటూ ఉంటే దాన్ని ఎలాగైనా విరోధించాలనే వాళ్లు కొందరో ఏ ఒక్కరో ఉండకుండా ఉండరు. దాంతో ఒకరొకరు చొప్పున రాజర్షికి తెలియకుండా ఆశ్రమంలోనికి పూలు కోసుకుందామనీ, ఆశ్రమంలో తిరుగాడే లేళ్లని చూద్దామనీ, ఉద్యానవనవిహారాన్ని చూద్దామనీ ఇలా రావడం ప్రారంభించారు. దాంతో ఆయన ఓ నియమాన్ని కఠినం చేస్తూ.. యా మే దృష్టిపథ మాగచ్ఛేత్‌ సా గర్భాన్ని ధరిస్తుంది జాగ్రత్త! అనే కట్టడిని చేశాడు. దాంతో ఎవరూ రానేలేదు. ఆ తర్వాత ఆయన కళ్లలో పడితే చాలు గర్భం వస్తుందని అనడానిక్కారణం కళ్లలో గర్భధారణ సమర్థత కల శక్తి, పైన అనుకున్న తీరుగా ఉండటమే.‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అనే ఓ మాటని వింటుంటాం. శరీరంలో ఉండే జ్ఞానేంద్రియ (శరీరం, కళ్లు, చెవి, నాలుక, ముక్కు) అలాగే ఉండే కర్మేంద్రియ (మాట, చేయి, కాలు, విసర్జకావయవాలు రెండు) విభాగాల్లో కళ్లు అతి ప్రధానమైనవని దానర్థం. ఒకే కన్ను శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంతమనే తొమ్మిది రసాలని చూపించగల శక్తి ఉన్న ఇంద్రియం.ఈ కారణంగానూ 12 సంవత్సరాల పాటు బహిరంగంగా కాకుండా నేలమాళిగలో ఉంటూ తీవ్రతపస్సుని ఏ బాధ్యతలు బరువులు లేని చిన్న వయసులో (4 సంవత్సరాల వయస్సులో) సాయి చేసిన కారణంగానూ సాయికి కన్నుల్లో ఉన్న శక్తి –అందరినీ వశులుగా చేసేదే. ఆ వశం చేసే శక్తుల్లో గర్భాన్ని కలిగించే తనం ఒకటన్నమాట. కాబట్టి సాయికనుల ద్వారా గర్భం, సంతానం కలిగిందంటే కచ్చితంగా నమ్మితీరవలసిన అంశమే!

 ఇక సాయి ఓ కపటగురువుకి శిష్యుడైన విధానాన్ని రేపు చూద్దాం!

Q ద్వారకామైలో ఎర్రని స్థంభం ఇప్పటికి ఉంది అది ఎందుకు ఉంది ?

ద్వారకా మయి లో లోపలికి వెళ్లిన వెంటనే ఎడమవైపు ఓ ఎర్రని స్థంభం ఇప్పటికి చూడవచ్చు  .ఆ స్థంభం కోసం పూర్తి వివరాలు తెలియక ఓ భక్తుడు దానిని తాకితే మనలో ఉన్న రోగాలు మాయం అవుతాయి అని విని ఆ భక్తుడు తనకు వీపు నొప్పి ఉంది అని ఆ కర్ర దగ్గరకు పోయి వీపును రుద్దడం ఆరంభించాడు .ఆ కారణంగా ఇప్పుడు ఆ స్థంభం  తాకడానికి వీలు లేకుండా ఓ ఇనుప బాక్స్ తయారుచేయించి దర్శనానికి ఉంచారు .

అసలు విషయానికి వస్తే బాబా శశీరులుగా ఉన్నపుడు ద్వారకామయి లో వంట చేసేవారు అ పొయ్యకు దగ్గరలోనే ఈ స్థంభం ఉంటుంది వండుతునప్పుడు బాబా ఆ స్థంభం ఆనుకుని కూర్చునే వారు , కాళీ సమయాల్లో ఈ స్థంభం ని అనుకుని కూర్చుని బాబా వచ్చే పోయే వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవారు .బాబా  స్పర్శకు పునీతమైన ఆ స్థంభం నిజముగా శక్తి ఉంటుంది కనుక ఆ భక్తుడు తన రోగాన్ని నయం చేసుకోవాలి అనుకోవడం తప్పుకాదు కానీ ఆ స్థంభం గట్టిగా రుద్దడం  చెయ్యడం ద్వారా సిందిలం అయ్యే అవకాశం ఉంది కనుక సంస్థాన్ వారు జాగ్రత్తలు తీసుకున్నారు.

అంతే కాదు ఒక సారి ఓ భక్తుడు బాబా వద్దకు వచ్చి బాబా నేను నీకు పూజ చెయ్యాలి అని అనుకుంటున్నాను అని అనుమతి కోరితే బాబా ఆ స్థంభం పూజించు అని అన్నారట .వెంటనే ఆ భక్తుడు బాబా ఆజ్ఞ ప్రకారం ఆ కర్రను పూజిస్తాడు. అంటే దానిని బట్టి బాబా ప్రతి వస్తువు యందు,ప్రతి ప్రాణి యందు నివస్తున్నాడు అని అర్ధం .బాబా స్పర్శకు అంతటి శక్తి ఉంది అని అర్ధం అవుతుంది .ఆ భక్తుడు లాగే మనం కూడా బాబా అజ్ఞాను శిరసా వహిద్దాం.బాబా అనుఘ్నకు పాత్రులు అవుదాం .బాబాకు ప్రీతిపాత్రమైన ఉత్తమమైన శిష్యులు అవుదాం.

శిష్యుడికే శిష్యుడైన సాయి

ఏం చిత్రమో గానీ సాయి చేసే లీలలు ఓ పట్టాన అర్థం కావు. కొద్ది లోతుగా ఆలోచిస్తే అర్థం కాకుండానూ ఉండవు. ‘లో’ అర్థం గాని తెలిసిందా.. ఇక జీవితాంతం గుర్తుంచుకోవల్సినంత గుర్తుంచుకునేంత అనుభవసంపద అందులో దాగి ఉంటుంది.అందుక్కాదూ పదులు వందలుగా, వందలు వేలుగా, వేలు లక్షలుగా, లక్షలు కోట్లుగా భక్తులు వచ్చి సాయిని దర్శిస్తున్నారు! ఈ నేపథ్యంలో ఓ కుమ్మరిపురుగు లాంటివాణ్ణి గురువుగా చేసుకుని సేవ చేసిన తుమ్మెదలాంటి సాయి చరిత్రని తెలుసుకుందాం!

పరివర్తన

ప్రతి వ్యక్తికీ జీవించిన మొత్తం కాలం ఒక్కలానే ఉండదు. మార్పులకి గురి అవుతూనే ఉంటుంది. ఒక్కో మార్పు ఒక్కో అనుభవాన్ని అందిస్తుంది. సాయి తన యవ్వనంలో పహిల్వాన్‌లా ఉండాలనుకుంటూ అలాంటి దుస్తుల్నే వేసుకుంటూ, జుట్టుని కూడా అలాగే పెంచుకుంటూ అందరికీ ఓ పహిల్వాన్‌లాగానే పై దృష్టికి అన్పించేవాడు. ఆ కాలంలో షిర్డీలో కుస్తీపోటీలు ఎక్కువ సంఖ్యలో సాగుతూ ఉండేవి. వేటితో మనకి దగ్గరతనముంటే ఆ లక్షణాలు మనకి ఎక్కువ అలవడుతాయనేది నిజం కదా! ఈ వస్త్రధారణ , జుట్టుపెంచడం మనసులో పహిల్వాన్‌ ఆలోచనలూ కారణంగా కుస్తీపోటీల్లో పాల్గొనాలని అన్పించింది సాయికి. అవకాశం కోసం ఎదురు చూస్తుంటే ఓ సారి తమలపాకులు, వక్కలు అమ్ముకుని వ్యాపారం చేస్తుండే మొహిద్దీన్‌ అనే వ్యాపారితో వాదం వచ్చింది. లోపల కుస్తీ పట్టాలనే ప్రబలమైన ఊహ ఉంది కదా! దాంతో వాదాన్ని పెంచుకున్నారిద్దరూ. కలియబడ్డారు. కుస్తీ పోటీలో తన వృత్తిగా కల మొహిద్దీన్‌ చేతిలో సాయి ఓడిపోయాడు. అంతే! పగ పెరగలేదు. ద్వేషం రగలలేదు. ఇంక కొంతమందిని కూడగట్టుకుని దొంగదెబ్బ తీసి ప్రతీకారాన్ని తీర్చుకోవాలనిపించలేదు సాయికి.

     ఆలోచన సాగింది ఇలా..! నేనూ అతనూ కలియబడ్డాం. ఒకరినొకరు తన్నుకున్నాం కాళ్లతో. పిడికిళ్లతో పరస్పరం గుద్దుకున్నాం. జుట్టూ జుట్టూ పుచ్చుకుని కొట్టుకున్నాం. ఇదా నా సంస్కారం? ఇదా నేను సాధించదలిచిన దానికి ఎన్నుకున్న మార్గం? నేను సక్రమంగా సరైనమార్గంలో ఉంటూ పదిమందిని ఆ మార్గంలో నడిపించాల్సి ఉంటే దానికి ఎంచుకున్న మార్గం ఎంత హేయంగా ఉంది!’ అని తనని గురించి తానే సిగ్గుపడుతూ పరాభవించుకుంటూ కుస్తీవైపుకి దృష్టిని పోనియ్యకూడదనే నిర్ణయానికొచ్చాడు. ఆలోచన వచ్చిందో లేదో వెంటనే పహిల్వాన్‌ దుస్తుల్ని తొలగించాడు. కఫనీ  (శరీరం పొడవునా ఉండే పెద్ద లాల్చీ)ని ధరించాడు. లోపల కౌపీనాన్ని పెట్టుకున్నాడు.ఇదేకాలంలో ఓ సారి ‘గంగాగీర్‌’ అనే అతనిక్కూడా కుస్తీల మోజు పెద్దగా ఉండేది. దాంతో ఎక్కడ కుస్తీపట్లున్నా (షిర్డీలో ఈ వినోదం ఎక్కువ) వెళ్తూ ఉండేవాడు. ఓ సారి ఓ యోధునితో కుస్తీపట్టు పడుతుంటే గంగాగీర్‌కి ఓ ఆకాశవాణి చెప్పిందా? అన్నట్లు ఓ వాక్యం విన్పించింది! ‘‘వెర్రివాడా! భగవంతునితో కుస్తీ పడుతూ(క్రీడిస్తూ) ఈ దేహాన్ని విడిచేసినా అది గొప్పపని అవుతుంది గానీ ఇది ఓ క్రీడా? దీనిలో వచ్చే జయం విజయమా?’’ అని. అంతే! గంగాగీర్‌కి ఆ క్షణంలోనే జ్ఞానోదయమయింది. కావాలని కుస్తీలో ఓడిపోయాడు. కాలక్రమంలో సంసారాన్ని విడిచేసాడు. భగవంతునితో క్రీడిస్తూ (వినోదిస్తూ) ఉండాలనే నిర్ణయానికి అనుగుణంగా ‘పుణతాంబే’ అనే పవిత్ర స్థలంలో ఓ ఆశ్రమాన్ని నిర్మించుకుని శిష్యులతో అక్కడే ఉండసాగాడు. ఇదంతా ఎందుకంటే ఏ వ్యక్తికైనా మంచిరోజులు రాబోతుంటే ‘పరివర్తన’ అనూహ్యంగా కలుగుతుందని చెప్పడానికే.

ఖురాన్‌ పండితుని రాక

ఇదిలా ఉండగా ‘రహతా’ అనే పేరున్న గ్రామానికి అహమద్‌నగర్‌ నుండి ‘జవహర్‌ అలీ’ అనే ఫకీరు (సాధువు) కొందరు శిష్యులతో సహా వచ్చాడు. ఎక్కడ తానుండాలా? ఉంటే బాగుంటుందా? మంచి ప్రచారం సాగుతుందా? అని గమనించి రహతా గ్రామంలోని వీరభద్రమందిరానికి దగ్గర్లో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కువమంది భక్తులొచ్చే ఆ మందిర సమీపంలో ఉంటే తనకి ప్రచారం బాగా ఉంటుందనేదే అలీ ఆలోచన.ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఫకీరైన అలీ సామాన్యుడు కాడు. మంచి పండితుడు. కురానే–ఎ–శరీఫ్‌ (ఖురాన్‌) అతనికి కంఠస్థం (కంఠంలో ఉంటుంది. ఎక్కడ అడిగితే అక్కడి ఆ గ్రంథంలోని విషయాన్ని పుస్తకాన్ని చూడకుండా చెప్పగలతనం). ఆ కారణంగా భక్తులు తెలుసుకోవాలనే తపనతో (జిజ్ఞాస) ఏ అనుమానాన్ని అడిగినా కురాన్‌–ఎ–శరీఫ్‌ని అవలీలగా ఆశువుగా చెప్పేస్తూ ఆ ప్రశ్నకి లేదా సందేహానికి సమాధానాన్ని సరిగ్గా అతుక్కుపోయేలా చెప్పి అందర్నీ తక్కువకాలంలో ఆకట్టేసుకున్నాడు. నిజం కూడా అంతేగా! సందేహాల్ని తీర్చగల సమర్థుణ్ణి అందరూ ఆసక్తితో సమీపిస్తారు గదా! దాంతో భక్తుల సంఖ్య పెరుగుతూ వెళ్తూండడం, ఆయన్ని గౌరవిస్తూండడం, కానుకలని సమర్పిస్తూ ఉండడం.. ఇలా ఆయన ప్రాచుర్యం ప్రసిద్ధి బాగా పెరిగిపోయింది. ఎప్పుడూ ప్రతివ్యక్తీ తనని తాను అదుపు చేసుకోవాల్సి ఉండేది పెరుగుదలలోనే. నిచ్చెనని ఎక్కుతూ వెళ్లేవానికి పడిపోయే ప్రమాదముంటుంది. గానీ నేల మీద నిలబడ్డవానికి ఏముంటుంది పడిపోతాననే భయం? అలీ అనే గురువుకి ఈ భక్తుల ఆదరణ పెరుగుతుండేసరికి ఓ దురాలోచన రానే వచ్చింది. వీరభద్రమందిరానికి (ఆలయం అనుకోవచ్చు) దగ్గరగా మహమ్మదీయ సంప్రదాయం ప్రకారం నిలబడి ప్రార్థించే ఓ గోడ (ఈద్‌గా)ని నిర్మించాలని నిర్ణయించాడు. భక్తుల అండదండలున్నాయి గదా! అనేదే అతని దృఢనిశ్చయం. మహమ్మదీయులంతా ‘ఈద్‌–ఉల్‌–ఫితర్‌’ అనే పండుగరోజున సామూహికంగా నిలిచి ప్రార్థించే పవిత్రస్థలమే ‘ఈద్‌గా’ అంటే. ఈ ఫకీర్‌ రహతాకి రావడం, గ్రామ ప్రజల్ని లోబరుచుకోవడం, ఆకర్షణకి గురయ్యే విధంగా చేసుకోవడం, ఆ క్రమంలో మహమ్మదీయ సంప్రదాయ ధోరణిలో ‘ఈద్‌గా’ని నిర్మించదలపెట్టడంతో హైందవ భక్తులకి కళ్లు విప్పారాయి. నిద్రావస్థలో ఉన్నామనే అభిప్రాయం సామూహికంగా కలిగింది. ఇంకా ఏ స్థితికి అలీ వెళ్లిపోతూ ఇంకెంత అథమస్థాయికి హైందవుల్ని తొక్కేస్తాడో అనిపించి అందరూ కలిసి ఆ ఫకీరుని రహతా నుండి వెళ్లగొట్టేశారు. గోడనిర్మాణం కాస్తా ఆగిపోయింది. అలీ ఎక్కడికి వెళ్లాలా? అని ఆలోచించుకుంటూ సాయి ఉన్న షిర్డీకి మకాం మార్చాడు. షిర్డీకే కాదు. సాయి సమీపంలో అంటే ఆయనవద్దే మసీదులో ఉండడం కోసం తన మకాంని షిర్డీ మసీదులోకి మార్చేశాడు.

     ఇంకేముంది? మసీదులో సాయి దర్శనాని కొచ్చే భక్తులందరితో తీపి తీపి సంభాషణలని చేస్తూ కురాన్‌–ఎ–శరీఫ్‌లోని వాక్యాలని చెప్తూ సాదరంగా సప్రమాణంగా విషయాలని వివరిస్తూ ఉంటే భక్తులందరికీ ‘సాయికి మించినవాడు అలీ’ అనే అభిప్రాయం దాదాపుగా వచ్చేసింది. దీన్ని అదనుగా తీసుకుని ‘అలీ’ కూడా సాయిని తన శిష్యునిగా చెప్పుకుంటూ ఉండేవాడు తన వద్దకి వచ్చిన భక్తులతో. ఆ సందర్భంలో సాయి కూడా ఆ అలీని తనకి ఎలా గురువువి? అని వ్యతిరేకించడం గానీ వాదించడం గానీ భక్తులతో నిజాన్ని చెప్పడం గానీ చేయలేదు సరికదా, ఆ అలీకి శిష్యునిగానే సాయి సేవలని చేయడం మొదలెట్టాడు కూడా. దీంతో భక్తులకి ఏం అర్థం కాలేదు పరిస్థితి.ఈ క్రమంలో అలీ తన మకాంని మళ్లీ ‘రహతా’ గ్రామానికే మార్చదలిచాడు. సాయికి అలీలోని లోపాలు బాగా తెలుస్తుండేవి. అలీకి సాయిలోని గొప్పదనాలు తెలుస్తుండేవి. దీంతో ఎంత తొందరగా ‘రహతా’ కి వెళ్తే అంతగానూ తన గురుస్థానం బలపడుతుందని భావించాడు అలీ. సాయితో మాట మాత్రం కూడా చెప్పకుండా సాయినీ శిష్యులనీ తీసుకుని ‘రహతా’ గ్రామానికి మకాం మార్చేశాడు. ఇలా తాము నమ్ముకున్న సాయి అకస్మాత్తుగా అలీకి లోబడిపోవడం, అంతేకాకుండా ఎంతకాలంనుండో ఉంటున్న షిర్డీ గ్రామాన్ని విడిచి భక్తుల్ని కూడా దూరం చేస్తూ, దూరం చేసుకుంటూ, వెళ్లిపోవడం అందరికీ చాలా బాధాకరమైంది.

     రహతానుండి వచ్చే కొందరి ద్వారా సాయి తన గురువు కాని గురువైన అలీకి నీళ్లు కూడా మోసి తెస్తుండేవాడనీ, ఇది చేయదగినది, అది చేయరానిది అనే భేదం, ఉచ్చం నీచం అనే వివక్ష కూడా లేకుండా సేవ చేస్తున్నాడనీ తెలిసి ఎంతో మనోబాధ పడుతుండేవారు సాయి భక్తులంతా. కొందరు ఈ సాయికి ఏదో మంత్ర ప్రయోగం చేసి ఉంటాడని, ఇంకొందరు ఇక సాయికీ మనకీ సంబంధాలు దూరమైపోయినట్లేననీ, అలీ మన సాయిని వదిలిపెట్టనే పెట్టడనీ.. ఇలా ఎవరికి తోచిన ఆలోచనలతో వాళ్లు అంటూండేవారు. అనుకుంటుండేవారు. ఈ భక్తుల మాటలు నిజమే సుమా! అనుకోవడానికి వీలుగా సాయి తన గురువైన అలీతో షిర్డీ గ్రామానికి అలా చుట్టపు చూపుగా వచ్చేసి వెంటనే వెళ్లిపోతుండేవాడు కూడా. నాలుగు సంవత్సరాల నుండి షిర్డీ గ్రామంతో అంతా చిక్కని చక్కని అనుబంధమున్న సాయి అలా ఎందుకు పొరుగూర్లో ఉంటున్నాడనేది ఎవరికీ అంతుబట్టలేదు. బాబాతో దూరంగా ఉండడమనే ఈ వియోగాన్ని షిర్డీ ప్రజలు భక్తులైన జనానికి తట్టుకోలేనిదిగా అయింది. అంతా తమంత తాముగా ఒకచోటికి చేరి – రహతాకి వెళ్లి సాయిని ప్రార్థించి బ్రతిమాలి బామాలి విన్నవించి మన స్థితిని వివరించి ఎలాగైనా షిర్డీకి తెచ్చేసుకుందామని గట్టిగా తీర్మానించుకున్నారు ఇలా అందరూ ఒకటి కావడం ఒకే మాట మీద ఉండడం ఒకే తీర్మానాన్ని చేసుకోవడమనేదాన్నే ‘ఏకగ్రీవం’ (ఏక–ఒకే, గ్రీవం–కంఠంగా కావడం –కంఠం అనేది మాటని పలుకుతుంది కాబట్టి అందరిదీ ఒకే మాట కావడమని అర్థం) అంటారు. అలా అందరూ కలిసి రహతా గ్రామానికి వెళ్లారు. అలీ అనే ఆ గురువు లేని సమయాన్ని పసి గట్టి మొత్తానికి సాయిని కలిసి తమ గోడు వెళ్లబోసుకుని సాయిని షిర్డీకి శాశ్వతంగా వచ్చేయవలసిందని విన్నవించుకున్నారు.

     సాయిలో ఉన్న గొప్పగుణాల్లో ఒకటి ఎదుటివారు చెప్పే విషయం మొత్తాన్ని పూర్తిగా వినడం, అలా వింటున్న కాలంలో తన అభిప్రాయమేదో దాన్ని చూచాయిగా కూడా తన ముఖకవళికలలో వ్యక్తం చేయకపోవడమూను. అంతేకాదు. పూర్తిగా విన్నాక తన అభిప్రాయాన్ని విస్పష్టంగా చెప్పడమే తప్ప, వంకరగా మాట్లాడకపోవడం కూడా ఆయన విశిష్టలక్షణమే. వీరి ప్రార్థనని మొత్తమంతా విన్నాక సాయి వీళ్లందరికీ చక్కని సమాధానమిస్తాడనుకుంటే ఆ సాయి మాట్లాడుతూ.. షిర్డీవాసులారా! నా గురువైన అలీ మహా కోపిష్టి. ఆయనకి చెప్పనిదే నేను ఏ పనినీ చేయను, చేయకూడదు. మీరు నన్ను ఇలా దొంగతనంగా కలిశారని ఆయనకి తెలిసినా, దురదృష్టవశాత్తూ ఇప్పుడే మనం ఆయన కంటబడినా పరిస్థితి సక్రమంగా ఉండదు. ఇక నన్ను విడిచిపెట్టనే పెట్టడు సరికదా అనుక్షణం నా మీద నిఘా ఉంచనే ఉంచుతాడు. ఇలా మనం ఆయన కంటపడితే తీవ్రంగా అగ్నిలా ప్రజ్వరిల్లిపోతాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తాడు. మీ మాటని నేను వినడం మాట అటుంచి, నా మాట విని మీరు వెంటనే షిర్డీకి వెళ్లిపోండి అన్నాడు. షిర్డీ భక్తులందరికీ మతిపోయింది. ‘సాయి మనందరికీ దిక్కు’ అని అనుకుంటూ ఉంటే ఆయనకి దిక్కు మరొకరున్నారని ఆయన అనడమేమిటి? పైగా ఎప్పుడో పరిచితులమైన మనకంటే.. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు ఈ అలీ మీద ఇంత గౌరవం, భయమేమిటి సాయికి? అనుకుంటూ ఉండగానే సాయి అన్నట్లుగా అలీ అకస్మాత్తుగా అక్కడికి రానేవచ్చాడు.

     నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ‘‘ఈ ‘కుర్రవానికోసం’ వచ్చారా? ఇతణ్ణి పంపనే పంపను షిర్డీకి. నా శిష్యుడు ఇతను. ఇక్కణ్ణుండి పొండి’’ అన్నాడు అలీ. చల్లకొచ్చి ముంత దాచడం, శత్రువు ఎదురైనప్పుడు యుద్ధాన్ని మాని బతిమిలాడడం ప్రయోజనం లేని పని అని భావించి షిర్డీ ప్రజలంతా అలీ మీద వాగ్యుద్ధంతో తిరగబడ్డారు. దాంతో అలీకి లోపల కొద్దిగా జంకు కలిగింది. ‘సరే! నేను ఈ కుర్రవాణ్ణి పంపను. వస్తే మేమిద్దరం వస్తాం షిర్డీకి!’ అన్నాడు అలీ. అందరికీ అప్పటికి ఆమోదమయింది. అనుకున్నట్టుగా ఆ ఇద్దరూ షిర్డీకి వచ్చేశారు. షిర్డీవాసులందరికీ పండుగ వాతావరణం వచ్చేసింది. ఇక ‘అలీ’ని ఎలా సాయి నుంచి వదిలించాలా? సాయిని ఎలా తమ వైపుకి రప్పించుకోవాలా? అని ఆలోచించారు భక్తులంతా.

     షిర్డీలో దేవీదాస్‌ అనే మహా తేజోవంతుడైన పండితుడు ఉన్నాడు. ఆయనకి ఎంతో గొప్పవారూ వయసులో పెద్దవారూ అయిన తాత్యా పాటిలు, షింపీ వంటి ఎందరో శిష్యులుగా అయి ఎన్నెన్నో విషయాలని ఈయన నుండి తెలుసుకుంటూ ఉండేవారు. అలాంటి దేవీదాసుకి సాయి భక్తులంతా విషయాన్ని పూస గుచ్చినట్లుగా చెప్పి.. శరణుకోరుతున్నామన్నారు. దేవీదాసు అలీ ఉన్న చోటుకొచ్చి అలీతో వాదం ప్రారంభించాడు. కేవలం కురాన్‌–ఎ–శరీఫ్‌ కంఠస్థం చేసి ఉండడమే తప్ప వాటిలోతులు తెలియని కారణంగా దేవిదాసు వాదపాండిత్యం ముందు అలీ తట్టుకోలేక ఓటమిని అంగీకరించి సాయిని విడిచేసి షిర్డీ నుండి పారిపోయాడు. మేఘం విడిచిన సూర్యునిలా మళ్లీ సాయి దేదీప్యమానంగా ప్రవేశించసాగాడు. కొన్నేళ్ల తర్వాత అలీ షిర్డీకి వచ్చి సాయి పాదాల మీద పడి మన్నింపవలసిందని వేడి పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు అందరి సమక్షంలోనూ.

లో భావం..?

సాయి ఎందుకిలా ప్రవర్తించాడనేది గట్టి ప్రశ్న కదా! వ్యక్తికి అహంకారమనేది ప్రారంభమై పెరుగుతున్న కాలంలో పతనమౌతామనే విషయం స్ఫురణలోకి రాదు. దీనికి ఉదాహరణే ‘అలీ’!

మంచో చెడో ఒకరినంటూ గురువుగా ఎన్నుకున్నాక, అతణ్ని ఆశ్రయించాక శిష్యునిలానే గురువుకి శుశ్రూష చేయాల్సిందే తప్ప నడుమలో విడిచివేయకూడదు. నిజమైన గురువు ఎలా ఉండడో, ఎలా ఉండేవాడు మాత్రమే గురువో ఆ విషయాన్ని తెలియజేయ దలిచాడు సాయి. తెలియజెప్పాడు. లోకంలో ఎందరో కేవలం పాండిత్యం ద్వారా జనాన్ని ఆకర్షిస్తూ, తాము చెప్పేదాన్ని ఆచరించకుండా స్వప్రచారం ద్వారా ఎంతెంత ఎత్తులకి ఎదిగిపోతారో గమనిస్తూ వాళ్లని నిజమైన గురువులుగా ఎలా లెక్కించకూడదో తెలియజేసే వృత్తాంతమే ఈ సంఘటన. ఇలా జనం అందరికీ గుండెలలోతుగా విషయాన్ని అర్థమయ్యేలా చేసేందుకు సాయి ఆ కపట వంచన గురువుకి యథార్థ శిష్యునిగా సేవ చేశాడు. అందుకే సాయి లీలల్ని లోతుగా అర్థం చేసుకోవాలని చెప్పేది కూడా!

మహమ్మదీయుల ‘ఉరుసు’ పండుగని సాయి శ్రీరామనవమిగా మార్చాడు. అది ఎలా జరిగిందో రేపు చూద్దాం!

Q బాబా తలకు గుడ్డను ఎందుకు కట్టు కున్నారు ?

1 – మానవ శరీరంలో ఉన్న ముఖ్యమైన చక్రాలలో సహస్రాలం సరిగ్గా తలపై 4 వేళ్ళ వెడల్పు లో ఉంటుంది ఆ చక్రాన్ని పరిరక్షించడానికి బాబా తలకు గుడ్డ కట్టుకున్నారు.

2౼ ఈ చక్రం ద్వారానే శక్తి లోనికి ప్రవేశిస్తుంది. గట్టిగా గుడ్డను కట్టడం ద్వారా ఈ సహస్రార చక్రాన్ని కాపాడే ప్రయత్నం  లో భాగమే తలపై గుడ్డ కట్టడం . ఇలా చెయ్యడం ద్వారా ఆలోచనలను పరిపరి విధాలుగా పోనియ్యకుండా చెయ్యవచ్చు .   

ఐతే బాబా నే భగవంతుడు ఐనప్పుడు ఇలా ఎందుకు చేశారు అంటే బాబా మనవరూపంలో వున్న భగవంతుడు మనలో ఒకరిగా జీవించడానికి భువి పై అవతరించిన మానవరూపదారి బాబా కనుక మనలా వుంటూ మనలో మార్పును కోరుకుంటారు బాబా . అందుకే ఆధ్యాత్మికంగా వెళ్తున్నప్పుడు ముఖ్యంగా ఆడవాళ్లు జిట్టును వదలకుండా ముడి వెయ్యాలి అంటారు దానిద్వారా చెడు మనలోకి ప్రవేశించదు

Q బాబా పాదుకులకు ఎలా నమస్కరించాలి ??? 

షిరిడి మొదలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాబా ఆలయాలలో తప్పనిసరిగా పాదుకలు ప్రతిష్టించ  బడి ఉంటాయి . దానికి ఓ ముఖ్యమైన కారణం ఉంది . దైవ దర్శనం చేసే విధానంలో గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే దైవ దర్శనం చేసేటప్పుడు  ముందుగా భగవంతుని పాదాలును దర్శిస్తూ ధ్యాసతో కుంచం కుంచంగా శిరస్సు వరకు మన చూపు చేరుకోవాలి .

ఐతే పాదుకులను స్పృశించే టప్పుడు మన నుదురు పాదాలకు తాకించి నమస్కరిస్తాం దానికి గల కారణం మన కనుబొమ్మల మధ్యన ఉన్న ప్రాతంలో ఆజ్ఞా చక్రం ఉంటుంది ఆ చక్రాన్ని భగవంతుని పాదాలకు తాకించడం ద్వారా భగవంతుని పాదుకలలో  శక్తి ఈ చక్రం నుండి మానవ శరీరం లోనికి ప్రవేశిస్తుంది దానిద్వారా మనకు స్వచ్ఛమైన జ్ఞానం లభిస్తుంది 

అన్నిటికన్నా ముఖ్య మైన విషయం ఏమిటంటే మన సాయి నిలయంలో బాబా మరో విధానం నేర్పించారు సహజంగా  ఏ ఆలయంలో నైన  పాదుకులను తాకినప్పుడు మన కుడిచెయ్యి ఎడమ పాదానికి ఎడమచెయ్యి కుడి పాదానికి తాకించి నమస్కరిస్తాం కానీ సాయి నిలయంలో బాబా ఒకసారి ఈ విధంగా నమస్కరించాలి అని నేర్పించారు అది ఎలా అంటే మన కుడిచెయ్యి కుడిపాదాన్ని ఎడమ చెయ్యి ఎడమ పాదాన్ని తాకేలా నమస్కరించాలి అని నేర్పించారు అలా మన రొండు చేతులు క్రాస్ చేస్తే ఈ విధంగా నమస్కరించ గలం.

ప్రతి దానికీ ఓ పద్ధతి అంటూ ఉంటుంది అని బాబా మనకు దగ్గర ఉండి మరీ నేర్పిస్తున్నారు 

అందరిదీ ఒకే మతం

     ‘యద్దృశ్యతే శ్రూయతే చ’ దేన్ని ఇష్టంగా మనసుకి పట్టించుకుని చూస్తామో, దేన్ని చెవులారా విని బుద్ధికి ఎక్కించుకుంటామో వాటి ప్రభావం మనమీద తప్పక ఉంటుందనేది నూటికి నూరుపాళ్లు నిజమైన అంశం. శరీరానికి అనారోగ్యకరమైన తిళ్లని తినిపిస్తే ఎలా శరీరం రోగమయమౌతుందో.. వైద్యుని అవసరం కలుగుతుందో, దానివల్ల ఇటు శారీరక బాధ అటు ధనవ్యయం , అంతేకాక మనకి బంధుమిత్రులు సేవచేయడంలో అలసటా.. కలుగుతాయో, అదే తీరుగా బుద్ధికి కూడా సరికాని కథలనీ సంఘటనలనీ గట్టిగా హత్తుకునేలా అందిస్తే మానసికంగా వ్యక్తి పూర్తిగా రోగిగా మారిపోతాడు. అందుకే పెద్దలు ‘సరైన వాటినే చూపించు–సరైన వాటినే తినిపించు’ అనేవాళ్లు. అలా శరీరానికీ బుద్ధికీ మనసుకీ ఆరోగ్యకరమైన సాయి చరిత్రలో ప్రయాణిస్తూ సాయి దృక్పథాన్ని ఒంటికి పట్టించుకుంటూ వెళ్తున్నాం. ఆ నేపథ్యంలో మరో మతమంటూ లేదనీ అందరిమతం ఒక్కటేననీ నిరూపించే సాయికథని జరిగినదాన్ని జరిగినట్లుగా అనుకుందాం!

కృతజ్ఞత

     ‘కృత = తనకి చేయబడిన సహాయాన్ని, జ్ఞ–త=గుర్తుంచుకోవడం’ అని ఈ మాటకి అర్థం. ‘గోపాలరావు గుండ్‌’ అనే పేరున్న ఒక ధార్మికుడుండేవాడు. చేస్తున్నది పోలీసుశాఖలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా అయినప్పటికీ, రోజూ నేరగాళ్ల మధ్యే ఉండవలసిన ఉద్యోగమైనప్పటికీ, పూర్తిగా వ్యతిరేకబుద్ధితో నేరం దిశగానే ఆలోచిస్తూ ఎవరొచ్చినా దొంగ– ఘాతుకుడు(హత్య చేసినవాడు).. అని ఈ తీరు మనస్తత్వమే కలిగినవాడుగా ఉండవలసిన వాడే అయినప్పటికీ ధర్మబుద్ధితోనే ఉద్యోగాన్ని చేస్తుండేవాడు. అందుకే ఆయన్ని ధార్మికుడు అనవలసివచ్చింది. తననెప్పుడూ ఏ ఒత్తిడీ ఉద్యోగపరిస్థితీ తోవ తప్పనీయకుండా చేయాలనే దృఢ సంకల్పంతో దైవానికి నిజమైన సమర్పణ బుద్ధితో (ఏదో ఇచ్చుకోవాలనే బుద్ధి అనేది సమర్పణ ఆనే మాటకి అర్థం కాదు. దైవానికి దాసుడైన వాడినని తనని తాను సమర్పించుకున్న బుద్ధి కలవాడనేది అర్థం) ఉంటూ కాలాన్ని గడుపుతుండేవాడు. వివాహమై ఎక్కువకాలమైనా సంతానం కలగలేదు. ఆ భార్య ఒత్తిడితో ప్రోత్సాహంతో మరో ఆమెని చేరదీయడం కాదు. వివాహమే చేసుకున్నాడు. అందుకే అతణ్ణి ధార్మికుడన్నాం. అయినా సంతానం కలగలేదు. ఈ ఉన్న ఇద్దరి భార్యల ప్రోత్సాహం ఒత్తిడితో మూడవవివాహాన్ని కూడా చేసుకున్నాడు. లోపల ఒక భయం. ఇలా ఎన్ని వివాహాలని చేసుకోవాలి? అని. ఈ సారి ఏమైనా మరి వివాహమనేమాటని ఎంతటి ఒత్తిడి వచ్చినా అంగీకరించననుకుని కాలాన్ని గడుపుతూ ఉంటే ఎవరో తన అదృష్టానికి సాయి గురించిన విశేషాలని వివరించారు. తన భార్యలు ముగ్గురితో కలిసి సర్వసమర్పణ అనే భావంతో ఆయనని చూడలేదు. దర్శించుకున్నాడు హృదయంతో.. హృదయంలో ఉన్న ఆర్తితో..! ఆయన కన్నుల్లో కన్నుల్ని పెట్టి మనసుతో ఆయన మనసుకి విన్పడేలా మౌనంగా చెప్పుకున్నాడు తన ఆవేదనని. వేదన అంటే ఎవరో వినేవాడున్నప్పుడు చెప్పుకోగల బాధ అని అర్థం. ఆవేదన అంటే దైవం తప్ప మరెవరికీ విన్పించుకోగల బాధ అని అర్థం. ఆవేదన అంటే దైవం తప్ప మరెవరికీ విన్పించుకోలేక ఒకవేళ విన్నా మనస్థాయి దుఃఖంతో సమానమైన దుఃఖాన్ని అనుభవిస్తూ అర్థం చేసుకోలేని బాధ అని అర్థం. అలాంటి ఆవేదనని అర్థం చేసుకోగలవాడు సాయి మాత్రమే అని నిశ్చయించుకుని ఆవేదనని చెప్పుకున్నాడు గోపాలరావు గుండ్‌.

     సరైన కాలంలో విత్తనాన్ని నాటితే చక్కని అంకురం వచ్చి మొక్కై మానుగా ఎదుగుతుందన్నట్లు సాయికి తన ఆవేదనని చెప్పుకున్న కొంతకాలంలోనే ఆయనకి సంతానం కలిగింది. సంతానం కల్గించిన సాయిపట్ల తన  ‘కృత–జ్ఞ–త’ తనకి మేలు కల్గించిన సాయికి తన మానసికానందాన్ని హృదయపూర్వకంగా చెప్పుకోవాలని ప్రత్యక్షంగా తనకి తానుగా ఆయనకి కన్పించి చెప్పుకునేలా వెళ్లాలని బయల్దేరి సాయికి సాష్టాంగపడి తన ‘కృతజ్ఞత’లను నమస్కారపూర్వకంగా తెలియజేసుకున్నాడు.ప్రార్థిస్తే సంతానం కలిగితే అన్ని పనుల్నీ మానుకుని వెళ్లి దర్శించిన గోపాలరావు గుండ్‌ ద్వారా ఎందరో అర్థం చేసుకోవాలి. ‘మొక్కులు  మొక్కుకుని, ఆ మొక్కుకున్న కారణంగా తీరవలసిన కోరిక తీరాక, ఇప్పుడు కుదరలేదు, అప్పుడు సాధ్యపడదు, మరొక కొంతకాలం వీలుపడదు’ అంటూ దైవదర్శనాన్ని వాయిదా వేసే వారందరూ ఎంతటి తప్పుని చేస్తున్నారో గమనించుకోగలగాలి. కేవలం ఒక్క కుటుంబపు బాధ్యతని నిర్వహిస్తున్న మనకే వీలుపడలేదని, వీలుపడదనీ మనం అంటుంటే, ఆ దైవం తనకంటూ ఎందరు కుటుంబాల బాధ్యతని చేపట్టి ఉన్నాడో కాబట్టి ఆయన అసలు ఏ మాత్రం తీరుబడి లేనివాడవుతూ మన కోర్కెని పట్టించుకోకుండా ఉన్నా అడిగే అవకాశమే లేదు మనకి. అంతటివాడు మన కోర్కెని తీర్చినా ఆయన్ని దర్శించుకోకపోవడం ఎంత ఘోరం ఎంత నేరం ఎంతటి ద్రోహం? ఎంతటి అకృతజ్ఞత? (కృతజ్ఞతకి వ్యతిరేకం కృతఘ్నత కాదు)అందుకే ధార్మికుడైన గోపాలరావు గుండ్‌ సాయిని దర్శించి తనకి జరిగిన ఆ ఆనందాన్ని ఒక దర్శనంతో వ్యక్తీకరించుకోవడం కాకుండా, అంతతో ముగించుకోవడం కాకుండా, ఆ ఆనందానికి గుర్తుంగా ప్రతి సంవత్సరం ఒక ఉత్సవం– జాతర– భక్తిపూర్వకంగా జరిపే తిరునాళ్లు జరపాలని దృఢంగా అనుకున్నాడు. బుద్ధింతు సారధిం విద్ధి– మనకి కలిగే ఆలోచనే మన జీవితరథానికి సారథి(నడిపించే వ్యక్తి) అని దీనర్థం. అందుకే తనకి కలిగిన ఈ ఆలోచనని తనకి ఆప్తులైన పాటిల్‌ ద్వయం(తాత్యా కోత్‌ పాటిల్, దాదాకోత్‌ పాటిల్‌) తోనూ వీరితో సమాన బుద్ధి కలిగిన మాదవరావు అనే ఆయనకీ చెప్పాడు గోపాలరావు గుండ్‌. ఓ మంచిపనిని చేయబోతే ఆహ్వానం లేకుండానే పదిమంది రావడమనేది సహజం కాబట్టి, నిస్వార్థంగా జరుపబోయే ఉత్సవానికి సంబంధించిన ప్రతిపాదనకి షిర్డీ గ్రామస్థులు కూడా సహకరిస్తామన్నారు. గోపాలరావు గుండ్‌ ఆనందానికి అవధుల్లేవు.

నిరాకరణ – అంగీకారం

     చేస్తున్నది మంచిపనే కదా! అనే అభిప్రాయంతో ఈ షిర్డీవాసులంతా ఆ ఉత్సవానికి సంబంధించిన అన్ని విధాల సహకారాలని అందించడానికి ముందుకొచ్చారు. అయితే సాంకేతికంగా మాత్రం ఇలాంటి ఉత్సవాలు చేసుకోవాలంటే జిల్లా కలెక్టర్‌గారి అనుమతి తప్పనిసరి. పైగా ప్రతి సంవత్సరం చేయదలిచిన ఉత్సవం కాబట్టి ప్రతిసారీ ఈ అనుమతి కోసం ఎదురుచూడనక్కరలేకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కలెక్టర్‌ గారికి దరఖాస్తు చేసుకున్నారు అందరి తరఫునా గోవిందరావు గుండ్‌ ప్రభృతులు.వేప చెట్టుకి పాలుపోసినా, తేనెని ఎరువుగా వేసినా, గంధాక్షతలతో పూజ చేసినా, గొడ్డలివేటు వేసినా.. దాని రుచి ఎన్నటికీ తీపికానట్లు, చేదుతనమే తన స్వభావమైనట్లు ఆ గ్రామ కులకర్ణి(కరణం) తనదైన సహజబుద్ధితో ఈ దరఖాస్తుని పంపుతున్నట్లే పంపుతూ.. ఈ ఉత్సవానికి అనుమతినీయడం మంచిది కాదంటూ తన సూచనని రాశాడు. రెవెన్యూ వారు ఈ కులకర్ణి అభిప్రాయాన్ని పరిగణనలోనికి తీసుకు తీరాలి. దానికి కారణం ఆయనే ఆ గ్రామ విశేషాలని అందించాల్సిన అధికారి కాబట్టి. దాంతో అనుమతి నిరాకరింపబడింది.గుర్తుంచుకోవాలి! ఎంత గొప్ప పనిని గోపాలరావు గుండ్‌ తలపెట్టాడో, దానికి గ్రామస్థులంతా ఎలా ముందుకొచ్చారో, ఒక్క సంవత్సరం ఏదో తూతూ మంత్రంగా కాకుండా ప్రతి సంవత్సరం జరుపదలిచారో, ఇది కూడా గోపాలరావు గుండ్‌కి చక్కని పరిశోద్ధారకుడు కలిగిన కారణంగా తప్పక కొనసాగుతూ వెళ్తుందో.. ఇన్నింటినీ ఆ గ్రామాధికారిగా ఉండి అన్నీ తెలిసికూడా కులకర్ణి (కరణం) అలా చేసాడంటే గమనించాల్సిన అంశాలు రెండు. ఒకటి : లోకమంతా ఒకవైపున ఉండి మంచి చేయదలిచినా ఇలాంటి చీడపురుగులుంటాయనీ..! రెండు : సాయి అనుగ్రహం కోసం ముందుగా ప్రయత్నించకుండా ఆయనకి మాట మాత్రంగానైనా చెప్పకుండా చేస్తూండడం వల్లే ఇదంతా జరిగిందనీను. భాగవతం చదువుతూ ఉంటే ఎలా కృష్ణుని చరిత్రతోపాటు శిశుపాలుడూ కంసుడూ గురించి కూడా అనుకుంటామో, శ్రీమద్‌ రామాయణాన్ని చదువుతుంటే ఎలా శూర్పణఖ–సీతని అపహరించవలసిందని చెప్పిన అకంపనుడనే రాక్షసుణ్ణి గురించి కూడా అనుకుంటామో అలా ఈ కులకర్ణి(కరణం) చరిత్రలో ఒక దుష్టునిగా శాశ్వతంగా నిలిచిపోయాడు. కాబట్టి చరిత్రలో మనమెప్పుడు మాయగా అనుకునేలా ప్రవర్తించాలి తప్ప ఎలా బడితే అలా ఉండడం సరికాదన్నమాట!

     నిరుత్సాహపరులైన గ్రామస్థులందరితో కలిసి గోపాలరావు గుండ్‌ సాయికి ఈ విషయాన్ని వివరించాడు. అయితే! సాయి ఆశీర్వచనం కారణంగా అనుమతి రానేవచ్చింది కొన్ని రోజుల్లోనే. అంటే ఏమన్నమాట? మనకేదైనా ఓ పని కాక మధ్యలో అడ్డంకి కలిగితే సాయిని ప్రార్థిస్తే పని మళ్లీ సక్రమ స్థితికి వచ్చేస్తుందని తెల్పడమే కదా!మరో విశేషం ఉంది కూడా. గోపాలరావు గుండ్‌ తనకి పుత్రుడు కల్గిన సందర్భంగా తానొక మహ్మదీయుడు కాబట్టి ఉరుసు ఉత్సవాన్ని చేయ సంకల్పించి ఇంత చేసాడు. సత్ప్రవర్తన కలిగిన మహాత్ములైన మహ్మదీయులు మర ణిస్తే వాళ్ల సమాధుల వద్ద ప్రతి సంవత్సరం వాళ్లని స్మరిస్తూ వాళ్లకి నివాళులనర్పించుకునే ఆరాధనోత్సవం ఉరుసు. అలాంటి ఉరుసుని చేయవచ్చునని కలెక్టర్‌ నుంచి అనుమతి రాగానే సాయి అందరినీ పిలిచి ఆ ఉరుసుని తప్పకుండా ఈ సంవత్సరంలో ప్రారంభించి ప్రతి సంవత్సరం జరుపుకుందాం! అయితే ఆ ఉరుసుని శ్రీరామనవమినాడు జరుపుకుందామని తన నిర్ణయాన్ని ప్రకటించాడు.గమనించాలి! సాయి ఎంత గొప్పవాడో హృదయవైశాల్యం కలవాడో! పరమత ద్వేషి కానివాడో! ఆ విషయాన్ని అర్థం చేసుకోగలగాలి!

     ‘నాకు పరమతసహనం ఉంది. స్వమతం మీద సంపూర్ణ అభిమానం మాత్రమే కాదు’ అంటుంటారు ఎందరో. సాయి దాన్ని అంగీకరించాడు. మతాలంటూ రెండున్నాయని అంగీకరిస్తూ ఈ రెంటింటిలో నాదికాని మతాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఇతర మతాన్ని ద్వేషించననడం గొప్ప కాదని తీర్మానిస్తాడు సాయి. రెండు మతాల్లోనూ వేర్వేరుదనం ఉండనే ఉండరాదు. ‘రెండు’ అనుకుంటున్న ఆ ‘రెండూ ఒక్కటే’ అని నిరూపిస్తూ, ముందుకాలం వారికి మార్గదర్శకుడు కూడా అవుతూ ‘ఆ చేయబోతున్న ఉరుసు ఉత్సవాన్ని శ్రీరామనవమినాడు చేయాలి’ అంటూ ఆజ్ఞ చేసాడు సాయి! ఇలాంటి చరిత్రలని పాఠ్యాంశాల్లో చదివి నేడు కన్పిస్తున్న హిందూ ముసల్మాన్‌ ద్వేషాలు ఇంతకు వెనుకకాలంలో చరిత్రలో జరిగాయని చెప్పిన ముసల్మాన్‌ దండయాత్రలు, ప్రస్తుతం ఇంకా జరుగుతున్న హిందూమహ్మదీయ పరస్పర దూషణలు చిన్నచిన్న ఘర్షణలు కూడా పూర్తిగా సమసిపోతాయి. ముఖ్యంగా బాల్యం నుండే పిల్లల్లో మతాల్లో ఉండే రెండు తనం పోయి, మతాలన్నీ ఒకటే అనే అభిప్రాయం బలపడుతుంది! సాయిని కొందరు హిందువులు ఆయన ఓ మహ్మదీయుడనే అభిప్రాయంతోనూ ఆ సంప్రదాయమే ఆయన ఆలయంలో జరుగుతూ ఉంటుందనే ఊహతోనూ సాయిపట్ల ఆయన ఆరాధన పట్ల విముఖతని చూపిస్తూ ఉంటారు. వీరి ఆలోచనే నిజమైనదైనట్లైతే – మసీదేమిటి? ధుని ఏమిటి? లోపల తులసి మొక్కని నాటడమేమిటి? దీపారాధన ఏమిటి? ద్వారకామాయి అని దానికి పేరు పెట్టడమేమిటి? కొద్దిగా ఇలా ఆలోచించుకోగలగాలి. ఇదే సందర్భంలో కొందరు మహ్మదీయులు కూడా ఈయన హిందువనే అభిప్రాయంతో కొంత విముఖతని చూపిస్తూ ఉంటారు. రాబోయే చరిత్రలో ముసల్మానులు అభిప్రాయంతో హిందువులని ఏం చేయబోయారో కూడా తెలియబోతోంది! నిజంగా ఆయన హిందువే అయ్యుంటే నిరంతరం ‘అల్లాహోమాలిక్‌’ అనడమేమిటి? కఫనీని ధరించడమేమిటి? తల గుడ్డని గట్టిగా చుట్టి ఎడమచెవి మీదుగా ముడిని వేయడమేమిటి? కొద్దిగా పరిశీలించగలగాలి.

     మరైతే సాయి ఎవరట?

ఆయన హిందువుగా కన్పించే మహ్మదీయుడు. మహ్మదీయుడిగా కన్పించే హిందువు. రెంటినీ కలిపి ఒకేమాటలో చెప్పాలంటే ఏ మతానికీ చెందని మహనీయుడూ, అన్ని మతాలు ఒకటే సుమా! అని అర్థం చేసుకునేలా మనకి ఉపదేశాన్నిచ్చే అనన్యసామాన్యుడూను.  మొత్తానికి ఉరుసుని శ్రీరామనవమినాడు నిర్వహించడానికి ప్రభుత్వ అనుమతి గ్రామస్థుల సహకారం సాయి అనుగ్రహపూర్వకమైన ఆమోదం అన్నీ లభించాయి గానీ మళ్లీ గ్రామస్థుల్లో ఒక చింత బయల్దేరింది. రెండు ఉత్సవాలనీ ఒకే మారు చేస్తున్న కారణంగా భక్తుల సంఖ్య మరింత ఎక్కువ అవుతుంది. షిర్డీలో నీటి సమస్య ఉంది. ఉత్సాహంతో మనం ఉత్సవాలని ఇక్కడ కాకుండా మరోచోట చేసుకుంటేనో  ఈ ఉత్సవాలని? అనే ఆలోచనదాక వచ్చేసారు జనం అందరూ. దీన్నే అస్థిర అవిశ్వాస తీర్మానం ’ అంటారు. ఒకేచోటంటూ ఉత్సవం జరగాలనే గట్టి ప్రయత్నంతో గోపాలరావు గుండ్‌ ఇంత భగీరథ ప్రయత్నం చేస్తే చివరి క్షణంలో నీటి సమస్య కారణంగా వాయిదా వేయడమా? అదుగో ఆ ఆలోచననే ‘అస్థిర అవిశ్వాస ఆలోచన’ అంటారు. అస్థిర ఆలోచనంటే ముందు షిర్డీలో అనుకుని, తర్వాత షిర్డీ కాక మరోచోట చేద్దామని సంకల్పించడం, అవిశ్వాస ఆలోచనంటే సాయి కూడా ఈ సమస్యని తీర్చలేడనే మానసిక అవిశ్వాసంతో ఆలోచించడం. అసలు సాయికి ఈ సమస్యని చెప్పుకోకుండా తమలో తాము ఆలోచించేసుకోవడమూను. కొన్ని కొన్ని సందర్భాల్లో మనుష్యులు ఇలాంటి ఆలోచనలనే చేస్తారు. ఆ సరైన ఆలోచన రావడానికి కూడా సాయి అనుగ్రహం ఉండాలి. గోపాలరావు గుండ్‌తో పాటు పాటిల్‌ ద్వయం మాధవరావు ఇంకా కొందరికి మెరుపులా ఇదేమిటి? ఇలా ఈ సమస్య మరో తోవ పడుతోంది? అనే ఆలోచన కలిగి సాయికి విన్నవించారు. ‘దేవా! ఈ ఉత్సవాలని చేయదలిస్తే షిర్డీలో రెండే రెండు నీటి వసతులున్నాయి. ఒక పేద్ద నుయ్యి ఉందిగాని ఈ ఉత్సవాలు ఎండాకాలంలో కాబట్టి నీరు సరిపోకపోవచ్చు. లేదా ఇంకిపోతుంది కాబట్టి మధ్యలో ఆ నుయ్యి మనని ఇబ్బందికి గురిచేయచ్చు. ఇక రెండో నుయ్యి ‘నడబావ’. అంటే నాలుగు వైపుల్నించి నడిచే మార్గాల మధ్యలో ఉన్న పెద్ద విశాలమైన బావి. నాలుగు వైపుల వారూ చక్కగా తోడుకుని నీళ్లు పట్టుకోగల వసతి ఉన్న బావి, అయితే దురదృష్టవశాత్తూ ఆ నూతినీరు ఉప్పగా అయిపోయింది. ఎవరికీ ఉపయోగపడడం లేదు. నువ్వే మాకు శరణం’ అని.సాయి చిరునవ్వు నవ్వుతూ ‘చెడు పనులకి విఘ్నాలు కలగనే కలగవు. మంచి పనులకే విఘ్నాల మీద విఘ్నాలొస్తూ ఉంటాయి. (‘శ్రేయాంసి బహు విఘ్నాని’ అని శ్రీమద్‌ రామాయణంలోని మాట ఇదే అర్థాన్నిస్తుంది) అందుకని ఆలస్యం చేయకూడదు మంచిపని విషయంలో. రండి! అంటూ సాయి ఉప్పు నీరు ఉన్న నూతి దగ్గరికి వెళ్లి దగ్గర్లో ఉన్న చెట్లపూలని స్వయంగా తానే కోసి లోపల ఏదో ధ్యానం చేసి నూతి చుట్టూ తిరుగుతూ కొన్ని పుష్పాలని తాను నూతిలో వేసాడు. ‘ఇక వెళ్దాం!’ అన్నట్టుగా తాను ద్వారకామాయి వైపు నడిచాడు. ఆశ్చర్యం మరురోజునుండే ఎందరో నీళ్లు తోడుకోవడం కన్పించిందక్కడ! నీళ్లన్నీ ఉప్పదనాన్ని కోల్పోయి రుచికరంగా తాగవీలైన తీరులో ఉన్నాయి పరిశీలించి చూస్తే. అప్పుడర్థమైంది షిర్డీ ప్రజలకి. గంగానది మన పక్కనే ప్రవహిస్తూ ఉంటే పొరుగూరి చెరువుకి నీళ్లకోసం వెళ్తున్నామా? అనీ మలయపర్వత వాయువు ఇక్కడే వీస్తుంటే విసనకర్రల్ని కొనుక్కుని వీచుకుంటున్నామా? అనీను!

       షిర్డీలో భక్తులు ఉరుసు ఉత్సవం రోజునే శ్రీరామనవమి ఉత్సవాన్ని జరుపదలిస్తే అడుగడుగునా వచ్చిన అడ్డంకుల్ని సాయి తొలగించడంతో ఆ ఉత్సవాన్ని ఎలా జరుపుకున్నారో రేపు చూద్దాం

బాబా చెప్పిన మాటలు వింటే ఆశ్చర్య పోతారు .

బాబా చెప్పిన మాటలు కంటే ముందు మనం బాబా లో ఉన్న అద్భుతమైన, గొప్పావైన లక్షణాలు కోసం మరో సారి గుర్తు చేసుకుందాం 

కీర్తి :- మానవ అవతారంలో ఉన్న దైవం బాబా అలాగే మనందరికీ ఆదర్శ ప్రాయంగా ఉంటూనే తను నిజమైన దైవం అని మనకు అర్ధం అయ్యేలా ఉంటుంది సాయి నడవడిక బాబా ఎన్నడూ కీర్తి ప్రతిష్టలు సంపాదించాలి అనుకోలేదు కేవలం బాబా తన భాద్యతలు కోసం అంటే భక్తులకోసమే పాటుపడేవారు .

అభిమానం :- సామాన్యమైన మానవుడు అభిమానాన్ని ఊపిరిగా జీవిస్తూ తన వద్ద ఉన్న దానిని చూసి గర్విస్తూ ఉంటారు కానీ బాబా మహాసమాధి చెందే వరకు భిక్షాటన చేస్తూనే ఉన్నారు ప్రజల పాపాలను తాను స్వీకరిస్తూనే ఉన్నారు ఇప్పటికి మన భారం ఆయనే మోస్తున్నారు మరి అభిమానం అనే భావన బాబా కి ఉంటే షిరిడీలో అందరి ఇళ్ల నుండి భిక్ష ఎలా ఎత్తె వారు ??

జ్ఞానం :- మనం బాబా హారతులలో పాడి నట్లు “హారతి జ్ఞాన రాజా ” అని ఓ చోట వస్తుంది అంటే జ్ఞానానికి రాజు సాయి అని .

ఇంక దాని కోసం ఎలా వర్ణించగలం ???

మహిమ :- బాబా కు ఉన్న మహిమలు అన్ని ఇన్ని కాదు బాబా ఎన్నడూ బహిరంగంగా మహిమలు చూపించలేదు

 ఉదాహరణకు :-

దీపాలు వెలిగించే  టప్పుడు అందరిని పిలిచి చూపించలేదు ప్రజలు తెలుసుకుని వచ్చి చూసారు అంతే

చెక్క బల్ల పై పడుకోవడం కూడా అంతే ప్రజలలో ఉత్సహం పెరగకూడదు అని చెక్క బల్లను కూడా విరిచేశారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి 

బాబా స్థానంలో మరెవ్వరూ ఉన్నా ఆ శక్తులను ఇంత చక్కగా వినియోగించగలరు ( నిస్వార్థంగా ) అని చెప్పలేం.

ఔదార్యం :-  బాబా విశాలమైన హృదయం కోసం ఏమని చెప్పగలం మన పాపాలను స్వీకరిస్తున్నారు,కొరినవన్ని ఇస్తున్నారు,ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నారు,కర్మల నుండి రక్షిస్తున్నారు ఏ దైవం చెయ్యలేని పని భవిష్యత్తు లో వచ్చే ఉపద్రవాలను తన శక్తిని అంతా దారపోసి మరీ మనందరికి రక్షిస్తున్నారు.

అమ్మ మీరు ఎప్పుడు అడిగే వారు బాబా అంటే మీకు ఎందుకు ఇష్టం అని తెలిసినా బయటకు ఇన్నాళ్లు వ్యక్త పరచ లేకపోయాం ఇప్పుడు మీ సన్మార్గంలో నడుస్తూ మీరు చెప్పేవి వింటూ నా భావనను వ్యక్తపరుస్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను అమ్మ బాబా లో ఉన్న ఔదార్యం, బాబా తియ్యటి  మాటలు,నడవడిక,నిరాడంబరత,మనపై చూపించే ప్రేమ , వచ్చిన భక్తుడు లో ఉన్న లోపాలను ద్వేషించకుండా వారిని చక్కగా మార్చగలిగే చాకచక్యం ఇవే కారణాలు అమ్మ  బాబాని నెను ఇష్టపడటానికి .

ఇక సత్చరిత్రలో హేమాండ్ పంతుకు బాబా  స్వయంగా చెప్పిన విషయాలు లోకి వెళదాం

ఒకానొక సందర్భంలో బాబా భక్తులను ఉద్దేశించి  చెప్పిన మాటలు ఇవి చదివిన ప్రతిసారి ఎందుకో చాలా బాధ కలిగేది నాకు 

బానిసలకు బానిస నగు నేను మీకు ఋణ గ్రస్తుడను  నిజమే బాబా ఎప్పుడు మన రక్షణ కోసం అహర్నిశలు శ్రమించేవారు కనుక బాబా అలా అన్నారు.

నీ దర్శనముచే నేను తృప్తుడనైతిని ఇది కూడా సత్యమే ఎందుకు అంటే బాబా సాయి నిలయంలో ఎప్పుడు ఒక్కటే కోరుకునే వారు ఒక్క హారతికి రమ్మని మాత్రమే మనదరిని కోరుకుంటున్నారు అలా వెళ్లడం వల్ల మనం బాబా ని చూసి ఎంత తృప్తి చెందుతున్నామో మనకు తెలుసు అలాగే బాబా పై ప్రేమతో దర్శనానికి వెళ్లిన మనల్ని చూసి బాబా కూడా అంతే తృప్తి చెందు తున్నారు .

నీ అశుద్ధములో నేనొక పురుగుని ఆ కారణం చేత నేను ధన్యుడను అని అన్నారు  చాలా సామాన్య మైన జీవులం మనం బాబా పలికిన పలుకులు ఎవ్వరైనా పలుకగలరా అంత నిరాడంబర , నిస్వార్థ మైన దైవం గురువు మనకు లభించారు .   నీ అశుద్ధములో నేనో పురుగు అని అనడంలో బాబా ఉద్దేశ్యం ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జీవుల యందు బాబా ఉన్నారు అని నమ్మిన వారికి మాత్రమే ఆ మాటకు అర్థం  అర్ధమవుతుంది అంటే ఆ పురుగులో కూడా తానే ఉన్నాడు అని  మనం బాబా ని ప్రేమిస్తూ ,సేవిస్తూ జీవనం గడుపుతున్నాము బాబా నే సర్వస్వం అని నమ్ముతున్నాము అటువంటప్పుడు బాబా మన పుట్టక నుండి మరణం వరకు మనతోనే మనలోనే ఉన్నారు కదా అటువంటప్పుడు బాబా మాటలలో అర్ధం ఏమిటో అర్థం చేసుకోవడం చాలా సులువే కదా

అల్లాహ్‌ రామ్‌ ఔర్‌ కృష్ణ్‌ ఏక్‌ హై!

     ఎన్నిసార్లు కృతజ్ఞతానమస్కారాలని సాయికి సమర్పించినా, ఎన్నిమార్లు హృదయం నిండుగా ఆయనకి మన ఆనందాన్ని అర్పించినా, ఇంకా మనం ఋణపడే ఉంటాం సాయికి. కారణం ఆయన మనకి చూపిన తోవ, దాంతోపాటు నడవవలసిన ఆ మార్గంలో మనం తడబడుతున్న వేళ చేతిని పట్టి నడిపించిన తీరూను. షిర్డీలో గోపాలరావు గుండ్‌ ఇతర భక్తులు కలిసి ఉరుసు ఉత్సవం రోజునే శ్రీరామనవమి ఉత్సవాన్ని జరుపదలిస్తే అడుగడుగునా వచ్చిన అడ్డంకుల్ని సాయి తొలగించాడనుకున్నాం కదా! ఈ సందర్భంలో గోపాలరావు గుండ్‌కి మిత్రుడైన కేస్కర్‌(అన్నాకేస్కర్‌) మరో శుభవార్తని తెచ్చాడు. కేస్కర్‌కి వివాహమైంది. సంతానం కలగలేదు. గోపాలరావు గుండ్‌ లాగానే భార్య ప్రోత్సాహం, అనుమతి మీద మరో వివాహాన్ని చేసుకున్నాడు. అయినా సంతానం కలుగలేదు. గోపాలరావు గుండ్‌ అనుభవాన్ని, ఇతరభక్తులకి సాయి చూపిన లీలల్ని విని సంపూర్ణమైన భక్తితో తన భార్యలిద్దరితో సాయిని దర్శించి, తన ఆవేదనని సాయికి, ఆయన కన్నుల్లోకి కళ్లు పెట్టి చూస్తూ విన్నవించుకున్నాడు. సాయి కన్నులు ఆకర్షణ గనులు, అమృతకలశాలు కాబట్టి చాలా కొద్దికాలంలోనే కేస్కర్‌కి సంతానం కలిగింది. ఆ ఆనందానికి అవధుల్లేని కేస్కర్‌.. గోపాలరావు గుండ్‌ చేస్తున్న ఉత్సవంలో తనవంతుగా ‘ఏం చేయమంటావ్‌’ అని అడిగాడు. ‘అయితే ఉరుసు ఉత్సవానికి ఓ జెండాని మహమ్మదీయ పూజా చిహ్నంగా తేవలసింది’ అన్నాడు గుండ్‌. ఈ విషయం తెలిసిన వెంటనే ‘నిమోల్కర్‌’ అనే పేరున్న మరో భక్తుడు తానూ ఒక జెండాని తెస్తానని చెప్పాడు.

     భగవంతుడు ప్రతివ్యక్తికీ చేతుల్ని ఇస్తూ ఒక్కో చేతికీ ఐదేసి చొప్పున వేళ్లుండేలా చేశాడు. ఏమిటి దీని అర్థం? చేతికున్న వేళ్లలో ఏ ఒక్కటీ మరొకదానితో బలంలో పొడవులో సమానం కానే కావు. అయినా ఐకమత్యంతోనే ఉంటాయి. అన్నీ కూడ మణికట్టు ఆజ్ఞకి లోబడే ఉంటాయి. ఆ చేతికి ఈ మణికట్టు తగిలించబడి ఉంటుంది కాబట్టి చేతిని బట్టి నడుస్తూ ఉంటుంది. సంఘంలో ఉన్న మనం కూడా అంతే. ఆర్థికంగానూ, కుటుంబపరంగానూ, ఉద్యోగపరంగానూ ఇలా అనేకవిధాలుగా మనం ఎన్నెన్నో తీరులుగా ఉంటున్నప్పటికీ ఒకే ధర్మమనే సూత్రానికి కట్టుబడి ఉండాలనే విషయాన్ని అర్థం చేసుకోగలగాలి ఈ మణికట్టు వేళ్ల అమరిక ద్వారా. ఎప్పుడైతే గుండ్‌ ప్రారంభించదలిచాడో.. దానికి పాటిల్‌ ద్వయం, మాధవరావులు సహక రించారో.. దానికి షిర్డీ గ్రామవాసులంతా బలాన్నిచ్చారో.. ఈ మొత్తానికి తానూ సహకరిస్తానని కేస్కర్‌ చెప్పాడు. దీన్నంతా గమనిస్తే హృదయపూర్వకంగా చేయదలిచిన పనైతే అందరూ సహకరించేలా దైవం చేసి తీరుతాడని అర్థమవుతుంది. ప్రజలనందర్నీ వాళ్లతో పాటు ఋషుల్నీ, దేవతల్నీ కూడా బాధిస్తున్న రావణవధ కోసం కేవలం రాముడు మాత్రమే ప్రయత్నించలేదు. వానరాలనీ, జటాయుపక్షినీ, జాంబవంతుడ్నీ.. ఇలా ఆయన సమీకరించుకోలేదు. ధర్మమనేది రామునివైపు ఉన్న కారణంగా రామునికే వీరందరూ ఎవరికివారు ఎదురెళ్లి సహాయం చేస్తామని ప్రార్థించి సహాయకులుగా చేరారు. అదే తీరుగా సాయి ఎప్పుడూ షిర్డీలో ఉత్సవం చేయవలసిందని కోరలేదు. ఎవరి ద్వారానూ చెప్పించలేదు. ఇది గొప్పదనమంటే!

రామభజనలతో జెండాలా?

     ఉరుసు పండుగ చేయాల్సిన రోజురానే వచ్చింది. నడబావి నిండుగా నీరుంది. ఎందరు తాగినా తరగని నీటితో కన్పించింది. సాయి తన చేత్తో పువ్వుల్ని వేయకముందు ఉప్పునీటిబావిగా పేరుపడ్డ నేటి ఆ మంచినీటిబావిని చూసి నీరు తాగి ఆశ్చర్యపడనివారు లేరు. సాయికి మనసులో నమస్కరించని వారూ లేరు. ఉరుసు పండుగ అనేది నిజానికి మరణించిన మహమ్మదీయుల సమాధుల(దర్గాల) వద్ద వారికి నివాళ్లని భక్తిశ్రద్ధలతో అర్పించవలసిన పండుగే.  అయినా ఏ భేదం లేకుండా హిందువులు మహమ్మదీయుల జెండాలని చేత్తో పట్టుకుని రామభజనని ప్రారంభిస్తూ షిర్డీ గ్రామమంతటా తిరుగసాగారు. హిందువులంతా మహమ్మదీయ జెండాతో ముందు నడిచారు. మహమ్మదీయులంతా రామభజనలని చేస్తూ ఆ వెనుక నడిచారు. వీరి వెనుక కేస్కర్‌ తెచ్చిన జెండాతో హిందువులు, ‘నిమోల్కర్‌’ అనే ఆయన తెచ్చిన జెండాతో హిందువులు ఊరేగింపులో కలిశారు. సాయి ఎప్పుడూ ఉండే మసీదు(ద్వారకామాయి) వద్దకి ఊరేగింపు రాగానే ఆ రెండు జెండాల్లో ఒకదాన్ని హిందువులు ద్వారకామాయి భవనానికి ఒకవైపునా, మహమ్మదీయులు ఆ రెండోజెండాని మరొకవైపునా పెట్టారు. ఇప్పటికీ ద్వారకామాయికి కన్పించే ఆ రెండు జెండాలూ హిందు – మహమ్మదీయ సమైక్యానికీ, వీటి స్థాపన జరిగిన ప్రాచీన కాలానికీ సంకేతంగా నిలుస్తాయి. సాధారణంగా మనుష్యులు మాట్లాడటం వరకే పరిమితమవుతూ అన్నిమతాలు ఒకటే అనడాన్ని వింటుంటాం. ఇక్కడ ప్రత్యక్షంగా దర్శిస్తాం నేటికీ.

హిందూ మహమ్మదీయ సమైక్యం

     సాధారణంగా ఇలాంటి సున్నితమైన అంశాలకి సంబంధించిన సంఘటనలు,  హిందువుల ఊరేగింపులో మహమ్మదీయులు పాల్గోవడం, అలాగే మహమ్మదీయుల ఊరేగింపులో హిందువులు పాల్గోవడం వంటివి అరుదు. నడిపించేవారిని బట్టి నడిచేవారుంటారన్నట్లుగా.. సాయి నడిపించేవాడు కావడం వల్ల ఇలా జరిగింది. షిర్డీ వెళ్లినప్పుడు కేవలం సాయిని చూసేసి వచ్చేయడం కాకుండా ఈ జెండాలు ద్వారకామాయికి అటూ ఇటూ ఉండటాన్ని గమనించి వాటి వెనుక చరిత్రని చెప్పుకుంటూ ఉంటే చరిత్ర నిలిచిపోతుంది. ఇలా నెమరేసుకోవడం వల్ల పరస్పర మత సమైక్యభావం పెరుగుతుంది కూడా. కనీసం ఏ ఒక్క చిన్న వ్యతిరేక సంఘటన కూడా మచ్చుకి లేకపోవడాన్ని గమనించాలి. ఇంటికొక రక్షకభటుడ్ని నిలిపినా రాని శాంతి, సామరస్యమనేవి ఆధ్యాత్మికతతోనే సాధ్యమవుతాయని గ్రహించాలి. అందుకని దైవ దూషణ, దైవ వ్యతిరేకతని పరిపాలకులు ప్రోత్సహించ కూడదన్నమాట! సరే!

     ఈ ఊరేగింపులని చూస్తున్న ఉత్సాహంతో స్ఫూర్తితో దలాల్‌ (అమీర్‌ షక్కర్‌ దలాల్‌) అనే సాయిభక్తుడు ఒక ప్రకటనని చేస్తూ, తాను ఇదే ఊరేగింపు రోజున చందనోత్సవాన్ని చేస్తానన్నాడు. ఫకీరులుగా (హిందూధర్మంలో సన్యాసులు, మఠాధిపతులు, పీఠాధిపతులు లాగా) జీవించిన మహమ్మదీయుల్ని గౌరవించడానికి గుర్తుగా మహమ్మదీయులు పెద్ద చందనపు ముద్దని, ఒక పెద్ద వెండి పళ్లెంలో పెట్టి దాన్ని తలమీద పెట్టుకుని సాంబ్రాణి ధూపాలతో ఇతర పరిమళద్రవ్యాలని వెదజల్లుతూ బాజాభజంత్రీలతో చేసే ఓ ఉత్సవం అది. ఆ ఊరేగింపు మొత్తం ఊరంతా సాగి మసీదు దగ్గరకొచ్చాక, మహమ్మదీయసంప్రదాయం ప్రకారం మసీదులోకి తెచ్చి, ఆ మసీదులో ఉండే గూడు (నింబారు) లోపలా, అలాగే మసీదు గోడలలోపలా ఆ చందనాన్ని పూస్తారు. దాంతో మసీదంతా సువాసనలతో ఘుమఘమలాడుతూ ఉంటుంది. ఇలా చందనాన్ని నిజానికి మహమ్మదీయులు మాత్రమే పూయాల్సి ఉంటుంది వారి సంప్రదాయం ప్రకారం. అయితే దలాల్‌ మాత్రం హిందువులకు కూడా అవకాశం ఉంటుందని ఆ ఊరేగింపులోనే ప్రకటించాడు. సాయి ఉండే మసీదు హిందువులకి ద్వారక, మహమ్మదీయులకి మక్కా. సాయి ఆ  మహమ్మదీయులందరికీ ‘అల్లా’. హిందువులందరికీ ఇష్టదైవమైన రాముడు. ఇటు నుండి గంగా, అటు నుండి యమున వచ్చి ప్రయాగలో కలిసినట్లు హిందూమహమ్మదీయ సంగమమైన ఆ షిర్డీ ఓ దివ్యధామం అన్పించింది చూసే అందరికీ.

మరో ఉత్సవం కూడా!

     హిందూ – మహమ్మదీయ ఐక్యంతో  1897 నుండి 1912 వరకూ అంటే 15 సంవత్సరాల పాటు ఏ విధమైన మార్పు లేకుండా ఈ ఉత్సవాలు సాగుతూనే వచ్చాయి షిర్డీలో. ఈ క్రమంలో మరో రెండు జెండాలు సశాస్త్రీయంగా అంటే మేళతాళాలతో ప్రతిసంవత్సరం ఊరేగించి మసీదు శిఖరానికి కడతారు. అవి గాలికి రెపరెపలాడుతూ ఇప్పటికీ ఎగురుతూ కన్పిస్తాయి. ఇది ఇలా జరుగుతుంటే ‘సాయినాథ సగుణోపాసన’ అనే సాయిని గురించిన  గ్రంథాన్ని రచించిన భీష్మ (కృష్ణారావు జాగేశ్వర భీష్మ) అనే ఆయన ఈ ఉత్సవాన్ని చూడ్డం కోసం 1912లో వచ్చాడు. ఒక సమయంలో ‘కాకా’ (కాకామహాజని అనే పేరున్న లక్ష్మణరావు) అనే ఆయన పూజాద్రవ్యాలతో మసీదుకి వెళ్తూ కన్పించాడు. దాంతో భీష్మ ఆ కాకాని పిలిచి ‘ఎలాగూ ఉరుసు – శ్రీరామనవమీ సాగుతూనే ఉన్నాయి కాబట్టి వీటితో పాటు శ్రీరామజన్మదినోత్సవాన్ని కూడా జరుపుకుంటే మరింత బాగుంటుందేమో కదా! ఆ ఖర్చు ఏదైనా ఉంటే భరించడానికి నేను సిద్ధం’ అన్నాడు.వెంటనే కాకా.. ‘భీష్మా! ఏ పనినైనా మన ఆలోచనకి అనుగుణంగా మనం ప్రారంభించడం సరికాదు. అలా లోగడ ప్రారంభించాక అడ్డంకి వచ్చి, మళ్లీ సాయి ద్వారా సమస్యలు  పరిష్కరింపబడ  సాగాయి కొన్ని ఇక్కడ. అందుకని సాయికి విన్నవించుకుని ఆయన అనుమతిస్తే ముందుకెళ్దాం’ అని అన్నాడు. ఇది భక్తులందరికీ ఓ సూచన లాంటిది. ఏ పనిని చేయబోయినా సాయికి ముందుగా విన్నవించుకుంటే సాగనిదీ, ఆగిపోయేదీ ఉండనే ఉండదు. అలా ఏదో కారణాల వల్ల కాని పక్షంలో అడ్డంకి వస్తుంది. సాయికి విన్నవించుకుంటే పని సరైన తీరులో ముగిసి తీరుతుంది. సాయి ఏం చేస్తాడని వ్యతిరేకించి, విరోధించి పని చేయబోతే లోగడ కులకర్ణి (కరణం) లాగా నవ్వుల పాలు అయి తీరుతారు. ఇది భక్తుల్లో ఎందరికో జరిగే అనుభవం. దాంతో కాకా, భీష్మ ఇద్దరూ శ్రీరామజన్మదినోత్సవాన్ని చేయడానికి ఏం కావాలో, ఎవరెవరు అవసరమో.. ఆ తీరుగా మొత్తం ఆ జాబితాని సిద్ధపరిచారు ముందుగా. శ్రీరామజన్మదినోత్సవం నాడు రాముణ్ణి గురించిన కీర్తనలని గొంతెత్తి పాడటం అక్కడి వారి సంప్రదాయం. దానికి తోడుగా హార్మోనియం వాయిద్యాన్నే వాడటం అక్కడి రివాజు. ఆనందంగా కీర్తనలు వాయిద్య ధ్వనీ సాగాక పాల్గొన్న అందరికీ ప్రసాదాన్ని పంచాల్సి ఉంటుంది. ఇదీ ప్రణాళిక.

     మంచిపని చేయబోతే, అది కూడా హృదయపూర్వకంగా చేయదలిస్తే అది ఖచ్చితంగా అవుతుంది. అంతేకాక ఏ పనినైనా సాయి సామ్రాజ్యమైన షిర్డీలో సంకల్పిస్తే అసాధ్యమంటూ ఉండదు. ఇది అక్కడి భక్తుల సంపూర్ణ అనుభవం. ఆ కారణంగా ‘కీర్తన’లనగానే తానే ఆలపిస్తానన్నాడు భీష్మ. ‘కీర్తనలెక్కడ దొరుకుతాయి’ అనుకుంటూండగానే రామాఖ్యానమనే కీర్తనలగ్రంథం ఉందని ఆయనే బదులిచ్చాడు. సరే! మరి ‘హార్మోనియం ఎక్కడా? వాయించే వ్యక్తి ఎక్కడా?’ అంటూండగానే కాకా..  ‘తన వద్ద హార్మోనియం ఉందనీ.. వాయించడం తనకి వచ్చు’ అని అన్నాడు. మరి ప్రసాదాల విషయం అనగానే అమిత సాయి భక్తురాలైన రాధా కృష్ణమాయి తానుండగా మరొకరి ఆలోచనే వద్దంది. ‘ఇంక శ్రీరామజన్మదినోత్సవానికి ఏం కావల్సి ఉంది’ అని భీష్మ అనగానే ‘సాయి అనుమతి మాత్రమే’ అన్నాడు కాకా. ఇలాంటి చరిత్రలని చదివినా, చదివించినా, విన్నా, వినిపించినా ‘మనకంటూ అన్ని పరికరాలు సిద్ధంగా ఉన్నా, చేయగలశక్తి కూడ ఉన్నా తప్పనిసరిగా పరమేశ్వరుని అనుమతి అవసరము!’ అన్న ఆలోచన దృఢంగా వస్తుంది ఎవరికైనా. లేని పక్షంలో అన్నింటినీ తానే చేసుకోగలననే అహంకారంతో పాటు ఏదైనా కాలగమనంలో సమస్యగాని వస్తే తనకి దిక్కెవరూ లేరనే నిరాశానిస్పృహలతో జీవితం మీద విరక్తి కలిగి తనువు చాలించాలనేంత స్థితి కలగొచ్చు. నేటి కాలపు ఆత్మహత్యలకి కొంత కారణం ఇదే. అదే మరి దైవాన్ని అనుమతి అడిగి దాన్ని పొందినట్లైతే కష్టకాలంలో ఆయన్ని సేవించి తరించగలమనే ధైర్యం మనకి అండగా నిలబడుతుంది. మనల్ని నిలబెడుతుంది.సాయి వద్దకి వీరందరూ వెళ్లగానే సాయి తనంత తానుగా.. ‘ఏం చర్చ జరుగుతోంది వాడలో?’ అని అడిగాడు. సాయి సర్వజ్ఞుడు కదా! మొత్తం జరిగిన కథని చెప్పగానే సాయి ఊదీ(విభూతి) ఇచ్చి (అంగీకారం అయినట్లయితే ఇచ్చేది ఊదీనే) ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వచన వార్త షిర్డీ అంతా పాకిపోయింది. ఊరంతా పండుగ వాతావరణంతో ఆనందమయమైంది. శ్రీరామజన్మదినోత్సవం కదా! అనే ఉద్దేశంతో ప్రసాదాలని సిద్ధం చేసే బాధ్యతని తలకెత్తుకున్న రాధాకృష్ణమాయి.. సాయి ఆసనానికి ముందు ఊయల ఒకటి వేలాడదీసింది. సాయి మసీదుకొచ్చి ‘ఊయల ఏమిటి?’ అని అడిగాడు. సాయి చెప్పని ఊయలని కట్టడమనే పనిని చేయడం తప్పేమో? అనుకుంటూ ఉండగానే, సాయి మసీదులోని గూడు (భగవంతుని నివాసస్థానం – రూపంలేని స్వరూపం అని మహమ్మదీయుల విశ్వాసం) నుంచి (నింబారు అంటారుఈ గూటినే) రెండు పూలమాలల్ని తెప్పించి ఒక పూలమాలని కీర్తనలు పాడటానికి సిద్ధంగా ఉన్న కాకా మెడలో వేయవలసిందని ఆజ్ఞ చేశాడు.‘శ్రీరామచంద్రమూర్తికీ జై’ అనే నినాదాలు మిన్నుముట్టాయి. బాజాభజంత్రీల ధ్వనులు కోలాహలంగా విన్పించసాగాయి. ఆ ధ్వనులు సద్దు మణిగాక భీష్మ అమోఘ కంఠధ్వని కీర్తనలనాలపించసాగింది. కాకా హార్మోనియం వాయిద్యశ్రుతిని జత చేసింది.

సాయి కోపం – లో భావం

     ఇంత కోలాహలంగా ఉత్సవం అనుకున్నదానికంటే అద్భుతంగా సాగుతుంటే భక్తులంతా గులాం చల్లుకోసాగారు ఆనంద పారవశ్యంతో. ఇంతలో పెద్ద గర్జనలాంటి ధ్వని విన్పించింది. సాయి తీవ్రకోపంతో ఊగిపోతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడసాగాడు. సాయి భక్తులకిది అలవాటులో ఉన్నవిషయమే. ఏదైనా నూతన కార్యక్రమమంటూ భక్తులు ప్రారంభిస్తే ఈ సాయి గర్జన వారికి తప్పదు. అందుకే అందరూ మౌనంగా ఉండిపోయారు. రాధాకృష్ణమాయి మాత్రం సాయి ఆసనం ముందున్న ఊయలని విప్పి తీసుకు రావలసిందని వణికిపోతూ కాకాకి చెప్పింది. కాకా అలా విప్పబోతుంటే సాయి వారించి.. ‘శ్రీరామనవమి – రామజన్మదినోత్సవం జరిగిన మరుసటి రోజున గోపాలకృష్ణుడి జన్మదినోత్సవాన్ని కూడా చేయాలి. విప్పకండి ఊయలని’ అన్నాడు. భక్తులంతా భయాన్ని వీడి ఆనందంతో నృత్యం చేశారు. గులాం పొడి బాబా కళ్లలో పడి ఆయన ఆ బాధతో తిట్టినట్లుగా అందరూ భావించారు. అయితే  లో – రహస్యం  అది మాత్రం కాదు. ఏదైనా ఓ కొత్త కార్యక్రమాన్ని శుభకార్యక్రమంగా ప్రారంభిస్తున్నప్పుడు అందరి దృష్టి ఒకేలా ఉండదు కాబట్టి, ఏదైనా విఘ్నమో, పొరపాటో, నష్టమో, అవమానమో జరిగితే బాగుండుననే ఆలోచనతో ఉంటారు కొందరు. ఆ కళ్ల దృష్టిదోషం(దిష్టి) పోవాలంటే ఇలా జరగడం, జరపడం మంచిది. అందుకే సాయి అలా ప్రవర్తిస్తాడు తప్ప ఉచితానుచితాలు తెలియనివాడు కాదు. (రావణ వధ అయ్యాక లంకాజనుల ఆగ్రహంగా భావించారు కొందరు.) మరునాడు గోపాలక ఉత్సవం జరిగింది. ‘కాలాహండి’ (ఉట్టిగొట్టడం) అనే ఉత్సవంలో నల్లనికుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారం, మిఠాయిలు కలిపి ఉంచుతారు. వినోదం చేస్తూ దాన్ని పగలగొట్టి ఆ అటుకులని, మిఠాయిల్నీ భక్తులకి పంచి పెడతారు. గోపబాలకులకి కృష్ణుడు ఎలా తినుబండారాలని పెట్టేవాడో ఆ దృశ్యాన్ని తలపింపజేసే ఘట్టం ఇదన్నమాట! ఉరుసు – శ్రీరామనవమి – శ్రీరామ జన్మదినోత్సవం – చందనోత్సవం – గోపాలకోత్సవం… ఇలా ఇన్నింటిని అరమరికలు లేకుండా నిర్వహించిన సాయిని ఏమనాలి? ఎవరనాలి?

ఇక రేపు బాబా యోగశక్తులని గురించి తెలుసుకుందాం!

Q బాబా కి సంభందించిన సాంప్రదాయాలలో ముఖ్య మైన మరో 3 విషయాలు కోసం తెలుసుకుందాం

ధుని :-  ధుని అంటే ధున్ అనగా పాపాలను హరించేది అనిఅర్ధం 

బాబా ప్రతిరోజు అగ్నిహోత్రం చేసేవారు

బాబా వెలిగించిన ధుని యోగ శక్తితో వెలిగించినది ఆ నాటి నుండి ఈ నాటి వరకు నిరంతరం ధుని వెలుగు తూనే ఉంది బాబా శశీరులుగా ఉనప్పుడు మహాసమాధి చెందిన తర్వాత కూడా        

ఆ ధుని లొనే భక్తుల పాపాలను బూడిద గా చేస్తున్నారు అంతే కాదు మన పూర్వ కాలంలో పెద్డలు పొయ్య వెలిగించి  ముందు అగ్ని దేవుడికి సమిధలు సమర్పించిన తర్వాతే వంటను ప్రారంభించేవారు అగ్ని దేవుడిని ప్రార్ధించే వారు బాబా సంప్రదాయాలకు చాలా విలువని ఇచ్చేవారు ఆ ధుని నుండి వచ్చిన ఊదినే ప్రసాదంగాను , అదే మందుగాను ఇచ్చేవారు ధునిలో వేసే సమిధలకు కూడా ఓ పద్ధతి అంటూ ఉంటుంది నిర్ధేశించ బడిన  వస్తువులు మాత్రమే సమర్పించాలి బాబా ఎదో అగ్గిపెట్టెను ఇంకేదో వినియోగించి ధునిని వెలిగించలేదు యోగ శక్తితో వెలిగించినది కనుక దానిని రక్షించుకుందాం ఓ భక్తుడు ఎదో కోరుకొని మొక్కు చెల్లించు కోవడానికి నెయ్యి ని ఎక్కువ మొత్తం లో ధునిలో వేయడానికి ప్రయత్నించే సరికి అది ఎగిసిపడింది అప్పటినుంచి ధునిని కేవలం దర్శనార్థం మాత్రమే అవకాశం సంస్థాన్ వారు కల్పిస్తున్నారు .

దక్షిణ :- దీనికోసం మన అందరికి తెలుసు చిన్నగా చెప్పాలి అంటే మనం ఏదైనా వ్రతాలు , నోములు చేయించుకుంటాము బ్రాహ్మణులకు  దక్షిణ ఇస్తాము అలా దక్షిణ ఇవ్వకుండా ఏ కార్యం జరిపించుకున్నా దాని ఫలితం మనకు దక్కదు చేసిన వారికి మిగిలిపోతుంది అలాగే మనం శారీరకంగా శ్రమించి సంపాదించిన ధనం దానం రూపంలో కొంత వ్యయ పరిస్తేనే మన కర్మలు తొలగు తాయి అందుకే బాబా మన దగ్గర నుండి దక్షిణ అడిగి తీసుకుని మరీ మన కర్మలను బాబా స్వీకరిస్తున్నారు అంతే కాని బాబా కి ధనంతో ఎటువంటి అవసరం లేదు  ఇటువంటి దైవం ,గురువు లభించడం మన పూర్వ జన్మ సుకృతం . ధూళి దర్శనం :- చాలా మంది తెలియక ఈ ధూళి దర్శనం పేరుతో అశుభ్రంగా దైవ దర్శనాలు చేస్తుంటారు.షిరిడి ప్రయాణం అయ్యి వెళ్లేకా బాబా ని చూడాలి అనే ఆత్రంతో,పరితపిస్తూ  బండి దిగగానే సరాసరిగా దర్శనానికి వెళ్లాడాన్నే ధూళి దర్శనం అంటారు అది బాబా వరకు సమ్మతమే అంతే కాని అన్ని చోట్లా అన్ని దేవాలయాలకు కాదు అవకాశం ఉన్నత వరకు పరిశుభ్రంగా వెళ్లటమే శ్రేయస్కరం ముఖ్యంగా అమ్మవారి దేవాలయాలకు కొన్ని కష్టతరమైన చోట్ల అవకాశం దొరకనిచో అది భగవంతుడికి సమ్మతమే కానీ నా వరకు నా మనస్సు పవిత్రమగా ఉంది నేను ఎలా ఉన్నా పర్వాలేదు అని వాదనలు చెయ్యక కొన్ని చోట్ల కొన్ని నియమాలు ఉంటాయి కనుక వాటిని అనుసరించడం మంచిది               

సాయి యోగశక్తి

     షిర్డీ గ్రామంలో ఏ రోజుకారోజు సాయి స్వయంగా అందరు అంగడులవారి వద్దకి వెళ్లి, మసీదులో, మరికొన్ని ప్రదేశాల్లో దీపాలని వెలిగించవలసి ఉందని చెప్పి నూనెని అడగడం చేస్తుండేవాడు. అందరూ కూడా సాయి గొప్పదనాన్ని విని ఉండటం, చూస్తూ ఉండటం కారణంగా ఎవరూ కాదనకుండా యథాశక్తి నూనెని దీపాల నిమిత్తం ఇస్తూనే ఉండేవాళ్లు. అంతా సవ్యంగా జరిగిపోతూ ఉంటే చెప్పుకోవాల్సిందంటూ ఏముంటుంది? సాయి అంటే కిట్టనివాళ్లు కొందరు పగ అనే వత్తిని, ద్వేషమనే నూనెలో తడిపి, వ్యతిరేకత అనే దీపాన్ని వెలిగించారు అంగడిదారుల బుద్ధులందరిలో. అంతే! ఎవ్వరూ కూడా నూనెని సాయికి ఇవ్వరాదని తీర్మానించుకున్నారు. ‘అంతమంది భక్తులొస్తున్నారుగా!? అందరిలో ఎవరో ఒకరితోనో, లేదా అందరితోనో నూనెని ఏర్పాటు చేసుకోలేడా?’ అని కొందరు, ‘అయినా మసీదులో కిరసనాయిలతో వెలిగే లాంతర్లు ఉండగా, ఈ నూనె దీపాలని కూడా వెలిగించాల్సిన అవసరమేమిటి?’ అని ఇంకొందరు, ‘ఇదంతా కాదు. మసీదేమిటి? హిందూ ఆచారం ప్రకారం నూనె దీపాలు వెలిగించడమేంటి?’ అని మరికొందరు మాట్లాడుకోసాగారు. ఎవరికి తోచిన రీతిలో వాళ్లు అనుకుని, సాయికి నూనె ఇవ్వరాదని తీర్మానించుకున్నారు.

     ఎప్పటిలానే సాయి నూనె కోసం వస్తే, వ్యాపారస్థులంతా ముభావంగా ఉండటం, ముఖం తిప్పుకోవడం, అయిష్టంగా ఇవ్వదలచడం, రేపటిరోజున రండి అనడం వంటివేం చెయ్యలేదు. ముఖానే చెప్పారు ఇవ్వడం సాధ్యంకాదని. ఇలాంటి అకస్మాత్‌ వ్యతిరేకతకు సాయి ఏ మాత్రం దుఃఖపడలేదు. వ్యతిరేకత సామూహికమైనందుకు అశ్చర్యపడలేదు. తన మసీదుకి తిరిగొచ్చేశాడు. తన దగ్గరున్న డబ్బాలో అట్టడుగున ఉన్న నూనెలో నీటిని పోశాడు. కలియదిప్పాడు డబ్బాని. ఆ నూనె, నీరు కలిసిన మిశ్రమాన్ని తాగి ఊశాడు. ఆ మీదట నిండుగా నీటిని డబ్బాలో నింపాడు. ఆ నీటినే వత్తులు ఉన్న ప్రమిదల్లో నిండుగా పోశాడు. ఎవరికీ ఏం అర్థంకాని స్థితిలో నూనె దీపాలులాగానే వాటిని క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి చొప్పున వెలిగించసాగాడు. అలా వెలిగిన నీటి దీపాలు రాత్రి రాత్రంతా కాంతిని ఇస్తూనే, వెలుగుతూనే ఉండిపోయాయి. ఇది అందరూ చూస్తుండగా జరిగిన కథ కాదు, చరిత్ర.

విశ్వనిర్మాణ రహస్యం

     ఏదైనా ఒక వస్తువు మరమ్మతుకి గాని వస్తే దాన్ని బాగు చేయవలసిన వానికి, ఆ వస్తువుకి సంబంధించిన, మొత్తం నిర్మాణానికి సంబంధించిన అంత సమాచారం ఎలా తెలిసి ఉండాలో, అదే తీరుగా విశ్వంలో జరిగిన ఈ విచిత్రానికి సంబంధించిన నిజానిజాలు తెలియాలంటేనూ, దాన్ని వివరించి చెప్పాలంటేనూ ఆ విశ్వానికి సంబంధించిన నిర్మాణ రహస్యం తెలిసి ఉండి తీరాల్సిందే కదా! ఆ దృష్టితో చూస్తే పృధ్వి – అప్‌ – తేజస్‌ – వాయు – ఆకాశం అనే ఐదింటితో ఈ జగత్తు ఏర్పడింది కాబట్టే దీన్ని ‘ప్ర–పంచము’ (ఐదింటి సమాహారం) అన్నారు. ఇది బ్రహ్మ చేత నిర్మింపబడింది కాబట్టి, బ్రహ్మకి మాత్రమే దీన్ని సృష్టించే అధికారాన్ని ఇచ్చారు కాబట్టి దీన్ని బ్రహ్మా+అండము ‘బ్రహ్మా అనే దీర్ఘం చివర ఉంటే పురుషుడైన బ్రహ్మ’ అని అర్థం. అదే ‘బ్రహ్మ+అండము’ అన్నట్లయితే స్త్రీ పురుష భేదం లేని బ్రహ్మపదార్ధమనే అర్థం వస్తుంది. ఈ జగత్తుని సృష్టించగల అధికారాన్ని పురుషుడైన బ్రహ్మే పొందాడు కాబట్టి ‘బ్రహ్మా+అండము’ అనేదే సరైన పదవిభాగం. అలాంటి బ్రహ్మ చేత సృష్టించబడిన ‘అండం’ ( స్త్రీయో, పురుషుడో తెలియని స్థితిలో ఉండే ముద్ద – ప్రాణియో, అప్రాణియో తెలియని స్థితిలో ఉండే ముద్ద) కాబట్టి దీన్ని బ్రహ్మాండము అన్నారు.

     ఈ బ్రహ్మాండమే జగత్తంతా. దీనికి సరైన పోలికతో ఉండేది మనం. మనందరం తల్లి గర్భంలో ఉన్న పిండం నుంచి పుట్టాం కాబట్టి మనం ‘పిండాండం’ నుంచి పుట్టినవాళ్లం. బ్రహ్మాండానికి ఎలా పంచభూతాలు సహకరించాయో అలాగే పిండాండానికి కూడా పంచభూతాలు సహకరించి ఉన్నాయి. అంటే బ్రహ్మాండంలో ఉన్న పంచభూతాలు, పిండాండంలో కూడా ఉండనే ఉన్నాయన్నమాట! బ్రహ్మాండంలోని ‘పృథ్వి’ మనకి కన్పించే నేల. పిండాండం అంటే మనలో పృథ్వి మన శరీరంలో ఉన్న మాంసం, మజ్జ అనేవి. బ్రహ్మాండంలోని ‘అప్‌’ మనకి కన్పించే నదులు, సముద్రాలు అన్నీను. పిండాండం అంటే మనలో ‘అప్‌’ మన శరీరంలోన ఉన్న నీరు. రక్తంలో ఎక్కువశాతం నీరే. బ్రహ్మాండంలోని ‘తేజస్‌’ (వేడిమి) మనకి కన్పించే సూర్యుని ఉష్ణత. పిండాండంలో కన్పించే ‘తేజస్‌’ మన శరీరంలో ఎప్పుడూ ఒకేలా ఉండే 98.4 డిగ్రీల వేడిమి. బ్రహ్మాండంలోని ‘వాయువు’ మనకి అనుభవంతో కన్పించే వాయువు. పిండాండంలో అంటే మన శరీరంలో (5+5) దశవిధాలైన వాయువులు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన మొదలైనవి ఉన్నాయి.

     బ్రహ్మాండంలోని ‘ఆకాశం’ మనకి కన్పిస్తున్నట్లుగా ఉంటూ ఎంత దూరం వెళ్లినా కన్పించని శూన్యమైన పదార్థం. ఇక పిండాండంలో ఉండే ఆకాశమంటే అనుభవంలో కన్పిస్తూ ఎవరూ చూడడానికి అవకాశం లేని మనస్సు. ఇలా బ్రహ్మాండ – పిండాండాలు అనే రెండూ పరస్పరం సమానంగా ఉంటూ రెంటి స్వభావం, స్వరూపం ఒకటే అయినా ఆ రెండూ వేర్వేరుగానే ఉంటాయి. ఒకటిగా ఉండలేవు. ఉండవు. ఇదంతా ఎందుకంటే ఈ పంచభూతాలు పైకి వేర్వేరుగా కన్పిస్తున్నా అన్నీ ఆకాశం నుంచి వచ్చాయని చెప్పడానికి. తద్వారా నీటిని గురించిన, అలాగే అగ్నిని గురించిన తత్వాన్ని తెలుసుకుని నీటిలో అగ్నితనం ఎలా ఉంటుందో నిరూపించడానికీను. ఆకాశాద్వాయుః – ఆకాశం నుండి వాయువు పుట్టింది. ‘గాలి బిగదీసింది’ అంటూ ఉంటాం. అంటే ఆకాశం ఆ సమయంలో తన శూన్య ప్రదేశం నుండి వాయువుని విడుదల చేయడం లేదని అర్థమన్నమాట. అంతే కాక వాయువెప్పుడూ శూన్యం నుండే వస్తుందని కూడా భావమన్నమాట. వాయో రగ్నిః – ఇలా వచ్చిన వాయువు నుండే అగ్ని పుట్టిందని దీనర్థం.

     ఇదేమిటి? ఎక్కడైనా నిప్పుంటే ఆ సమయంలో గాలి బలంగా వీస్తే నిప్పు ఆరిపోతుందిగా!? అని అనుకుంటాం మనం. నిప్పు ఆరిపోవాలన్నా, బాగా రాజుకుని నిప్పు మరింతగా పెరిగి, తన ప్రతాపాన్ని చూపాలన్నా వాయువు వీచినప్పుడే అని అనుకోం. దానికి కారణం సాధారణమైన దృష్టితో ఆలోచించడమే. లో–దృష్టితో పరిశీలించకపోవడమే!!అగ్నే రాపః – ఆ అగ్ని నుంచి నీరు పుట్టిందని దీనర్థం. ఇదేమిటి? ఇది మరీ వింతగా ఉంది! అనిపిస్తుంది. అగ్ని అనేది నీటిని వేడి చేస్తుంది. అలాగే నీరు అనేది నిప్పుని ఆర్పుతుంది. అంతేతప్ప అగ్ని నుండి నీరు పుట్టడమేమిటి? అన్పిస్తుంది. దీనికి కూడా కారణం సాధారణ దృష్టితో మాత్రమే చూడడం. లో–దృష్టి పెట్టాలనే ఆలోచన కూడా లేకుండా ఉండడమూనూ. అబ్‌భ్యః – పృధ్వి అలాంటి నీటి నుండి నేల పుట్టిందని దీనర్థం. ఎక్కడైనా నేల అనేది కణాలు కణాలుగా ఉంటే ఆ భూకణాలని తొలగించడానికి దూరంగా నెట్టివేయడానికీ నీటిని వాడతాం తప్ప నీటి నుండి భూమి ఎలా పుట్టే వీలుంది? అన్పిస్తుంది.

     దీనికి కూడా సమాధానం సాధారణ దృష్టితో ఆలోచించడమే తప్ప లో–దృష్టిని పెట్టకపోవడమే అనేదే. అంటే ఏమన్నమాట? నీటితో దీపాల్ని వెలిగించడం వంటి అనూహ్యమైన, ఎన్నడూ వీలుకాని సంఘటనలని విన్నట్లయితే, చూసినట్లయితే సాధారణ దృష్టితో కాకుండా లో–దృష్టితో పరిశీలించి తీరాల్సిందే అని దీని భావమన్నమాట! మరొక్క మాటని అనుకుని సమాధానాన్ని తెలుసుకుందాం! మన శరీరానికి నవ(9) రంధ్రాలున్నాయి. రంధ్రం అంటే కన్నం లేదా చిల్లు అని కదా అర్థం. మరి ఈ తొమ్మిదింటి నుంచి శరీరంలోకి మనం నీటిని పంపినా, అన్నాన్ని పంపినా, మరి దేన్ని తిన్నా వెంటనే అన్నీ కన్నాల నుండి లేదా ఏవో ఒకటో రెండో కన్నాల నుంచి బయటికొచ్చేయాలి కదా! అనుకుంటాడు సామాన్య దృష్టి మాత్రమే ఉన్నవాడు. సహజంగా పిల్లలు ఈ ప్రశ్నని చిన్నపిల్లలు అడిగే ఉన్నారు కదా! దాన్ని వివరించి చెప్తేగదా వాడు ఆ రోజున అర్థం చేసుకోగలిగాడు!

     ఇదే తీరుగా పంచభూతాల్నీ వివరించుకోకుండా (అసందర్భం అవుతుంది కాబట్టి) నీటిని గురించి మాత్రమే అనుకుందాం! నీరు అనేది ‘అగ్నేరాపః’ నిప్పునుంచి పుట్టిందే. అయితే ఈ నీరు నిప్పుని ఆర్పగల శక్తితో కన్పిస్తోంది. లౌకికంగా ముందు ఒక సమాధానాన్ని చూద్దాం! నీటిని బాగా వేడి చేశాం. వేడి నీళ్లు అయ్యాయి. మనం ముట్టుకుంటే మన శరీరభాగం కాలేంతటి నిప్పుదనం (ఉష్ణత) ఆ నీటికి పట్టుకుంది. అవును కదా! ఆ నిప్పుదనంతో నిండిన నీటిలోనికి నీళ్లని ఎక్కువగా పంపితే… పూర్తి ఉష్ణతని కోల్పోయి మళ్లీ చల్లబడిపోయి, వేడిమి చేయడానికి ముందు ఏ చల్లదనంతో ఉన్నాయో ఆ స్థితికే వచ్చేస్తాయి నీళ్లు. అంతే కదా! ఇప్పుడు నీళ్లు అనేవి ఎలా ఏర్పడ్డాయో ఈ ఉదాహరణతో గమనిద్దాం! నీళ్లు అనేవి రెండు వాయువుల కలయిక వల్ల ఏర్పడి వాయురూపాన్ని మార్చుకుని, ద్రవరూపాన్ని పొందాయి. వాయువులు రెండు కలిస్తే ఆ పదార్థం వాయువే కావలసి వస్తూంటే ఆ రెండు వాయువుల సమ్మేళనం ద్రవంగా (నీరు) కావడమేమిటి? ఇక్కడే ఉంది రహస్యం. పంచభూతాలు వేటికి అవిగా ఉన్నప్పుడు చెప్పుకోవలసిందంటూ ఏమీ ఉండదు.

పృధ్వి(నేల)+అప్‌(నీరు) = ప్రవాహం

అప్‌(నీరు)+ తేజస్‌(ఉష్ణత) = వేడి నీరు

తేజస్‌(ఉష్ణత)+ వాయువు(గాలి) = వేడిగాలి(గాడుపు)

వాయువు + ఆకాశం = శూన్యం (కన్పించని ఆకాశం)

ఇదే తీరుగా ఉష్ణతని కలిగించే శక్తి ఉన్న వాయువు (ఆక్సిజన్‌) మరో ఉష్ణత ఏమాత్రం ఉండని వాయువుతో (హైడ్రోజన్‌) కలిసినట్లయితే ఆ రెంటి సంయోగం ‘నీరు’గా మారుతుంది.

(ఏ2+ౖ2  ఏ2ౖ అని తీర్మానించారు విజ్ఞాన శాస్త్రజ్ఞులు).  ( Burning Hydrogen gas with Oxygen gas will make pure water, 2H2 (g) = O2 (g) –> 2H2O (g) )

     పైన చెప్పుకున్న ఉదాహరణలో వేడిగా ఉన్న నీళ్లలో చన్నీళ్లని అతిమాత్రంగా కలిపితే ఎలా ఆ వేన్నీళ్లు కాస్తా చల్లబడిపోతాయో, అలా ఈ ఉష్ణత కలిగిన గాలి(ఆక్సిజన్‌) అలాగే ఉష్ణతలేని గాలి(హైడ్రోజన్‌) అనే రెంటి సంయోగంలో తీవ్రమైన ఉష్ణతకల వాయువు (ౖ2 లేదా ఆక్సిజన్‌) అనేది మరింత స్థాయి కలిగినదైన పక్షంలో నీరుగా కన్పిస్తున్న ఈ పదార్థానికి మండించగల శక్తి మాత్రమే ఎక్కువ అయి, ఆ నీరు దేన్నైనా మండించగలిగిందిగా అయిపోతుంది. ఇది నిజం కాబట్టే సాయి ఎప్పుడైతే నీటిని తెచ్చాడో, ఆ నీటిలో మండించగల ఉష్ణతాశక్తిని తన యోగశక్తితో పెంపొందేలా (అభివృద్ధి అయ్యేలా) చేసాడో వెంటనే ఆ నీరు తనలోని చల్లదనాన్ని కోల్పోయి, తనలో ఉన్న రెండవదైన ఉష్ణతాశక్తి ఆధిక్యంతో ఉండిపోయింది. అంటే నిప్పుగా అయింది. గుడ్డతోనో, పత్తితోనో చేయబడిన వత్తికి ఉన్న నూనె అనేది మండే అవకాశాన్నిచ్చేది కాబట్టి, ఈ నీటిలో ఉన్న దహించే శక్తి ఆ వత్తికంటుకుని దీపంగా వెలగడం ప్రాంభించింది. అయితే ఇక్కడ ‘మరి సాయి గొప్పదనమేంముంది?’ అనుకోకూడదు. తన యోగశక్తి ద్వారా సాయి నీటిని రెండు వాయువులుగా విభజించేసి, రెండవదైన ఉదజని (హైడ్రోజన్‌) శక్తిని పూర్తిగా కోల్పోయేలా చేసి ప్రాణశక్తిని (ఆక్సిజన్‌) మరింత పెంపుచేసి ఉండడమే.

     ఇలాంటిదే మరో ఉదాహరణ. శ్రీమద్రామాయణంలో ఆంజనేయస్వామి తోకకి రావణుని సేనలైన రాక్షసులు నిప్పు పెట్టారు. రావణ ఆజ్ఞకి అనుగుణంగా ఆంజనేయస్వామి ఆ తోకకున్న నిప్పుతో మొత్తం లంకని తగులబెట్టాడని చెప్పింది ఆ ఇతిహాసం. అంతవరకూ బాగానే ఉంది. మరి నిప్పుకి కాల్చివేయడమనేది లక్షణం కాబట్టి, ఆ ఆంజనేయస్వామి తోకకి ఉన్న నిప్పు లంకాజనాన్ని మంటలకి గురి చేసి చంపినట్లే. ఆంజనేయస్వామి శరీర భాగాలకు కూడా వ్యాపించి ఎందుకు ఆంజనేయుడ్ని గాయపరచలేదనేది ప్రశ్న కదా! సాయి కథలో నీటి నుండి నిప్పు కన్పిస్తూంటే, ఆ నిప్పుద్వారా వత్తులన్నీ మండి వెలుగుతుంటే, ఇక్కడ నిప్పులోని నిప్పుదనం(ఉష్ణత) లేకుండా ఆంజనేయునికి చల్లదనం గోచరించడమేమిటి? ఇక్కడ కూడా లోతుగా ఆలోచిస్తే తప్ప సమాధానం దొరకదు. దొరికినా మరింత లోతుగా భావిస్తే తప్ప ఆ సమాధానం అర్థం కాదు. నీటికుండే లక్షణం చల్లదనం. (శీతస్పర్శవత్య ఆపః) అలాగే నిప్పుకుండే లక్షణం ఉష్ణత. (ఉష్ణస్పర్శవత్తేజః) నీటికుండే చల్లదనాన్ని వేడిగా మార్చి దీపాలని వెలిగేలా చేస్తే, సీతమ్మ తన మంత్రశక్తితో అగ్నికుండే ఉష్ణతని చల్లబరిచింది.

     రెంటికీ ఎంత సామ్యముందో గుర్తించగలగాలి. గుర్తుంచుకోగలగాలి కూడా! ఏ చల్లదనమనేది లేని పక్షంలో దాన్ని నీరు అనమో, ఏ ఉష్ణత లేని పక్షంలో దాన్ని అగ్ని అనమో, చల్లదనమనేది నీటితో కలిసి మాత్రమే ఉంటుందో అలాగే వేడితనమనేది నిప్పుతో కలిసి మాత్రమే ఉంటుందో అలా కలిసి ఉన్న రెంటిలో నుంచి ఒకదాన్ని వేరు చేయడమనేది మంత్రశక్తితోనే సాధ్యం! ఆ మంత్రశక్తి అనేది దేవతల్లో ఉంటే ఆ దేవతలని ప్రార్థించి ప్రార్థించి ఉన్న కారణంగా ఆ తపస్సు శక్తే వ్యక్తుల్లో యోగశక్తిగా మారుతుంది. ఆ యోగశక్తి ఉన్న వ్యక్తి యోగిగా మారుతాడు. తనకున్న ఆ యోగశక్తి కారణంగానే ఇలాంటి లోకాతీతమైన కొన్నింటిని చేయగలుగుతాడు. శంకరాచార్యులవారు రాసిన సౌందర్యలహరిలో ఓ శ్లోకం (మహీం మూలాధారే..)లో యోగశక్తి గురించి మరింత వివరంగా కన్పిస్తుంది. మూలాధార చక్రాన్ని బాగా ఉపాసించినట్లయితే భూమిలోపల దాగి ఉండగల శక్తిని సాధకుడు సంపాదించగలడట. కపిల మహర్షి అలాగే తపస్సు చేస్తూ ఉండిపోయాడు.

     సగరుని పుత్రులైన అరవై వేల మందిని భస్మం చేసింది ఆ యోగశక్తితోనే. అలాగే మణిపూరక చక్రాన్ని బాగా ఉపాసించినట్లయితే నీటిని గురించిన మహాశక్తిమంతుడవుతాడు. దాంతో నీళ్లలో దాగి ఉండగలుగుతాడు. దుర్వాసో మహర్షి అలాగే తపస్సు చేసి ఆ యోగశక్తితోనే అంబరీషుని మీదికి కృత్య అనే రాక్షసిని పంపగలిగాడు. ఇదే తీరుగా మిగిలిన ఐదు చక్రాలనీ కూడా ఉపాసించినట్లయితే.. ఆయా లోకాతీత శక్తులు లభిస్తాయి ఉపాసించినవారికి. సాయి ఎవరితో మాట్లాడుతూ ఉన్నట్లు కన్పించినా నిరంతరమైన తన ఏకాగ్రతతో కూడిన ఉపాసన సాగిపోతూనే ఉంటూ ఉండేది. కాబట్టి అన్ని శక్తులు ఆయనకి లభించాయి. అంతటి శక్తిమంతుడు కాబట్టే కుల, మత, వర్గ, స్త్రీ, పురుష, బాల, వితంతు… వంటి భేదాలు ఆయనకి లేనే లేవు. అంతే కాక ఉరుసు – శ్రీరామనవమి జెండా ఉత్సవం, చందనోత్సవం వంటి ఈ ఆ మతాలకి సంబంధించిన పండుగలన్నీ ఆయనకి ఒకటిగానే అన్పించాయి, కన్పించాయి. మనకి మనం, అలాగే మన పక్కనున్న మరో కొంతమంది మాత్రమే కన్పిస్తాం గానీ పర్వతమెక్కిన వారికి అందరం కన్పిస్తాం! దాన్నే సమదృష్టి, సరైన దృష్టి అంటారు.

బాబా కి సంభందించిన సాంప్రదాయాలలో ముఖ్య మైన మరో 3 విషయాలు కోసం తెలుసుకుందాం 

ధుని :-  ధుని అంటే ధున్ అనగా పాపాలను హరించేది అనిఅర్ధం 

బాబా ప్రతిరోజు అగ్నిహోత్రం చేసేవారు

బాబా వెలిగించిన ధుని యోగ శక్తితో వెలిగించినది ఆ నాటి నుండి ఈ నాటి వరకు నిరంతరం ధుని వెలుగు తూనే ఉంది బాబా శశీరులుగా ఉనప్పుడు మహాసమాధి చెందిన తర్వాత కూడా        

ఆ ధుని లొనే భక్తుల పాపాలను బూడిద గా చేస్తున్నారు అంతే కాదు మన పూర్వ కాలంలో పెద్డలు పొయ్య వెలిగించి  ముందు అగ్ని దేవుడికి సమిధలు సమర్పించిన తర్వాతే వంటను ప్రారంభించేవారు అగ్ని దేవుడిని ప్రార్ధించే వారు బాబా సంప్రదాయాలకు చాలా విలువని ఇచ్చేవారు ఆ ధుని నుండి వచ్చిన ఊదినే ప్రసాదంగాను , అదే మందుగాను ఇచ్చేవారు ధునిలో వేసే సమిధలకు కూడా ఓ పద్ధతి అంటూ ఉంటుంది నిర్ధేశించ బడిన  వస్తువులు మాత్రమే సమర్పించాలి బాబా ఎదో అగ్గిపెట్టెను ఇంకేదో వినియోగించి ధునిని వెలిగించలేదు యోగ శక్తితో వెలిగించినది కనుక దానిని రక్షించుకుందాం ఓ భక్తుడు ఎదో కోరుకొని మొక్కు చెల్లించు కోవడానికి నెయ్యి ని ఎక్కువ మొత్తం లో ధునిలో వేయడానికి ప్రయత్నించే సరికి అది ఎగిసిపడింది అప్పటినుంచి ధునిని కేవలం దర్శనార్థం మాత్రమే అవకాశం సంస్థాన్ వారు కల్పిస్తున్నారు .

దక్షిణ :- దీనికోసం మన అందరికి తెలుసు చిన్నగా చెప్పాలి అంటే మనం ఏదైనా వ్రతాలు , నోములు చేయించుకుంటాము బ్రాహ్మణులకు  దక్షిణ ఇస్తాము అలా దక్షిణ ఇవ్వకుండా ఏ కార్యం జరిపించుకున్నా దాని ఫలితం మనకు దక్కదు చేసిన వారికి మిగిలిపోతుంది అలాగే మనం శారీరకంగా శ్రమించి సంపాదించిన ధనం దానం రూపంలో కొంత వ్యయ పరిస్తేనే మన కర్మలు తొలగు తాయి అందుకే బాబా మన దగ్గర నుండి దక్షిణ అడిగి తీసుకుని మరీ మన కర్మలను బాబా స్వీకరిస్తున్నారు అంతే కాని బాబా కి ధనంతో ఎటువంటి అవసరం లేదు  ఇటువంటి దైవం ,గురువు లభించడం మన పూర్వ జన్మ సుకృతం . ధూళి దర్శనం :- చాలా మంది తెలియక ఈ ధూళి దర్శనం పేరుతో అశుభ్రంగా దైవ దర్శనాలు చేస్తుంటారు.షిరిడి ప్రయాణం అయ్యి వెళ్లేకా బాబా ని చూడాలి అనే ఆత్రంతో,పరితపిస్తూ  బండి దిగగానే సరాసరిగా దర్శనానికి వెళ్లాడాన్నే ధూళి దర్శనం అంటారు అది బాబా వరకు సమ్మతమే అంతే కాని అన్ని చోట్లా అన్ని దేవాలయాలకు కాదు అవకాశం ఉన్నత వరకు పరిశుభ్రంగా వెళ్లటమే శ్రేయస్కరం ముఖ్యంగా అమ్మవారి దేవాలయాలకు కొన్ని కష్టతరమైన చోట్ల అవకాశం దొరకనిచో అది భగవంతుడికి సమ్మతమే కానీ నా వరకు నా మనస్సు పవిత్రమగా ఉంది నేను ఎలా ఉన్నా పర్వాలేదు అని వాదనలు చెయ్యక కొన్ని చోట్ల కొన్ని నియమాలు ఉంటాయి కనుక వాటిని అనుసరించడం మంచిది 

సాయి సంస్కృత పండితుడా?

       ఎవరికైనా కొంత పాండిత్యం పట్టుబడితే చాలు తమ పాండిత్యాన్ని ప్రదర్శించుకోవడం కోసం ఎవర్ని నలుగుర్లోనూ కించపరుద్దామా? అనే దృష్టితో ఎక్కువ మంది కనిపిస్తారు. కొందరైతే అప్పటికప్పుడు అవతలివారి తక్కువదనాన్ని గుర్తించి మనసులో ఒక అంచనాకి వచ్చి మౌనంగా ఉంటారు. ఇక కొందరైతే చాటుగా వేళాకోళం చేస్తూ కనిపిస్తారు. సాయిది మాత్రం మరొకర్ని తక్కువ చేసే లక్షణం కానే కాదు. అవతలి వ్యక్తికి తన స్థాయి స్పష్టంగా తనకే అర్థమయ్యేలా, నొప్పించకుండా అర్థమయ్యేలా చేయడం సాయి ప్రత్యేకత. ఉదాహరణతో గమనిద్దాం!

దీని అర్థం ఇదేనా?

     నానా(నానాసాహెబ్‌ ఛాందోర్కర్‌) సాయికి మంచి భక్తుడు. నిరంతరం సాయి సేవలోనే ఉంటూ ఉండేవాడు. ఓ రోజున ఎప్పటిలాగానే సాయి పాదాలని చేతులతో ఒత్తుతూ తనకి బాగా ఇష్టమైన భగవద్గీత శ్లోకాలని లోలోపల కూనిరాగంలాగా తీస్తూ పాడుకోవడం మొదలుపెట్టాడు. జ్ఞానసన్యాసయోగమని ఓ యోగముంది భగవద్గీతలో. దానిలోని 34వ శ్లోకాన్ని నానా చిన్నగొంతుతో పాడటం మొదలెట్టాడు ఓ పక్క సాయి పాదాలని ఒత్తుతూ. సాయి వెంటనే.. నానా! శ్లోకాన్ని చాలా బాగా పాడుతున్నావు గానీ, లోలోపల గొణుగుతూ చదవడమెందుకు? పైకే పాడు ఆ శ్లోకాన్ని నేనూ వింటాను అన్నాడు. నానాకి మరింత సంతోషమైంది. శ్రావ్యంగానూ కొంత పెద్ద గొంతుతోనూ స్పష్టంగా పాడి విన్పించాడు నానా. ఆ శ్లోకం ఇదే.

త ద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా! ఉప దేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్వదర్శినః అనేది.

   అప్పుడు సాయి.. ‘‘నానా! ఈ శ్లోకానికి అర్థాన్ని ‘ప్రతి పదానికీ ఇది అర్థం’ అంటూ నాకు చెప్పవూ?’’ అని అడిగాడు. సాయికి సంస్కృతం రాదనీ, ఆ కారణంగా తానే దానికి అర్థాన్ని సాయి అంతటివానికి చెప్పే అవకాశాన్ని పొందగలిగాననీ నానా ఆనందపడుతూ అర్థాన్ని వివరించసాగాడు.‘ప్రణిపాతేన – సాష్టాంగ ప్రణామం చేతనూ, పరిప్రశ్నేన – ప్రశ్నించడం చేతనూ, సేవయా – సేవించడం చేతనూ, తే – నీకు, తత్‌త్వ దర్శినః – తత్త్వసాక్షాత్కారాన్ని పొందిన, జ్ఞానినః – జ్ఞానులు, జ్ఞానమ్‌ – జ్ఞానాన్ని, ఉపదేక్ష్యంతి – ఎంతో శ్రద్ధతో బోధిస్తూ నీకు అర్థమయ్యేలా చేస్తారు. తత్‌ – ఏ ప్రకారంగా ఆ జ్ఞానం బోధింపబడుతుందో దాన్ని, విద్ధి – శ్రద్ధతో గమనించి తెలుసుకో! ఓ గురువు నుంచి జ్ఞానాన్ని పొందాలంటే అది సాష్టాంగ ప్రణామం ద్వారా, ప్రశ్నించి తెలుసుకోవడం ద్వారా, ఆ గురువుకి సేవని చూస్తూ ఉండటం ద్వారా అది సాధ్యం. ఇంతకీ జ్ఞానాన్ని బోధించగల ఆ తత్త్వాన్ని తెలిసిన గురువు నుంచి పై పద్ధతుల్లో దేని ద్వారా ఆ జ్ఞానం లభిస్తుందో దాన్ని శ్రద్ధతో గమనించి తెలుసుకో! అనేది దానర్థం అని పరమ సంతృప్తిని పడుతూ చెప్పాడు నానా. ఇంతేకాదు. మళ్లీ సాయి ఈ చెప్పిందాన్ని మరోలా చేస్తూ చెప్పకుండానూ, అలాగే తన పాండిత్యపు లోతు సాయికి అర్థమయ్యేలాగానూ, పరమానందపడుతూ ఈ పై వ్యాఖ్యానానికి కొనసాగింపుగా ‘ఆనందగిరివ్యాఖ్యానం శంకరానంద శ్రీధర వ్యాఖ్యానం, శంకర భాష్యం, మధుసూదన వ్యాఖ్యా.. నీలకంఠ వ్యాఖ్యా…. కూడా ఈ విషయాన్నే చెప్పాయి’ అని నానా చెప్పి తన మాటలకి సాయి ప్రతిస్పందన ఏమిటో తెలుసుకునే ఉద్దేశంతో ఓ పక్క ధైర్యం, ఆత్మసంతృప్తితోనూ.. మరో పక్క అదో తీరు భయం, అధైర్యంతోనూ.. సాయి ముఖంలోకే చూస్తూ ఉండిపోయాడు నానా. ఇతర భక్తులంతా నానా సంస్కృత పండితుడైన కారణంగానూ, సాయికి సంస్కృత పాండిత్యమున్నట్లు ఏనాడూ విన్న– కన్నవారు లేని కారణంగానూ, సాయి ఏమంటాడోనని అలా చూస్తూ ఉండిపోయారు అటు నానానీ ఇటు సాయినీ.

          సాయి ప్రారంభించాడు. నానా! పై శ్లోకంలోని మూడవ పాదాన్ని ఒక్కసారి చూడు. ‘ఉపదేక్ష్యంతి తే జ్ఞానమ్‌’ అని కదా నువ్వు చదివింది. దానికి అర్థాన్ని వివరించినది కూడాను. సంస్కృత వ్యాకరణం ప్రకారం దీన్ని ‘తే+అజ్ఞానమ్‌’ అని కూడా విడదీయవచ్చు. (ఏజః పదాం తాదతి అనే సూత్రం ప్రకారం ఇది శాస్త్రం అంగీకరించిన సత్యమే) ఆ పద్ధతిలో మరి జ్ఞానులంతా అజ్ఞానాన్ని ఉపదేశిస్తారని అన్నామనుకో! ‘ఇలా చెప్పడం తప్పు!’ అని ఎలా అనగలవు? నేనేదో నిన్ను తగ్గించడానికో, ఏదో మెలిక పెట్టి అవమానించడానికో నీతో అంటున్న మాట కాదు. ఇలా ఎవరైనా నిన్నడిగితే ఏం సమాధానం చెప్పగలుగుతావు? ఇది మొదటి సందేహం.

     రెండవది. కృష్ణుడు కదా గీతని ఉపదేశించాడు! ఆయన ఏమంటున్నాడని ఈ శ్లోకం చెప్తోంది? ‘తత్త్వాన్ని దర్శించిన జ్ఞానులు నీకు జ్ఞానం అంటే ఏమిటో ఆ విశేషాలని వివరిస్తారు’ అని కదా! అంటే మరి ఉపదేశిస్తూన్న కృష్ణుడు తత్త్వదర్శి కాడా? జ్ఞాని కాడా? ఆయనే మరి తత్త్వదర్శులయిన జ్ఞానుల దగ్గరికి వెళ్లాలని చెప్తూన్నవాడు అవుతుంటే ఇక ఈయన ఎందుకు గీతని అర్జునునికి బోధించాలి? పైగా ‘అన్నీ తెలిసినవాడ్ని నేనే’ (వేదాహం సమతీతాని..) అని ఆయనకాయనే భగవద్గీతలో చెప్పుకున్నాడు కదా! మరి ఆయనే ఫలానివాళ్లు తత్త్వదర్శులు, జ్ఞానులు అని చెప్పకూడదా? మరోమాట కూడా! ఆయనే భగవద్గీత చేస్తూ (భగవంతుడ్ని, అతని స్వరూపాన్ని గూర్చిన విశేషాలని గానం చేస్తూ) జ్ఞానమంటే ఏమిటో, విజ్ఞానమంటే ఏమిటో, ఏం తెలుసుకుంటే ఇక తెలియవలసిందంటూ ఏదీ ఉండదో.. దాన్ని తెలియజేస్తున్నాను (జ్ఞానం తేహం సవిజ్ఞానమ్‌.. అవశిష్వతే) అన్నాడో దీన్నంతటినీ ఆలోచిస్తూంటే తికమక అయిపోతోంది. అందరూ నోరెళ్లబెట్టి చూస్తుంటే, నానాకి నోటమాట రాకపోతూంటే సాయి చెప్పుకుపోతున్నాడు.

     నానా! ఇక చివరి అనుమానాన్ని విను. సాష్టాంగప్రణామం చేస్తే జ్ఞానం  ఉపదేశింపబడుతుందా? మామూలు తేలికపదాన్ని వాడకుండా నమస్కారమనే అర్థంలో ‘ప్రణిపాతం’ అనేంత గట్టిపదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చిందట? అలాగే ప్రశ్నిస్తూ ఉంటే జ్ఞానం ఉపదేశింపబడుతుందా? అయినా ప్రశ్నించడం అనకుండా పరిప్రశ్న చేయడమనేంత గట్టిపదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది? మరొక్కమాట… సేవ చేస్తే జ్ఞానాన్ని ఉపదేశిస్తారా? ఇదేంమాట? జ్ఞానమనేది అంత తేలికైనదా? అని ప్రశ్నార్థకంగా నానాని చూశాడు సాయి.మల్లయుద్ధంలో చిత్తుచిత్తుగా ఓడిపోయినవానిలా నానా అక్షరం కూడా మాట్లాడలేక, సాయిపాదాలు రెంటినీ గట్టిగా పట్టుకుని ‘సాయిదేవా! నువ్వు అనన్యసామాన్యుడివి. మహా ప్రతిభా సంపన్నుడివి. ఇన్ని మార్లు భగవద్గీతలోని ఈ అధ్యాయాన్ని చదివినా సమాధానాలు ఎలాగూ తెలియనే తెలియవు గానీ, కనీసం ఇలాంటి ప్రశ్నలు ఈ శ్లోకం చదివితే వస్తాయి, వచ్చేందుకు అవకాశముందనే విషయం కూడా తెలియని అజ్ఞానంతో ఉన్నాను. దయచేసి సమాధానాల్ని చెప్పి నాకు జ్ఞానబోధ చేయి తండ్రీ!’ అన్నాడు నానా. సాయి ప్రారంభించాడు. ‘‘ఏం లేదు నానా? ఆందోళన పడకు! జ్ఞానాన్ని సంపాదించాలంటే జ్ఞానపిపాసి అయిన వ్యక్తి సద్గురువుని ఏ తీరుగా ఆశ్రయించాలో చెప్పే శ్లోకం ఇది.ప్రణిపాతమనే మాటకి సాష్టాంగనమస్కారమనేది అర్థమే కావచ్చు గానీ ఒట్టిగా సాష్టాంగ ప్రణామాలవల్ల జ్ఞానం ఉపదేశింపబడదు. ప్రణిపాతమంటే ‘సర్వస్య శరణాగతి’ అని అర్థం.

     ఏనుగుకాస్తా చెరువులో దిగింది. మొసలి దాని ముందు రెండుపాదాలనీ పట్టింది. మొసలి నీటిలోనికీ, ఏనుగు ఒడ్డువైపుకీ లాగుకుంటూ ఒకర్ని మరొకరు గెలవాలని ప్రయత్నించారు. సాధ్యపడలేదు. అప్పుడు ఏనుగు – నీవే తప్ప ఇత్ః పరం బెరుగ..! ఓ! దైవమా! నన్ను రక్షింప సమర్థుడివి నువ్వే సుమా! అంటూ తన శరీర మనః ప్రాణ బుద్ధులతో శరణుకోరి ప్రార్థించింది. అదుగో అదీ ‘సర్వస్య శరణాగతిః’ అంటే.ద్రౌపది నిండు కౌరవసభలో వస్త్రాపహరణం జరగబోతున్న తరుణంలో సర్వస్యశరణాగతిధర్మంతో కృష్ణుడ్ని ప్రార్థించింది.ఇదే విధంగా సుగ్రీవుడు కూడా వాలితో యుద్ధానికి తలపడి పూర్తిగా ఓడిపోయి రాముణ్ని శరణువేడాడు. ఆ రాముడు వాలిని వధించాడంటే దానికి కారణం సుగ్రీవుని బలాధిక్యం కాదు. సుగ్రీవుడు చేసిన శరణాగతి ధర్మం మాత్రమే. కాబట్టి ప్రణిపాతమంటే.. శరణుకోరుతూ, తనని తాను రక్షించే వ్యక్తికి సమర్పించుకోవడమని అర్థమన్నమాట.

ఇక ప్రశ్నించడమనే మాటకి.. ఎదుటివానికి విసుగొచ్చేంత స్థాయిలో ప్రశ్నించడమని అర్థం కాదు. ప్రశ్న అనకుండా ‘పరిప్రశ్న’ అనడమంటే వేదాంతానికి సంబంధించిన ప్రశ్న వేయడమని అర్థమన్నమాట! అంతే కాదు. కొందరు – ఎదుటివానికి ఎంత తెలుసు? అనే దుర్బుద్ధితో, అతనికి తెలిసిన దాన్ని కాదనిపించాలనే వంకర బుద్ధితో, ఏమేమో మోసంతో నిండిన ప్రమాణాలని చూపించి, నిజం కానిదానిని నమ్మింపజేసి, వారితో కూడిన సభలో వాళ్లని బహిరంగంగా ఓడించి, తాము గొప్పవారనిపించుకోవడం.. వంటి ఇలాంటివి సరికాదన్నమాట. శ్రద్ధతో, భక్తితో కేవలం విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తితో మాత్రమే ప్రశ్నించడం, అందునా లౌకికమైన ధోరణిలో కాకుండా వేదాంతానికి సంబంధించి ప్రశ్నించడమే ‘పరిప్రశ్న.

మూడవ పదం ‘సేవ’ అనే మాటకి అర్థం గురువుగారికి పాదాలొత్తడం, దూరం నుంచి నూతి నీళ్లు తోడి తేవడం, ఇంకా మూఢభక్తితో ఆయనకి ఒళ్లు తోమడం.. వంటివన్నీ జ్ఞానాన్ని పొందే మార్గాలు కానే కావు.

9 విధాల భక్తి మార్గాలున్నాయి.

స్నేహపూర్వకంగా ఉండే భక్తి సఖ్యభక్తి. దీనికి ఉదాహరణ అర్జునుడు. తన రథానికి సారథిగా ఉంచుకోవడమే కాక భక్తితో స్నేహాన్ని శ్రుతిమించకుండా చేశాడు.

పరీక్షిన్మహారాజుకి పాము కాటు శాపం రాగానే శుకమహర్షి దగ్గర అధ్యాత్మ విద్యని నేర్చుకోవడం కోసం మోక్షతత్వాన్ని గురించి విన్నాడు. ఇది శ్రవణభక్తికి ఉదాహరణ.

నిస్వార్థంగా దాస్యాన్ని చేసి రామునికి, సీతమ్మ జాడని చెప్పడమే కాక, రాముని మీద ప్రయోగించదలిచి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని దాచి ఉంచుకుంటే దాన్ని తనమీదే ప్రయోగించేలా చేసుకున్న ఆంజనేయుడు దాస్య భక్తికి ఉదాహరణ.

శరీరంలోని పంచజ్ఞానేంద్రియాలతోనూ సంపూర్ణభక్తితో వందనం చేసి తరించిన అక్రూరుడు (భాగవతంలో) వందనభక్తికి ఉదాహరణ.

సంవత్సరకాలం పాటు రాజ్యాన్ని విడిచి, భార్యతో కలిసి, ఓ మధువనంలో ఉంటూ రాజసౌఖ్యాలనీ, లాంఛనాలనీ విడిచి కృష్ణుడినే సేవించిన అంబరీషుడు అర్చన భక్తికి ఉదాహరణ.

తన హృదయపూర్వకమైన సేవతో ఒక్క తులసిదళానికే తన భర్త కృష్ణుడు తూగిపోయేలా చేసుకుని విజేత్రి(గెలిచినది) అయిన రుక్మిణి సేవాభక్తికి ఉదాహరణ.

విదురుడు, భీష్ముడూ మొదలైన పెద్దలు కృష్ణుడ్ని ఏనాడూ వ్యక్తిగా కాక ఎల్లప్పుడూ దైవంగానే ఆరాధిస్తూ తమ అంతఃకరణం నిండుగా దైవంగానే అనుకున్నారు. ఇది ఆత్మలో ఎరుక అంటే ఆత్మనివేదన భక్తికి ఉదాహరణ.

నిరంతరం సంకీర్తన చేస్తూ తన భక్తిని చాటుకుని, విజయాన్ని సాధించిన నారదుడు సంకీర్తన భక్తికి ఉదాహరణ.

తనకి ప్రాణాపాయం లేనే లేదనే ధైర్యంతో తన తండ్రి చంపదలచి, ప్రయత్నాలు చేస్తున్నా చలించని ప్రహ్లాదుడు చింతనమనే 9 వ భక్తికి ఉదాహరణ.

అలా ఈ తీరు ఏదో ఒక భక్తిమార్గంలో సేవిస్తూ ఉండడం సేవ కిందికొస్తుంది తప్ప గురువుకి భౌతికంగా చేసే సేవ.. సేవాభక్తి కిందికి రాదు.

సాయి ఇలా చెప్పేస్తూ ఉంటే.. సాయి ఇంతటి లోతు పాండిత్యాన్ని ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎవరి నుంచి గ్రహించాడు? అనే భావంతో అందరూ నిశ్చేష్టులై వింటూండిపోయారు. కేవలం అది ఆయన చేసిన మంత్రమననశక్తి మాత్రమే అనేది స్పష్టంగా అర్థం కాసాగింది అందరికీ.

అప్పుడు సాయి మాట్లాడుతూ.. ఇంకొక్క విషయాన్ని చెప్పి ముగిస్తానంటూ జ్ఞానం గురించి చెప్పాడిలా.

  ఏ గురువూ ఏ శిష్యునికీ జ్ఞానాన్ని గురించి చెప్పడు. చెప్పలేడు కూడా. పంచదార అనేది తీపిగా ఉంటుందని చెప్తే తెలియదు అలా వినడం ద్వారా. ఏవేవో గ్రంథాల్లో చదివితే అర్థమయ్యే విషయం కాదు. స్వయంగా దాన్ని తిన్నప్పుడే ఆ విషయం ఎవరూ చెప్పనంతగా, చెప్పలేనంతగా అర్థమవుతుంది. దీన్నే ఆది శంకరుల వారు అనుభూతి అన్నారు. ఏది ప్రత్యక్షంగా తెలియదో, గ్రంథాల ద్వారా అనుభవానికి రాదో, రాలేదో, వచ్చే వీలులేనిదో, ప్రత్యక్షం, పరోక్షం అనే రెండింటి ద్వారా కాక స్వయంగా అనుభవంలో మాత్రమే తెలిసేదో అదే అపరోక్ష అనుభూతి అవుతుందన్నమాట.సాయి ఇంతలోతుగా చెప్తుంటే కొందరికి ఈ వేదాంతం కొంతస్థాయిలోనే అర్థమవుతున్నా.. ఓ మహమ్మదీయునికి ఇంతటి వైదిక సంస్కారమా? అనుకున్నారు. పూర్తిగా తెలియకున్నా వినాలనే ఆసక్తి పెరుగుతూ వింటూనే ఉండిపోయారు.సాయి చెప్పసాగాడు భగవద్గీతలో కృష్ణుడన్నాడు ‘అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః’ అని.అందరికీ ఉండేది అజ్ఞానమే. దాన్ని తొలగిస్తే చాలు జ్ఞానమంటే ఏమిటో తెలుస్తుంది. ఉదాహరణకి సూర్యుడ్ని, చంద్రుడ్ని రాహుకేతుగ్రహాలు గ్రహిస్తాయి. దాన్నే గ్రహణం తొలిగాక పూర్తిగా వారి ప్రకాశం మనకి సొంతమవుతుంది. గురువనే వారెవరు ఉన్నారో ఆయన మనకున్న ఆ అజ్ఞానాన్ని తొలగించడమనే పనిని మాత్రమే చేస్తాడు. అద్దం నిండా దుమ్ము, ధూళి, నూనె మరకలు వంటివి పడితే మనరూపం కన్పించకుండా పోతుంటే, దాన్ని ఎలా శుభ్రపరచాలో అలా శుభ్రం చేసిన రోజున మన రూపం ప్రతిబింబితమవుతుంది. ఆ దుమ్ము, ధూళి, నూనె మరకలు వంటివి అజ్ఞానంతో సమానం. దాన్ని తుడిచి శుభ్రపరిచినవాడు గురువు. అద్దానికున్న ప్రతిబింబించగలిగే గుణం జ్ఞానలక్షణం. ఇలా శుభ్ర పరుచుకోవాలనే విధానాన్ని తెలిపిన గురువు ద్వారా ఈ విషయాన్ని గ్రహించడం అనుభవంలోనికి తెచ్చుకుని, నిత్యం శుభ్రపరుచుకుంటూ ఉండటం ‘జ్ఞానం’. ‘తాడుని చూసి పామేమో అనుకుని భయపడతాం. తాడు గురించిన, పాముని గురించిన జ్ఞానం కలిగిన గురువు మనలో పాముని గురించిన అజ్ఞానపు ఆలోచనని తొలగించి తాడే సుమా! అనే జ్ఞానాన్ని కలిగిస్తే అతను గురువూ – అది జ్ఞానస్వరూపమూనూ. కాబట్టి మట్టిపట్టిన బంగారాన్ని ఎలా నిప్పులో వేసి కాల్చి నిజమైన మేలిమి బంగారపు ముద్దని పైకి తెచ్చి చూపిస్తారో అలా గురువు ఎప్పుడూ తన వద్దకొచ్చిన శిష్యుల అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞానదర్శనాన్ని చేయించుతాడే తప్ప తాను కొత్తగా జ్ఞానమంటూ మరి దేన్నో బోధించడు. బోధించలేడు.’‘జ్ఞానమనేది ఎప్పుడూ ఉన్నదే. ఎక్కడా ఉండేదే. దాని మీద ఉన్న – మనకి అర్థం కాకుండా ఉన్న ఆ అడ్డునీ, అవరోధాన్నీ, ముసుగునీ తొలగిస్తే చాలు. జ్ఞానమనేది ఎవరికి వారికే తెలుస్తుంది. అర్థమవుతుంది. అనుభవంలో కన్పిస్తుంది అని ఈ శ్లోకం అర్థం’ అని ముగించాడు సాయి.

నానాతో పాటు వింటున్న ఆ భక్తులంతా సాయి పాదాలని కౌగిలించుకున్నట్లుగా ఒకరి వెంట ఒకరు చుట్టేశారు. ఇప్పటివరకూ చూసిన సాయిని మరింత స్పష్టంగా, లోతుగా, అవగాహనతో చూశారు. సాయికున్న అత్యద్భుత యోగశక్తి, తపశ్శక్తి, మంత్రమననశక్తి కారణంగా సంస్కృత పండితుడైన, వ్యాఖ్యాన గ్రంథాలని ఔపోశనపట్టిన వాడైన నానాకి కూడా అర్థం కాలేదని తనకి తానే అంగీకరించేలా వ్యాఖ్యానించాడు సాయి అనుకున్నారు నానాతో సహా.

     నేడు మనం కూడా గ్రహించుకోవల్సింది ఒక్కటే. సాయికి ఇష్టమైన నైవేద్యాలు, సాయికి ఇష్టమైన ప్రదేశాలు, సాయికి ప్రీతికరమైన ఊదీ(విభూతి)ని ధరించడాలు మాత్రమే చేస్తూ.. సాయికి దగ్గరివాళ్లం అయిపోయామనుకోకూడదు. సాయిని గురించిన ఈ తత్త్వాన్ని తెలిపే చరిత్రలని చదివి, దాన్ని హృదయంలో ఉంచుకోగలగాలి. అప్పుడే సాయి మనకి అర్థమవుతాడు. మనకి అర్థం ఎక్కడైనా కాలేదన్నచోట తానే వచ్చి, మనకి అర్థమయ్యేలా తనని తాను వివరించుకుంటాడు. అందుచేత సాయి చేసిన ప్రతిపనీ, ప్రతిమాటా, ప్రతి సంఘటనా వెనుక ఎంతో అర్థం ఉంటుందన్నమాటే!మన అదృష్టం మనకి సాయినిలయంలో ఈసారి గురుపౌర్ణమికి ముందు అమ్మ మన చేత చేయించిన exercise (సాధన) అంతా ఇదే. బాబా సత్చరిత్రలోని తత్త్వాన్ని అర్ధం చేసుకోండి, వంటబట్టించుకోండి అని, అప్పుడే మనం నిజమైన సాయిభక్తులమనిపించుకోగలము. దానివలన వచ్చే పూర్తి ప్రతిఫలాన్ని పొందగలుగుతాము. పైన చెప్పినట్లుగా మనకి అర్థం ఎక్కడైనా కాలేదన్నచోట తానే వచ్చి, మనకి అర్థమయ్యేలా తనని తాను వివరించుకుంటాడు, అన్నట్లుగా మనకి బాబా సాయినిలయంలో అమ్మ రూపంలో మనకి అర్ధమయ్యేలా, అరటిపండు తొక్క తీసి నోటికి అందించే విధంగా తెలియచేస్తున్నారు. ఇంతటి అదృష్టం ఎంత మందికి లభిస్తుంది. ఎంత పుణ్యం చేసుకున్నామో మనకి సాయినిలయంలో నిత్యం తన ఉనికిని అనుభవింపచేస్తున్నాడు మన సాయి. ఈ జన్మలో మనకి దొరికిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మనలో ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టి సర్వస్య శరణాగతి చేసిననాడే అది మనకి లభ్యమౌతుంది అని మన గ్రహించాలి.

    ‘మేకని కోసి చంపాల్సిందే!’ అని సాయి ఓ భక్తునికి ఆజ్ఞాపించాడు ఒకసారి. ఇదేమిటి? జీవహింసని చేయవలసిందని దైవసమానుడైన సాయి ఆజ్ఞాపించాడా? అందునా ఓ బ్రాహ్మణుడ్ని..? ఏమిటి అంతరార్థం? రేపు తెలుసుకుందాం అజ్ఞానాన్ని తొలగించుకుని..!

సద్గురువు అంటే ఎవరు ??? 

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధి రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద  సమర్ధ సద్గురు సాయి నాధ్ మహరాజ్ కి జై 

పైన శ్లోకం లో చెప్పినట్లు గా మనం బాబా ని గురువు అంటున్నాము,సద్గురువు అంటున్నాము,సమర్ధ సద్గురువు అంటున్నాము ఎందుకు ???

గురువు అంటే ఏమిటి :- గుహ్యమైన ( రహస్యమైన) అందకరాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చేవారే గురువు రహస్యమైన అంధకారం అంటే ? 

ఇది పైకి కనబడదు ఎవరికి వారు నేను,నాది, నేను చేసాను,నాకేంటి అనే భావం ఇది అంతర్ముఖంగా ఉంటుంది దానిని కూడా గురువు తొలగిస్తారు.

దీనిలోని ఆధ్యాత్మిక మైన ( పారమార్థికమైన ) అంధకారం కూడా ఉంటుంది వారి స్వభావం ఇలా ఉంటుంది 

సత్యానికి – అసత్యానికి తేడా తెలియదు

వివేకానికి – వైరాగ్యానికి కి తేడా తెలియదు

భగవంతుని లక్షణాలమీద అవగాహన ఉండదు 

పరతత్వపు చిహ్నాలు,విధి విధానాలు తెలియవు 

ఎదో గుడికివెళ్ళాం,లేకపోతే నేను గొప్ప భక్తుడుని, అని  చెప్పుకుంటూ ఉంటారు కానీ నిజమైన భక్తుడు ఐతే కనుక భగవంతుని కోసం తెలుకోవాలి అని , ఆయన మన నుంచి ఏమి కోరుకుంటున్నారు, ఆయననుంచి మనం ఏమి తెలుసుకున్నాము ఏమి నేర్చుకున్నాము అనేవి ముఖ్యం.చివరిగా భగవంతునిలో ఎలా లీనమవ్వాలి అనేది మాత్రమే ముఖ్యం అని తెలుసుకోవాలి అదే గురువు ప్రయత్నం .

మన జీవితంలో 5 గురు గురువులు( పంచ గురువులు అంటారు ) ఉంటారు వారు

1౼ తల్లి 

ప్రతి మనిషికి మొదటి గురువు తల్లి తన ప్రాణాన్ని సహితం లెక్క చెయ్యకుండా ఈ ప్రపంచం లోకి తీసుకు వస్తుంది. తినడం,నడవడం, మంచి చెడు అవే కాకా ఎలా బ్రతకాలో నిరోయిస్తుంది .

2 ౼ తండ్రి 

తండ్రి బయట ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు,జీవితంలో పైకి ఎలా రావాలో నేర్పిస్తాడు.ఉపనయన సమయంలో యజ్ఞోపవేతమ్ ధారణ చేస్తూ గాయత్రి మంత్రాన్నీ ఉపదేశం చేసేది తండ్రి కనుక ఆయన రొండవ గురువు.

 3-  మామ గారు 

ఎక్కడ ఎప్పుడు వినలేదు కానీ తన కూతురుని ఇచ్చి పెళ్లి చేసి పంపుతో తన కూతురుని జాగ్రత్తగా చూసుకోమంటూ మంచి చెడులు నేర్పుతారు .

4౼ విద్యను నేర్పు గురువు 

ఈ గురువు బ్రతకడానికి విద్యను నేర్పిస్తారు , 

5౼ ఆధ్యాత్మిక గురువు 

దైవాన్ని తెలుసుకోవడం ఎలా ,దైవం లో చూసినవి ఆచరణలో పెట్టడం ఎలా,దైవంలో లీనమవ్వడం ఎలా అనేది నేర్పించే వాడు ఆధ్యాత్మిక గురువు .

సద్గురువు అంటే ??? 

సత్ అంటే సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండి ఆయనే సత్య స్వరూపుడుగా ఉంటూ శిష్యులకు సత్య అసత్యాలు గల వ్యత్యాసాన్ని తెలియ చేస్తూ శిష్యులు నుండి ఏది ఆశించక శిష్యుల అభివృద్ధికోసం నిరంతరం పాటుపడుతూ, మనకున్న సంకెళ్లను తీసి సంసారమనే ఈ భంద   నాలనుండి విముక్తులను చేసి  మోక్షాన్ని ప్రసాదించే వరకు వెంట ఉండే వారే సద్గురువు.

సమర్ధ సద్గురువు ఎవరు ???

సద్గురువుల్లోకెల్లా ఉత్తమోత్తమమైన లక్షణం ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా, శిష్యులు తనని విడిచి పెట్టినా శిష్యులను విడిచి పెట్టకుండా తన దోవలోకి లాక్కుని వచ్చి మరి మాయను వదల కొట్టి లక్ష్య దిశగా నడిపించే వాడు సమర్ధ సద్గురువు.

పైన చెప్పిన విధంగానే బాబాలో అన్ని గుణాలు ఉన్నాయి కనుక మనం బాబాని  అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక          రాజాధి రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయి నాథ్ మహరాజ్ కి జై అని కీర్తిస్తున్నాము బాబా లాంటి గురువు మనకు లభించడం మనం చేసుకున్న అదృష్టం

మేకని చంపి తీరాల్సిందే! అన్నాడా సాయి? ఇదేమిటి?

     సాయి చేసే ప్రతి చేష్టా, సాయి మాట్లాడే ప్రతి మాటా, సాయి నడిచే ప్రతి ప్రదేశం, సాయి చరిత్రలో కన్పించే ప్రతి సంఘటనా ఓ కొత్త విషయాన్ని జీవితాంతం మనకి గుర్తుండేలా, గుర్తుంచుకునేలా చేస్తూనే ఉంటుంది. ఓ చిరుచీకటి ఉన్న గదిలోనికి ప్రవేశించకుండానూ, కనీసం ప్రవేశించి చూద్దామనే ఊహకూడా లేకుండానూ అదో చీకటి శూన్యపు గది అనడం ఏ మాత్రమూ సరికాదు. చక్కని దీపపు వెలుగుతో దానిలోనికి ప్రవేశించి, చూస్తే ఏదైనా ఉందో లేదో? ఉంటే ఏముందో?… అలా వివరాలన్నింటినీ తెలుసుకోగలుగుతాం! అదిగో ఆ పనినే చేద్దాం! చేస్తున్నాం కూడా!ఆ మేకని చంపెయ్‌!

     ఎవరో ఓ వ్యక్తి ఓ మేకని తెచ్చి సాయికి ఇచ్చాడు. ఆ మేకని సాయి దగ్గరే ఓ చిన్న స్తంభానికి కట్టివేశాడు. భక్తులంతా చూస్తున్నారు ఆ మేకని. అది పాపం అందరూ జాలిపడేలా దీనాతి దీనంగా చూస్తోంది. ఆ సందర్భంలో సాయి ‘బడేబాబా’ అనే అతన్ని పిలిచాడు ‘రావలసింది’ అని. బడేబాబా సాయికి ఎంతో.. మళ్లీ మాట్లాడితే.. మరెంతో సన్నిహితుడు. రోజూ సాయి అతనికి 50 రూపాయలని దక్షిణగా ఇచ్చేవాడు.అలా సొమ్మిచ్చినందుకు సన్నిహితుడని దీని అర్థం కాదు. బడేబాబాని కొంతదూరం సాగనంపి వస్తుండేవాడు సాయి. ప్రతీ రోజూ భక్తులంతా భోజనం వేళకి సభామండపానికి ఆనందంగానూ సాయితో కలిసి కూర్చుని భోజనాన్ని చేయాలనీనూ ఆత్రుతతో వస్తూండేవారు. భక్తులంతా ఎదురు బదురుగా రెండు వరుసల్లో ఓ క్రమశిక్షణ పద్ధతిలో తాడు పట్టుకుని చూస్తే సరిపోయేంత సరళరేఖలా చక్కగా కూర్చుంటూండేవారు. ఈ రెండు వరుసలూ ఎంతో పొడుగ్గా ఉండేవి. ఆ రెండు వరుసలకీ మధ్యలో ఆ వరుసలు ప్రారంభమయ్యే చోటున ఇద్దరు కూర్చోవడానికి రెండు చోట్లు ఖాళీగా ఉండేవి. ఆ కుడివైపున సాయి కూర్చునేవాడు. ఆయనకి ఎడమ పక్కన బడేబాబా కూర్చునేవాడు. మొత్తం అందరి విస్తళ్లలోనూ వడ్డన అయిపోయినా భోజనం చేసే సంప్రదాయం సాయికి బాగా తెలుసు కాబట్టి, ఆ సాయి భక్తులకీ మరింతగా తెలుసు కాబట్టి, ఎవరి మటుకు వారు విస్తళ్లలో వేయబడ్డ పదార్థాలని వేసిన వెంటనే తినేస్తుండేవారు కానే కాదు. ఇలాంటి సందర్భాలని పరిశీలిస్తే ‘బ్రాహ్మణసమారాధన, బ్రాహ్మణ గృహాల్లో జరుగుతూండే భోజన సంప్రదాయ పద్ధతి’ సాయిలో కన్పిస్తూ ఆశ్చర్యం వేస్తుంది.

    ఇంత వడ్డన జరిగినా.. ఇందరూ వచ్చి కూర్చున్నా.. సాయి మాత్రం తన ఎడమపక్కన బడేబాబా వచ్చి కూర్చోనిదే విస్తరిని ముట్టేవాడు కాడు. అలాగని బడేబాబా కావాలని ఆలస్యం చేయడమో లేక ఏదో పని మీద ఉండి ఆలస్యంగా వస్తూ ఇందరిని ఎదురుచూసేలా చేయడమో చేసేవాడు కాదు! అదే సభామండపంలో కొంత ముందుగానే వచ్చి, భక్తి శ్రద్ధలతో ఓ మూల కూర్చుని, సాయి పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. అంతా కూర్చున్నాక, అన్ని పదార్థాలు వడ్డింపబడ్డాక ఇక భోజనాన్ని చేయవచ్చు అన్నాక.. ఆవో బడేబాబా (బడేబాబా! రా! ) అని ఆప్యాయంగా పిలిచేవాడు సాయి. ఆవుదూడ కట్టుని విప్పేస్తే ఎలా ఆ దూడ తల్లిగోవు పొదుగులో తలని దూర్చేస్తుందో అలా, అంత ఇష్టంతో బడేబాబా వచ్చి సాయి ఎడమపక్కన కూర్చునేవాడు. ఆ మీదట భోజనాలు ముగిసేవి. ఇది ఓ నిత్యక్రతువులా సాగిపోతూ ఉండేది షిర్డీలో.

     అయితే ఈ రోజున మాత్రం అందరూ భోజనాన్ని ప్రారంభించే ముందు, అందరూ వింటూ ఉండగా.. ‘బడేబాబా! ఈ మేకని కత్తితో ఒకే వేటుకి తల నరికి చంపెయ్‌!’  అని బిగ్గరగా ఆజ్ఞ చేసాడు సాయి. అది దీపావళి రోజు కావడంతో రోజూ కంటే ఎక్కువ పదార్థాలతో పాటు మిఠాయిల్నీ, ఇంకా తీపిపదార్థాలనీ కూడా వడ్డించారు విస్తళ్లలో. రోజూ ఉండే పద్ధతి ప్రకారం బడేబాబాని సాయి పిలవటం ఆయన వచ్చి కూర్చోగానే భోజనాలు ప్రారంభం కావటం జరగాల్సి ఉంది. అయితే కథ తారుమారై.. ‘మేకను చంపడం’ అనే కొత్త కథ ప్రారంభమైంది. భక్తులంతా వింతగా చూస్తున్నారు ఏం జరుగుతుందోనని.బడేబాబా సాయి చేసిన ఈ ఆజ్ఞని విని బాధతో సాయి పక్కకి వచ్చి కూర్చోవలసిన వాడు కాస్తా.. ఎటో వెళ్లిపోయాడు. అది సాయి ఆజ్ఞ కదా! ఎవరో భక్తులు మొత్తానికి బడేబాబాని వెదికి తీసుకొచ్చారు. బడేబాబా కూర్చోనిదే సాయి భోజనాన్ని ముట్టడు కదా! సాయి ప్రారంభించనిదే భక్తులు కూడా ప్రారంభించరు గదా! అదీ అప్పటి స్థితి. ఎవరికీ ఏం తోచడం లేదు.బడేబాబాని ఇలా మర్యాదపూర్వకంగా ఆప్యాయతతో భోజనానికి పిలవడం, ఆయన వచ్చి తన సరసన కూర్చుని ఆయన భోజనాన్ని ముట్టుకున్నాక తాను భోజనాన్ని ప్రారంభించడమనే ఈ పద్ధతిని అందరు భక్తుల సమక్షంలోనూ సాయి చేస్తూ ఉండటం ఎందుకంటే… అతిథి అనేవాడు లేకుండా తానొక్కడే తినకూడదని, ఆ అతిథిని కూడా గౌరవపూర్వకంగా ఆహ్వానించవలసిందే తప్ప చేతి సంజ్ఞని చేస్తూ చోటుని చూపించడం సరికాదనీ, అతిథి తన భోజనాన్ని ముగించాక యథాశక్తి దక్షిణని ఇచ్చి, కనీసం నూరు అడుగులైనా ఆయనతో వెళ్తూ ఆయన్ని సాగనంపి రావాలనీ, దాన్నే అతిథి సత్కారమంటారనీ అందరికీ తెలియజెప్పడానికే సాయి ఇలా చేస్తూ ఉండేవాడు రోజూ.

     అలాంటిది, అంత గొప్పగా తాను భావించే అతిథిని, అది కూడా ఎవరో అతిథి కాకుండా బడేబాబాని ‘మేకని చంపవలసిందే’ అని ఆజ్ఞాపించడమా? అది కూడా ఈ సమయంలోనా? అని అంతా ఆశ్చర్యపోతూ ఉంటే బడేబాబా ‘నిష్కారణంగా ఈ మూగజీవిని నేనెందుకు చంపాలి?’ అని సాయిని ప్రశ్నించాడు. సాయి వెంటనే అక్కడే ఉన్న ‘శ్యామా’ అనే మరింత సన్నిహిత భక్తుడ్ని చూస్తూ ‘పోనీ! నువ్వైనా సరే కత్తి తెచ్చి ఒకే ఒక్క వేటుతో దీని తల నరికెయ్యి! పో! కత్తి తెచ్చుకో! వెళ్లు వెంటనే!’ అన్నాడు. నిజానికి శ్యామాకి కూడా మనసు నిండుగా చెప్పలేనంత బాధ వస్తోంది ఆ జాలి గొలుపుతున్న మేకని చూస్తుంటే. బడేబాబాలాగానే తనకీ అనిపిస్తోంది ‘నిష్కారణంగా ఆ మూగజీవాన్ని తాను చంపడమా?’ అని. ‘అసలు అలాంటి మూగజీవిని చంపబోతున్నా చూడలేమే! మరి దాన్ని నేను నా చేతులతో చంపడమా?’ అని లోలోపల కుమిలిపోతూ అది సాయి ఆజ్ఞ అనుకుంటూ చక్కని వంటలని భక్తితో శ్రద్ధతో సకాలంలో వండి పంపించే రాధాకృష్ణమాయి దగ్గరికెళ్లి కత్తి తెచ్చి ఆ కత్తిని సాయి ముందు పెట్టాడు శ్యామా. ఇంతలో భక్తుల ద్వారా రాధాకృష్ణమాయికి కత్తి విషయం తెలిసి దాన్ని ఓ మూగజీవిని బలిని ఇచ్చేందుకు ఉపయోగించవలసివస్తే వద్దు! కత్తిని తిరిగి తెచ్చేయవలసిందని రాధాకృష్ణమాయి కబురు చేసింది సభామండపానికి.

     సాయి ఈ విషయాన్ని తెలుసుకుని.. కొద్ది దూరంలో ఉన్న శ్యామానే మళ్లీ పిలుస్తూ ‘సరే! మరోచోటి నుంచి కత్తిని తెచ్చి ఒకే ఒక్క వేటుకి దాని తలని నరికెయ్యి!’ అని ఆజ్ఞ చేశాడు. భక్తులందరికీ ఈ మేక తలని నరకడంలో సాయి చూపిస్తున్న పట్టుదలకి ఆశ్చర్యం అనిపిస్తోంది. మేక ప్రాణాలు ఎలా పోతాయోనని బాధగా ఉంది! ఆ సంఘటనకి సాక్షిగానూ, ఏ దోషం చేసిందో ఎవరికీ తెలియని ఓ ముద్దాయిలా నిలబడి, అమాయకంగా మరణశిక్ష పడుతుందని కూడా తెలియని తీరులో నిలబడి ఉంది మేక.‘కర్ర విరగకుండా.. పాము చావకుండా..’ అనే సామెతకి ఉదాహరణగా శ్యామా కత్తిని తేవడానికి వెళ్లినట్లుగా వెళ్లి ఎంతసేపటికీ రాకుండా ‘ఓడ’లో కూర్చుండిపోయాడు. మేక ఎవరి చేతిలోనూ చంపబడకూడదని, తన చేతితో తాను నరకనే నరకకూడదని శ్యామా దృఢసంకల్పం. అందుకే సాయి ఆజ్ఞకి కట్టుబడినట్లే ఉంటూ అక్కడే ఉండిపోయాడు. ఎంతసేపటికీ శ్యామా రాకపోయేసరికి సాయి మరో సన్నిహిత భక్తుడైన ‘కాకా’ని పిలిచి.. ‘కాకా! తొందరగా నువ్వైనా ఈ పనిని ముగించెయ్యి’ అన్నాడు. కాకాలో అంతర్మధనం ప్రారంభమైంది. మేలిమి బంగారంతో సమానమైనవాడివని తనని సాయి అనేక పర్యాయాలు అన్నాడు. చెప్పిన ఆజ్ఞని పాటించేవాడివని కూడా అంటుంటాడు. అలాంటి తనని ఈ అకృత్యాన్ని చేయవలసిందేనని సాయి ఆజ్ఞాపిస్తున్నాడంటే ఏదో అంతరార్థం ఉండే ఉంటుంది. ఇప్పటికే తన ముందు ముగ్గురు ఆ పనిని చేయడానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ విముఖతని చూపిస్తే.. ఆ పనిని సాయి తనకి పురమాయిస్తున్నాడంటే.. ఏదో ఉండే ఉంటుంది దానిలో ఓ రహస్యం.

     వజ్రం ఎంతో గొప్పది. ఎంత కొట్టినా పగులనితనంతో దృఢంగా ఉంటుంది. అలాంటి వజ్రాన్ని కూడా చక్కనైన నగలో అమర్చాలంటే దానికీ కోత తప్పదు. నగిషీకోసమని సాన మీద అరగదీయడం తప్పదు. ఒక సన్నని తీగని చుట్టి ఆ వజ్రాన్ని మంచి వేడితో మండిపోయే కొలిమిలో కాల్చడం తప్పదు. అది ప్రకాశించాలంటే, దాని గొప్పదనం తెలియాలంటే, లోకానికి తెలియజేసేలా చేయాలంటే.. ఈ చిత్రహింసలు, మనం అనుకునే ఈ తీరు పరీక్షలు దానికి తప్పవు. మరి ఈ కఠిన పరీక్షలన్నీ వజ్రానికే ఉంటాయి గానీ, మామూలు రాతికి ఉండనే ఉండదు కదా!… అని ఈ తీరులో ఆలోచించుకుంటుంటే.. ఇంకా ఆలస్యం చేస్తున్నావేమి? అన్నట్లు చూశాడు సాయి. దాంతో తాను గురువు ఆజ్ఞని ధిక్కరిస్తూన్న భావం మనసులో మెదిలింది. ‘నేను చేసే దానిలో, చేస్తున్న దానిలో ఏదైనా తప్పుగానీ ఉంటే అది సాయి–నామజపం వల్ల పూర్తిగా తొలిగిపోయి తీరుతుంది’ అని దృఢభావంతో కత్తి కోసం బయలుదేరాడు. తనకి ఏ హానినీ చేయని ఆ మూగజీవిని చంపడమనే పాపం కంటే గురువు ఆజ్ఞని ధిక్కరిస్తూ ఇందరు భక్తుల మధ్య గురువుని తృణీకరించినవాడు’ అని అన్పించుకోవడం మహా పాపం అనుకున్నాడు. అయినా సాయినామజపమనే ఔషధం తనదగ్గరే ఉన్నప్పుడు ఈ మనోవ్యాధి తననేం చేస్తుంది? అనే దృఢధైర్యంతో పదును చూసుకుని మరీ కత్తిని తెచ్చుకోవాలనుకున్నాడు. దానికి కారణం సాయి ఆజ్ఞ ప్రకారం దాని మెడ ఒక్కవేటులోనే తెగిపోవాల్సి ఉంది కాబట్టి. గురువు ఆజ్ఞని పాటిస్తున్న తనకి పుణ్యం లభిస్తుందనే నమ్మకం తప్ప కాకాకి మరో ఆలోచనే రావడం లేదు, రాలేదు. భక్తులందరూ కాకా కూడా శ్యామాలాగానే ఎక్కడకో వెళ్లి రాకుండా ఉండిపోతాడని అనుకున్నారు. అయితే కాకా మాత్రం ‘సాఠేవాడా’ అనే ప్రదేశానికి వెళ్లి, కత్తినీ దాని పదునునీ నిశితంగా పరిశీలించుకుని, తన వెంట తెచ్చుకుని సాయి సమక్షానికొచ్చాడు. భక్తులందరికీ భయం, ఉద్వేగం, ఆశ్చర్యం, మూగజీవి పట్ల జాలి.. అయ్యో! అనే భావాలు కలుగుతున్నాయి.

     కాకా తన ధోవతిని ఎగగట్టాడు. చొక్కా చేతుల్ని పైకి మడుచుకున్నాడు. మేక వద్దకి వెళ్లాడు. లోపల ఆలోచన ప్రారంభమైంది. తాను పుట్టుకతో బ్రాహ్మణ కులానికి చెందినవాడు. సహజంగానే కోమల స్వభావం, చెప్పలేని కరుణా, అంతేకాక తన వంశంలో మాంసాహారం కాదు గదా కోడిగుడ్డుని కూడా వాడని వాడైన కారణంగా హింసాభావమే ఉండదు. ఆ కారణంగా ఈ మూగజీవిని చంపడమా? అనే ఆలోచన మళ్లీ ప్రారంభమైంది మనసులో. ఆ మేక మాత్రం వెర్రి చూపులు చూస్తోంది.‘గురుకార్యం కర్తవ్యం’ అనే దిటవుతో రెండు చేతులతో కత్తిని గట్టిగా పట్టుకుని ఆ మేకని నరకడం కోసం సిద్ధమై ‘సాయీ.. తలని నరుకుతున్నా..!’ అంటూ మేక మెడని చూస్తున్నాడు నిశితంగా. హఠాత్తుగా అతని మదిలో జాలి ప్రారంభమైంది. కత్తి పట్టిన చేతులు వణుకుతున్నాయి. అడుగులు వెనక్కి పడుతూ ముందుకి రాలేక మేకమెడకి సూటి తప్పుతూ ఉంటే.. సాయి ఆ పరిస్థితిని గమనించి.. ‘చూస్తావేం? నరుకు!’ అన్నాడు బిగ్గరగా. మేకకి అదే చివరి శ్వాస అనుకుంటూ కాకా ఓ మారు సాయినామాన్ని జపించి, తలని తెగగొట్టడం కోసం కత్తిని దృఢంగా పట్టుకుని, బలంగా ఎత్తి వేటు వేసెయ్యబోతుంటే సాయి బిగ్గరగా అరుస్తూ… ‘ఆగాగు! దాన్ని చంపుతావేమిటయ్యా? ఏం అపకారం చేసింది నీకు? మూగజీవి కదా! పైగా మరణాసన్న (చావుకి సమీపించిన) స్థితిలో ఉంది కదా! అంతేకాక నువ్వు బ్రాహ్మణుడివి! చంపవచ్చునా?’ అనగానే కాకా కత్తిని కిందపడేశాడు.

     ఎవ్వరికీ ఏం అంతుబట్టడం లేదు. ఎందుకు చంపమన్నాడో…? ఎవరికి వాళ్లు తప్పించుకుంటూంటే పట్టుబట్టి చంపడానికి సిద్ధపడేంతవరకూ ఎందుకు ప్రోత్సహించాడో…? చివరికి గుండెధైర్యంతో మనసుని చంపుకుని, చంపబోయేసరికి వద్దని ఎందుకు నివారిస్తున్నాడో..? ఎవరికీ అర్థం కాలేదు. సాయి అన్నాడు. ‘కాకా..! ఇలారా!! ఇది నిజంగా చావుకి సమీపంగా ఉన్న మేక. చూడు ఎంత దుర్బలంగా ఉందో! దీన్ని తెచ్చి ఇచ్చాడు ఆ వ్యక్తి ఎవరో, దీన్ని సంప్రదాయబద్ధమైన పద్ధతిలో ‘‘హలాల్‌’’ చేస్తాను. నీటి పాత్రని పట్టుకో!’ అన్నాడు. ‘‘హలాల్‌’’ అంటే చావబోతున్న మేక చెవిలో ఖురాన్‌ మంత్రాలని కొన్నింటిని చదవడం అని అర్థం. అలా చదివి, దాని కట్టు నుంచి తొలిగించారు. అంతే! అది కొద్ది దూరం అడుగులు వేసి, తనంత తానే చనిపోయింది అందరూ చూస్తుండగానే. నేర్చుకోవలసిందేమిటి? ఈ మేకకి మాత్రమే చావు లేదు. మనందరం కూడా అలాంటి మేకల్లాంటి వాళ్లమే. అక్కడెవరో ఓ వ్యక్తి సాయికి ఆ మేకని బహూకరించినట్లు, మనల్ని కూడా మన తల్లిదండ్రులు ఓ శరీరాన్ని ఇచ్చి, ఈ లోకంలో ఓ ప్రాణిగా అందించారు. ఈ శరీరానికి ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా మరణమనేది తప్పదు. ఆ విషయం మనకెందుకు గుర్తుండదు. మన ముందే ఎందరో చనిపోతున్నా, వాళ్ల అంత్యక్రియలకి వెళ్లి అక్కడి కార్యక్రమాలని చూసి వస్తున్నా, ఆ నిరాశ, వైరాగ్యమనేవి ఏ ఒక్కటో రెండు రోజులు మాత్రమే ఉంటూ ఆ మీదట మర్చిపోతూ ఉంటాం.

     కాలం అనేది మేకని చంపడానికి ఉపయోగించబడే కత్తి లాంటిది. ఆ కాలమనేది ఎవరి కారణంగా, ఏ స్థలంలో, ఏ తీరుగా, ఎందుకు మూడుతుందో తెలియదు. అందుకే చంపాలన్న ఆజ్ఞని వింటూనే ‘ఎందుకు?’ అన్నాడు బడేబాబా. కత్తి కోసం వెళ్లి అక్కడే ఉండిపోయాడు శ్యామా. ఏ మాత్రమూ ఇష్టంలేక ప్రయత్నించి విఫలుడయ్యాడు కాకా. భగవంతుడనే వాడు కూడా మన మరణాన్ని అనేక పర్యాయాలు ఇలాగే ఏవో కారణాలతో వాయిదా వేయిస్తూ ఉంటాడు. దాని కోసమే మనం నామజపాన్ని చేయవలసి ఉంటుంది. మేకని చంపదలిచి ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నా మేక అమాయకంగా చూస్తోందే తప్ప కట్టు విడిపించుకుని పారిపోయే ప్రయత్నాన్నే చేయడం లేదు. అందరు భక్తులున్నా ఎవరూ సాయి ఆజ్ఞకి వ్యతిరేకాన్ని చెప్పడం లేదు. భగవంతుని ఆజ్ఞ దాట వీలులేనిది. ఎదురు తిరిగే శక్తిని ఎవరికీ ఇయ్యనిది. ఏదో మనం చేసుకున్న పుణ్యాల కారణంగానే మనకి చావు సమీపించి ఉన్న ఏవేవో కారణాల ప్రకారం ఆ విరోధించే వ్యక్తులు వెనుకడుగు వేస్తూ ఉంటారు. ఆ ఇబ్బంది తప్పినప్పుడల్లా అది మన సామర్థ్యం, మేధావితనం, నేర్పరితనం అని మనమనుకుంటాం తప్ప అదంతా దైవకృప అని అనుకోం. ఇలాంటి మరణాసన్నస్థితిలో ఉండి కూడా కావాలని ఎవరికో హానిని తలపెట్టడం, బాకీలని తీర్చకపోవడం, దౌర్జన్యాలు చేయడం, తల్లిదండ్రులకి మనస్తాపాన్ని కల్పించే పనుల్ని చేయడం.. వంటి ఎన్నింటినో బాగా తెలిసి కొన్నింటినీ, తెలియక కొన్నింటినీ చేస్తూనే ఉంటాం.ఆ మేకకి సాయి ‘హలాల్‌’ చేసినట్టుగా మనకి కూడా సాయిలాంటి యదార్థ గురువు మంత్రోపదేశాన్ని చేసినట్లయితే అప్పుడు లభించే మరణం స్వచ్ఛందమరణం లాంటిదే. అదే ఆత్మకి శాంతినిస్తుంది. ఇంతటినిగూఢార్థాన్ని అర్థం చేయించేందుకే సాయి ఈ ఘాతుక సంఘటనని మన ముందుంచాడు తప్ప సాయి మాత్రం పరమ దయార్ద్రహృదయుడే!

       యదార్థ భాగవద్భక్తుడైన మహమ్మదీయుని వద్దకి వెళ్లడం, ఆయన్ని గురువుగా భావించడం వల్ల అపవిత్రత వస్తుందా? అనే అంశాన్ని రేపు చూద్దాం!

Q జ్యోతిష్య శాస్త్రాం పై బాబా అభిప్రాయం ఏమిటి ??

ఈ విషయం క్లుప్తంగా తెలుసుకోవాలి అంటే ముందుగా మనం సత్చరిత్రలోనికి వెళ్ళాలి బాబు టెండుల్కర్ అనే ఓ వ్యక్తి బాబా భక్తుడు అతడు వైద్య శాస్త్రాన్ని అభ్యసిస్తున్నాడు అతడు ఓ రోజు తన స్నేహితుని  ద్వారా అనుకోకుండా ఓ జ్యోతిష్యుని కలవడం ఆ జ్యోతిష్యుడు టెండుల్కర్ కి నువ్వు ఈ సంవత్సరం పరీక్ష తప్పుతావు అని చెప్పడం దానితో నిరాశచెంది పరీక్ష మనేయ్యాలి అనుకోవడం జరిగే సరికి టెండుల్కర్ తల్లి బాబాని కలవడం బాబా ధైర్యం చెప్పి జ్యోతిష్యాన్ని పక్కన పెట్టి నాపై నమ్మకంతో పరీక్ష రాయమనడం జరుగుతుంది టెండుల్కర్ బాబా మాటలపై విశ్వాసం ఉంచి జ్యోతిష్యాన్ని పక్కన పెట్టి పరీక్ష రాసి ఉత్తీర్ణత చెంది సంతోషంగా ఉన్నాడు.

ఐతే చాలా మంది బాబా ఉద్దేశ్యాన్ని బాబా సందేశాన్ని బాబా చెప్పాలి అనుకున్న దానికి వ్యతిరేకంగా అర్ధం చేసుకుంటారు. పైన చెప్పిన కథ ఆధారంగా బాబాకి జ్యోతిష్యం పై విశ్వాసం లేదు అని కాదు బాబా ఉదేశ్యం నమ్మకం నా పై ఉంచితే మీ జీవితాలలో ఉన్న కర్మలను ,తలరాతలు కూడా నేను మార్చగలను అని చెప్పే ప్రయత్నమే ఈ టెండుల్కర్ కథ లో ఉన్న అంతరార్ధం .

బాబా అన్ని మతాల ఆచారా వ్యవహారాలను ఎంతగానో గౌరవించేవారు ముందు మన గురువు మనస్సు ని అర్ధం చేసుకుంటేనే గురువు వాక్కును, గుణాలను,బోధనలను అర్ధం చేసుకోగలం .

     బాబాకు భోజనం పెడదామా!

     సాయి గొప్పదనాన్ని వినడమే కాదు… ప్రత్యక్షంగా కూడా ఎన్నో నిదర్శనాలతో సహా చూసిన తాత్యా (తాత్యా పటేల్‌) దంపతులు ఎప్పుడు తమకు కొంత ఖాళీ దొరికినా వెంటనే షిర్డీ గ్రామానికి వచ్చేస్తుండేవారు. ’సర్వస్య శరణా గతిః’ అన్నట్లు సాయి దగ్గరే ఉంటూ ఆయన ఏం చేస్తే దాన్ని చేయడం.. ఆయన దేన్ని వద్దంటే ఆ పని తమ మనసుకి ఇష్టమైనదైనా సరే మానేయడం.. ఇలా సాయికి నీడలాగ ఉంటూ ఉండేవారు. కొందరికి అనిపిస్తుండేది.. ‘ఇక వీళ్లకు ఇట్లా పనీ పాటా, గొడ్డు గోదా, ఉద్యోగం సద్యోగమంటూ ఏమీ లేదా?’ అని.. తాత్యా దంపతులు ఒకేమాట అంటుండేవారు. మాకు ఇళ్లు లేకా కాదు.. పని పాటా ఉండక కాదు.. అన్నీ ఉన్నాయి కానీ ప్రతిపనిలోనూ.. ప్రారంభంలోనూ.. మధ్యలోనూ..ముంపులోనూ ఒక అశాంతి ఉంటుంది. లేదా అసంతృప్తి కలుగుతుంది, కలిగే వీలు ఉంటుంది. అయితే సాయి సన్నిధిలో ఆ అసంతృప్తి, నిరాశ, అశాంతి అనేవి మచ్చుకి కూడా ఉండవు. తల్లి దగ్గర ఉన్న దూడకు మరో ఆలోచన ఎలా ఉండదో .. గూటిలో అమ్మతో ఉన్న పక్షి పిల్లకి ఆకాశంలో ఎగురుదామనే ఊహ ఉన్నా ఎలా ఇష్టం పుట్టదో అలా ఇంత విశాల ప్రదేశం మాకంటూ తిరగడానికి ఉన్నా శరీరంలో ఓపిక ఉన్నా.. ఖర్చు చేసుకుని తిరిగే ఆర్థిక శక్తి ఉన్నా ఇక్కడ ఉంటే వచ్చే ఆ ఆనందం ఎక్కడా మరెక్కడా ఉండదు. లేదంతే. ఇక మాకు ఇదే కాశీ, ఇదే మాకు ప్రయాగ, ఇదే మాకు ద్వారకా, మీరు ఏ పుణ్యక్షేత్రాలు ఉన్నాయంటున్నారో అవన్నీ మాకు మాకోసం షిర్డీకే వచ్చేశాయి. అందుకే మేము రోజుకో పుణ్య క్షేత్రానికి వచ్చిన ఆనందంతో సాయిసన్నిధిలో గడుపుతూ ఉంటామని స్పష్టమైన అవగాహనతో, విశ్వాసంతో చెబుతూ ఉండేవారు.

      అంతటి శరణా గతి ధర్మం ఉన్నవాళ్లు ఆ దంపతులు. ఇలా ఉంటే ఒక రోజున తాత్యా భార్య సాయి దగ్గరకు వచ్చి మౌనంగా నిలబడి చూపులతో ఆయన్నేదో ప్రార్థించినట్లుగా చూసింది. సాయి ఆమెను చూస్తూ ‘‘సందేహించకు..! అడిగేది ఏదో అడుగు.. ఆలోచనను లోలోపల దాచేసుకోవడం పిరికితనానికి చిహ్నం. తప్పు పని గురించి అడుగుతున్నామేమో అనే భయానికి సాక్ష్యం అడుగు’’ అన్నాడు. వెంటనే చెప్పలేనంత ఉత్సాహంతో ఆమె సాయికి సాగిలపడి లేచి ఆయన మొఖంలోకి చూస్తూ.. ‘దేవా ! ప్రతి రోజూ నేను విందును తీసుకొస్తే ఆరగిస్తున్నావు కదా.. ఈ దీనురాలి ప్రార్థన మన్నించి ఒక్కసారి మా ఇంటికి వచ్చి ఎందుకు ఆరగించకుడదూ..?  నీకు ఏమేమి పదార్థాలు ఇష్టమో ఆ పదార్థాలు నాకు తెలుసు.. వండే అవకాశం నాకు ఉంది. దయచేసి రావూ?’ అని అడిగి ఆయన ఏమంటాడో అని అలా చూస్తూ మౌనంగా ఉండిపోయింది. ఆయన సమాధానం ఇవ్వకుండానే.. ‘సాయి! మా ఇల్లు ఇక్కడకు చాలా దగ్గర. పైగా సమయం పాటించే లక్షణం కూడా మా దంపతులది.

     నిన్ను రప్పించి నువ్వొచ్చాక నేను ఆలస్యం చేయను నీ భోజనానికి దయచేసి రావూ !’ అంది. సాయి నవ్వుతూ ‘అమ్మా..! భిక్షం కోసమని అన్ని వీధులు తిరిగే నాకు దగ్గర దూరం అనేది ఓ లెక్కా? ఇక బిడ్డకు అన్నం పెడతానని తల్లిలా నువ్వు అంటుంటే ఎందుకు రానూ.. పిలవడమే ఓ అదృష్టంగా భావించి వచ్చి తీరుతాను.. నువ్వన్నావే సమయ నియమాన్ని పాటిస్తున్నానని.. దానికి సరిపోయేలా 5 కొట్టేసరికల్లా మీ ఇంటికి వస్తాను. భిక్షగాడైన నాకు మీ ఇంటి చిరునామాను, దూరాన్ని వివరించి చెప్పాలి కూడానా..? నాకు పోళీలు (మహారాష్ట్ర వంటకం) బాగా ఇష్టమని తెలిసిందంటున్నావే..! తల్లికి కదమ్మా బిడ్డకు ఇష్టమేదో తెలుస్తుంది. సరే రమ్మంటున్నావుగా వస్తాను అన్నాడు. అంతే ! ఆమె ఉరుకులాంటి నడకతో ఇంటికి వెళ్లి వంటింటిని ఒకటికి రెండు మార్లు శుభ్రం చేసి ఏ ఒక్కరిని కూడా సహాయానికి పిలవకుండా అంతా తానే చేసి సాయికి వడ్డించాలనే ఆనందంతో మొత్తానికి పోళీలని చక్కగా చేసింది. మంచి వెండిపళ్లెంలో చక్కగా సర్ది మరీ పెట్టింది.

     ఇటు వంటకాన్ని చేస్తుండడం అటు గడియారాన్ని చూస్తూండడం.. ఇలా మొత్తానికి 5 గంటల ముందే అంటే 4 గంటలకే సిద్ధం చేసి సాయి రాకకోసం ఎదురు చూస్తూ గుమ్మం దగ్గరే కూచుంది ఈ వీధిలోకి కళ్లని ప్రసరింపజేస్తూ. వంటింటి ముందున్న గదిలో అగరువత్తుల ధూపాన్ని బాగా వేసి మరీ ఆమె ఎదురు చూస్తూ ఉండిపోయింది.సమయం 4 దాటింది. నాలుగున్నర అయింది. సాయికి ముగ్గులు బాగా ఇష్టం కదా! అని ఆ వడ్డించబోయే గదిలో ముగ్గులు వేయడం ప్రారంభమయింది అటు 5 గంటలనే మాట గుర్తుంచుకుని. ఈ పనిధ్యాసలో ఈమె ఉండగా ఎక్కడినుండో ఓ నల్లకుక్క గబగబా ఇంట్లోకి దూరి ఆ పోళీలని తినడం కోసం నోరు తెరిచి పళ్లెం దగ్గరకి వెళ్లింది. వెంటనే అపరిమిత కోపం వచ్చిన ఆమె– పాడుకుక్కా! సాయికోసం నైవేద్యంగా పెడితే నువ్వెక్కడ దాపురించావంటూ దగ్గర్లో కర్ర కనపడబోతే చిన్న ఇనుప కడ్డీని దాని మీదికి విసిరింది. అది దానికి తగిలి బాధతో అరుచుకుంటూ వెళ్లిపోయింది. సమయం ఆరు ఆరున్నర ఏడు కూడా అయింది. ఎంతో నిరాశతో ఆమె సాయి మందిరానికి ఈ పోళీలున్న పళ్లాన్నే పట్టుకుని వెళ్లింది.

     సాయి అప్పటికి తన భక్తులూ శిష్యులైన వాళ్లందరి మధ్యా కూర్చుని ఈమెని ఉద్దేశిస్తూ– ‘చూశారా! ఈమెకెంత కోపం వచ్చిందో! నన్ను విందుకి పిలిచింది తన ఇంటికి. నేను వస్తానని కూడా అన్నాను. తీరా నేను కచ్చితంగా ఆమెతో అన్నట్టుగానే ఆమె కూడా ఒప్పుకున్నట్టుగానే 5కే వెళ్లాను ఆమె ఇంటికి. మంచి ముగ్గులు వేసింది. అగరు ధూపం వేసింది. ఇదుగో! ఈ వెండిపళ్లెంలోనే పోళీలని చూడముచ్చటగా కూడా సర్ది ఉంచింది.అయితే ఏం లాభం? నేను తినబోయేసరికి ఓ ఇనుప కమ్మీని నా మీదికి విసిరింది. భయంతో అరుచుకుంటూ  పారిపోయి వచ్చానని ఆమె వంక చూస్తూ ముగించాడు. ఆమె ఆశ్చర్యానికి అంతులేదు. మహల్సాపతితో పాటు అక్కడున్న భక్తులందరికి ముందు ఏమీ అర్థం కాకపోయినప్పటికీ ఆమె వివరించిన విషయం తెలిసి అందరూ నివ్వెరపోయారు. ఆమె మళ్లీ సాయిని ప్రార్థిస్తూ.. ‘సాయి దేవా..! జరిగిందేదో జరిగిపోయింది నాదే తప్పు. పొరపాటైంది మన్నించు. ఇన్నినాళ్ల నుంచి నిన్ను సేవిస్తున్నా నీ తత్వం తెలియని అజ్ఞానిని. మన్నించు. రేపు సాయంత్రం ఇదే సమయానికి మాల్‌ పూరీలను పానకంలో ముంచి సిద్ధం చేసి ఉంచుతాను. నీ కోసం ఎదురుచూస్తుంటున్నానని దీనాతిదీనంగా పలికింది.

     సాయి అన్నాడు.. ‘‘తల్లీ ! అంత దీనంగా వేడుకోవాల్సిన అవసరం లేదు. నేను తప్పక వస్తాను. విందు ఆరగిస్తాను. సరేనా’’ అన్నాడు. అంతే! ఆమె కిందటి రోజులాగే.. అంతా సిద్ధం చేసుకుని కూర్చుంది. మాల్‌ పూరీలను పానకంలో ముంచి ఉంచేసరికి ఆ చక్కని సువాసన ఆ వీధి వెంట వెళుతుంటే అందరి ముక్కుపుటాలకు తాకనారంభించింది. ఏదో విశేషముందని అందరూ లోపలికి రాబోతుంటే ఆమెకు ఒక పక్కసాయేనేమో అని భయం. మరోపక్క ఇతడు.. వాడు నాకు తెలిసిన వాడే కదా అని ఊరటా.. ఇంతలో ఏ కుక్క వస్తోందని ఆత్రుత. కుక్క వచ్చినా సాయిలానే భావిద్దామని ఉత్సాహం. కొన్ని కుక్కకు పెట్టి మరికొన్ని సాయికి పెడదామనే ఆలోచన. ఒకటేమిటి వేలవేల ఊహలు.. ఆపోహలు ఆమెకు మనసులో అలా తాండవించ సాగాయి. అటు వీధిని.. ఇటు ఇంటిని మరోవైపు వచ్చి పోతూ వినోదంగా చూస్తుండే మనుషులను చూస్తుంటే ఎక్కడ నుంచో ఒక పెద్ద దున్నపోతులా ఉన్నటు వంటి శరీరంతో కనిపిస్తున్న గవిడిగేదె తన ముందు కాళ్ల రెంటిని లోపలి గదిలోనికి పెట్టి ఆనందంతో అంబా అని అరుస్తూ లోపలికి పోబోయింది. చెప్పలేని కోపంతో కర్రతో బలంగా కొట్టి పంపేసింది ఆమె. అంతకుముందు తను ఎప్పుడూ చూడని.. ఎన్నడూ రాని కుక్క వచ్చింది కాబట్టి ‘సాయి’ అని గుర్తించలేకపోయాను గాని, ఈ గేదెని ఎప్పుడూ చూస్తూనే ఉంటాను కాబట్టి ఇది సాయి రూపం కానేకాదనుకుని తనకు తాను సమాధానపడిందామె. అనుకున్నట్టుగా 5 దాటింది. ఐదున్నర ఆరుకూడా అయ్యింది.

     ఆరు దాటింది. మళ్లీ నిన్నటి లాగానే తీవ్ర నిరుత్సాహంతో ఆ వంటకాన్ని తీసుకుని సాయి తన భక్తులకి ఏదో అధ్యాత్మిక విశేషాలను వివరిస్తున్న ఆ మందిరానికి వెళ్లి సాయికి నమస్కరించబోయింది. వెంటనే సాయి తన భక్తులందరితో ‘ఈ అమ్మ పిలిచింది కదా ఈ బిడ్డని’ అనే అభిప్రాయంతో ఆమె ఇంటికి సకాలంలో వెళ్లి ఎప్పుడు తిందామా? అనే ఆకలి కడుపుతో పోతే వెంటనే బలంగా కర్ర తీసుకుని మోదింది. చూడండి బలంగా ఎంత దెబ్బ నాకు తగిలిందో! ఇదేదో ఆమె ఇష్టంగా పిలిస్తే నేను నిందని ఆమె మీద వేస్తున్నానేమిటని భావించకండి అంటూ తన కఫ్నీ (పెద్ద పొడుగాటి చొక్కా) పైకెత్తాడు. బలంగా కర్రతో కొట్టిన వాత అందరికీ కనిపించింది. తాత్యా భార్యకి మాట రాలేదు. రెండుసార్లు అపచారం చేశాననే మనోబాధ పెల్లుబికింది. నిన్నయితే ఇనుపకమ్మీని విసిరిందే గాని కుక్క తప్పించుకుంది. ఈ రోజున ఆ గేదెకి తగలనే తగిలింది. అది కాస్తా సాయి శరీరానికే తగిలిందని బాధపడుతూ అనేక పర్యాయాలు క్షమించవలసిందంటూ సాయిని ప్రార్ధించింది. ‘అమ్మా! నేను ఈ భౌతిక శరీరంలో వస్తేనే కాని వచ్చినట్టుగా భావించకు.. అన్ని రూపాల్లోనూ సాయి ఉన్నట్టుగా భావించి ఏది ఆ సమయానికి నీకు కనబడినా నాకు పెట్టినట్టుగానే భావించు. నేను కోరుకునేది కూడా భూతదయ ఉండాలనే’.

     జీవించి ఉన్న ప్రతి ప్రాణినీ భూతమంటారు కదా! నేనూ ప్రాణినే. నువ్వూ ప్రాణివే. ఇక్కడ అందరూ కూడా ప్రాణం ఉన్నవాళ్లు కాబట్టి అందరూ కూడా భూతాలే. గుర్తుంచుకో! అన్నాడు సాయి. ఆమె కన్నీరు కారుస్తూ దీనాతిదీనంగా నిలబడితే ఆమె లోపలి భావాన్ని గ్రహించిన సాయి.. తల్లీ! ఇదిగో ఊదీ (విభూతి) నిచ్చాను తీసుకో! సాయంత్రం 5 కే వస్తాను. చక్కని పేణీలనే సిద్ధంగా ఉంచు! అవే నాకు ఇష్టం కదా! అన్నాడు. పరుగు లాంటి నడకతో ఆమె ఇల్లు చేరి మధ్యాహ్నం 2 గంటలకే పేణీలని సిద్ధం చేసి ఇక 5 గంటలకి ఏ కుక్క వచ్చినా గేదె వచ్చినా ఆవు వచ్చినా.. ఇక ఏది వచ్చినా దాన్నే సాయిరూపంగా భావించాలనే అభిప్రాయంతో దృఢంగా నిశ్చయబుద్ధితో ఉండిపోయి ఎదురుచూడ సాగింది. సాయి వచ్చే మార్గమంటూ తమయింటిని ఒకటే ఉండటం వల్ల ఆమెకి అటూ ఇటూ చూడాల్సిన అవసరం తప్పింది. తగిన విధంగా గది తలుపులు దగ్గరకి వేసి సాయి రావలసిన తోవనే చూస్తూ ఉండిపోయింది. ఎందుకు సమయాన్ని వ్యర్ధపరచాలనుకుంటూ సాయి సంకీర్తనాన్ని శ్రావ్యంగా తాను పాడుతుంటే ఆ సమీపంలో ఉన్న గృహిణులు కూడ గొంతు కలిపారు. మొత్తానికి ఆ ఇల్లు వాయిద్యధ్వనితో నిండిన ఓ సంగీతవేదికలా అన్పించింది అందరికీ. ఆమెకి నిన్న రాత్రి నిద్రపట్టలేదు. దానిక్కారణం సాయిని కర్రతో కొట్టాననే తీవ్ర మనోవేదన. పైగా ఇంటికి పిలిచి కొట్టానుకదా! అనే దుఃఖం. మళ్లీ అంతలోనే ‘నాకు సాయియే అనే భావం ఉంటే అలా చేసి ఉండేదాన్ని కాదు గదా!’ అనే దోషంలేని ఊహ.

     ఇలా ఊహా అపోహా నేరమూ శిక్షా.. ఈ తీరు భావనలతో ఉండిపోయింది. 5 అయింది. అయిదున్నర అయింది. సాయి జాడలేదు. దిక్కుతోచని ఆమె ఆ పేణీలని పెట్టిన పళ్లాన్ని తీసుకుని సాయి ఉన్న మసీదు వద్దకి వెళ్దామని లోనికి వచ్చి చూసి వాటికి పట్టిన గండు చీమల్ని దులిపి మసీదులో సాయి వద్దకి వెళ్లి నమస్కరిద్దామనుకుని ఆయన్నే ప్రార్ధించి రప్పించాల్సిందే! అనుకుంటూ ఆయనకి మొక్కింది. సాయి ఆమెని చూస్తూనే.. అమ్మా! పేణీలు ఎంత రుచిగా ఉన్నాయమ్మా.. చాలా చక్కగా చేశావు నాకోసం! ఇంత ప్రేమతో నాకు ఆ వంటకాన్ని నువ్వు పెట్టావుగా! కడుపు మొత్తం నిండిపోయింది. నాకెంతో ఇష్టమైన తీపిని సమపాళ్లలో పెట్టి మరీ సిద్ధం చేశావు. ఇక ఇలా నాకు తీపి పదార్ధాలని సిద్ధం చేస్తూ అస్తమానం పిలుస్తూ ఉంటే నా ఆరోగ్యం కూడా చెడిపోతుంది! చాలునమ్మా.. అంటూ పూర్ణిమచంద్రుని లాంటి నవ్వుని నవ్వాడు సాయి. ఆమెకేమీ పాలు పోలేదు. ‘వంటకమంతా ఇంట్లో ఉంటే ఆయనెప్పుడు తిన్నాడు?’ అనేది ఆమె చింత–అనుమానం.

     ఆ స్థితిని గమనించిన సాయి ఆమెని చూస్తూ.. ‘అదేమిటమ్మా! తీపిని సిద్ధం చేసింది నువ్వేకదా! ఆ వెనుక గదిలో కిటికీ పక్కన ఉంచింది నువ్వే కదా! రంగురంగుల ముగ్గులతో నిండిన గదిని దాటి అగరువత్తుల వాసనలతో గది మొత్తాన్ని నింపి నాకోసం కొత్త పళ్లెంలో కొత్త ఆకుల మీద పేణీలని పెట్టిందీ నువ్వే కదా! తినలేదని ఎందుకంటావు? ఎన్ని చీమలు సుఖంగా తిన్నాయి! వాటిని చూడగానే రుచికి ఆశపడ్డ నోరు నీకు కన్పించాలనే ఆలోచనని కూడా వేయలేదు. అందుకే అలా తినేసా’నన్నాడు. ఆమె నివ్వెరపోతుంటే.. సాయి అన్నాడు– ‘‘అమ్మా.. భగవంతుడు 84 లక్షల జీవరాసుల్ని  సృష్టి చేశాడు. తెలుసా నీకు? ఓ తండ్రి తన ఇంట్లో తానొక్కడే ఎప్పుడూ భోజనం చేసి నిద్రపోడు. తమ సంతానం భోజనం చేసిందా? అని గమనించి వాళ్లు తింటూంటే తాను ఆకలితో ఉన్నా  తృప్తిగా చూపులతో భోజనాన్ని ముగించి ఆ మీదట భౌతికంగా తాను తింటాడు నోటితో. తల్లివి నీవు! బిడ్డల ఆకలి నీకు తెలిసినట్టుగా నాకెలా తెలుస్తుంది? ‘‘తల్లీ.. ! నీ విందుకి చాలా ఆనందమమ్మా! ఎప్పుడు నాకు భోజనాన్ని పెట్టాలని నీకు అన్పించినా ఏదో ఒక ప్రాణిని పిలిచి లేదా తనంతటి తానే వస్తే దానికి పెట్టు. పెట్టేటప్పుడు నా పేరుని ఒక్కమారు అనుకో! అంతే!! అది నన్నే చేరుతుంది విందూ లేదా నైవేద్యం రూపంగా! సంతోషమమ్మా’’ అని ముగించాడు సాయి. ఆమె తన్మయత్వంతో అలా ఆనందబాష్పాలని విడుస్తూనే ఉండిపోయింది.

నేను వేదాలని చదివిన వాడిని. మసీదుకొస్తే మైలబడతా! అని పలికిన పండితుని కథ  ఏమిటో రేపు చూద్దాం!

సీమోల్లంఘన అంటే ఏమిటి ???

బాబా సత్చరిత్రలో ముఖ్యమైన ఘట్టం ఈ సీమోల్లంఘన .

1916 సంవత్సరం విజయదశమి నాడు బాబా సీమోల్లంఘన చేశారు అదే సమయంలో ద్వారకామయి లో కొంత మంది భక్తులు బాబా ముస్లిం ఆ ??

లేక హిందువా ?? అనే చర్చను ఆరంభినచారు అది కొంత సేపటికి తీవ్రరూపం దాల్చింది బాబా సర్వాంతర్యామి ఆ చర్చ కోసం తెలుసుకుని వెనుకకి తిరిగి తీవ్రమైన ఆగ్రహం తో మసీదు వద్ద కు వచ్చి ధుని వద్ద నిల్చుని తన వస్త్రాలను తీసి ఆ ధునిలో వేసి ఇప్పుడు చెప్పండి నేను హిందువా ???? లేక ముస్లిమ్  ఆ అని బిగ్గరగా అరిచారు ” నేడు నా సీమోల్లంఘన ” అని ఎర్రటి చింత నిప్పుల వంటి కన్నులతో ఆవేశంగా అరిచారు  చాలా సేపటివరకు శాంతించలేదు భాగోగి షిండే ధైర్యం చేసి ముందుకువెళ్లి మరోవస్త్రం బాబా కు కట్టి శాంతించ మని వేడుకున్నాడు 

రాత్రి 11 గంటల ప్రాతంలో బాబా ఆవేశం చల్లారింది ఇది అంతా మనం సత్చరిత్రలో చదువు కున్నాము .

1918 అక్టోబర్ 15 మధ్యాహ్నం 2 :31  నిమిషాలకు బాబా దేహాన్ని విడిచారు అంటే  సీమోల్లంఘన చేశారు మహాసమాధి అయ్యారు ఐతే బాబా దీనినే ముందుగా సూచించారు కానీ దానిని అర్ధం చేసుకోగలిగే అంతటి జ్ఞానం మనలో లేదు .

ఐతే ఈ సందర్భం ఆత్మతత్వాన్ని ప్రబోధిస్తుంసి 

ఇంకా వివరంగా లౌకికంగా వివరించాలి అంటే క్షత్రియులు  విజయ దశమి నాడు వారి రాజ్యపు సరిహద్దులను దాటుతారు ఎందుకు అంటే శత్రు రాజ్యాలను కూడా తమ రాజ్యాలుగా ఆక్రమించుకోవడానికి ఆ రోజు విజయం చేకూరాలి అని ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారు 

మరి బాబా కు ఏ రాజ్యాలు లేవు కదా బాబా ఇలా చెయ్యడానికి కారణం ???

సీమోల్లంఘన అంటే crossing tha limits are crossing tha border అని అర్ధం .

 ధునిలో వస్త్రాలను వేసి అగ్నికి ఆహుతి చేశారు దానికి అర్ధం ఈ దేహం ఈ వస్త్రం లానే బూడిద అవుతుంది 

ఐతే మన దేహానికి సీమోల్లంఘన అంటే శరీరాన్ని విడిచి పెట్టడం 

దేహానికి కులం ,మతము అని మన సృష్టించుకున్నది దేహానికి ఇవి అన్ని ఉండచ్చు కానీ ఆత్మకి కుల మతాలు ఉండవు లోనున్న ఆత్మను దర్శించగలగాలి అప్పుడే పర్మాతగమను దర్శించగలము అనే గొప్ప సందేశాన్ని బాబా మనకు అందించారు అని తెలుస్తుంది 

యద్భావం తద్భవతి

      భగవద్గీతలో ఓ శ్లోకం ఉంది.‘‘యే యథా మాం ప్రపద్యంతే తాం స్తధైవ భజామ్యహమ్‌!మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ! సర్వశః’’ అని.ఎవరు తననెలా అనుకుంటే తాను వాళ్లకి అలాగే కనిపిస్తాననీ, ఎవరు ఏం అనుకున్నప్పటికీ తాను అనుకున్నది మాత్రమే జరిగేలా చేస్తాననీ, చేసుకుంటాననీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు ఆనేది పై శ్లోక సారాంశం. అందుకే తనని దైవంగా భావించిన దేవకీ వసుదేవులకి అలాగే కన్పించాడు. తనని వివాహమాడే పతిగా భావించిన రుక్మిణిని అదే విధంగా అనుగ్రహించాడు. తమ జన్మని ధన్యం చేయవచ్చినవానిగా భావించిన భీష్మ–విదురులకి అలాగే మోక్షాన్ని ఇచ్చాడు. తనని చంపవచ్చినవాడని భావించిన కంసునికీ, శిశుపాలునికీ అలాగే చావునిచ్చాడు. వాస్తవాన్ని పరిశీలించి చూస్తే సాయి కూడా అదే తీరులో కనిపించాడు ఎందరికో. కనిపించలేదని ఎవరూ అనుకోకుండా ఉండేలా తనని నిజమైన భక్తితో సేవిస్తే ఏ రూపంతో దర్శించదలిస్తే అలానే కనిపిస్తానంటాడు సాయి. అలా కనిపించిన తీరు తెన్నుల్ని ఎందరో చెప్పారు కూడా. ఈ క్రమంలో జరిగిన ఓ చరిత్రని తెలుసుకుని తీరాల్సిందే!

     నాసికాత్య్రంబకమనే పుణ్యక్షేత్రం ఒకటుంది షిర్డీకి కొంత దూరంలో. దాన్నే నాసిక్‌ అని పిలుస్తూ ఉంటారు. గోదావరి పుట్టిన కొండలకి దిగువ ఉంటుంది ఈ క్షేత్రం. ఆలయం లోపల శివలింగం చిన్న పరిమాణంలో ఉంటుంది. ఆ లింగానికి కింద మూడు వైపుల నుంచి చిన్న తూముల వంటి మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ మూడింటి నుంచీ నిరంతరం జలం ప్రవహిస్తూ ఈ శివలింగాన్ని తాకుతూ ఉంటాయి. ఒకటి పవిత్ర గంగాజలం, రెండవది ఆ కొండల మీద నుంచి వచ్చే గోదావరి జలం, ఇక మూడవది ఎక్కడి నుండి వస్తోందో తెలియని పర్వత జలమునూ. ఈ మూడు జలాలనీ స్వయంగా సేకరించుకుని ఏ రోజుకారోజు శివలింగానికి మహాద్భుతంగా అభిషేకాన్ని చేస్తే గానీ, ఆ మీదట అగ్నిహోత్రాన్ని వేదమంత్రపూర్వకంగా నిర్వహిస్తే గానీ ఏనాడూ పచ్చిగంగని కూడా ముట్టనంత నిష్టాగరిష్ఠుడైన ములేశాస్త్రీ(మూళే శాస్త్రీ–శాస్త్రీ–మూలే–పండితుడు) అనే బ్రాహ్మణుడు ఉంటూండేవాడు నాసిక్‌లో.

      తన వద్దకొచ్చిన ఆధ్యాత్మికపరులైన వాళ్ల చేతుల్ని చూసి హస్తసాముద్రిక విశేషాలనీ, జాతకచక్రాలనీ చూసి భూతభవిష్యత్‌ వర్తమానాలనీ, అంతే కాక ఇళ్లకి సంబంధించిన వాస్తు బాగోగులనీ కూడా ఆయన చూస్తూ ఉండేవాడు. దాంతో ఆయన ఇల్లు సందర్శకులతో నిత్యం కిటకిటలాడుతూ ఉంటూండేది. ఎందరు వచ్చినా ఆయన అనుష్టానం పూర్తయ్యాక మాత్రమే మాట్లాడటం తప్ప ఏనాడూ ఆ నియమాన్ని తప్పనివాడాయన. ఆయన చెప్పిన అన్ని కూడా స్పష్టంగా జరుగుతుండే కారణంగా అందరికీ ఆయన మీద పూజ్యభావం ఉంటూ ఉండేది. ఆయన్ని ఎవరైనా ‘ఎంతగొప్పవాడో’ అంటూ ప్రశంసిస్తే ‘అదంతా మా గురువు ఘోలవ్‌ స్వామి గారి చలవ’ అంటూ తన అహంకారం లేని తనాన్ని తెలియజేస్తుండేవాడు. ఆయన తన గురువైన ఘోలవ్‌ స్వామివారి వద్ద నాలుగు వేదాలనీ ఆ వేదానికి అంగాలుగా ఉండే 6 శాస్త్రాలనీ కూడా గట్టిగానే అభ్యసించి ఉండటంతో ఇటు జ్యోతిషం, అటు వాస్తు మరోౖవైపు సాముద్రిక శాస్త్ర పండితులూ ఇంకోవైపు వ్యాకరణం మొదలైన శాస్త్రాల్లో పండితులు కూడా ఏమేమో సందేహాలని తీర్చుకోవడానికి స్వయంగా విచ్చేస్తూ ఉండటంతో ఆయనకి తీరుబడి అనేది దాదాపుగా ఉండేదే కాదు. ఇలాంటి ఈయనకి – సాయికి అత్యంత ప్రేమాస్పదభక్తుడైన బూటి (బాబు సాహెబ్‌ బూటీ)తో మంచి సంబంధం ఈ తీరు రాకపోకలతో ఏర్పడింది. నాగపూర్‌ వాస్తవ్యుడూ కోటీశ్వరుడూ అయిన బూటీ సాయి ఆజ్ఞ ప్రకారం ఆయనకి ఓ సుందర విశాలమందిరాన్ని శోభాయమానంగా నిర్మించి ఇచ్చాడు కూడా. అంతటి బూటితో ఓ సారి ములేశాస్త్రి పండితునికి పనిపడింది. బూటీ ఎప్పుడూ షిర్డీలోని ద్వారకామయి (సాయి ఉండే మసీదు)లోనే ఉంటాడు కాబట్టి ములేశాస్త్రి అక్కడికే వెళ్లాడు. వేదాలని చదివినవాడూ, శాస్త్రాల్లో దిట్టా, నిత్యం అగ్నిహోత్రాన్ని చేసేవాడూ, అందరితో గౌరవాభిమాన పరిచయాలున్నవాడూ, సంప్రదాయపరుడూ అయిన ఆయనకి షిర్డీ వెళ్లినప్పటికీ కూడా ఒక సాయేబు (ఆయన దృష్టిలో సాయి)ని.. అందునా ఆయన మసీదులో.. అది కూడా 4 రోజులపాటైనా స్నానం కూడా (అప్పుడప్పుడు వీలు కుదరక) చేయని పండితుడు కాని  వ్యక్తి (శాస్త్రి దృష్టిలో)ని స్వయంగా వెళ్లి దర్శించడమా? అనే అభిప్రాయంతో తానున్న ఓ ప్రదేశంలోనే మూడురోజుల పాటు ఉండిపోయాడు. అంతా నిర్విరామంగా ఉండే తనకి ఇలా రోజులు గడిచిపోతున్నాయనే ఆలోచనతో… ఎలాగో అక్కడికి వెళ్లి బూటీని ఎలాగో ఒకలా ఆ మసీదు ఇవతలనుండే కలిసి, మాట్లాడి వచ్చేద్దామనే నిర్ణయానికొచ్చాడు నాల్గవ రోజున.

     సరిగ్గా అదే రోజున బూటీ బాబా దర్శనానికి రావలసిందనగానే అయిష్టంగా సాయి దర్శనానికి వెళ్లాడు. తనకొచ్చిన భక్తుల దక్షిణలతో పళ్లని కొని, తనని చూడవచ్చిన భక్తులకి ఇస్తూ ఉండటం సాయికి అలవాటు. ముఖ్యంగా మామిడిపళ్లనైతే రెండు అరచేతుల మధ్య పెట్టి ముందుకి వెనక్కి నలిపి పిసికి నోట్లో పెట్టుకోగానే రసమంతా వచ్చేలా మామిడిపండుని చేసి భక్తులకియ్యడం, అలాగే అరటిపండునైతే తొక్కని తొలగించి గుజ్జునిస్తూ తొక్కల్ని తన వద్ద ఉంచడం… వంటివి ఆయన నిత్యకృత్యాలు. శాస్త్రి వెళ్లేసరికి ఇలాగే జరుగుతోంది. ఆ పళ్లని తాను తీసుకోవడం ఏ మాత్రం ఇష్టమనిపించలేదు శాస్త్రికి. తన వంతు రాగానే శాస్త్రి తన చేతిని చాచి సాయిని తమ చేతిని చూపించినట్లయితే సాముద్రికవిశేషాలని చెప్తాననే అభిప్రాయంతో చూశాడు. శాస్త్రి అభిప్రాయాన్ని గమనించి కూడా సాయి తన చేతిని చూపించనే లేదు, ఎందరో తన వద్దకి చేయి చూపించుకోవడానికి వచ్చి తమ వంతు కోసం ఎదురుచూస్తూ ఉంటూంటే, సాయివద్దకి తాను వెళ్తే చేతిని చూపించడేమిటి సాయి? అనుకుని అలాగే ఉండిపోయాడు. అందరికీ ఇచ్చినట్లే శాస్త్రికి కూడా నాలుగు అరటిపళ్లని చేతిలో పెట్టాడు సాయి. అయితే సాయి పాదాలని గమనించి, పాదాల్లోని రేఖలని గమనించి, సాయిలోకోత్తర పురుషుడేనని మాత్రం లోపల అనుకున్నప్పటికీ, ఈ మహమ్మదీయునికి ఇంత గొప్పదనమా? అనే ఊహ శాస్త్రిని బాధించసాగింది. గొప్పదనాన్ని ఒప్పుకోనీయలేదు. అనంతరం శాస్త్రి బూటీతో సహా మరో ప్రదేశానికి వెళ్లిపోయారు. సాయి లెండీతోట (తాను స్వయంగా పచ్చికుండలతో నీళ్లని తెచ్చి పోసి పెంచే తోట)కి బయలుదేరి వెళ్తూ ‘ఈ రోజు కాషాయవస్త్రాలని నాకు తెప్పించండి. ధరిస్తా’ అన్నాడు భక్తులతో. ఎవరికీ అంతరార్థం బోధపడలేదు. బూటీ శాస్త్రి వద్దకి మళ్లీ వచ్చి మధ్యాహ్నహారతి సమయమైంది. ‘వస్తారా సాయి దర్శనానికీ – హారతికీ?’ అని అడిగాడు.

     శాస్త్రి అయిష్టంగా ‘సాయి దర్శనానికి సాయంత్రం వస్తాను. ఇప్పుడింకా దేవతా అనుష్టానం కాలే’ అన్నాడు. ఈ సమాధానంలో రెండున్నాయి. మొదటిది – ‘ఉదయం తనని అందరితో సమానంగా, అందరిలో ఒకడుగా సాయి లెక్కించాడనీ, చేయి చాపి సాముద్రికాన్ని చెప్తానని నోరు తెరిచి అడక్కపోయినా మౌనంగా తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించినా తిరస్కరించాడనీ’. ఇక రెండవది – ‘తాను స్నానానికి అత్యంత శుచిగా చేసి, పట్టుబట్ట కట్టుకుని, వెంటతెచ్చుకున్న గంగాజలాన్ని కలిపిన జలంతో శివాభిషేకాన్ని చేసుకుని, ఓ మసీదులోనికి వెళ్లి ఆయన ఈయబోయే ప్రసాదాన్ని తీసుకుని రావడమా?’ అనేదీనూ. ఈ రెండాలోచనలతోనూ సాయంత్రం వస్తానని ముక్తసరిగా చెప్పాడు శాస్త్రి. మధ్యాహ్నహారతి ప్రారంభం కాగానే బూటీని పిలిచి సాయి.. ‘బూటీ! నాసిక్‌ నుండి వచ్చిన ఆ బ్రాహ్మణపండితుడి వద్దకెళ్లి దక్షిణని సాయి అడిగాడంటూ పట్రా!’ అన్నాడు. అది దైవాజ్ఞతో సమానం బూటీకి. వెంటనే శాస్త్రి వద్దకొచ్చి చెప్పి దక్షిణని యాచించాడు  కోట్లకి అధిపతి అయిన బూటీ.శాస్త్రి ఈ మాటని వింటూనే.. ‘ఆ సాయి ఎంత తనదైన మహిమల్లో గొప్పవాడో నేనూ అంతే నాదైన శాస్త్రంలో గొప్పవాడిని. సరే! ఆ మాటని అలా ఉంచితే నేనేమిటి? ఆయనకి దక్షిణ ఇయ్యడమేమిటి? అయినా ఎవరికైనా ఎవరైనా గొప్పవారని తోస్తే దక్షిణనిస్తారేమో గానీ, ఈ దక్షిణకోసం దబాయింపు ఏమి?’ అని ఆలోచిస్తూ.. అడిగింది బూటీ కాబట్టి ‘సరే!’ అంటూ దర్శనానికి బయలుదేరాడు శాస్త్రి అర్ధాంగీకారంతో. అనుష్టానం దాదాపు ముగియవచ్చిన సందర్భంలో తాను మసీదులోనికి పోవడం సుతరామూ ఇష్టం లేని శాస్త్రి, మసీదు బయటి నుండే సాయిని దర్శించాడు. ఆ పక్కనే బుట్టలో ఉన్న పుష్పాలని దోసిలి నిండుగా తీసుకుని మసీదు గుమ్మం బయటి నుండే సాయి మీద పడేలా భక్తితోనే విసిరాడు.

     అంతే! క్షణంలో సింహాసనం లాంటి ఆసనంలో కూర్చున్న సాయి రూపం మొత్తం అదృశ్యమైపోయింది. పరీక్షగా చూశాడు శాస్త్రి. నిజమే. అది కలకానే కాదు. నిజమే. వాస్తవమే. సాయి కనపడటం లేదు. ‘ఇదేమిటి?’ అనుకునేంతలోనే తనకి సంపూర్ణంగా వేదాలనీ, శాస్త్రాలనీ బోధించిన తన గురువు ఘోలవ్‌ స్వామి ఆ ఆసనంలో కూచుని చిరునవ్వు నవ్వుతూ కన్పిస్తున్నాడు శాస్త్రికి. గురువుగారు శివైక్యం చెంది ఎన్నో సంవత్సరాలు గడిచిపోతే ఆయన ఇక్కడెలా ఉన్నాడు? అదీ సజీవంగా చిరునవ్వు నవ్వుతూ కన్పిస్తుండటమా? అది కూడా ఎవరికో కాకుండా శిష్యుడైన తనకే కూడనా? మళ్లీ ఓ సారి పరీక్షగా చూసి ఆశ్చర్యపడ్డాడు – నివ్వెరపోయాడు శాస్త్రి. తనకి తెలియకుండానే.. అందరు భక్తులూ తనని చూస్తుండగానే.. ముందుకి నడిచాడు. సాయి కూచున్న ఆసనం ఉన్న వేదికకున్న మెట్లని ఎక్కి వెళ్లాడు. మనసు నిండుగా కనిపిస్తున్న భక్తితో, బుద్ధి నిండుగా ఉన్న శ్రద్ధతో, శరీరం నిండుగా ఉన్న విశ్వాసంతో సాయి పాదాల మీద పశ్చాత్తాపబుద్ధితో తలని పెట్టి, వెంటనే సాష్టాంగపడి నమస్కరించాడు అప్రయత్నంగా. అందరూ గొంతెత్తి హారతి పాటని పాడుతుంటే శాస్త్రి మాత్రం తన గురువు ఘోలవ్‌ స్వామి నామాన్ని పెద్దగా ఉచ్చరిస్తూ ఎదురుగా సాయి పాదాలని పట్టి నమస్కరిస్తూనే ఉన్నాడు. ‘తన పట్టుబట్ట – అగ్నిహోత్రం – అపవిత్రతాభావం – అది ఓ మసీదు’ అనే ఆలోచన పూర్తిగా స్ఫురణలోనే లేకపోయాయి. భక్తి పారవశ్యంతో కళ్లు మూసుకుని ఆ నాటి గురువు ఈనాడు సజీవంగా దర్శనమిచ్చాడనుకుని కళ్లు తెరిచి చూశాడు. అంతే! మళ్లీ వెనుకటి సాయి కాషాయరంగు వస్త్రాల్లో కన్పించాడు. ఘోలవ్‌ స్వామి ఏమయ్యాడో తెలియదు. ‘ఈ వింత మరెవరికైనా కూడా కనిపించిందా?’ అనుకుంటూ శాస్త్రి భక్తజనం అందరినీ చూస్తుంటే.. అందరూ ఎవరి ధ్యాసలో వాళ్లున్నారు తప్ప తనవైపు చూస్తున్నట్లే కనిపించలేదు. అప్పటికర్థమైంది. బూటీ ఎందుకిలా సాయికి అంకితమైపోయాడో.. సాయికి తన జీవితాన్ని సర్వసమర్పణాన్ని చేసేసాడో! ఈ విశేషాన్ని పూసగుచ్చినట్లు భక్తులందరికీ శాస్త్రి చెప్పడమే కాక అప్పటి నుంచి సాయికి  పరమసన్నిహిత భక్తుడయ్యాడు.

     మరో సంఘటనషిర్డీలో ఓ రెవెన్యూ ఉద్యోగి ఉంటూ ఉండేవాడు. ఆయన పరమభక్తుడు సాయికి. అయితే తన భక్తి ధోరణి ఏదో తనదే తప్ప మరెవరినీ సాయిదర్శనానికి రావలసిందని గానీ, వచ్చి దర్శిస్తే ఈ తీరూ ఆ తీరూ అద్భుతాలు జరుగుతాయని గానీ చెప్పి ప్రచారాన్ని చేసే సాయి భక్తుడు కాడు.

      సహజంగా ఒక సంప్రదాయాన్ని ఎన్నుకుని ఆ మార్గంలో వెళ్తూ ఉండే భక్తులు మూడు తీరులుగా కన్పిస్తూ ఉంటారు.

      మొదటి జాతివాళ్లు కేవలం తన భక్తీ తన పూజా ఏదో దాన్ని మాత్రమే చేసేసుకుంటూ నిరంతర భక్తి భావంతో వెళ్లిపోతూ ఉంటారు. వాళ్లకి తమకంటూ జరిగిన అద్భుతాలని చెప్పుకోవాలనే ధ్యాసే ఉండదు.

       రెండవజాతివాళ్లు తమకి జరిగిన అనుభవాలని వివరిస్తూ ప్రోత్సహించి ఆ దైవదర్శనానికో లేక తాము నమ్మి ఆనందాన్ని పొందిన ఆ మహనీయుని దర్శనానికో ఒకరినో ఇద్దరినో నిస్వార్థంగా తీసుకువెళ్లి తాముపొందిన ఆ ఆనందాన్ని వాళ్లకి కూడా కలిగించేవాళ్లు. కేవలం దైవసేవాభావం ఇతరులకి ఆనందాన్ని పంచాలనే ధ్యేయమే వీళ్లది.

      ఇక మూడవజాతి వాళ్లుంటారు. దైవం మీద వ్యతిరేకతా నాస్తికభావాలూ అంటూ ఏవైనా ఏ కొందరికైనా అబ్బుతున్నాయంటే దానికి వీరే కారణం. దైవం గురించో లేక సాయి వంటి మహనీయుని గురించో ఎదుటివారిలో తీవ్రమైన నమ్మకాన్ని కుదిర్చి దాన్ని దృఢం చేయాలనే అభిప్రాయంతో ఉన్నదానికి మరికొంతని కలిపి తీవ్రంగా దాన్ని ప్రచారంలోకి తెచ్చేయడం వీరి లక్షణం. వాళ్లు చెప్తున్నదాన్ని ఏ మాత్రపు బుర్ర పెట్టి విన్నా అదంతా అబద్ధమే అని స్పష్టంగా అర్థమైపోతూ ఉంటుంది. అలా ఎదుటివాళ్లు అనుకుంటారనే ధ్యాస కూడా లేకుండా చెప్పుకుంటూ వెళ్లిపోతుంటారు ఉన్నవీ లేనివీ కలగలిపి. ఇదే పద్ధతిలో పైన అనుకున్న రెవెన్యూ ఉద్యోగి ఒక డాక్టరుతో ‘షిర్డీ వెళ్దాం. వస్తావా?’ అని అడిగాడు. ఈ రెవెన్యూ ఉద్యోగి కేవలం తనకి సహాయంగా ఈ డాక్టరుని రావలసిందిగా పిలిచాడు తప్ప ఆయన్ని సాయిభక్తునిగా చేయాలనే తపనతో మాత్రం కాదు.

      దానికి డాక్టర్‌ సమాధానమిస్తూ.. ‘నేను షిర్డీకి సరదాగా వస్తా! అక్కడికొచ్చి సాయి దర్శనానికి రావలసిందని గానీ, ఇంతదూరం వచ్చాక ఓసారి దర్శిస్తే పోలేదా? అయినా దర్శిస్తే వచ్చే నష్టమేముంది? అని గానీ నన్ను బలవంతపెట్టనంటే వస్తా!’ అని కరాఖండీగా చెప్పాడు. అసలు ఆ ఉద్దేశమే లేని రెవెన్యూ ఉద్యోగి ‘అక్కడికొచ్చాక అది నీ ఇష్టం! బలవంతపెట్టడం నేనుగానీ నాకెరుగున్న మరెవరి ద్వారానైనా గానీ ఉండనే ఉండదు’ అని సహృదయతతో చెప్పాడు. దాంతో ఆ ఇద్దరూ షిర్డీకి వెళ్లారు. రెవెన్యూ ఉద్యోగి బాబా దర్శనానికి వెళ్తుంటే డాక్టర్‌ అతనితో ‘నువ్వేమీ అనుకోకు! నేను రామభక్తుడ్ని. ఏ రోజూ రామునికి సంబంధించిన వృత్తాంతాన్ని చదవడమో ఆయన శ్లోకాలని పఠించడమో లేక ఆంజనేయుని ధ్యాన శ్లోకాలని మనసులో అనుకోవడమో చేస్తూనే ఉంటాను. రామాయణం చెప్పిన అన్నింటి మీద సద్భావంతో ఉంటాను. ఏదో ఒక సంప్రదాయ రహస్యాలని తెలుసుకుని ఆచరించదలచడం పొరపాటున ఇది నచ్చకపోతే మరో వైపు అడుగులు వేయడం.. అనే ఇదంతా నాకు నచ్చని పని’ అంటూ చెప్పి ‘నువ్వొక్కడివే ఆ సాయి దర్శనానికి వెళ్లిరా!’ అన్నాడు. ముందునుంచి డాక్టర్‌ అదేమాటల్ని చెప్తుండటం బట్టి రెవెన్యూ ఉద్యోగి మారు మాట్లాడకుండా సాయి దర్శనానికి వెళ్లాడు. మార్గమధ్యంలో ఓ చిన్నపని చూసుకుని దర్శనానికి వెళ్లాడు. అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు.తాను వెళ్లేసరికి ఇన్ని మాటల్ని మాట్లాడిన డాక్టర్‌ ఆ సాయిపాదాలని గట్టిగా పట్టుకుని ఆయన ముఖంలోనికే తన దృష్టిని నిలిపి ఆర్ద్రంగా చూస్తూ ఆనందబాష్పాలని విడుస్తూ కనిపించాడు. సాయి సేవ పూర్తయ్యాక రెవెన్యూ ఉద్యోగి ‘దానికి కారణం ఏమిటి?’ అని అడగకుండానే డాక్టర్‌ చెప్పడం ప్రారంభించాడు.‘ఓసారి సాయిని సందర్శించే భక్తుల్ని చూస్తూ సాయి తన దర్శనాన్నిచ్చే చోటుని చూశాను. ప్రశాంతంగా కూర్చున్న సాయి నాకు ప్రత్యక్షంగా రామచంద్రునిలానే కనిపించాడు. తరచి తరచి పరిశీలించి చూసినా రాముడే ఉన్నాడు ఆ ఆసనంలో. అందుకే ఆనందంతో సాష్టాంగపడ్డాను. నన్ను ఈ దర్శనానికి వచ్చేలా చేసినందుకు జీవితాంతం ఋణగ్రస్తుడ్ని’ అన్నాడు డాక్టర్‌. అదీ సాయి గొప్పదనం.

‘ద్వారకామయి అన్ని కోరికలనీ తీరుస్తుంది’ అని సాయే చెప్పాడు. ఎప్పుడు? ఎందుకు? ఎలా?

 

ద్వారకామయి లో బాబా చిత్ర పట వృత్తాంతం ఏమిటి

శ్యామరావ్ జయ కర్ అనే ప్రముఖ చిత్ర కారుడు ఉండేవారు బాబా శశీరులుగా ఉన్నప్పుడు బ్రిటీష్ వారి కోసం రాజుల కోసం వారి వారి చిత్రాలను ఎంతో అద్భుతంగా గీసే వారు ఆయన ఒకసారి బాబా కోసం విని దర్శనం చేసుకోవాలి అని షిరిడి వచ్చి బాబాని దర్శించి బాబా చిత్రాన్ని గియ్యాలి అని     ప్రేరేపితులై బాబాను ఆనుమతి కోరగా బాబా తిరస్కరించారు ఎలాగైనా బాబా అనుమతి పొంది బాబా చిత్రాన్ని గియ్యాలి అని దృఢనిశ్చయులై ఉండగా శ్యామా కోసం తెలుసుకొని బాబా అనుమతి ఇప్పించ మని కోరగా ఎంతో ప్రయత్నం చెయ్యగా బాబా సరే అని ఒప్పుకున్నారు శ్యామరావ్ జయకర్ బాబా చిత్రాన్ని గియ్యడం ప్రారంభించారు బాబాని అనుమతి కోరి బాబా నేను నీ చిత్రాన్ని గీసే సమయంలో కదలకుండా కుర్చుని నాకు సహకరించండి అని అడిగాడు సరే అని బాబా కాసేపు కూర్చుని అటు ఇటు కదిలేవారు అతనికి చిత్రం గియ్య డానికి కష్టతరంగా మారేది బాబా కి విసుగు వచ్చి ఆ కాగితాన్ని చింపి ముక్కలు చేసి పొమ్మనే  వారు ఒక రోజు శ్యామా ఆ చిత్ర కారుడుని ఇలా ప్రశ్నించెను నీ పని ఎంత వరకు వచ్చింది అని అప్పుడు అతను అపరిస్థితిని వివరించి నిరాశ చెంది బాబా కి నేను చిత్రాన్ని చిత్రించడం ఇష్టం లేనట్టు గా ఉంది అని విచారంగా చెప్పెను శ్యామా ఓ సలహాను ఇచ్చెను బాబాకి హారతి ఇస్తున్నప్పుడు ఏమి జరిగినా కదల కుండా కూర్చునే ఉంటారు కనుక ఆ సమయంలో చిత్రించమని చెప్పగా ఆ సలహాని పాటించి చిట్ట చివరికి బాబా చిత్రాన్ని గియ్యడం పూర్తి చేస్తారు  ఆ కారణంగానే ద్వారకామయి చిత్రం లో బాబా పాదాల వద్ద హారతి పళ్లెం,కొబ్బరికాయ , మిగిలిన పూజా ద్రవ్యాలు కూడా చిత్రించ బడ్డాయి   ఏదైనా ఓ పనిని ఆరంభిస్తే అంతటి కృషి చేస్తే బాబా సహాయ సహకారాలు కచ్చితంగా ఉంటాయి.

ఐతే ఈ రోజు ద్వారకామయి లో మనం చూస్తున్న ఫోటో శ్యామరావ్ జయకర్ గారు గీసినది కాదు ఎందుకు అంటే 1975- 1985 ప్రాంతంలో దానిని మార్చడం జరిగింది కారణం చిత్ర పఠం వద్ద ధూపాలు అవి ఇవి పెట్టడం వల్ల ఆ చిత్రపటం నల్లగా మారె సరికి మరో చిత్ర పటాన్ని గీయించాలి అని సంస్థాన్ వారు నిర్ణయించి ఎంతో ప్రయత్నాన్ని చేశారు ఎంత మంది ప్రయత్నించినా చిత్రంచ లేకపోయేవారు నిరాశతో తిరిగి వెళ్లి పోయేవారు .

జ్యోతిరాజ్ అనే మన తెలుగు వాడైన బాబా భక్తుడు ఓ సారి బాబా దర్శనానికి స్నేహితులతో షిరిడి వెళ్లారు అక్కడ జ్యోతిరాజ్ ఉండగా ఇలా జరిగింది అది ఏమిటంటే 

ఆ  రోజుల్లో శివణేషన్ స్వామి అనే ఓ స్వామీజీ ఉండేవారు ఆయనకి బాబా గారి సందేశాలు వస్తూ ఉండేవి ఐతే ఈ స్వామీజీకి బాబా  ఆ జ్యోతిరాజ్ ని చూపించి నా చిత్రన్ని ఇతనితో గియించమని బాబా ఆదేశించెను ఐతే ఆ స్వామీజీ ఆ జ్యోతిరాజ్ వద్దకు వచ్చి విషయం వివరించగా  ఆశ్చర్య పోయెను ఎందుకు అంటే అతను చిత్ర కారుడు అనే విషయం ఎవరికి తెలియదు కనుక 

స్వామీజీ చెప్పిన ప్రకారం అతను బాబా చిత్రాన్ని చిత్రించేను ఇప్పుడు మనం చూస్తున్న ద్వారకామయి లో ఉన్న పటం జ్యోతి రాజ్ వేసినదే  శ్యామరావ్ జయకర్ వేసిన పటం ఇప్పుడు మనం మ్యూజియం లో చూడచ్చు

*శ్రీ ఆదిశంకరాచార్యులవారి ‘వివేకచూడామణి’*

*మనందరిలోను ఉండే వాసనలన్నింటిని 3 రకాలుగా విభజించవచ్చు*.1. *తమోగుణ వాసనలు*. 2. *రజోగుణ వాసనలు* 3. *సత్త్వగుణ వాసనలు*. ఈ 3 రకాలు వాసనలు అంతమైతే పూర్తి *వాసనాక్షయం* జరిగినట్లే. అలా *వాసనలన్నీ క్షయమైతే బ్రహ్మమును అని తెలుసుకున్న మనం బ్రహ్మముగానే వ్యవహరించగలం. అధ్యాసను (నేను దేహముననే భావనను) పూర్తిగ తొలగించుకోగలం. అయితే ఎలా వాసనలను అంతం చేసుకోవాలి?*(a) ముందు మనలోని తమోగుణ వాసనలను అంతం చేయాలి. ఏమిటా వాసనలు? ఎప్పుడూ బద్ధకంగా, నిద్ర మొహంతో, ఉండంటం. ఏ పనీ చేయ బుద్ధి కాదు. నిద్రపోయినా పోకపోయినా పడుకొని ఉండాలని కోరిక. అలాంటి సమయంలో ఎవరన్నా నిద్రలేపినా, పనిచెప్పినా చెప్పలేనంత కోపం వస్తుంది. ఇవే తమోగుణవాసనలు. తిండి తినటం – నిద్రపోవటం తప్ప దేని మీదా తపన ఉండదు. *ఈ వాసనలు గనుక తొలగాలంటే రజోగుణం వాసనలను వృద్ధి చేయాలి*. ఎలా? తమోగుణంతో బద్ధకంగా ఉండేవానిలో అనేక కోరికలను ప్రవేశపెట్టాలి. అతడు ఆ కోరికలకు వశుడయ్యాడా? ఇక వాటిని తీర్చుకోవటానికి నిరంతరం శ్రమిస్తాడు. శారీరకంగా శ్రమిస్తాడు. బుద్ధికి పదునుబెట్టి ఆలోచనలూ చేస్తాడు. క్షణం తీరిక లేకుండా తపించిపోతాడు. ఇదే రజోగుణ లక్షణం. అలాగే ఆ *కోరికలు తీర్చుకొనుటకు శ్రమించటంతో బాటు ఆటంకాలు తొలగటానికి ఏదో దివ్యశక్తి ఉన్నదని తెలియగానే పూజలు, నోములు, వ్రతాలు, మ్రొక్కుబడులు మొదలుపెడతాడు. అలా రజోగుణంలోనే సత్త్వగుణ వాసనలు కూడా ప్రారంభమవుతాయి*.(b) ఇలా స్వార్థపూరిత కోరికలతో, నీచమైన కోరికలతో నిరంతర క్రియాశీలిగా మారిన రజోగుణసంపన్నుడు గాని – లేదా సహజంగానే స్వార్థపూరిత మనస్సు గల రజోగుణ సంపన్నుడు గాని ఎప్పుడూ తన కోసం, తన భార్యాబిడ్డల కోసం నిరంతరం –  రాత్రీ పగలూ అనే తేడా లేకుండా శ్రమిస్తాడు. ఇలా *శ్రమిస్తూ శ్రమిస్తూ ఉన్నవానిలో ఎప్పటికో ఒకప్పటికి – ఏదో ఒక ఎదురుదెబ్బ తగిలి మార్పు వస్తుంది*. నేనెందుకిలా గొడ్డులా చాకిరీ చేస్తున్నాను? క్షణం విశ్రాంతి లేకుండా, సరియైన నిద్రలేకుండా, శరీరానికి సుఖం లేకుండా, మనస్సుకు శాంతి లేకుండా, నేనెందుకు శ్రమ పడుతున్నాను? ఇంతేనా నా బ్రతుకు? అని *పునరాలోచన* కలుగుతుంది. స్వార్థపూరిత కోరికలతో *నిరంతరం శ్రమించే వానిలో ఇలాంటి పరివర్తన తప్పకుండా కలుగుతుంది. అది ఎప్పుడు కలుగుతుందో – ఏ జన్మలో కలుగుతుందో చెప్పలేం*. ఈ జన్మంతా గొడ్డుచాకిరీ చేయాలని వాడి మొఖాన రాసిపెట్టి ఉంటే ఈ జన్మంతా పరివర్తన కలగదు. ఎన్ని మొట్టికాయలు పడ్డా బుద్ధి రాదు. అయితే ఎప్పుడైతే నీకర్మ పరిపక్వమ్ చెంది *పరివర్తన కలుగుతుందో అప్పుడు సత్వగుణ సంబంధమైన కోరికలను, ప్రవేశపెట్టాలి. ఇప్పుడూ కోరికలుంటాయి. కాని అవి స్వార్థపూరిత కోరికలు కాదు. లోకకళ్యాణమునకై, పరోపకారము కొరకు ఏదో చేయాలనే కోరికలు* – దానితో దానధర్మాలు, యజ్ఞయాగాలు, సత్కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. ఇప్పుడే కొంత *జ్ఞానం కావాలి. తెలివి కావాలి. ఒక సద్గురువు కావాలి*. పనులు చేయటం వల్ల బంధం కలుగుతున్నదని తెలుసుకొని – పనులు చేస్తూనే బంధం నుండి విడుదలయ్యే విధం తెలుసుకోవాలి. పనులు చేయకుండా ఉండే వీలులేదు. కనుక పనులు చేస్తూనే ఫలితాల పట్ల ఆసక్తి చూపకూడదు. ఫలాని ఫలితం రావాలని కర్మలు చేయరాదు. *నిష్కామంగా కర్మలు చేయాలి*. కర్మలలోని ఫలితం మీది ఆసక్తే – కోరికే మనిషిని బంధిస్తున్నది గనుక కర్మఫలాసక్తిని – *సంగభావాన్ని విడిచి కర్మలు చేయాలి. దీనివల్ల వాసనలు క్షయమైపోతాయి. కొత్తగా వాసనలు పేరుకోవు*. మొత్తం మీద వాసనలు క్షయమై పోవటంతో *మనశుద్ధి* కలుగుతుంది. స్వార్థపూరిత కర్మల వల్ల మనస్సు ఆందోళన చెందుతుంది. నిస్వార్థ, ఫలాసక్తి రహిత, నిష్కామ కర్మల వల్ల, భగవదార్పిత, లోకకాళ్యాణ కారక కర్మల వల్ల మనస్సు ఆనందంగా ఉంటుంది. ఇలా *సత్వగుణ కర్మలతో రజోగుణ సంబంధమైన వాసనలను క్షయం చేసుకోవాలి*. ఇప్పుడు సత్త్వంలో ఉంటాడు.(c) ఇక సత్వగుణ సంబంధమైన కర్మలను కూడా త్యజించాలి. ఎందుకంటే సత్వగుణ వాసనలు కూడా వాసనలే. బంగారంతో చేసినా అవీ సంకెళ్ళే – బంధించేవే. వీటినెలా వదిలించుకోవాలి?భక్తిభావం పెంపొందాలి. *తీవ్రమైన మోక్షాపేక్ష* కలగాలి. సద్గురువు దర్శనం కోసం, ఆశ్రయం కోసం తపించాలి. శాస్త్రాలను శ్రవణం చేస్తూ – మననం చేస్తూ – అధ్యయనం చేస్తూ ఉండాలి. శాస్త్రాలలో నిర్దేశించిన విధంగా గురువు ఆదేశించిన విధంగా సాధనలు సాగించాలి. *నిష్కామకర్మల స్థానంలో సాధనలు చోటు చేసుకోవాలి*. నిరంతర జపధ్యానాలతోను, గురుసేవతోను, బ్రహ్మభావనతోను నీలోని రజోగుణ తమోగుణ వాసనలతో బాటు సత్వగుణ వాసనలు కూడా తొలగిపోవాలి. దానితో స్వస్వరూప దర్శన కాంక్ష పెరుగుతుంది. ఆత్మస్థితిలో కూర్చొని ఆనందించటం అలవడుతుంది. అట్టి బ్రహ్మనిష్టలో కర్మలు చేస్తున్న స్పృహ కూడా ఉండదు. అదే *నైష్కర్మ్య సిద్ధి*. అదే *కర్మసన్యాసం*. ఇట్టి స్థితిలో మనస్సులో ఎట్టి ఆలోచనలు కదలవు. నిశ్చలంగా ఉంటుంది. ఆత్మదర్శన కాంక్షతో అన్ని ఆలోచనలు ఆగిపోతాయి. అదే *శుద్ధసాత్విక స్థితి*. *నిస్సంకల్ప స్థితి*. ఇలా సాత్విక వాసనలు కూడా తొలగించుకోవాలి.(d) ఇలా 3 రకాల వాసనలు అంతమైపోతే ఈ శుద్ధ సాత్విక స్థితిలో నిలిచిపోవచ్చు. *మనస్సులో ఎట్టి ప్రాపంచిక వాసనలు లేకపోవటంతో మనస్సు శుద్ధమై – అంతర్ముఖమై ఆత్మనిష్టలో నిలుస్తుంది. నేను ఈ దేహమనోబుద్ధులకు అతీతమైన చైతన్య స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని – బ్రహ్మమును అని అవగాహన అవుతుంది. దీనినే బ్రహ్మనిష్ట అంటారు*. ఇలా బ్రహ్మములో నిష్ట కలిగి ఉంటే అధ్యాస తొలగిపోయినట్లే – ఈ విధంగా తమోగుణాన్ని రజోగుణ కోరికలతో – కర్మలతోను, రజోగుణాన్ని సత్వగుణ సంబంధమైన కోరికలతో కర్మలతోను; సత్వగుణాన్ని తీవ్రమోక్షాపేక్షతో, సద్గురువుల ఆశ్రయంతో, సత్ శాస్త్రాల అధ్యయనం – శ్రవణంతో, ఆధ్యాత్మిక సాధనలతో – బ్రహ్మనిష్టతోను అంతం చేసుకొని *అధ్యాసను తొలగించుకొనుటకు ప్రయత్నం చేయాలి. చెయ్యి – అని గురువాక్యం*.

బాబా మసీదులో దీపాలు ఎందుకు వెలిగించే వారు ???

బాబా షిరిడీ వచ్చి  మసీదులో నివసించడం ప్రారంభించిన నాటి నుంచి దీపాలను వెలిగిస్తూనే ఉన్నారు 

ఆ దీపాలను వెలిగించడానికి నూనె అవసరం కనుక బాబా వర్తకుల వద్ద నుంచి నూనెను అడిగి తెచ్చి దీపాలను వెలిగించే వారు .

ఓ దీపావళి నాడు ప్రతి రోజులాగే నూనె కోసం వెళ్లగా వర్తకులు తిరస్కరించెను కానీ బాబా ఏ మాత్రం చలించలేదు ,భాద పడలేదు ,వారిపై కోపగించలేదు సరికదా” అల్లా అచ్చా కరేగా ” అని వెనుకకు తిరిగి వచ్చి మసీదులో ఓ రేకు డబ్బాలో రొండు నూనె చుక్కలు ఉంటే అందులో      బాబా నీటిని పోసి నోటిలో వేసుకుని పుక్కలించి దానిని వినియోగించి దీపాలు వెలిగించగా ఆ దీపాలు దేదీప్యమానంగా మరుసటి ఉదయం వరకు వెలుగుతూనే ఉన్నాయి.

అంటే బాబా కి ఉన్న యోగ శక్తి ,మంత్ర శక్తి,తంత్ర శక్తి , ఇంకా అష్ట సిద్ధులు ఇలా చెపుకుంటూ పోతే అనంతం 

కానీ బాబా వాటికి ఏనాడు గర్విన్చలేదు.

నీటిలో వున్న జలతత్వాన్ని మార్చి అగ్నితత్వాన్ని ప్రవేశింపచేసి ఆ ద్రవాన్ని ప్రమిదలలో పోసి వత్తులు వేసి దీపాలు వెలిగించారు బాబా అది చూసిన వర్తకులకు గర్వ భంగం జరిగింది.

 పంచ భూతాలు బాబా ఆధీనంలో ఉన్నాయి అనడానికి జలం నూనెగా మారటం అలా మారిన నూనె ద్వారా దీపాలు వెలగటం ఇంకా ఏ ఋజువు అక్కరలేదు మనకి ఈ సంఘటన ఒక్కటి చాలు .

బాబా ఆత్మ స్థైర్యాన్నీ చూసి మనం నేర్చుకోవాలి ప్రపంచంతో నికే నిమిత్తం లేదు నాకు నా గురువు నేను నమ్మిన దైవం నాతో తోడుగా నీడగా ఉన్నప్పుడు నేను దేనికి చింతించక బాబా ఆజ్ఞ ఏ నాకు సర్వం అదే నాకు శుభమైన మార్గాన్ని చూపిస్తుంది అని నమ్మి ముందుకు సాగిపోవాలి అని బాబా ఆచరించి చూపిస్తున్నారు.

ఇంకా బాబా ఉదేశ్యం ప్రకారం ప్రతి సాయి భక్తుడు వారి వారి గృహములయందు నిత్య దీపారాధన చెయ్యాలి అని ఆ కారణం చేతనే బాబా మసీదులో నిత్యం దీపాలు వెలిగించే వారు .

ఇలా రోజు దీపాలు వెలిగించడం ద్వారా గృహములో ప్రాణ శక్తి పెరిగి తద్ద్వారా దైవ శక్తి ఆకర్షించబడుతుంది 

అప్పుడు ఇంట్లో మనస్పర్థలు , అసహనం వంటి చెడు గృహములలోకి ప్రవేశించందు అప్పుడు ప్రశాంత మైన వాతావరణంలో జీవించ గలుగుతాము దానిని అలవర్చడం కోసమే బాబా దీపాలు వెలిగించే వారు .

తాను గురువు కదా భోదించడమే తన కర్తవ్యం గా అనుకోలేదు బాబా ఏ నాడు తాను ఆచరించి చూపించి మనతో పాటించేలా చేసే వారు.

ఉదాహరణ బాబా తన బోధనలు ఎంత సులువుగా అర్ధం అయ్యేలా చెప్తారు అంటే ఏనుగు ఎలా ఉంటుంది అని అడిగితే బొమ్మ గీసి చూపించే గురువులు ఉంటారు కానీ బాబా ఏనుగునే తెచ్చి చూపిస్తారు అంతటి గొప్ప గురువు బాబా .

 ద్వారకామయి అంటే చతుర్విధ వర్ణ వివక్షత లేకుండా చతుర్విధ పురుషార్ధాల కోసం ప్రభోదించే స్థలమే ద్వారకామయి 

మనకు 3 ద్వారకలు ఉన్నాయి

1 ౼ శ్రీ కృష్ణుడు  ద్వారక ఇప్పుడు భూగర్భంలో ఉంది 

2 ౼ పండరీ పురం రొందవ ద్వారక

3 ౼ షిరిడి గుప్త ద్వారాకగా పిలువ బడుతుంది  ఎవరైతే ఈ ద్వారక మెట్లు ఎక్కి వచ్చెదరో వారి కర్మలు నశించును అటువంటి ద్వారాకను భూలోక కైలాసం గాను, భూలోక వైకుంఠం గాను చెప్పు కోవడం అతిశయోక్తి కాదు

బాబా  కి రొట్టెలంటే ఇష్టమా ???

బాబా కి రొట్టెలంటే ఇష్టం అందుకే బాబా కి గురువారం రొట్టెలు చేసి పెడతాము అని భక్తులు అంటారు.

చాలా చోట్ల విన్నాం మనం అయ్యో బాబా కి ఈ రోజు రొట్టెలు పెట్టడం కుదరలేదు అని బాధ పడిపోతారు.

నిజతత్వాన్ని తెలుసుకుందాం

ముందు  గురువారం బాబా కి ఇష్టం అని అంటూ తెలియకుండానే ఆ వారానికి భక్తులు అవుతున్నారు చాలా మంది కానీ మనం భక్తులం కావాల్సింది బాబాకి అంటే బాబా కి ఇష్టమైన వన్నీ చెయ్య గలగాలి ఇష్టమైన నైవేద్యం పెడితే సరిపోతుందా ????

బాబా బోధనలను అర్ధం చేసుకుని పాటించినప్పుడు గురు వారానికి కాకుండా గురువు కి భక్తులం , శిష్యులం అవుతాము .

బాబా ఓ రోజు ఆకలిగా ఉంది అమ్మ అని లక్ష్మీభాయి షిండే ని ఏమైన తెచ్చి పెట్టమ్మా అని అడిగారు మహారాష్ట్రలో రొట్టెలు తింటారు కనుక లక్ష్మీభాయి రొట్టెలు తెచ్చింది అదే బాబా షిరిడిలో కాకుండా ఇంక వేరే ఎక్కడైనా నివాసం ఏర్పరుచుకుని వుంటే ఆ ప్రాంతంలో ఏది తింటారో అదే గా తెచ్చి లక్ష్మీ భాయి వండి పెట్టీది .

బాబాకి కుక్కలు ఇష్టం అంటే మిగిలిన జీవులు అంటే ఇష్టం లేదు అనా? 

అసలు రుచి యందు ఏ మాత్రం ఆసక్తి కనపరచని బాబా కి రొట్టెలు ఇష్టం,వంకాయ కూర అంటే ఇష్టం అని ఏ చరిత్రలో చెప్పారు ఇక్కడ తెలుసుకోవాల్సింది అదే బాబా చేసే చర్యలు ద్వారా బాబా ఏమి నేర్పించాలి అనుకుంటున్నారో దానిని అర్ధం చేసుకోవాలి మనం .

ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి బాబా తత్వం స్పష్టంగా అర్ధం అవుతుంది ఈ సందర్భంలో.

బాబా తనకు అని అడిగి తెప్పించిన  రొట్టెని కుక్కకి పెట్టారు  లక్ష్మీ భాయి కి కోపం వచ్చింది  బాబా ఒకవేళ కుక్కకి అని లక్ష్మీ భాయి ని ఆడిగివుంటే అంత వేగంగా  ,అంత ప్రేమగా తెచ్చి పెట్టి ఉండేదా? ఎవ్వరూ చెప్పలేరు. అందుకే బాబా తనకి అని చెప్పి రొట్టె తెప్పించారు.  సర్వాంతర్యామి బాబా  జగన్నాటక సూత్ర దారి .బాబా     బోధనలు , బాబా పెట్టె పరీక్షలను వాటి  లోతును అర్ధం చేసుకోవడం అంత సులువు కాదు అలాగని పాటించడం కష్టము కాదు .

దైవానికి ఇష్టమైన భోజనం, ఇష్టమైన మతం, ఇష్టమైన భక్తుడు ఇలా ఏ వ్యత్యాసం ఉండదు .మన దృష్టి లొనే లోపం ఉంటుంది.ఈ లోపాన్ని సరిదిద్దుకొవడం మన చేతుల్లోనే ఉంది.

*తస్మాత్ జాగ్రత జాగ్రత్త…*


     *ఏబంధాలు లేకుండా ఏకాకి గా తపమాచరించు**ఒక యోగి ఒక్కనాడు ఒకరి చెప్పులు వేసుకున్న కారణానికి**మోక్షానికి వెళ్లవలసిన వాడు ఈ ఋణం ఉండిపోవటంతో**అతని ఇంట పుత్రుడై జన్మిస్తాడు.*
రుణానుబంధం తీర్చుకోవటానికి ఆ యోగి మళ్ళీ పుడతాడు. జాతకం చూసిన వాడు తలిదండ్రులకు ఒక హెచ్చరిక చేస్తాడు. ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉన్నాడు. వాడి చేతి నుంచి పైసా కూడా తీసుకోకండి. వాడికి అన్నీ ఇస్తూండండి. అని చెప్తాడు. నాటినుంచీ తల్లిదండ్రులు వానినుంచి ఏమీ ఆశించకుండా పెంచుతారు. పూర్వజన్మ గుర్తున్నందున అతడు వారి రుణంతీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. పెద్దయాక తండ్రి ఇతడిని రాజుగారి కొలువుకి తీసుకుపోయి ఉద్యోగం ఇమ్మంటాడు. రాజు రాత్రి గస్తీ ఉద్యోగం ఇస్తాడు. అపుడు ప్రతి జాముకీ ఒకసారి ఆ యువకుడు ఇలాటి ఉపదేశాన్ని నిద్రలో ఉన్న వారికి జాగ్తేరహో… అనే అర్ధంలో ఇస్తాడు. దొంగలంటే ధనం ఎత్తుకుపోయేవారేకాదు. ఇవన్నీ కూడా దుఃఖభాజనాలే సుమా అని చెపుతుంటాడు. ప్రతి జాముకీ ఇలాటి హితవు ఒకటి ఉండాలి. ఇంతకీ రాజుగారికి రాచకార్యాలతో నిద్రపట్టక తిరుగుతూ ఇవన్నీ విని ఇతడు సామాన్యుడు కాడని గుర్తిస్తాడు. మరునాడు స్వయంగా అతడి ఇంటికి వెళ్లి రాత్రి తాను అన్నీ విన్నాననీ, తన మనసు ప్రశాంతి పొందిందనీ అంటాడు. పళ్లెంలో వెంట తెప్పించిన ధనాన్ని అతడికి అందిస్తాడు. అతడు వెంటనె ఆ ధన రాశిని తల్లికి ఇవ్వగా ఆమె పుత్రోత్సాహంలో నియమం మరచి ఆ పళ్లెం అందుకుంటుంది. వెంటనే అతడు తనువును విడిచి ముక్తి పొందుతాడు. తలిదండ్రులు దుఃఖిస్తే రాజు ఆ యోగి కావలి సమయంలో చెప్పిన ఉపదేశాలు వినిపించి ఓదారుస్తాడు
తస్మాత్ జాగ్రత జాగ్రత !
1. శ్లో|| మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర |అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు అందుచే ఓ మానవుడా సావధానుడవై ఉండుము.
2. శ్లో|| జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, ఈ సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.
3. శ్లో|| కామశ్చ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా :- కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.
4. శ్లో|| ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఎదియో చేయవలెనను ఆశతోనే జీవింతురు. కానీ తరిగిపోవుచున్న జీవిత కాలమును గుర్తింపరు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.
5. శ్లో|| సంపదః స్వప్రసంకాశాః యౌవనం కుసుమోపమ్|విధుఛ్చచంచల ఆయుషం తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, యౌవనము ఒక పూవు వలె మనజీవితములో స్వల్ప కాలము మాత్రమే ఉండునది. ఈ జీవితమూ మెరుపు వలె క్షణభంగురము. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.
6. శ్లో|| క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితమావయోః|యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.
7. శ్లో|| యావత్ కాలం భవేత్ కర్మ తావత్ తిష్ఠతి జంతవః|తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్ర కా పరివేదన||
తా:- మనుషులకు వారి కర్మానుసారము జీవితకాలము ఉండును. అది తీరిన తరువాత వారును నశింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?
8. శ్లో|| ఋణానుబంధ రూపేణ పశుపత్నిసుతాదయః|ఋణక్షయే క్షయం యాంతి తత్ర కా పరివేదన||
తా:- గత జన్మ ఋణానుబంధముచే పశు, పత్ని పుత్ర లాభము గల్గును. ఆ ఋణము తీరగనే వారును పోవుదురు. దానికై దుఃఖించుట ఎందులకు?
9. శ్లో|| పక్కాని తరుపర్ణాని పతంతి క్రమశో యథా|తథైవ జంతవః కాలే తత్ర కా పరివేదన||
తా:- చెట్ల యొక్క పండిన ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?
10. శ్లో|| ఏక వృక్ష సమారూఢ నానాజాతి విహంగమాః|ప్రభతే క్రమశో యాంతి తత్ర కా పరివేదన||
తా:- రాత్రి చెట్లపై వివిధ జాతుల పక్షులు చేరును. మరల సూర్యోదయము కాగానే ఒక్కటోక్కటిగా ఎగిరిపోవును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?
11. శ్లో|| ఇదం కాష్టం ఇదం కాష్టం నధ్యం వహతి సంగతః|సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన||
తా – ప్రవహించుచున్ననది లో కళేబరములు తేలుచు, ఒకప్పుడు కలియుచు ఒకప్పుడు విడిపోవుచుండును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?      

తా – ప్రవహించుచున్ననది లో కళేబరములు తేలుచు, ఒకప్పుడు కలియుచు ఒకప్పుడు విడిపోవుచుండును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?      

గురుస్తాన్ లో ఉన్న వేప చెట్టు ఆకులు చేదు గుణాన్ని ఎలా కోల్పోయాయో మీకు తెలుసా ????

బాబా 16 సంవత్సరాల బాలుడుగా షిరిడి రావడం వేపచెట్టు కింద కూర్చోవడం అదే తన గురిస్తాన్ అని తెలియ చెయ్యడం ఇవన్నీ మనం సత్చరిత్రలో చదివాము .

ఐతే ప్రపంచంలో ఎక్కడ ఐనా వేప చెట్టు ఆకు రుచి కటిక చేదుగా ఉంటుంది  కానీ ఈ షిరిడీలో బాబా గురుస్తానంలో ఉన్న వేప ఆకు  తింటే తుయ్యగా అని కాదు గాని చేదు అనేది మచ్చుకకైనా ఉండదు.

దానికి గల కారణం బాబా ఎల్లప్పుడూ ఆ వేపచెట్టు కిందనే కూర్చుని ఆత్మానుసంధానం చేసుకుంటూ ఉండేవారు ఆ దైవిక శక్తి వలన ఆ చెట్టు ఆకు తన రుచిని కోల్పోయి బాబా లాగే సాత్వికంగా మారిపోయింది .ఇప్పటికి మనం ఈ వేప ఆకు లభిస్తే రుచి చూసి తెలుసుకోవచ్చు.

ఐతే  దీని ద్వారా ఏమి నేర్చుకోవాలి అంటే మనం బాబా కి మన హృదయంలో ఆసనంవేస్తే మనలోని భయాలు,అసహనాలు,ద్వేషం,

అసూయా,క్రోధం,వంటి చేదు గుణాలను అన్ని తొలగి పోయి సన్మార్గంలో నడవగలం, తద్వారా లక్ష్యాన్ని చేరుకోగలం, ఇక్కడ మన లక్ష్యం అంటే అర్థం మోక్ష మార్గం చేరుకోగలం అని అర్ధం.

శ్రావణ మాసంలో వేపచెట్టు కింద పాదుకలు ప్రతిష్టించి ఉపాసనీ బాబా ఓ శ్లోకాన్ని కూడా రాయించారు అది 

సదానింబ వృక్షస్యమూలాధివాసాత్ 

సుధాస్రావిణం తిక్తమస్యప్రియంతం

తరుంకల్పవృక్షాధికమ్  సాధయంతం  

నమామీశ్వరం సద్గురుం సాయి నాథం౹౹ 

అంటే 

నిరంతరం చేదురసాన్ని స్రవించు వేపచెట్టు మూలాలలో నివసించి , దానిని కల్పవృక్షముకన్నా ఉత్తమోత్తమ మైనట్టిదిగా చేసిన జగద్రక్షా ! నీకు నా వందనము .

అని అర్ధం ఎంతో అద్భుతమైన శ్లోకం ఇది .

సత్చరిత్రలో ప్రతి అధ్యాయంలో బాబా తత్వం బోధించారు అనుకున్నాను కానీ అది తప్పు ప్రతి అక్షరం,ప్రతి అణువు,ప్రతి మాట,నడక ఇలా ఎన్ని చెప్పగలం బాబా కోసం లోతుగా తెలుసుకునే కొద్దీ బాబా పై అపారమైన నమ్మకం ,అమితమైన భక్తి,మాటల్లో చెప్పలేని ప్రేమ క్షణ క్షణం పెరుగుతూనే ఉంది.

త్రికరణ శుద్ధి అంటే ???

మనం ఇంతకు ముందు ఆత్మసాక్షాత్కారం పొందాలి అంటే భగవంతునికి

తన్, ధన్, మన్ ,ఈ మూడింటిని స్వచ్ఛంగా  సమర్పించాలి అని నేర్చుకున్నాము.

ఐతే ఇప్పుడు త్రికరణాలు అంటే ఏమిటో , వాటిని భగవంతునికి ఎలా అర్పించాలో తెలుసుకుందాం.

మనసా,వాచా, కర్మణా ఇవి శుద్దిగా భగవంతునికి అర్పించడం అంటే

మనస్సు :- మనస్సులో ఎటువంటి కల్మషం లేకుండా ఉండాలి.    

పైకి మంచిగా మనస్సులో చెడు ఆలోచనలతో వ్యతిరేక మనస్తత్వం తో భగవంతుని సేవ చెయ్యకూడదు . 

భగవంతునికి ఇచ్చే దక్షిణ గాని,చేసే సేవగాని నిస్వార్థంగా చెయ్యాలి.

ప్రతిఫలం లోలోపల ఆశిస్తూ చేస్తే ఫలితం సూన్యం.

వాచా -: బాబా తత్వం లో మొట్టమొదట బోధన ఇదే వాక్కు శుద్దిగా ఉండాలి మనం చెడు మాట్లాడితే దాని ప్రభావం మనమీద చేడు గానే ఉంటుంది.

ఉదాహరణ -: 

రామ నామం చెప్తే  ఆ నామం యొక్క మంచి ఫలితాలు అనుభవిస్తాం 

కాదు అని రావణుణ్ణి తలిస్తే  ఆ చెడు ప్రభావమే మనకు లభిస్తుంది 

ఇంకా చెప్పాలి అంటే వేప ఆకు తింటే చేదు ,పంచదార తింటే తీపి మన నాలుకకు రుచి ఎలా పొందుతామో అలాగే మనం మాట్లాడే మాటలు వాటి వాటి ఫలితాలు ఆధార పడి ఉంటాయి .

( ఎదుటి వారిని నిందించడం మనేయ్యాలి )

కర్మలు -: ఉదయం లేచిన దగ్గరనుండి వీలైనంత వరకు దైవ చింతనతో ఉండాలి , కష్టాల్లో ఉన్నవారికి సహాయ పడటం ,లేనివారికి ఉన్నదానిలో ఆర్ధిక సహాయం చేసి ఆదుకోవడం( దానం) భగవంతునికి సమర్పించే దక్షిణ ఉదారంగా ,అనుకవతో ఇవ్వడం ఇలా మనం చేసే సత్ కర్మలు ఉండాలి . అదే త్రికరణ శుద్ధి అవుతుంది ఈ మూడింటిని ఆచరిస్తే మిగిలినవన్నీ వాటంతట అవే స్వచ్ఛమ్ గా మారిపోతాయి

ద్వారకా మాయి ( మసీదు) లో నింబారు అని ఉంటుంది .

అది ఏమిటి ?? ఎందుకు ఉంది ??

మసీదులో ఉన్న నింబారు ఏమిటంటే  అది ఒక గూడు లా ఉంటుంది దానికి ఎదురుగా కూర్చుని ముస్లీమ్స్ నమాజ్ చేసుకుంటారు .

మనం( హిందువులు) సాకార రూపాన్ని పూజిస్తే 

ముస్లీమ్స్ నిరాకార రూపాన్ని ఆరాధిస్తారు.

అలా అల్లాని వారు ఆ గూడు వద్ద కూర్చుని స్మరించు కుంటారు.బాబా ఈ మసీదు లో నింబారు కి ఎదురుగా కూర్చో పెట్టి ఖురాన్ పఠింప చేసేవారు , నమాజ్ చేయించేవారు .

అలాగే మనం చరిత్రలో చదువుకున్నట్లు హిందూ, ముస్లీమ్స్ ఒక్కటిగా ఉండాలి అని చెప్పేవారు.

మసీదు నిరాకార రూపానికి మూలం ఐతే సాకార రూపంలో అక్కడే నివసిస్తూ మీమీ ఇష్ట దైవాలను ఆరాధిస్తూనే చక్కగా కలసి మెలసి ఉండాలి అని బోధించే వారు .

భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భినత్వం అనే నినాదాన్ని పాటిస్తూ ఆచరణాత్మకంగా చేసి చూపేవారు బాబా .

బాబా ముఖ్య ఉదేశ్యం మతాలకన్నా మానవత్వం ముఖ్యం అని తెలియ చెయ్యడం మాత్రమే .

సాయి రాం అని పిలవడానికి కారణం ???

షిరిడీలో బాబా శశీరులుగా ఉన్న రోజుల్లో శ్రీ రామ నవమిని ఎంతో ఉత్సాహంగా, వైభవంగా, జరిపించేవారు.

బాబా పై షిరిడి ప్రజలకు  ఉన్న గౌరవం ,ప్రేమ,భక్తులతో ఈ నాటికి  అచ్చంగా అలాగే జరిపిస్తున్నారు బాబా భక్తులు,శిష్యులు.బాబా రామనవమిని ఎందుకు జరిపించే వారు?

దానికి గల కారణం రాముడు సుగుణాభిరాముడు కనుక. రామాయణాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మానవ రూపంలో ఉన్న దైవం రాముడు ఐనా ఆయన ఎంతో నిరాడంబరంగా, ఆదర్శ ప్రాయంగా,నడుచుకుని మానవులకు ఎలా జీవించాలో సూచించాడు రాముడు.రాముడు ఆదర్శ పురుషుడు.

ఇక్కడ రఘువంశపు రాముడు సీతా సమేతంగా ఇంకా తనకు ప్రీతిపాత్రంగా ఉన్న వారైనా లక్ష్మణుడు,హనుమతో కలిపి ఉన్న పట్టాభిషేకాన్ని మనం రామ పట్టాభిషేకంగా కొలుచుకుంటాం.

ఐతే అలా చాలా మంది వారి వారి గృహాలలో రామ పట్టాభిషేకాన్ని ఇళ్లలో పెట్టుకుని ఆరాధిస్తారు అసలు ఎందుకు రామ పట్టాభిషేకాన్ని ఇంట్లో పెట్టుకోవాలి అనే దాని కోసం సాయి నిలయంలో అమ్మ బాబా చెప్పిన సందేశాన్ని నాకు కూడా చెప్పి మా ఇంట్లో కూడా రామ పట్టాభిషేకం పెట్టించారు.

నన్ను ప్రసన్నమ్మ అడిగారు నీకు తెలుసా రామపట్టాభిషేకాన్ని ఎందుకు ఇంట్లో పెట్టు కోమన్నారో అని .

అప్పుడు లేదు అమ్మ నాకు తెలియదు అంటే ఎంత అందంగా వివరించారు అంటే .

రాముడు నుంచి తీసుకోవాల్సిన ఆదర్శ వంతమైన గుణాలు

మొట్టమొదటిది తండ్రి మీద గౌరవం,అపారమైన ప్రేమ 

గురువు పట్ల గురి

తాను రాజే ఐనా ఎంతో నిరాడంబరంగా దేనియందు మక్కువ లేకుండా త్యాగ గుణం తో జీవించాడు రాముడు  అసలు అన్ని ఇన్ని కాదు రాముని సుగుణాలు.వీటిలో కొన్నిటినైనా ఆచరించాలి అని.

సీతమ్మ తల్లి లో  ఆదర్శంగా తీసుకోవాల్సిన గుణాలు అణుకువ, పెద్దలంటే గౌరవం,కుటుంభం పట్ల బాధ్యతగా నడుచుకోవడం,భర్త అడుగుజాడలలో నడవడం , పతి చెయ్యి పట్టి, ఏడూ అడుగులు వేసేకా పతి ఎక్కడ ఉంటే అక్కడే స్వర్గం గా భావించడం ఇలా  సీతమ్మ తల్లి లో సుగుణాలు కూడా రాముని లో ఉన్న సుగుణాలు తో సరి సమానంగా ఏమాత్రం తగ్గకుండానే ఉన్నాయి కదా ప్రతి స్త్రీ కి సీతమ్మ తల్లే ఆదర్శం .

ఇక లక్ష్మణుడు నుండి తీసుకోవాల్సిన గుణాలు  లక్ష్మణుడు  సాక్షాత్తు ఆదిశేషువే మరి వైకుంఠంలో ఎలా ఐతే లక్ష్మీ దేవి సమేతంగా ఎప్పుడు ఆయననే అంటి పెట్టుకుని ఉన్నారో ఈ అవతారంలో కూడా రాముడిని వదలకుండా తన యొక్క సేవ అడవులలో కూడా కొనసాగించాడు మన జన్మ ఎటువంటి దైనా దానియొక్క కారణాన్ని మరువకుండా లక్ష్మణుడు తన బాధ్యతను నెరవేర్చాడు జన్మ సార్ధకం చేసుకున్నాడు ఆయన ఎంతో అదృష్ట వంతుడు .

ఇక హనుమ నుండి తీసుకోవాల్సిన గుణాలు  ఈయన నుంచి ఓ దైవానికి భక్తుడుగా కానివ్వండి,గురువుకి శిష్యుడుగా కానివ్వండి,ఓ తల్లికి బిడ్డగా కానివ్వండి ,లక్ష్మణుడు విషయంలో రక్షకుడుగా ( ప్రాణ దాత ) అని ఎందుకు అన్నాను అంటే సంజీవని పర్వతాన్ని మోసుకు వచ్చి మరీ లక్ష్మణుడు ప్రాణం కాపాడినందుకు అన్నాను. హనుమలో ధైర్యం,భలం, సమయస్ఫూర్తి,వినయ విధేయతలు ఇలా ఎన్నో సుగుణాలు హనుమలో కూడా ఉన్నాయి .

ఓ కొడుకు తండ్రి తో ఎలా ఉండాలి.

ఓ భార్య తన కుటుంభం పట్ల ఎలా నడుచు కోవాలి .

భగవంతుని విషయంలో భక్తుడు ఐనా, శిష్యులు ఐనా ఎలా ఉండాలి అని నేర్చుకోవచ్చు .

కాబట్టి రామ పట్టాభిషేకాన్ని మన గృహాలలో నిల్పుకోని ఆ నలుగురిలో అంటే ( సీతారాములు,లక్ష్మణుడు,హనుమంతుడు ) వారి లోని ఉన్న లక్షణాలను కొన్నిటినైనా  మనలో పెంపొందించు కోవాలి అని బాబా ఉదేశ్యం.

ప్రసన్నమ్మ బాబా చెప్పిన సందేశాన్ని నాకు వివరించి మా ఇంట్లో రామ పట్టాభిషేకాన్ని పెట్టుకోమని శాస్త్రి uncle ద్వారా రప్పించి ఇచ్చారు.

ఐతే ఇలా రాముని గొప్పతనాన్ని చెప్పడానికి నా శక్తీ ఏ మాత్రం సరిపోదు  .

ఇలా రాముడు తో సరి సమానమైన గుణాలు అన్ని నేను బాబా లో చూసాను రాముడికి బాబాకి నాకైతే ఏ వ్యత్యాసం కనిపించలేదు .

రామ అనే నామాన్ని కనుక చూస్తే “రమ్యతే ఇతి నామః “

రామనామము మోక్ష ప్రదాయకం అలాగే సాయి నామము కూడా హృదయాన్ని రమింపచేస్తుంది.

కనుక  సాయి రాం అనే నామము కచ్చింతంగా మోక్షాన్ని ఇస్తుంది .బాబా కూడా అదే గా బోధించింది 

“సాయి సాయి “అను నామము సర్వకాల సర్వావస్థలయందు తలవండి మీ భారాలన్నీ నేను మోస్తాను అని అభయం ఇచ్చారు బాబా . బాబా తనలోనే రామదర్శనం ఇచ్చి ఓ భక్తుడుని ఆశీర్వదించారు.మరో భక్తురాలికి “రాజారామ్ ” అనే మంత్రమే నీ కష్టాలను తీరుస్తుంది అని బోధించారు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి సాయి మందిరాలలో ప్రతి సంవత్సరం శ్రీరామ నవమికి సితారాముల కళ్యాణం జరిపించడం వల్ల మనందరం బాబాకి ప్రీతిపాత్రులం కాగలం

కాగడ హారతి ఎప్పుడు రచించారు??

ఎవరు రచించారు ???రచించడానికి గల కారణాలు ఏమిటి ??? తెలుసుకుందాం 

జగదీశ్వర్ భీష్మా అనే ఓ సాయి భక్తుడు ఉన్నాడు  అతనికి 1908 సంవత్సరం శ్రావణ మాసంలో  ఓ స్వప్నం వచ్చింది  ఆ స్వప్నంలో నల్లగా ఉన్న ఓ  బ్రాహ్మణుడు దౌవతి ధరించి , విభూది రేఖలు శరీరం అంతా రాసుకొని  కనిపించాడు, జగదీశ్వర్ భీష్మా అతనిని గమనించగా సచ్చిదానంద అని మాయ మైపోయాడు ఆ బ్రాహ్మణుడు ,జగదీశ్వర్ భీష్మ కు ఏమి అర్ధం కాలేదు.

తర్వాత కొంత కాలానికి జగదీశ్వర్ భీష్మ షిరిడి బాబా దర్శనం కోసం వెళ్లారు అప్పుడు బాబా అతనిని చూసి నా 5 లడ్డూలు ఏవిరా అని అడిగి చిన్నగా నవ్వేరు, జగదీశ్వర్ భీష్మ కు ఏమి అర్ధం కాలేదు అప్పుడు బాబా” జై సచ్చిదానంద ” అని పలికారు అప్పుడు అతనికి వచ్చిన స్వప్నం జ్ఞాపకం వచ్చింది అలా బాబా ఇచ్చిన సందేశం ఆధారంగా అప్రయత్నంగా 5 హారతి పాటలను రచించారు జగదీశ్వర్ భీష్మ.

మొట్టమొదట కాగడ హారతి కోసం తెలుసుకుందాం 

జోడు నియాకరాచరణి ఠేవిలామాథా

పరిసావీ వినంతీ మాఝీ పండరీనాథా౹౹

 ఈ చరణాన్ని ౼ తుకారామ్ రాశారు.

ఉఠా పాండురంగా ఆతా ప్రభాత సమయో పాతలా ౹ 

వైష్ణవాంచ మేళా గరుడ ౼పారీ దాటలా ౹౹

ఈ చరణాన్ని జానాభాయి రాశారు.

ఉఠా ఉఠా శ్రీ సాయినాథగురుచరణ కమల దావా

ఆదివ్యాధి భవతాప వారునీ తారా జడజీవా ౹౹ 

ఈ చరణాన్ని శ్రీ కృష్ణ జగదీశ్వర భీష్మ రాశారు .

ఉఠా పాండురంగా ఆతా – దర్శనధ్యాసకళా

ఝాలా అరుణోదయాసరలీ – నిద్రేచివేళా౹౹ 

ఈ చరణాన్ని నామదేవు రాశారు .

ఘేఉనియా పంచారతీ కరూబాబాసీ ఆరతీ

ఉఠా ఉఠాహో బాంధవ ఓవాళూ హరమాధవ

ఈ చరణాన్ని శ్రీ కృష్ణ జగదీశ్వర భీష్మ రాశారు .

కాగడా హారతి కరీతా ! సాయినాథ దేవా 

చిన్మయరూప డాఖనీఘే ఉని ! బాలకలఘు  సేవా ౹౹ 

ఈ చారణాన్ని జగదీశ్వర భీష్మ రాశారు.

భక్తీచియా పోటీభోథ్ కాగడా జ్యోతి

పంచప్రాణజీవే భావే ఓవాళూ ఆరతీ ౹౹ 

ఈ చరణాన్ని తుకారామ్ రాశారు.

ఉఠాసాధుసంతసాదా ఆపులాలే హిత

జా ఈల్ జాఈల్  హానరదేహ మగకైచా భగవంత ౹౹ 

ఈ చరణాన్ని నామదేవు రాశారు.

ప్రభాత సమయీనభా శుభ రవీ ప్రభాపాకలీ 

స్మరే గురు సదా అశాసమయిత్యాఛళే నాకరీ 

ఈ చరణాన్ని శ్రీ కృష్ణ జగదీశ్వర భీష్మ రాశారు.

సాయిరహమ్ నజర్ కరనా బచ్చోంకాపాలన్ కరనా

ఈ చరణాన్ని దాసగణు రాశారు.

రహమ్ నజర్ కరో, అబ్ మేరేసాయీ

తుమబిన నహిముఝే మాభా భాయీ 

ఈ చరణాన్ని దాసగణు రాశారు .

తుజకాయదేఉ సావళ్య మీభాయాతరియో

తుజకాయదేఉ సద్గురు మీభాయాతరియో 

ఈ చరణాన్ని జానాభాయి రాశారు.

శ్రీ సద్గురు బాబా సాయీ హో  ఈ చరణాన్ని శ్రీ కృష్ణ జగదీశ్వర భీష్మా రాశారు

భగవంతునికి సమర్పించే కొన్ని ముఖ్యమైన వాటిలో టెంకాయకే ప్రధాన స్థానం ఉంది ఎందుకు ????

సృష్టిలో భగవంతునికి నైవేద్యంగా సమర్పించే వాటిలో శ్రేష్ఠమైనదిగాను,ఉత్క్రుష్టమైనదిగాను,ఇంకా పూర్ణత్వం ఉన్నదిగాను,అన్ని శుభకార్యాలలో ప్రధానంగా ఉండేది టెంకాయ.

ఆలయాలలో ఎవరైనా గురువులను ఆహ్వానించాలి అంటే పూర్ణకుంభ స్వాగతం అని టెంకాయతోనే ఆహ్వానిస్తారు.ఇలా చెప్పుకుంటూ పోతే  చాలా విశేషమైన కారణాలు ఉన్నాయి.

కొబ్బరికాయ పంచభూత సమన్వితం గా సరిపోల్చవచ్చు .

కొబ్బరి పీచులో -భూతత్త్వం ఉంది.

కొబ్బరి కాయలో జలం ఉంది కనుక – జల తత్త్వం ఉంది.

కొబ్బరి తెల్లగా ఉండటం వల్ల -ఆకాశతత్త్వం ఉంది.

ఆ కొబ్బరి నుండి నూనె తీసి ఒత్తి వేసి దీపం వెలిగించ గలుగుతున్నాము గనుక దానిలో -అగ్ని తత్త్వం ఉంది

అలాగే టెంకాయలో వాయుతత్త్వం కూడా ఉంది.

ఇలా పంచభూత తత్వాలు టెంకాయలో ఉండటం వల్ల అది అంత శ్రేష్ఠమైనదిగా చెప్పబడుతోంది.ఆ కారణం చేతనే షిరిడీలో బాబా ద్వారకామయి చిత్ర పటంలో టెంకాయ ఉంటుంది.

టెంకాయ వంకరగా పగిలింది,లేకపోతే కుళ్ళిన టెంకాయ భగవంతుని వద్ద కొట్టడం వల్ల ఎదో కీడు జరగపోతుంది అని చాలా మంది భయపడి పోతారు.కానీ మన ఆలోచనలు మంచిగా ఉంటే అంతా మంచిగానే జరుగుతుంది .భగవంతుని సమక్షంలో ఎటువంటి పొరపాట్లు జరగవు.మన ఆలోచనలలోనే పొరపాట్లు ఉంటాయి.

టెంకాయ కుళ్ళితే – కీడు పోయింది అనుకోండి.

టెంకాయ వంకరగా పగిలితే మనం దానిని కొట్టడంలో పొరపాటు అనుకోండి,కొట్టిన విధానంలో తప్పు ఉంటుంది గాని భగవంతుడు చూసే దృష్టిలో తప్పు ఉండదు .

టెంకాయలో పువ్వువస్తే – శుభసూచకం అనుకోండి .

మన ఆలోచనల పైనే అంతా ఆధార పడి ఉంటుంది.

షిరిడీలో ఉన్న మూడు వాడాల వెనుక ఉన్న కథలు ఏమిటో తెలుసుకుందాం.

 షిరిడీలో చెప్పుకో దగ్గది మొట్టమొదటిది  సాఠే వాడా     అందరికి ఉపయోగకరంగా ఉండాలి అని సదుద్దేశంతో కట్టబడినది సాఠే వాడా అని మనం సత్ చరిత్రలో చదువుకున్నాం.

ఐతే దాని వెనుక ఉన్న ఓ గొప్ప విశేషమైన కథ కొన్ని పుస్తకాల నుండి సేకరించి సాయి విశ్వచైతన్య స్వామిజీ మనకు అందించారు అదే ఇప్పుడు మీకు వివరిస్తాను.

 దాదా కేల్కర్ గారి అల్లుడైన సాఠే అను బాబా భక్తుడు ఒక సారి షిరిడి వచ్చి బాబాని దర్శించి బాబా నేను షిరిడి నీ దర్శనం కోసం వచ్చే భక్తులకు ఉపయోగ కరంగా ఉండటం కోసం ఒక వాడాను నిర్మించాలి అనుకుంటున్నాను దానికి మీ అనుమతి కావాలి అని కొరగానే బాబా సాఠేని  చెయ్య పట్టుకుని లాక్కుని వెళ్లి కొబ్బరికాయ కొట్టు అని అజ్ఞా పించారు. అప్పుడు సాఠే బాబా చెప్పినట్లే చేసి తిది చూడగా ఆరోజు పౌర్ణమి అని చూసి ఆశ్చర్య పోయాడు. సాఠే బాజా బజంత్రీలతో మొదలు పెట్టాలి అని అనుకున్నాడు. కానీ బాబా సర్వాంతర్యామి ఆయనకు తెలియని విషయాలు అంటూ ఏమి ఉండవు.   మనకు ఇటువంటి విషయాలలో సాయి నిలయంలో కూడా చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి  తలుస్తాడు అని అది అంతా మంచిగానే ఉంటుంది అని మనం గ్రహించుకో గలగాలి .  వాడా కట్టడం పనులు ప్రారంభించారు. వాడా నిర్మిస్తుండగా వేపచెట్టు కొమ్మ ఒకటి అడ్డు వచ్చింది అందరికి ఏమి చెయ్యాలో తోచలేదు వేప చెట్టును తాకే సాహసం చెయ్యలేక అందరూ  వదిలి వెళ్లిపోయారు.

 అప్పుడు బాబా వచ్చి సాఠే ఇలా చూడు ఓ గర్భిణీ ప్రసవ వేదన పడుతున్నప్పుడు శిశువు అడ్డం తిరిగాడు తల్లా, బిడ్డా అను ప్రశ్న వస్తే తల్లి ప్రాణం కాపాడటమే ముఖ్యం అని వైద్యులు నిర్ణయిస్తారు. అలాగే ఇక్కడ నువ్వు కట్టాలి అనుకున్న వాడా పదిమంది ప్రయోజనార్ధం తల పెట్టిన కార్యం కనుక కొమ్మను నరుకు పని పూర్తి చెయ్యి అని  చెప్పారు. దానితో వాడా నిర్మాణం నిర్విఘ్నంగా పూర్తి అయ్యింది .

ఇక్కడ బాబా చెప్పాలనుకునే తత్త్వం ఒక్కటే ఆధ్యాత్మికంగా ముందుకి వెళ్ళాలి అంటే ముముక్షత ఉండాలి,సాదకుడుగా మారాలి,దేనికైనా సిద్ధంగా ఉండాలి,ఎటాచ్మెంట్స్ ఎక్కువుగా పెట్టుకోకూడదు ,  మనస్సు ఊగిసలాడ కూడదు,ఇష్టమైనవి కూడా వదులుకోడానికి సంసిద్దంగా ఉండాలి.

తర్వాత కాకా సాహెబ్ దీక్షిత్ కట్టించిన వాడా (దీక్షిత్ వాడా)  కూడా ఉపయోగ కరంగా వుండేది.

ఇప్పుడు అతి ముఖ్యమైన వాడా భూటి వాడా ఇప్పుడు బాబా సమాధి మందిరంగా పిలువ బడుతున్నది.భూటి చాలా అదృష్టవంతుడు అద్భుతమైన వాడా బాబా కోసం బాబా అజ్ఞ మేరకు నిర్మించి జన్మ సార్ధకం చేసుకున్నారు భూటి.

ఇటువంటి అదృష్టం అందరికి రాదు వచ్చిన అవకాశం వినియోగించే కున్నవాడు వివేకవంతుడు,అదృష్ట వంతుడు,అవుతాడు.ఎప్పుడూ చెప్పే విషయమే ఐనా అతిశయోక్తి కానీ విషయం మన సాయి నిలయం ప్రత్యేకత. అచ్చం షిరిడి లానే ఇక్కడ సాయి నిలయం లో కూడా బాబా మనందరి కోరికలు తీరుస్తూ మన నిత్య జీవితంలో ఆధ్యాత్మికత కూడా కొంత ప్రాధాన్యత ఇవ్వాలి అని అటువైపుగా అడుగులు వెయిస్తూ మనందరిని ఉద్ధరించడానికి సిద్ధంగా ఉన్నారు బాబా. కనుకనే సత్కార్యాలు అనునిత్యం జరిపించే సత్సంకల్పంతో బాబా స్థిరనివాసం సాయి నిలయం కోసం ఏర్పాటు చెయ్యమని తత్ద్వారా సకల శుభాలను నా భక్తులకు  నేను కల్పిస్తాను అని బాబా వాగ్దానం చేశారు .కనుక బాబా స్థిర నివాసానికి కావలసిని ఏర్పాట్లలో మనకు చేతనైన సహాయం,ఉన్నదానిలో ఉదారంగా , స్వచ్ఛమైన మనస్సుతో , విరాళాలు ఇవ్వడం ద్వారా  మనం కూడా భూటి అంతటి అదృష్టవంతులము కావచ్చు.బాబా మనకు ఇచ్చిన ఈ సదావకాశాన్ని అందరూ వినియోగించుకుంటారు అని భావిస్తున్నాను

శ్రద్ధా- సబూరి ని బోధించే సాయి కి ఆగ్రహం ఎందుకు వచ్చేది???

శాంతి క్షమలకు ప్రతి రూపం సాయి .

సాయి అంటే చాలు హాయి కలుగుతుంది.

సాయి కి కోపం వస్తుందా???అని అంటే వస్తుంది కానీ దానికి నర్మగర్భమైన కారణాలు ఎన్నో ఉంటాయి .సాధారణ మైన మనుష్యులం మనకు అర్థంకాదు.

మేఘ శ్యాముడు కథ ఓ ఉదాహరణ అతను బాబా వద్దకు వచ్చేసరికి అతను గొప్పకులానికి చెందిన వాడిని అనే అహంకారం ఉండేది.ఆ అహంకారం పటాపంచలు అవ్వాలి అని బాబా మేఘ శ్యాముని మీద ఆగ్రహంతో తిట్టారు ఇక్కడ బాబా అతనిని స్వీకరించాలి అని నిర్ణయించుకున్నారు కనుకనే తన దగ్గరకు లాక్కుని వచ్చి ,వచ్చిన వెనువెంటనే అతనిలో అహంకారాన్ని మచ్చుకకైనా ఉండకూడదు అని అలా ప్రవర్తించారు బాబా.

అలాగే బాబా దర్శనం కోసం వచ్చిన ఓ తల్లి,బిడ్డలను రక్షించిన తీరు చూద్దాం. ఓ తల్లి బిడ్డ వచ్చి బాబా ని దర్శించుకున్నారు బాబా వాళ్ళని కాసేపు అక్కడే ఉండమన్నారు వాళ్ళు కూర్చుని ఉండగా బాబా ఒక్కసారిగా తిట్టడం ప్రారంభించారు.ఎవ్వరికి ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు.కాసేపటికి బాబా ఇలా చెప్పారు ఆ తల్లికి అమ్మ నీ బిడ్డను కలరా ఆవరించడానికి సిద్ధపడుతుంది దానిని వెనుకకు తిట్టి పంపించాను .ఇక నీ బిడ్డకి వచ్చిన భయం ఏమి లేదు అని చెప్పారు.

షిరిడీలో బాబా ఏ కులానికి చెందిన వాడు అనే ఆలోచన ప్రజలలో వచ్చినప్పుడు బాబా దానిని కూడా అరికట్టారు కోపాన్ని ప్రదర్శించి .

ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి బాబాకి కూడా కోపం వచ్చింది,వస్తుంది ,అని మనం చదువుకున్న కథలలో ఐతే ఇక్కడే మనం వివేకంతో ఆలోచించాలి ,నిజ సాయి తత్త్వం తెలుసుకోవాలి , గురువు గా బాబా ని మనం అనుకున్నప్పుడు ఆయనకి మన మీద సర్వాధికారాలు ఉంటాయి అది కూడా మనల్ని సన్మార్గంలో పెట్టడానికి అంటే అక్కడ ప్రయోజనం మనకే గురువు ప్రతి క్షణం మన ఎదుగుదలకోసమే శ్రమిస్తారు. బాబా కి ఆగ్రహం ,ఆవేశం,ఆక్రోశం, ఇవేమీ ఉండవు ఆయన మనలో ఒకరిగా ఉండడానికి అవతరించిన దైవం.కానీ మనం మనలా ఉంటేనే స్వీకరించగలం అందుకే మనలో ఒకరిగా ఉంటూ ఆయన మార్గంలోకి మనల్ని నడిపిస్తున్నారు